For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  'గే'గోల(నువ్విలా రివ్యూ)

  By Srikanya
  |

  --జోశ్యుల సూర్యప్రకాష్
  బ్యానర్ :ఉషా కిరణ్ మూవీస్
  నటీనటులు:అజయ్,హవీష్,ప్రసాద్,యామి,సరయు,రమ్య,రాధాకుమారి,రవిబాబు తదితరులు.
  సంగీతం:శేఖర్ చంద్ర
  నిర్మాత:రామోజీరావు
  కథ,స్క్రీన్ ప్లే,దర్శకత్వం:రవిబాబు

  ఉషాకిరణ్ బ్యానర్ నుంచి సినిమా వస్తోందంటే అది ఖచ్చితంగా కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రమని ఒకప్పుడు నమ్మకం.ఆ తర్వాత చిత్రం,నువ్వే కావాలి,నచ్చావులే సినిమాలు మారుతున్న కాలానికి తగినట్లుగా సినిమాలకు మహారాజ పోషకులైన యువతను టార్గెట్ చేస్తూ వచ్చాయి.ఇప్పుడు తాజాగా రవిబాబుతో ఈ బ్యానర్ చేసిన నువ్విలా చిత్రం ఏ తరహా యూత్ ని టార్గెట్ చేసారో కానీ, సినిమా సగభాగం 'గే'గోల తో నిండిపోయింది.హాలీవుడ్ తరహా టీన్ మూవీ లా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దే పనిలో అక్కడ వాతావరణాన్నే కాక అక్కడ కల్చర్ ని సినిమా పూర్తిగా ఆవహించేసింది.

  పిజ్జా కార్నల్ పనిచేసే ముగ్గరు స్నేహితులు,వారి ప్రేమ కథలు చుట్టూ ఈ సినిమా సాగుతుంది.వారిలో ఆనంద్(అజయ్)ప్రతీ విషయానికి కన్ఫూజ్ అయ్యే కుర్రాడు.అతను తన ఎదురింట్లో దిగిన అమ్మాయి అర్చన(యామి)తో ప్రేమలో పడతాడు.కానీ అప్పటికే అర్చన విష్ణు అనే క్రికెటర్ తో హద్దులు దాటి ఉంటుంది.ఇక రెండో వాడు రాజు(ప్రసాద్)నత్తి ఉన్న వైలనిస్టు.దాంతో ప్రతీ మ్యూజిక్ డైరక్టర్ దగ్గరి వెళ్లటం అక్కడ పాడమంటే తన నత్తితో ఆఫర్ పోగొట్టుకుని రావటం జరుగుతుంది.అతని చిన్నప్పటి క్లాస్ మేట్ రాణి(రమ్య)ని అతను ఓ శనిలా భావిస్తూంటాడు.అయితే అనుకోని పరిస్దితుల్లో ఆమెనే పెళ్లి చేసుకోవాల్సివస్తుంది .ఇక మూడో వాడు మహేష్ (హవీష్)ఓ పాపులర్ మోడల్ అవ్వాలని జీవితాశయం.అతనికి మాధవి(సరయూ)ప్రేమ.అయితే అనుకోకుండా ఆమె తండ్రితో తగువుపడతాడు.దాంతో ఆమె అతనికి బుద్ది చెప్పాలని ఓ గే ని అతని మీదకు ఉసిగొల్పుతుంది.ఇలా ముగ్గరూ మూడు విధాలుగా సమస్యల్లో పడతారు.వారు ఆ సమస్యల నుంచి ఎలా బయిటకు వచ్చి తమ జీవితాశయాలను నెరవేర్చుకున్నారనేది మిగతా కథ.

  సునీల్ వాయిస్ ఓవర్ తో ప్రారంభమైన ఈ చిత్రం మొదటి ఓ కొత్త తరహా కామిడీ చిత్రాన్ని చూడబోతున్నామనే ఆసక్తిని రేపుతుంది.అయితే కొంతదూరం వెళ్లాక 'గే'పాత్ర చిత్రంలో ప్రవేశించాక విరక్తి కలగటం ప్రారంభమవుతుంది.అయితే కొద్ది సీన్స్ కే ఆ పాత్ర పరిమితమవుతుందనుకుంటే చిత్రం మొత్తం అదే ఆక్రమిస్తుంది.అందేకాక ఆ గే పాత్రకు మరో గే లవర్ ని క్రియేట్ చేసి,ఓ ట్రయాంగిల్ లవ్ స్టోరీలా మారిపోయి గగ్గోలు పెట్టేలా చేస్తుంది.దానికి తగినట్లే సెకండాఫ్ లో కథలో సీరియస్ నెస్ పెంచటం కోసం మరీ కావాలని ఏడుపుకొట్టు సీన్స్ ను బలవతంగా చొప్పించారు.దాంతో ఫన్ తో నడుస్తున్న సినిమా కాస్తా సీరియస్ సీరియల్ గా మారిపోయింది.క్లైమాక్స్ కు వచ్చేసరికి రెగ్యులర్ సినిమాలా టర్న్ తీసుకుంది.

  అయితే రవిబాబు గొప్పతనం క్యారెక్టర్స్ కి తగ్గ పాత్రలను ఎంచుకోవటం అనిపిస్తుంది.ప్రధాన పాత్రలు ముగ్గురులో ఎవరికి హీరో లక్షణాలు లేకపోయినా కథలో కలిసిపోయారు.అలాగే ముఖ్యంగా తెలుగు సినిమా కథ అంటే ప్రపంచంలో ఉన్న రసాలు అన్ని కలిసి ఉండాలనే భావనను దాటి కథ నడపటం కూడా రిలీఫ్ ఇస్తుంది.నటీనటుల్లో నత్తి వ్యక్తిగా ప్రసాద్ బాగా చేసారు.'స'పలకలేక 'ల'పలుకుతూ,తన విచిత్రమైన బాడీ లాంగ్వేజ్ తో అస్సలు కొత్తవాడే అనే ఫీల్ రాకుండా సినిమాకు వెన్నుముకై నిలిచాడు.మరో పాత్రధారి హవీష్ ఓకే అనిపిస్తాడు.అతని పాత్రకు తగ్గట్లు గే నుంచి తప్పుకునే వాడి పాత్రలో కామిడీ పండించే ప్రయత్నం చేసాడు.అలాగే కొత్తవాళ్లతో మంచి అవుట్ రాబట్టుకున్న రవిబాబుని మెచ్చుకోవాల్సిందే.గెస్ట్ గా కనిపించిన మ్యూజిక్ డైరక్టర్స్ కోటి,కీరవాణి,కళ్యాణ్ మాలిక్,చక్రి ప్రత్యేక ఆకర్షణలు.హీరోయిన్స్ ముగ్గరూ ముగ్గురే..ఎవరూ హీరోయిన్స్ లా అనిపించరు.అలాగని కథలో పాత్రలాగ కూడా అనిపించరు.కథలో ఓ పాత్ర చేసిన రవిబాబు కూడా నవ్వించే ప్రయత్నం చేసి కొన్ని సార్లు సఫలీకృతుడయ్యాడనే చెప్పాలి.ఇక లో బడ్జెట్ తో చేసిన ఈ చిత్రం తెరమీద ఓ రిచ్ చిత్రం చూస్తున్న ఫీలింగ్ తీసుకు వచ్చాడంటే ఆ గొప్పతనం దర్శకుడు రవిబాబుదే.అతనెప్పుడూ కథను ఎన్నుకోవటంలో ఫెయిల్ అవుతున్నాడే కానీ టెక్నికల్ గా అతనెప్పుడూ మంచి మార్కులు వేయించుకుంటూనే ఉన్నాడని మరో సారి నిరూపించింది.కెమెరా,ఆర్ట్,ఎడిటింగ్ డిపార్టమెంట్ ల నుంచి దర్శకుడు మంచి అవుట్ పుట్ నే రాబట్టాడు.సంగీతం ఓ మాదిరిగా ఉంది.

  ఫైనల్ గా కాలేజీ యూవతని టార్గెట్ చేసిన ఈ చిత్రం వారికే నచ్చే అవకాశం ఉంది.అయితే గే పాత్ర ఉండే సీన్స్ తగ్గిస్తే కాస్త జుగుప్స తగ్గుతుంది.ఇక ఫ్యామిలీలు విషయానికి వస్తే ఉషాకిరణ్ బ్యానర్ ని చూసి ఈ సినిమాకు పరుగెత్తుకెళ్లకుండా కాస్త ఆలోచించి ముందడగు వేయటం మేలు.

  English summary
  Ravibabu came up with another comedy targeted at urban youth and multiplex audience.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X