For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆఫీసర్ సినిమా రివ్యూ: శివ.. శివా!

By Rajababu
|
Officer Movie Review ఆఫీసర్ సినిమా రివ్యూ

Rating:
1.5/5
Star Cast: నాగార్జున, మైరా సరీన్‌, ఫిరోజ్‌ అబ్బాసీ, షియాజీ షిండే
Director: రాంగోపాల్‌వర్మ

సెన్సేషనల్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ, కింగ్ నాగార్జున అక్కినేని కాంబినేషనల్‌లో వచ్చిన శివ చిత్రం భారతీయ సినిమా పరిశ్రమను ప్రభావితం చేసింది. ఫిల్మ్ మేకింగ్‌లో ఆ చిత్రం ఓ ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత అలాంటి కాంబినేషన్ మళ్లీ ఆఫీసర్ చిత్రం కోసం జతకట్టింది. సినిమా ఓపెనింగ్ రోజున 'నా బుర్రలో గుజ్జు అయిపోయిందని విమర్శించే వాళ్లకు ఆఫీసర్ చిత్రం ఓ సమాధానం' అని వర్మ సంచలన వ్యాఖ్యలు చేయడంతో ఆఫీసర్ చిత్రం అందరి దృష్టిని ఆకర్షించింది.

ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఆఫీసర్ సినిమా వర్మ కమ్‌బ్యాక్ మూవీ అనే అభిప్రాయం వ్యక్తమైంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆఫీసర్ సినిమా జూన్ 1 ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం మళ్లీ శివ రేంజ్ సక్సెస్ సాధించిందా? ఈ చిత్రంపై నెలకొన్న అంచనాలను అధిగమించిందా అనే ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే.

ఆఫీసర్ కథ ఇదే

ఆఫీసర్ కథ ఇదే

ముంబైలో మాఫియాను గడగడలాడించిన పోలీసు అధికారి నారాయణ పసారి (ఫిరోజ్ అబ్బాసి). ఆయన ఎన్‌కౌంటర్ స్సెషలిస్ట్. కానీ ఓ భూటకపు ఎన్‌కౌంటర్‌ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటారు. ఆ కేసును విచారించడానికి చేయడానికి ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందానికి శివాజీ రావు (నాగార్జున) అనే ఆఫీసర్‌ను అపాయింట్ చేస్తారు. కేసు దర్యాప్తులో భాగంగా పసారిని శివాజీ అరెస్ట్ చేస్తాడు.

 క్లైమాక్స్ పాయింట్స్

క్లైమాక్స్ పాయింట్స్

ఆ తర్వాత కేసు నిలబడకపోవడంతో పసారిని మళ్లీ ఉద్యోగంలో చేర్చుకొంటారు. ఈ నేపథ్యంలో పసారి, శివాజీ మధ్యలో విభేదాలు ముదురుతాయి. శివాజీని ఎదుర్కోవడానికి ముంబైలో పసారి మళ్లీ ఓ మాఫియాను సృష్టిస్తారు. పసారి ఎత్తులను శివాజీ ఎలా ఎదుర్కొన్నారు? పసారి సృష్టించిన మాఫియాను శివాజీ ఎలా మట్టుపెట్టారు అనే ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే ఆఫీసర్ సినిమా చూడాల్సిందే.

 తొలి భాగంలో

తొలి భాగంలో

తొలిభాగంలో నారాయణ పసారిపై ఆరోపణలు, ఆ తర్వాత సిట్ అధికారిగా నాగార్జున నియమించడం లాంటి అంశాలతో సినిమా ప్రారంభమవుతుంది. పసారిపై వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు చేయడం లాంటి సీన్లు చాలా రొటీన్‌గా సాగుతుంటాయి. ఆ క్రమంలో పసారిని శివాజీ అరెస్ట్ చేసే సీన్ కొంత ఆసక్తి రేపుతుంది. ఆ సీన్ నుంచి సినిమా ఏమైనా ఎత్తుకుంటుందా అని ఆశ పడ్డవాళ్లకు పూర్తి నిరాశే మిగులుతుంది. ఓ సాదా సీదా సన్నివేశంతో ఇంటర్వెల్ బ్యాంగ్‌ పడుతుంది.

 సెకండాఫ్‌లో

సెకండాఫ్‌లో

ఇక రెండో భాగంలో శివాజీని ఇబ్బంది గురిచేయడానికి పసారి ఆడే డ్రామాతో సినిమా నిరాశాజనకంగా సాగుతుంది. రొటీన్ సీన్లు, కథ, కథనంలో పస లేకపోవడం ప్రేక్షకుడికి ఓ పరీక్షగా మారుతుంది. రెండో భాగంలో నాసిరకమైన సీన్లు చాలా చికాకును కలిగిస్తాయి. ఎప్పుడో 80ల నాటి సీన్లు, స్క్రీన్ ప్లే చాలా బోర్‌గా ఉంటుంది. ఇక రెండోభాగంలో శివాజీ కూతురుతో సెంటిమెంట్‌ను కూడా పండించలేకపోవడంతో ఈ చిత్రం చాలా సాదాసీదా అనే అభిప్రాయం ఏర్పడుతుంది.

 వర్మకు వేకప్ కాల్

వర్మకు వేకప్ కాల్

వర్మ అనగానే శివ, అంతం, కంపెనీ, సర్కార్ లాంటి బ్లాక్‌బస్టర్లు గుర్తుకొస్తాయి. ఇటీవల కాలంలో వర్మ తీసిన చిత్రాలు అలా వచ్చి ఇలా పోతున్నాయి. ఇలాంటి క్రమంలో ఓ ఛాలెంజ్‌గా తీసుకొని నాగార్జునతో ఆఫీసర్‌ చిత్రాన్ని వర్మ రూపొందిస్తారని ఫ్యాన్స్ అంతా ఆశించారు. కానీ వర్మలో మునపటి ఫైర్ ఎక్కడ కనిపించదు. కెమెరా యాంగిల్స్, సీన్‌లో డిటెయిలిటీ చాలా ఫన్నీగా, కామెడీగా కనిపిస్తాయి. ఆఫీసర్ చిత్రంలో చాలా సీన్లు వర్మ ఫిలిం మేకింగ్ పట్టుకోల్పోయాడనే ఫీలింగ్ కలుగజేస్తాయి. చేజింగ్, ఫైట్లకే పరిమితమయ్యారు. క్లైమాక్స్ చూస్తే థర్డ్ క్లాస్ డైరెక్టర్ కూడా చేసి ఉండరు అనే ఫీలింగ్ కలుగుతుంది. ఆఫీసర్ చూసిన తర్వాత వర్మ ఇక మేల్కొనాల్సిన అవసరం ఎంతైనా ఉందనే భావన కలుగడం సహజం.

యంగ్ అంట్ ఫిట్‌గా నాగ్

యంగ్ అంట్ ఫిట్‌గా నాగ్

శివాజీగా నాగార్జున పోలీస్ ఆఫీసర్‌గా కనిపించారు. ఫిజికల్‌గా చూస్తే చాలా ఫిట్‌గా, యంగ్ అండ్ ఎనర్జిటిక్‌గా కనిపించారు. కానీ పాత్రలో అలాంటి అంశాలు లేకపోవడంతో తెర మీద తేలిపోయాడనిపిస్తుంది. సాధారణంగా నాగార్జునలో మంచి జడ్జిమెంట్ ఉంటుందని సినీవర్గాల్లో టాక్ ఉంటుంది. కానీ ఆఫీసర్ కథను ఏలాఒప్పుకొన్నారో అనేది సినిమా చూసిన వారంతా చర్చించుకొనే పరిస్థితి కనిపించింది.

హీరోయిన్‌గా మైరా సరీన్

హీరోయిన్‌గా మైరా సరీన్

ఇక ఈ చిత్రంలో హీరోయిన్ కానీ హీరోయిన్ పాత్రలో మైరా సరీన్ కనిపించింది. సినిమాకు పెద్గగా ఉపయోగపడని పాత్ర. అటు ఆమె ఫెర్ఫార్మెన్స్‌ చాలా పేలవంగా ఉంటుంది. గ్లామర్‌గా కూడా అంత ఆకట్టుకొని పాత్రను మైరా పోషించింది. ఆటలో అరటిపండు లాంటి పాత్రలో మైరా కనిపించింది.

మిగితా పాత్రల్లో

మిగితా పాత్రల్లో

ఆఫీసర్ చిత్రంలో అజయ్, షియాజి షిండే తప్ప మిగితా పాత్రల్లో పేరు, ఊరులేని నటీనటులు నటించారు. నాగార్జున కూతురిగా బేబీ కావ్య నటించింది. నారాయణ పసారి, శివాజీ పాత్ర మొదలుకొని అన్ని పాత్రలు చాలా రొటీన్‌గా, పొంతనలేని విధంగా తెరపైన కనిపిస్తాయి.

మ్యూజిక్

మ్యూజిక్

ఆఫీసర్ చిత్రానికి రవి శంకర్ సంగీతం అందించారు. బిస్వాస్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అక్కడక్కడా బాగుంది. ఈ చిత్ర రిలీజ్‌కు ముందు సౌండింగ్ గురించి గొప్పగా మాట్లాడారు. కాకపోతే అంతలేకపోయినా కొంత మెరుగ్గానే అనిపిస్తుంది.

సినిమాటోగ్రఫి

సినిమాటోగ్రఫి

ఆఫీసర్ చిత్రానికి ఎన్ భరత్ వ్యాస్, రాహుల్ పెనుమత్స సినిమాటోగ్రఫిని అందించారు. కొన్ని సన్నివేశాలు బాగా చిత్రీకరించారు. కానీ వర్మ చిత్రంలో ఉండే మ్యాజిక్ కనిపించదు. ఎడిటింగ్ విభాగం పనితీరు కూడా అంతంత మాత్రమే.

నిర్మాణ విలువలు

నిర్మాణ విలువలు

నిర్మాణ విలువల గురించి మాట్లాడితే ఏదో అలా చుట్టేశారా అనే ఫీలింగ్ కలుగకమానదు. సినిమాలో పసారి అరెస్ట్ సీన్ తప్ప థ్రిల్లింగ్ సీన్లు కనిపించవు. డైలాగ్స్ వింటుంటే ఏదో డబ్బింగ్ సినిమా చూస్తున్నామా అనిపిస్తుంది.

ఫైనల్‌గా

ఫైనల్‌గా

ఫ్లాపులతో సతమతమవుతున్న నేపథ్యంలో వర్మ‌ సవాల్‌గా తీసుకొని రూపొందించిన ఆఫీసర్ ప్రేక్షకులను ఆకట్టుకోవడం కష్టమే. నాగార్జున, వర్మ కలయికలో శివ మ్యాజిక్ ఆశించిన వారికి ఆఫీసర్ షాకివ్వడం ఖాయం.

బలం, బలహీనతలు

బలం, బలహీనతలు

ప్లస్ పాయింట్స్

నాగార్జున

ఫిరోజ్ అబ్బాసి యాక్టింగ్

మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్

మైనస్ పాయింట్స్

బలమైన క్యారెక్టర్లు లేకపోవడం

నటీనటుల ఎంపిక

నిర్మాణ విలువల

సెకండాఫ్

తెర ముందు.. తెర వెనుక

తెర ముందు.. తెర వెనుక

నటీనటులు: నాగార్జున, మైరా సరీన్‌, ఫిరోజ్‌ అబ్బాసీ, షియాజీ షిండే, అజయ్‌, బేబీ కావ్య తదితరులు

సంగీతం: రవిశంకర్‌

సినిమాటోగ్రఫీ: ఎన్‌. భరత్‌ వ్యాస్‌, రాహుల్‌ పెనుమత్స

ఎడిటింగ్‌: అన్వర్‌ అలీ, ఆర్‌.కమల్‌

కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: రాంగోపాల్‌వర్మ

బ్యానర్‌: ఆర్‌ కంపెనీ ప్రొడక్షన్స్‌

విడుదల తేదీ: 01-06-2018

English summary
Nagarjuna and Ram Gopal Varma joined hands for an intense cop thriller ‘Officer’. After a few postponements, the film is finally hitting the screens on June 1st, 2018. Coming from the combination of evergreen ‘Shiva’, this film is expected to have a lot of expectations over it and audience are hoping that ‘Officer’ will sign off this Summer on a high note.
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more