OG Movie Twitter Review: ఓజీ మూవీ ట్విట్టర్ రివ్యూ అండ్ రేటింగ్
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా టాప్ ప్రొడక్షన్ కంపెనీ డీవీవీ ఎంటర్‌టైనర్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య నిర్మాతగా సాహో ఫేమ్ సుజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ఓజీ (OG). గ్యాంగ్‌స్టర్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటించారు. సినిమా ద్వారా బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ఈ చిత్రంలో మలయాళ నటుడు అర్జున్ దాస్, సీనియర్ నటులు ప్రకాశ్ రాజ్, శుభలేఖ సుధాకర్, శ్రీయా రెడ్డి, హరీష్ ఉత్తమన్, అభిమన్యు సింగ్, అజయ్ ఘోష్ లాంటి వాళ్లు నటించారు. ఇక ఈ చిత్రానికి రవి కే చంద్రన్ సినిమాటోగ్రఫి, ఎఢిటింగ్ నవీన్ నూలీ, సంగీతం థమన్ ఎస్ బాధ్యతలను నిర్వర్తించారు.
ఓజీ సినిమా పాటలు యాక్షన్ గ్లింప్స్ సగటు ప్రేక్షకుడిని ఆకట్టుకోవడంతో అంచనాలు భారీగా పెరిగాయి. భారీ వర్షాన్ని లెక్క చేయకుండా సాగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ తర్వాత క్రేజ్ మరింత పెరిగింది. ఇక ఆలస్యమైనా ట్రైలర్ విడుదల తర్వాత ఈ సినిమాను చూడాలనే ఉత్సాహం మరింత పెరిగింది. సెప్టెంబర్ 25వ తేదీన గ్రాండ్‌గా ప్రపంచవ్యాప్తంగా రిలీజవుతున్నది. అయితే ఈ సినిమాకు సంబంధించిన ప్రీమియర్లు సెప్టెంబర్ 24వ తేదీ రాత్రి 9 గంటల నుంచి ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో నెటిజన్లు, క్రిటిక్స్, సినీ ప్రముఖుల అభిప్రాయాల్లోకి వెళితే..

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సాలిడ్ కమ్ బ్యాక్. 2025 సంవత్సరంలో పవర్ ప్యాక్ట్, బ్లడీ మాస్ బెస్ట్ థ్రిల్లర్ 2025. పవన్ కల్యాణ్ బ్యాంగ్‌తో బ్యాక్ వచ్చాడు. విలన్‌గా ఇమ్రాన్ హష్మీ చెలరేగిపోయాడు. స్వాగ్, క్రేజీ డైలాగ్స్, ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే, చివరి 20 నిమిషాల క్లైమాక్ష్ ఈ సినిమాకు ప్రాణం అని క్రిటిక్ ఉమేర్ సంధూ ట్వీట్ చేశాడు.
OG సినిమా కేవలం ఒక సినిమా కాదు. ఒక స్టేట్‌మెంట్. మాస్టర్ క్లాస్ స్వాగ్, స్టోరీ టెల్లింగ్. అద్బుతమైన విజువల్స్‌కు వెన్నులో చలిపుట్టించే బ్యాక్ గ్రౌండ్ స్కోర్. ప్రతీ సన్నివేశం మాస్ జనాల చేత కేక పెట్టించే విధంగా ఉంటుంది. ఇలాంటి సినిమాను అందించిన ఓజీ టీమ్‌పై గౌరవం పెరగింది. వారి శ్రమపై ప్రశంసలు కురిపించాల్సిందే. ఈ ఫైర్ స్ట్రామ్ వెనుక ఉన్న ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు అని ఓ నెటిజన్ కామెంట్ చేశారు.
ఓజీ సినిమాకు సంబంధించి ఇన్‌సైడ్ రిపోర్టు ప్రకారం.. టైటిల్ కార్డు అదిరిపోయింది. పవన్ కల్యాణ్ ఎంట్రీ సూపర్బ్. ఫస్టాఫ్ క్రేజీగా ఉంటుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ అదిరిపోయింది. సెకండాఫ్ ఇంకా బాగుంటుంది. క్లైమాక్స్ గురించి మాటల్లో చెప్పలేం. తెరపైనే చూడాలి అంటూ కామెంట్ నెటిజన్ కామెంట్ చేశాడు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అనడానికి ఎలాంటి అనుమానాలు అక్కర్లేదు అని పేర్కొన్నాడు.
OG ఇన్‌సైడ్ రిపోర్ట్ ప్రకారం.. బ్లాక్ బస్టర్ అనే మాట ఈ సినిమాకు పదంగా మారిపోతుంది. ఈ సినిమా రిలీజ్ తర్వాత నాన్ ఓజీ రికార్డులు నమోదు కావడం ఖాయం. ఆంధ్రా, నైజాంలో ప్రీమియర్లు ఎప్పుడు ముగుస్తాయా? అనే విషయం క్రేజీగా ఉంది. డెత్ కోటా కన్ఫార్మ్ అని నెటిజన్ కామెంట్ చేశాడు.
OG ఇన్‌సైడ్ రిపోర్ట్ రివ్యూ:
ఓజీ సినిమా ఫస్టాఫ్ డీసెంట్‌గా స్టార్ట్ అవుతుంది. ఇంటర్వెల్ హైలో ఉంటుంది. సెకండాఫ్‌లో మూడు హై మాస్ సీన్లు ఉంటాయి. వాషి ఓ వాషి మానియా మూములుగా ఉండదు. విలన్‌గా ఇమ్రాన్ హష్మీ అదరగొట్టాడు. సదరన్ మాస్ స్వాగ్ లోడెడ్. ఆంధ్రా, తెలంగాణ, ఫైర్ స్ట్రామ్ లోడింగ్. ఫైనల్‌గా బ్లాక్ బస్టర్ ఖాయం అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.
ఓజీ సినిమాతో బిగ్గెస్ట్ ఫెస్టివల్ మొదలైంది. ఫైర్ స్ట్రామ్ మంటలు ఎగిసిపడి విధ్వంసం సృష్టిస్తున్నాయి. ఈ విజయోత్సవానికి ఎప్పుడెప్పుడు జరుపుకోవాలా? అని ఎదురు చూస్తున్నాను. మాస్, భారీ బాక్సాఫీస్ ర్యాంపేజ్‌కు సర్వం సిద్దమైంది. పవన్ కల్యాణ్, సుజిత్, డార్లింగ్ తమన్ కంగ్రాట్స్ అని మారుతి ట్వీట్ చేశాడు.
నా జీవితం మొత్తంలో ఇలాంటి ఇంటర్వెల్ బ్లాక్ చూడలేదు.. థ్యాంక్స్ రా సుజీత్, బ్లాక్‌బస్టర్ రా అని ఓ నెటిజనో పోస్ట్ చేశాడు.
మీసం తిప్పు తమన్ అన్నా, ఏమన్నా షాటా, ఇంటర్వెల్ షాట్ వామ్మో సుజీత్.. పవన్ అన్నా కొట్టేశాం అంటూ ఓ అభిమాని రాసుకొచ్చాడు.
ఫస్టాఫ్ బాగుంది.. ప్రీ ఇంటర్వెల్ నుంచి ఇంటర్వెల్ వరకు పూనకాలే. అల్టీమేట్ ఫేస్ ఆఫ్ సెట్ చేశాడు సుజీత్. ఇంటర్వెల్ అయితే బోయపాటి లెవల్ విధ్వంసమేని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు
ఫస్టాఫ్ ఓ సాధారణ గ్యాంగ్‌స్టర్ డ్రామా. తొలి అర్ధభాగం పాత్రల పరిచయాలతో సెటప్‌గా ఉంది. భారీ ఇంటర్వెల్ బ్లాక్ ముందు వరకు ఫ్లాట్‌గా ఉన్నా తర్వాత ఊపొచ్చింది. పవన్ కళ్యాణ్ ఎంట్రీ, ఇంటర్వెల్ బ్లాక్‌లు సినిమాకే హైలైట్. థమన్ ఈ సినిమాకు ప్రాణం. సెకండాఫ్ కోసం వెయిట్ చేస్తున్నానని ఓ నెటిజన్ రివ్యూ ఇచ్చాడు.
ఓజీ కథనం ఆసక్తికరంగా, వేగంగా, వీఎఫ్ఎక్స్ అద్భుతంగా ఉంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లుక్ ఓ మ్యాగ్నటిక్. అతను పీక్ బీస్ట్ మోడ్‌లో ఉన్నాడు. మొత్తంగా ఓజీ బ్లాక్‌బస్టర్. సుజీత్ మళ్లీ అద్భుతంగా చేశాడు అని ఓ అభిమాని తెలిపాడు.
పవన్ కళ్యాణ్ ఎంట్రీ సీన్స్ పీక్స్. థమన్ బీజీఎం భారీ ప్రభావాన్ని చూపుతుంది. బ్యాక్‌డ్రాప్ ఫైట్ సీన్లు, స్టోరీ లైన్ దర్శకుడిని బెస్ట్ ఆఫ్ బెస్ట్‌గా నిలబెట్టాయి. సుజీత్ అభిమానులకు భారీ విందు ఇచ్చాడు అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.
ఓజీ ఫస్టాఫ్ అద్భుతంగా ఉంది. పవన్ కళ్యాణ్‌కి బెస్ట్ ఎలివేషన్స్, ఇంపాక్ట్ యాక్షన్ సీక్వెన్స్‌లు ఉన్నాయి. కన్‌ఫ్లిక్ట్‌ని అద్భుతంగా సెట్ చేశారు. ఎస్ఎస్ థమన్ తన మనసు పెట్టి మ్యూజిక్ ఇచ్చాడు. సుజీత్ దర్శకత్వం, స్క్రీన్ ప్లే ఫైర్ అంతే అని ఓ అభిమాని పోస్ట్ పెట్టాడు


Click it and Unblock the Notifications











