For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  ఒక్క క్షణం మూవీ రివ్యూ: ‘అల్లు’కొన్న కథ

  By Rajababu
  |

  Rating:
  2.5/5
  Star Cast: అల్లు శిరీష్, సురభి, శ్రీనివాస్ అవసరాల
  Director: విఐ ఆనంద్

  Okka Kshanam Public Talk 'ఒక్క క్షణం' పబ్లిక్ టాక్..

  అల్లు సినీ వారసుడిగా టాలీవుడ్‌లో అడుగుపెట్టిన అల్లు శిరీష్ రాశి కంటే వాసినే నమ్ముకున్నట్టు కనిపిస్తున్నాడు. వరుస సినిమాల కంటే విభిన్నమైన చిత్రాలను ఎంచుకొంటూ ప్రేక్షకులకు చేరువవుతున్నాడు. శ్రీరస్తు శుభమస్తు లాంటి ఫీల్‌గుడ్ మూవీ తర్వాత ఒక్క క్షణం చిత్రంతో డిసెంబర్ 28న ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. వీఐ ఆనంద్ దర్శకత్వం వహించిన చిత్రంలో సీరత్ కపూర్, వీఐ ఆనంద్, సురభి, అవసరాల శ్రీనివాస్ తదితరులు నటించారు. చక్రి చిగురుపాటి నిర్మించిన ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించారు. తాజాగా సైంటిఫిక్, సస్సెన్స్ థ్రిల్లర్‌తో వచ్చిన అల్లు శిరీష్ ఎలాంటి ఫలితాన్ని అందుకొన్నారు అనే విషయాన్ని తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే.

  Vote Here : 2017 సంవత్సరపు ఉత్తమ హీరో ఎవరు?

  ఒక్క క్షణం కథ ఇదే

  జీవా (అల్లు శిరీష్), జో (సురభి) లవర్స్. జో ఫ్లాట్‌కు ఎదురుగా ఉంటే ఫ్లాట్‌లో శ్రీనివాస్ (అవసరాల శ్రీనివాస్), స్వాతి (సీరత్ కపూర్) దంపతులు ఉంటారు. అయితే శ్రీనివాస్, స్వాతి దంపతుల మధ్య ఎప్పుడు గొడవ పడుతుంటారు. వారిద్దరూ ఎందుకు గొడవ పడుతున్నారనే విషయాన్ని జీవా తెలుసుకోవడానికి ప్రయత్నించగా వారి జీవితంలో చోటుచేసుకొన్న సంఘటనలే తమ జీవితంలో కూడా జరుగుతున్నాయని తెలుసుకొంటారు. ఈ నేపథ్యంలో స్వాతి దారుణ హత్యకు గురవుతుంది. స్వాతి హత్యా నేరం శ్రీనివాస్‌పై మోపబడి అతను జైలుకెళ్తాడు. ఈ నేపథ్యంలో తమ జీవితంలో కూడా ఇలానే జరుగుతుందా అని జీవా, జో భయంతో వణికిపోతారు.

  ట్విస్టులకు ముగింపు ఇలా

  ఇంతకీ స్వాతిని శ్రీనివాస్ చంపాడా? లేదా స్వాతి ఎలా దారుణ హత్యకు గురైంది? జీవా, జో జీవితంలో కూడా ఇలాంటి సంఘనలే జరిగాయా? జో కూడా హత్యకు గురవుతుందా? లేదా స్వాతి, శ్రీనివాస్ లైఫ్‌లో జరిగిన సంఘటనుల తమ జీవితంలో చోటుచేసుకోకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకొన్నారు అనే తెర మీద ప్రశ్నలకు సమాధానమే ఒక్క క్షణం సినిమా.

  ఫస్టాఫ్‌లో

  తొలిభాగం ఆరంభంలో కథలోకి వెళ్లడానికి దర్శకుడు కొంత ఎక్కువ సమయమే తీసుకొన్నాడనిపిస్తుంది. కథలోకి వెళ్లిన తర్వాత ఆసక్తికరమైన ట్విస్టులతో ఇంటర్వెల్ బ్యాంగ్‌కు ప్రేక్షకుడిని తీసుకెళ్తాడు. ఓ ఇంట్రెస్టింగ్ పాయింట్‌తో రెండో భాగంపై ఆసక్తిపెంచేలా దర్శకుడు జాగ్రత్త పడ్డాడు.

  సెకండాఫ్‌లో

  ఇక రెండో భాగంలో జీవా, జో తమ జీవితంలో ఎలాంటి ప్రతికూల పరిస్థితులు ఎదురవుతాయనే భయాందోళనల మధ్య కథ సాగుతుంటుంది. ప్రీ క్లైమాక్స్‌కు ముందు మెడికల్ మాఫియా అంశాన్ని జొప్పించడంతో కథ మరో మలుపుతిరుగుతుంది. అక్కడ నుంచి కథ, కథనాలు వేగం పుంజుకోవడం, దాసరి అరుణ్ కుమార్ విలన్‌గా రంగ ప్రవేశం చేయడం ప్రేక్షకుడికి సరికొత్తగా అనిపిస్తుంది. కాకపోతే సెంటిమెంట్, యాక్షన్ ఎపిసోడ్ల కోసం క్లైమాక్స్‌ను సాగదీయడం కొంత ఇబ్బందికి గురిచేస్తుంది. అనవసరమైన నస లేకుండా కథను ఆసక్తిగా చెప్పి ఉంటే సినిమా అన్నివర్గాల ప్రేక్షకులకు చేరువ కావడానికి మరింత ఆస్కారం ఉండేది.

  దర్శకుడు వీఐ ఆనంద్

  అమెరికా అధ్యక్షులు అబ్రహం లింకన్, జాన్ ఎఫ్ కెన్నడీ జీవితంలో చోటుచేసుకొన్న ఒకే రకమైన సంఘటనల ఆధారంగా అల్లుకొన్న ప్యార్లల్ లైఫ్ (సమాంతర జీవితం) కథనే ఒక్క క్షణం. ఒకరి జీవితంలో జరిగిన సంఘటనలే మరోకరి జీవితంలో అచ్చం అలానే జరగడం ఈ కథలో ప్రధాన అంశం. ప్యార్లల్ లైఫ్ కథకు రెండు జంటలను ఎంచుకొని చక్కటి స్క్రీన్‌ప్లేతో సినిమాను దర్శకుడు వీఐ ఆనంద్ నడిపించాడు. సెకండాఫ్‌లో స్క్రీన్‌ప్లేను బలంగా అల్లుకొన్నాడు. క్లైమాక్స్‌ను సాగదీయకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉండేది.

  అల్లు శిరీష్ పెర్ఫార్మెన్స్

  కెరీర్ ఆరంభంలో తన క్రేజ్, స్టామినాకు తగినట్టు కథలను అల్లు శిరీష్‌ ఎంచుకోవడం మంచి పరిణామమే. జీవా పాత్రను చాలా బ్యాలెన్స్‌గా కవర్ చేశాడు. అనవసరంగా పాటలు, ఫైట్ల కోసం ఆరాటపడకుండా శీరిష్ తన పాత్రను చక్కగా తీర్చిదిద్దుకొన్నాడు. కథతో ట్రావెల్ అవ్వడమే కాకుండా అన్ని పాత్రలు బ్యాలెన్స్‌గా ఉండేలా చూసుకోవడం శిరీష్ పరిణితికి అద్దం పట్టింది. ఫైట్స్, పాటలు, యాక్టింగ్ బాగుంది.

  సురభి గ్లామర్‌గా

  ఆట, పాటలకే హీరోయిన్లు పరిమితమవుతున్న నేపథ్యంలో సురభికి ఈ చిత్రంలో అభినయానికి స్కోప్ ఉన్న పాత్ర లభించింది. అయితే నటనలో ఇంకా రాటుదేలాల్సిన అవసరం ఉంది. తన పాత్ర పరిధి మేరకు ఓకే అనిపించింది.

  అవసరాల యాక్టింగ్

  విభిన్నమైన నటనను ప్రదర్శించే అవసరాల శ్రీనివాస్‌కు ఈ చిత్రంలో మంచిపాత్రే దక్కింది. కథ మొత్తం తన చుట్టే తిరుగుతుంది. ఈ నేపథ్యంలో తన పాత్రలో భావోద్వేగాలను బాగానే పండించాడు. తన పాత్రకు నూటికి నూరు శాతం న్యాయం చేశాడు. ఇలాంటి పాత్రలు అవసరాలకు కొట్టిన పిండిలాంటివే.

  సీరత్ కపూర్ అందాలు

  ఒక్క క్షణం చిత్రంలో సీరత్ కపూర్‌ది కూడా ప్రాధానమైన పాత్రే. ప్రధానంగా కథ మొత్తం ఆమె పాత్రపై ఆధారపడి ఉంటుంది. దాంతో సీరత్ స్సెషల్ అట్రాక్షన్‌గా కనిపిస్తుంది. గ్లామర్ పరంగా అందాలు ఆరబోతకు వెనుకాడలేదు.

  విలన్‌గా దాసరి అరుణ్

  దివంగత దర్శకుడు దాసరి నారాయణరావు కుమారుడు దాసరి అరుణ్‌‌ది ఈ చిత్రం ద్వారా సర్ఫ్రైజ్ ఎంట్రీ ఇచ్చాడు. ప్రమోషన్‌లో ఎక్కడ అరుణ్ పేరు కనిపించకపోవడం.. సడెన్‌గా కథలో ఎంట్రీ కావడం ప్రేక్షకులు ఓ థ్రిల్ పాయింట్. విలన్ ఈ చిత్రంలో అరుణ్ మెప్పించాడు. ఇంకా కొంత మేరకు ఎమోషన్స్ పలికించే స్కోప్ ఉందనిపిస్తుంది.

  కమెడియన్లు, మిగితా పాత్రల్లో

  మిగితా పాత్రల్లో కమెడియన్లు సత్య, ప్రవీణ్ హాస్యం కొంత రిలీఫ్‌గా ఉంటుంది. కమెడియన్ రఘు విలన్ టచ్ ఉన్న పాత్రలో కనిపించారు. అల్లు శిరీస్ తండ్రిగా కాశీ విశ్వనాథ్ తన పాత్ర పరిధి మేరకు ఒకే అనిపిస్తాడు.

  సాంకేతిక విభాగాల పనితీరు

  ఒక్క క్షణం సినిమాకు మరో అదనపు ఆకర్షణ మణిశర్మ మ్యూజిక్. కీలక సన్నివేశాలకు రీరికార్డింగ్ ప్రాణం పోసింది. సస్పెన్స్, థ్రిల్లర్ కథకు కావాల్సిన మూడ్‌ను క్రియేట్ చేయడంలో మణి పైచేయి సాధించాడు. పాటలకు పెద్దగా స్కోప్ లేకపోవడంతో ప్రభావం చూపించలేకపోయాడు. అబ్బూరి రవి మాటలు ఫర్వాలేదనిపించేలా ఉన్నాయి. ఎడిటింగ్‌ శాఖకు ఇంకా కత్తెర వేసేందుకు స్కోప్ ఉంది.

  ఫైనల్‌గా ఒక్క క్షణం గురించి

  టాలీవుడ్‌లో ఇటీవల కాలంలో సస్పెన్స్ థ్రిల్లర్లకు కొదవలేకుండా ఉంది. ప్రతీ నెల ఒకటో, రెండో ఇలాంటి సినిమాలు ప్రేక్షకులను పలకరిస్తుంటాయి. తాజాగా మెడికల్ మాఫియా ఆధారంగానే ఇలాంటి చిత్రాలు వస్తున్నాయి. అలాంటి కోవలోనిదే ఒక్క క్షణం. కాకపోతే దర్శకుడు వీఐ ఆనంద్ కథపై చేసిన పరిశోధన తెరపైన ఆకట్టుకొనేలా ఉంది. ప్యార్లల్ లైఫ్ అనేది కొత్త పాయింట్. కాకపోతే మరింత గ్రిప్పింగ్ చెప్పడానికి అవకాశం ఉంది. కానీ ఏదో పరిస్థితుల వల్ల తెరమీద గొప్పగా పండలేదు. ఇయర్ ఎండ్ హాలీడేస్‌లో సస్పెన్స్ థ్రిల్లర్లను ఆస్వాదించే ప్రేక్షకులకు, మల్టిప్లెక్స్ ఆడియెన్స్‌కు ఇది నచ్చుతుంది. బీ, సీ సెంటర్ల ప్రేక్షకులకు చేరువైతే మంచి ఆర్థికపరమైన విజయం లభించడం ఖాయం.

  బలం, బలహీనతలు

  ప్లస్ పాయింట్స్
  వీఐ ఆనంద్ టేకింగ్
  మణిశర్మ రీరికార్డింగ్

  మైనస్ పాయింట్స్
  ఫస్టాఫ్ కొంత
  క్లైమాక్స్ సాగదీత

  తెర వెనుక, తెర ముందు

  అల్లు శిరీష్, సురభి, సీరత్ కపూర్, అవసరాల శ్రీనివాస్, జయప్రకాశ్ తదితరులు
  దర్శకుడు: వీఐ ఆనంద్
  నిర్మాత: చక్రి చిగురుపాటి
  మ్యూజిక్ డైరెక్టర్: మణిశర్మ
  రిలీజ్ డేట్: 28 డిసెంబర్ 2017

  English summary
  Allu Sirish, Surbhi, Srinivas Avasarala and Seerat Kapoor starrer 'Okka Kshanam' releases on December 28 amidst high expectations. Directed by Vi Anand, with music by Mani Sharma, the teaser and trailer of the film have been received well, bringing up the curiosity of viewers. In this occassion, Telugu Filmibeat brings you an exclusive review.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more