For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఒరేయ్ బుజ్జిగా మూవీ రివ్యూ అండ్ రేటింగ్

  |

  Rating:
  2.0/5
  Star Cast: రాజ్ తరుణ్, మాళవిక నాయర్, హెబ్బా పటేల్, వాణి విశ్వనాథ్, వీకే నరేష్
  Director: విజయ్ కుమార్ కొండా

  గుండె జారి గల్లంతయ్యిందే లాంటి ప్రేమ కథతో అభిరుచి ఉన్న దర్శకుడిగా పరిచయమైన విజయ్ కుమార్ కొండా, ప్రేమ కథా చిత్రాలతో వరుస విజయాలు సాధించిన రాజ్ తరుణ్ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం ఒరేయ్ బుజ్జిగా. నిర్మాత కేకే రాధామోహన్ రూపొందించిన ఈ చిత్రం లాక్‌డౌన్ కారణంగా విడుదల నిలిచిపోయింది. ఈ క్రమంలో ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆహా యాప్‌ ద్వారా రిలీజైన చిత్రం ఎలా ఉందంటే..

  ఒరేయ్ బుజ్జిగా కథ

  ఒరేయ్ బుజ్జిగా కథ

  శ్రీను అలియాస్ బుజ్జి (రాజ్‌ తరుణ్) కృష్ణవేణి (మాళవిక నాయర్) ఒకే ఊరికి చెందిన వాళ్లు. ప్రేమను దక్కించుకోవడానికి శ్రీను.. ఇష్టం లేని పెళ్లి చేసుకోవడం కష్టంగా భావించిన కృష్ణవేణి ఒకే సమయంలో ఒకే ట్రైన్‌లో ఊరి నుంచి పారిపోతారు. ట్రైన్‌లో ఒకరికొకరు పరిచయం కాగా బుజ్జి తన పేరు శ్రీను అని, కృష్ణవేణి తన పేరు స్వాతి అని పరిచయం చేసుకొంటారు. వారిద్దరూ లేచిపోయారనే పుకారుతో శ్రీను, కృష్ణవేణి కుటుంబాల మధ్య చిచ్చు రేపుతుంది. హైదరాబాద్‌కు వెళ్లిన ఇద్దరు ఫ్రెండ్లీగా ఉంటారు. అయితే ఈ క్రమంలో ఊర్లో రెండు కుటుంబాల మధ్య గొడవలు జరుగుతున్నాయనే విషయంతో కృష్ణవేణిని వెతికేందుకు శ్రీను ప్రయత్నిస్తుంటాడు. అయితే తన ఇమేజ్‌ను డామేజ్ చేసిన బుజ్జిగాడంటే కృష్ణవేణి కోపం పెంచుకొంటుంది. అయితే స్వాతిగా పరిచయమైన కృష్ణవేణికి, శ్రీనుగా పరిచయమైన బుజ్జిగాడికి మధ్య ప్రేమ పుడుతుంది.

  ఒరేయ్ బుజ్జిగా ట్విస్టులు

  ఒరేయ్ బుజ్జిగా ట్విస్టులు

  తన ప్రేయసి సృజన (హెబ్బా పటేల్)తో బుజ్జిగాడి ప్రేమ సక్సెస్ కాకపోవడానికి కారణమేమిటి? స్వాతియే కృష్ణవేణి శ్రీనుకు ఎలా తెలిసింది? శ్రీనుగా పరిచయమైన బుజ్జిగాడు గురించి కృష్ణవేణి ఎలా తెలుసుకొన్నది. బుజ్జిగాడుపై కోపం ఎలా తీరింది. చివరకు బుజ్జిగాడు, కృష్ణవేణి ఎలా కలుసుకొన్నారు? రెండు కుటుంబాల మధ్య గొడవలు ఎలా సద్దుమణిగాయి? అనే ప్రశ్నలకు సమాధానమే ఒరేయ్ బుజ్జిగా సినిమా కథ.

  ఒరేయ్ బుజ్జిగా గురించిన విశ్లేషణ

  ఒరేయ్ బుజ్జిగా గురించిన విశ్లేషణ

  ప్రేయసి సృజన ప్రేమను పొందేందుకు శ్రీను ఇంటి నుంచి పారిపోవడం, అలాగే సొంత బావను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేని కృష్ణవేణి నిడదవోలు నుంచి హైదరాబాద్‌కు ఓకే ట్రైన్‌లో పారిపోవడంతో కథ మొదలవుతుంది. హైదరాబాద్‌లో వారిద్దరి కలిసి తిరుగుతూనే కృష్ణవేణి కోసం శ్రీను.. బుజ్జిగాడి కోసం కృష్ణవేణి వెతకడమనే చిన్న ట్విస్టుతో సినిమా సాగదీసినట్టుగా సాగుతుంది. కృష్ణవేణి ఎవరో తెలిసిన తర్వాత బుజ్జిగాడు ఎవరో తెలియడానికి, కృష్ణవేణికి తానే బుజ్జిగాడినని శ్రీను చెప్పడానికి సినిమా అనేక మలుపు తిరుగుతుంది. అయితే ఈ కథ చెప్పే విధానం రొటీన్‌గా ఉండటం, నాసిరకమైన కామెడీ కారణంతో ఓ దశలో సహనానికి పరీక్షగా మారుతుంది. డ్రామా మోతాదు మించడం ఇబ్బందిగా ఉంటుంది. చివర్లో కథను ఫీల్‌గుడ్‌గా మార్చడంతో ఒరేయ్ బుజ్జిగా పర్వాలేదనే ఫీలింగ్ కలుగుతుంది.

  రాజ్ తరుణ్ నటన గురించి

  రాజ్ తరుణ్ నటన గురించి

  ఇక రాజ్ తరుణ్‌ విషయానికి వస్తే కొత్తగా చేయడానికి విషయం లేకపోయింది. ఇలాంటి పాత్రల్లో ఆయనను ఎన్నో సినిమాల్లో చూశారు. టాలీవుడ్‌లో ఇలాంటి కథలు చాలానే వచ్చాయి. రాజ్‌ తరుణ్‌ను విభిన్నంగా చూడాలనుకొనే ప్రేక్షకులకు కాస్త నిరాశనే. లవర్ బాయ్‌గా, సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా, ప్రేమ కోసం పరితపించే యువకుడిగా డిఫరెంట్ షేడ్ పాత్ర అయినప్పటికీ.. కథలో వెరైటీ లేకపోవడం, కొత్తగా కథ చెప్పకపోవడంతో శ్రీనుగాడి రూపంలో బుజ్జిగాడు ఆకట్టుకోలేకపోయాడు.

  మాళవిక, హెబ్బా పటెల్

  మాళవిక, హెబ్బా పటెల్

  ఇక మాళవిక విషయానికి వస్తే.. రాజ్ తరుణ్‌కు ఎదురైన పరిస్థితే కనిపించింది. బేసిగ్గా పాత్రలో ఎమోషన్స్ కొత్తగా లేకపోవడం, ప్రేక్షకులను మైమరిపించే విధంగా పాత్ర లేకపోవడంతో మాళవిక నటన కూడా ఓ పరిధి మేరకే పరిమితమైందనే ఫీలింగ్ కలుగుతుంది. కొన్ని సీన్లలో తప్ప ఓవరాల్‌గా మెప్పించినట్టు ఎక్కడా కనిపించదు. హెబ్బా పటేల్ ఆధునిక భావాలున్న యువతిగా అతిథి పాత్రకే పరిమితమైంది. ఈ సినిమాకు పెద్దగా ఉపయోగపడే పాత్ర కాదని కచ్చితంగా చెప్పవచ్చు.

  ఇతర పాత్రల్లో

  ఇతర పాత్రల్లో

  వాణి విశ్వనాథ్, పోసాని, సప్తగిరి, సత్య, రాజా రవీంద్ర, సత్యం రాజేశ్, వీకే నరేష్, మధుసూదన్, అనిష్ కురివిల్లా లాంటి పాత్రలు ఎక్కువగానే ఉన్నప్పటికీ.. ఏ ఒక్క పాత్ర కూడా బ్రహ్మండంగా అనిపించలేదు. వీకే నరేష్ కొంతలో కొంత ఫర్వాలేదనిపించారు. వాణి విశ్వనాథ్ పాత్ర రకరకాల రోల్స్, కథ, కథనాల మధ్య నలిగిపోయిందనే చెప్పవచ్చు.

  దర్శకుడు విజయ్ కుమార్ కొండా

  దర్శకుడు విజయ్ కుమార్ కొండా

  విజయ్ కుమార్ కొండా విషయానికి వస్తే.. ఒకే రకమైన పార్మాట్‌నే నమ్ముకొని సినిమా తీసినట్టు అనిపిస్తుంది. ఫేస్‌బుక్, ఫోన్లతో మరోసారి మ్యాజిక్ చేద్దామనే ప్రయత్నం అంతగా సఫలం కాలేదనే చెప్పవచ్చు. రొమాంటిక్ సన్నివేశాలు రాసుకోవడంలోనూ, కథను కొత్తగా చెప్పడంలో తడబాటుకు గురయ్యారని చెప్పవచ్చు. హాస్పిటల్‌లో సన్నివేశాలను మరీ మూసగా చిత్రీకరించారనిపిస్తుంది. అలాంటి నాసిరకం సీన్లు ఎక్కువగానే ఉన్నాయని చెప్పవచ్చు.

  టెక్నికల్‌గా

  టెక్నికల్‌గా

  సాంకేతిక విషయాలకు వస్తే.. అనూప్ రూబెన్స్ సంగీతం బాగుంది. మాస్ పాటలు తెరపై మంచి హుషారు రేకెత్తించాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వల్ల కొన్ని సీన్లు మెరుగ్గా కనిపించాయి. ప్రవీణ్ పుడి ఎడిటింగ్‌కు ఇంకా స్కోప్ ఉంది. అండ్రూ సినిమాటోగ్రఫి ఒకే అని చెప్పవచ్చు. నిర్మాత కేకే రాధామోహన్ ప్రొడక్షన్ వ్యాల్యూస్ బాగున్నాయి.

  Actor Madhunandan Interview Part 2 రాజ్ తరుణ్, హెబ్బాపటేల్ కెమిస్ట్రీ ఓ రేంజ్ లో ఉంటది!!
  ఫైనల్‌గా

  ఫైనల్‌గా

  కథలో కొత్తదనం, ఆసక్తికరమైన కథనం కనిపించని రొమాంటిక్ ప్రేమ కథ ఒరేయ్ బుజ్జిగా. దర్శకుడు విజయ్ కుమార్ కొండా రాసుకొన్న కథ, కథనాలు గత చిత్రాల మాదిరిగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయనే చెప్పవచ్చు. నాసిరకమైన సీన్లు, కామెడీ ప్రేమ కథకు అడ్డంకిగా మారాయి. కొంతలో కొంత యూత్‌ను ఆకట్టుకొనే కొన్ని అంశాలు ఉండటం కాస్త ఊరట. కథలో ఉండే ట్విస్టులను సరిగా తెరకెక్కించి ఉంటే ఒరేయ్ బుజ్జిగా మూవీ మరో రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా మారి ఉండేదనే అభిప్రాయం కలుగుతుంది.

  English summary
  Director Vijay Kumar Konda's latest movie Orey Bujjigaa. Raj Tarun, Malavika Nair, Hebba Patel are the star leads in this movie. Produced by KK Radhamohan under Sri Sathya Sai Arts banner. This movie released on AHA aap on October 01.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X