»   » రెగ్యులర్ ఫ్యామిలీ డ్రామా.... (‘ఓయ్ నిన్నే’ రివ్యూ)

రెగ్యులర్ ఫ్యామిలీ డ్రామా.... (‘ఓయ్ నిన్నే’ రివ్యూ)

Posted By:
Subscribe to Filmibeat Telugu

రేటింగ్: 2.25/5

'Oye Ninne' Movie Reviw ‘ఓయ్ నిన్నే’ మూవీ రివ్యూ..

కోపిష్టి తండ్రి, అమాయకంగా ఉండే అమ్మ, చదువు ఇష్టం లేకున్నా తండ్రి మీద భయంతోనో లేక గౌరవంతోనో కాలేజీకి వెళ్లే ఒక కొడకు.... బావకంటే బాగా చదువతూ అతడిని అన్ని విషయాల్లోనూ ఏడిపించే ఒక మరదలు, హీరోతో చాలా ఫ్రెండ్రీగా ఉండే ఒక మామయ్య..... ఇది తెలుగు సినిమాల్లో సాధారణంగా కనిపించే క్యారెక్టర్ల కాంబినేషన్. చదువు పెద్దగా అబ్బని హీరో చుట్టూ అతడిలాగే జులాయిగా తిరిగే నలుగురు స్నేహితులు. ఫ్రెండ్ ప్రేమ కోసం అమ్మాయిని లేపుకుపోయి పెళ్లి చేయడాలు, తన పరువు తీస్తున్నాడంటూ తండ్రి ఫీలవ్వడాలు.... ఇవి తెలుగు సినిమాల్లో సాధారణంగా కనిపించే కాన్సెప్టులు.

చిన్నతనం నుండి పోట్లాడుతూ పెరిగిన బావ మరదళ్లు.... వేరొకరిని పెళ్లి చేసుకోవాల్సిన సమయం వచ్చే సరికి రియలైజ్ అయి తమలోని ప్రేమలు ఒకరిపై ఒకరు వ్యక్త పరుచుకోవడాలు, చివరకు ఏకమవ్వడాలు..... ఇలాంటివి మనం తెలుగు సినిమాల్లో తరచూ చూస్తూనే ఉన్నాం. దాదాపు ఇలాంటి క్యారెక్టర్లు, కాన్సెప్టుతో వచ్చిన మరో తెలుగు మూవీ 'ఓయ్ నిన్నే'. ఇలా రోటీన్ కాన్సెప్టులతో వచ్చిన సినిమాలు కూడా ఒక్కోసారి ప్రేక్షకులకు తెగ నచ్చేస్తాయి. అందుకు కారణం ప్రేక్షకులను టచ్ చేసే ఏదో ఒక కొత్త అంశం అందులో ఉండటమే. 'ఓయ్ నిన్నే' చిత్రంలో అలాంటి టచ్ చేసే అంశం ఏమైనా ఉందా? లేదా? అనేది రివ్యూలో చూద్దాం.

కథ విషయానికొస్తే...

కథ విషయానికొస్తే...

హెడ్మాస్టరుగా వందల మంది విద్యార్థులను తన చేతుల మీదుగా విద్యావంతులను చేసి వారు ప్రయోజకులు అవ్వడానికి కారణమైన శేఖరంగారు(నాగినీడు) అంటే చుట్టు పక్కల ఊర్లలో ఎంతో గౌవరం. పండితపుత్ర పరమశుంట అన్న చందంగా శేఖరం కొడుకు విష్ణు(భరత్ మార్గాని)కి మాత్రం పెద్దగా చదువు అబ్బదు. పైగా తను చేసిన పనులతో తండ్రి దృష్టిలో మరింత చులకన అయిపోతాడు. ఇలాంటివి ఎన్ని జరిగినా లెక్క చేయని హీరో... తాను ఎలా ఉండాలనుకుంటాడో అలానే ఉంటాడు.

కొడుకు చదువుకుని మంచి ఉద్యోగం చేయాలని తండ్రి ఆశ..... మంచి రైతు కావాలని కొడుకు కోరిక. చివరకు ఈ కథలో తండ్రి దారిలోకి కొడుకు వెళ్లాడా? లేక కొడుకు చేసేది కరెక్టే అని తండ్రి రియలైజ్ అయ్యాడా? ఈ ఇద్దరి మధ్య మరదలు క్యారెక్టర్ క్రియేట్ చేసిన సీన్లు కథను ఎలా మలుపు తిప్పాయి అనేది తెరపై చూడాల్సిందే.

నటీనటులు

నటీనటులు

హీరోగా తొలి పరిచయం అయిన భరత్ మార్గాని నటన పరంగా ఆకట్టుకోలేక పోయాడు. సినిమాలో హీరో క్యారెక్టర్‌కు ఉండాల్సిన యాటిట్యూడ్ ప్రదర్శించలేక పోయాడు. పెర్ఫార్మెన్స్ పేలవంగా ఉంది. ఇక హీరోయిన్‌గా నటించిన సృష్టి నటన పరంగా, లుక్స్ పరంగా ఫర్వాలేదు. శేఖరం మాస్టారు పాత్రలో నాగినీడు మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. తనికెళ్ల భరణి, రఘబాబు, సత్య, తాగుబోతు రమేష్ తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.

టెక్నికల్ అంశాలు

టెక్నికల్ అంశాలు

టెక్నికల్ అంశాలను విశ్లేషిస్తే.... శేఖర్ చంద్ర అందించిన సంగీతం గొప్పగా ఉందని కాక పోయినా.... సినిమాతో పాటు అలా సాగిపోయిందని చెప్పుకోవచ్చు. సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ ఫర్వాలేదు. మార్తాండ్ కె.వెంకటేష్ ఎడిటింగ్, ఇతర టెక్నికల్ విభాగాలు ఓకే. సినిమా మొత్తం పల్లెటూళ్లో తీసినా ప్రొడక్షన్ వ్యాల్యూస్ బావున్నాయి.

ప్రేక్షకుల్లో ఆసక్తి రేపే అంశాలు ఉన్నాయా?

ప్రేక్షకుల్లో ఆసక్తి రేపే అంశాలు ఉన్నాయా?

ఏ సినిమాకు అయినా కథ, స్క్రీన్ ప్లే ఎంతో ముఖ్యం. ప్రేక్షకుడు సినిమా చూస్తుంటే నెక్ట్స్ ఏం జరుగుబోతోంది అనే ఆసక్తిగా అతడిలో ఏర్పడాలి. ఊహించని మలుపులు ఉంటే మరింత ప్లస్ అవుతుంది. అయితే ‘ఓయ్ నిన్నే'లో అలాంటివి పెద్దగా కనిపించలేదు. ఏదో అలా రెగ్యులర్ సినిమాలా సాగిపోయిన ఫీలింగ్ కలుగుతుంది.

దర్శకుడి పని తీరు

దర్శకుడి పని తీరు

సత్య చల్లకోటి ఈ సినిమాకు తానే స్వయంగా కథ, స్క్రీన్ ప్లే, డైలాగులు, దర్శకత్వం బాధ్యతలు చేపట్టారు. అతడు రాసిన డైలాగులు కొన్ని చోట్ల ఆకట్టుకున్నాయి. కథను నేరేట్ చేసిన తీరు బావుంది. ఫస్టాఫ్ డీసెంట్ గా నడిపించిన దర్శకుడు... సెకండాఫ్‌లో నేరేషన్లో గ్రిప్ కోల్పోయాడు. హీరో హీరోయిన్ తమ లవ్ రియలైజ్ అయిన తర్వాత అందరూ ఊహించినట్లే రెగ్యులర్ సీన్లతో రోటీగా సినిమా ముగుస్తుంది.

రెగ్యులర్ ఫ్యామిలీ డ్రామాలా సాగే ఈ కథలో ప్రేక్షకులను టచ్ చేసే ఏదైనా కొత్త అంశాలు, స్క్రీన్ ప్లే మరింత ఆసక్తికరంగా ఉంటే ఔట్ పుట్ మరింత బావుండేది.

ఫైనల్ వర్డ్

ఫైనల్ వర్డ్

‘ఓయ్ నిన్నే' రెగ్యులర్ గా సాగే ఫ్యామిలీ డ్రామా.

ఓయ్ నిన్నే

ఓయ్ నిన్నే

బ్యానర్: ఎస్‌.వి.కె. సినిమా
నిర్మాత: వంశీకృష్ణ శ్రీనివాస్‌
దర్శకత్వం: సత్య చల్లకోటి
కెమెరా: సాయి శ్రీరామ్
సంగీతం: శేఖర్‌ చంద్ర
ఎడిటింగ్‌: మార్తాండ్‌ కె. వెంకటేష్
లిరిక్స్‌: రామజోగయ్య
నటీనటులు: భరత్‌ మార్గాని, సృష్టి, నాగినీడు, తనికెళ్ల భరణి, రఘుబాబు, సత్య, ‘తాగుబోతు' రమేష్, తులసి, ప్రగతి, ధనరాజ్‌ తదితరులు

English summary
Director Sathya Challakoti's 'Oye Ninne', starring Bharath Margani and Srushti Dange, finally hit the screens on October 6. The film is the story of Vishnu (Bharat), a young man who aspires to become a farmer right from childhood. His father, a school principal, and his loving mother want him to aim for something bigger.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu