»   » పద్మావత్ సినిమా రివ్యూ: భన్సాలీ జయ జయహో..

పద్మావత్ సినిమా రివ్యూ: భన్సాలీ జయ జయహో..

Written By:
Subscribe to Filmibeat Telugu
Rating:
3.5/5
Padmaavat Movie Review : పద్మావత్ సినిమా ఏలా ఉందంటే ?

సిల్వర్‌ స్క్రీన్ మీద సినిమా కథలను దృశ్యకావ్యంలా రూపొందించడంలో దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ దిట్ట అనడం ఎలాంటి సందేహం అక్కర్లేదు. ఎందుకంటే ఆయన తీసిన బ్లాక్, రామ్‌లీలా, బాజీరావు మస్తానీ చిత్రాలు అందుకు సాక్ష్యంగా నిలిచాయి. తాజాగా ఆయన రూపొందించిన చిత్రం పద్మావతి. అయితే సెన్సార్ అభ్యంతరాల నేపథ్యంలో ఈ చిత్రాన్ని పద్మావత్ అనే పేరుతో రిలీజ్ చేయనున్నారు. ఈ చిత్రంలో రాణి పద్మావతిగా దీపికా పదుకొన్, అల్లావుద్దీన్ ఖిల్లీగా రణ్‌వీర్ సింగ్, రావల్ రతన్ సింగ్‌గా షాహీద్ కపూర్ నటించారు. ప్రపంచవ్యాప్తంగా జనవరి 25న రిలీజ్‌కు సిద్దమవుతున్న ఈ చిత్రం ప్రేక్షకుల అంచనాలకు ఏ మేరకు చేరుకొన్నదో తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే..

పద్మావత్ కథ ఇలా..

పద్మావత్ కథ ఇలా..

సింహళ దేశపు యువరాణి పద్మావతి (దీపికా పదుకోన్)కి వేట అంటే చాలా ఇష్టం. వేటాడుతుండగా పద్మావతి బాణం తగిలి మేవాడ్ వంశానికి చెందిన రావల్ రతన్ సింగ్ (షాహీద్ కపూర్) గాయపడుతాడు. అప్పుడే వారిద్దరి మధ్య పరిచయం జరుగుతుంది. వారిద్దరూ తొలిచూపులోనే ప్రేమలో పడుతారు. తన ప్రేమను వ్యక్తం చేసిన రతన్ సింగ్.. పద్మావతిని పెళ్లాడటమే కాకుండా తన దేశం చిత్తోర్‌గఢ్‌కు తీసుకెళ్తాడు. కథా గమనంలో తన రాజగురువు రాఘవ కేతనుడికి పద్మావతి దంపతులు దేశ బహిష్కారం విధిస్తారు. దాంతో రాఘవకేతనుడు ఢిల్లీ సుల్తాన్ అల్లాఉద్దీన్ ఖిల్జీ చెంతన చేరుతాడు. ఆ తర్వాత చిత్తోర్‌గఢ్‌పై ఖిల్జీ దండయాత్ర చేసి రతన్ సింగ్‌ను ఎత్తుకెళ్తాడు. అక్కడి నుంచి పద్మావతి చిత్ర కథ కొత్త మలుపు తిరుగుతుంది.

కథలో మలుపులకు సమాధానం

కథలో మలుపులకు సమాధానం

రాజ గురువు‌ను పద్మావతి దంపతులు ఎందుకు దేశ బహిష్కరణ విధిస్తారు? ఖిల్జీకి రాజగురువు ఎలాంటి విషయాలు నూరిపోసి యుద్ధానికి పురిగొల్పుతాడు? చిత్తోర్‌గఢ్ నుంచి రతన్ సింగ్ బందీగా పట్టుకెళ్లిన తర్వాత ఏం జరిగింది? తన భార్తను ఎత్తుకెళ్లిన ఖిల్జీని పద్మావతి ఏ విధంగా ఎదురించింది? రతన్ సింగ్‌కు, అల్లాఉద్దీన్ ఖిల్జీకి జరిగిన యుద్ధంలో ఫలితమేమిటీ అనే సమస్యలకు సమాధానమే పద్మావత్ చిత్రం కథ.

ఫస్టాఫ్ ఇలా

ఫస్టాఫ్ ఇలా

తొలిభాగంలో పద్మావతి, రతన్ సింగ్ ప్రేమ, పెళ్లి అంశాలతో చకచకా కథ సాగిపోతుంది. చిత్తోర్‌గఢ్ సంస్థానంలో యువరాణిగా పట్టాభిషేకం చేయడం, ఆ తర్వాత రాజగురువు బహిష్కరణతో సినిమా మలుపు తిరుగుతూ ఆసక్తికరంగా మారుతుంది. ఒకవైపు ఈ కథ సాగుతూనే మరోపక్క అల్లాఉద్దీన్ ఖిల్జీ రాజ్యకాంక్ష, మగువల పట్ల మోహం అంశాలతో రణ్‌వీర్ సింగ్ నటనలో ఉగ్రరూపం చూపించడం జరుగుతుంది. చిత్తోర్‌గఢ్ కోటపై దండెత్తడం, ఆ తర్వాత పద్మావతిపై ఖిల్జీ కామవాంఛ రగలడం లాంటి అంశాలు సినిమాపై పట్టు బిగించేలా చేస్తాయి.

సెకండాఫ్ ఇలా

సెకండాఫ్ ఇలా

ఇక రెండోభాగానికి వస్తే రతన్ సింగ్‌ను ఖిల్జీ బంధించడం, ఆ తర్వాత పద్మావతి పాత్రలో దీపికా పదుకొన్ అభినయానికి పెద్ద పీట వేయడం ప్రేక్షకులకు ఆసక్తిని రేపుతుంది. పద్మావత్ సినిమా చివరి 20 నిమిషాలు అద్భుతంగా ఉంటుంది. ప్రీ క్లైమాక్స్‌లోనూ, చిత్ర చివరి అంకంలో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్రేక్షకుడికి చక్కటి ఫీలింగ్ కలుగజేస్తుంది.

పాత్రలతో భన్సాలీ విన్యాసం

పాత్రలతో భన్సాలీ విన్యాసం

సూఫీ కవి మాలిక మహ్మద్ జయాసీ అవధ్ భాషలో రాసిన పద్మావతి కావ్యం ఆధారంగా చేసుకొని పద్మావత్ చిత్రాన్ని దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ రూపొందించారు. ప్రతీ సీన్‌ను భన్సాలీ దృశ్యకావ్యంగా మలిచారు. పద్మావతి, రతన్ సింగ్, ఖిల్జీ పాత్రలను మలిచిన విధానం అమోఘంగా ఉంటుంది. తెర మీద ఆ పాత్రల విన్యాసం అబ్బురపరిచే విధంగా ఉంటుంది. రాజపుత్రుల వంశాన్ని ఉన్నత విలువలతో తలమానికంగా తెరకెక్కించడంలో భన్సాలీ తన ప్రతిభను చాటుకొన్నారు.

నిజమైన ఖిల్జీగా రణ్‌వీర్ సింగ్

నిజమైన ఖిల్జీగా రణ్‌వీర్ సింగ్

పద్మావత్ చిత్రంలో కీలకంగా చెప్పుకొనే పాత్ర ఖిల్జీ. ఈ పాత్రను రణ్‌వీర్ సింగ్ అద్భుతంగా పోషించి ఎలాంటి పాత్రనైన పోషించడంలో తనకు తానే సాటి అని మరోమారు నిరూపించుకొన్నారు. ఖిల్లీ నిజంగా ఇలానే ఉంటాడా అనే భావనను కలిగించడంలో తన ప్రతిభను చాటుకొన్నాడు. ఖిల్జీ పాత్రను రణ్‌వీర్ తప్ప మరొకరు పోషించలేరనే ఫీలింగ్‌ను కల్పించాడు.

అద్భుతంగా దీపికా పదుకోన్

అద్భుతంగా దీపికా పదుకోన్

పద్మావత్ చిత్రంలో మరో అద్బుతమైన పాత్ర దీపికా పదుకొన్‌ది. గతంలో రామ్ లీలా, బాజీరావు మస్తాన్ చిత్రంలో తన నటనతో మెప్పించిన దీపికా.. ఈ చిత్రంలో మరోసారి నట విశ్వరూపాన్ని చూపించింది. సినిమా ఆరంభంలో వేట సన్నివేశంలో, రాజ గురువును బహిష్కరించే సమయంలో తెర మీద దీపిక పలికించిన హావభావాలు మరుపురాని విధంగా ఉంటాయి. ఇక రెండో భాగంలో ఢిల్లీ కోటలో ప్రేవేశించి రతన్ సింగ్‌ను విడిపించుకొనే సమయంలో, ఇక చివర్లో ఆత్మాహుతి చేసుకొనే సీన్‌లో ఎమోషన్స్‌ను ఆమోఘంగా పలికించింది.

మూలస్తంభంగా షాహిద్

మూలస్తంభంగా షాహిద్

పద్మావత్ చిత్రానికి మరో మూలస్తంభంగా నిలిచిన పాత్ర షాహిద్ కపూర్‌ది. దీపికా, రణ్‌వీర్‌లో సమానంగా తన నటనను ప్రదర్శించాడు. ఈ చిత్రంలో కొత్త షాహిద్ కపూర్ ప్రేక్షకుడికి పరిచయం అవుతాడు. కీలక సన్నివేశాల్లో షాహీద్ నటనకు ప్రేక్షకుడు దాసోహం కావాల్సిందే. రతన్ సింగ్ పాత్ర షాహిద్‌లోని కొత్త కోణాన్ని ఆవిష్కరించింది.

 కీలకపాత్రల్లో అదితిరావు, రాజా మురాద్

కీలకపాత్రల్లో అదితిరావు, రాజా మురాద్

పద్మావత్ చిత్రానికి కీలకంగా మారిన పాత్రల్లో మెహరున్నీసాగా అదితి రావు హైదరీ తన పాత్రకు నూరుశాతం న్యాయం చేసింది. భావోద్వేగ సన్నివేశాల్లో కళ్లతో అదితి పలికించిన నటనతీరు చూసి ప్రేక్షకుడు ఫిదా కావాల్సిందే. తన పాత్ర పరిధి మేరకు సంపూర్ణంగా మెప్పించింది. మాలిక్ కాఫూర్‌గా జిమ్ సాబ్, జలాలుద్దీన్ ఖిల్జీగా రాజా మురాద్ తమ పాత్రల పరిధి మేరకు పర్వాలేదనిపించారు.

భన్సాలీ సంగీతం ప్రాణంగా

భన్సాలీ సంగీతం ప్రాణంగా

పద్మావత్ చిత్రానికి సంచిత్ బహారాతో కలిసి భన్సాలీ సంగీతాన్ని అందించారు. ఈ చిత్రానికి సంగీతం ప్రాణంగా నిలిచింది. చివరి 20 నిమిషాల్లో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాను మరోస్థాయికి చేర్చింది. స్వరూప్ ఖాన్, శ్రేయా ఘోషల్ పాడిన ఘూమార్ పాట ఆడియో పరంగానే కాకుండా తెర మీద అద్భుతంగా ఉంది. ఖలిబలి పాట కూడా ఆకట్టుకునేలా ఉంది.

సినిమాటోగ్రఫీ అదుర్స్

సినిమాటోగ్రఫీ అదుర్స్

సుదీప్ చటర్జీ అందించిన సినిమాటోగ్రఫీ పద్మావత్ చిత్రానికి మరో ఆకర్షణ. ఆయన ప్రతిభ పాత్రలను సజీవంగా కళ్ల ముందు ఉంచిందా అనే భావన కల్పిస్తుంది. అద్భుతమైన సెట్టింగులను, ముఖ్యంగా చివరి సతీ కార్యక్రమాన్ని నభూతో న భవిష్యత్ అనే విధంగా చిత్రీకరించి ప్రేక్షకుల్లో ఉద్వేగాన్ని రగిలించారు.

 భన్సాలీ ఎడిటింగ్

భన్సాలీ ఎడిటింగ్

జయంత్ జాదర్, అఖివ్ అలీతో కలిసి భన్సాలీ ఎడిటింగ్ బాధ్యతలు చేపట్టి పద్మావత్‌ను ఆసక్తికరంగా మలిచారు. ప్రతీ ఫ్రేమ్‌ను సమతూకంగా ఉంచి ప్రేక్షకుల్లో కొత్త అనుభూతిని కలిగించారు. ప్రకాశ్ కపాడియాతో కలిసి భన్సాలీ అందించిన మాటలు తూటాల్లా పేలాయి.

అంతిమంగా

అంతిమంగా

కమర్షియల్ సినిమాలకు పెద్ద పీట వేస్తున్న సమయంలో బురద గుంటలో వికసించిన తామరలా, గంజాయి వనంలో తులసి మొక్కలా కనిపించిన చిత్రం పద్మావత్. పుష్కరానికోసారి పద్మావతి లాంటి చిత్రాలు ప్రేక్షకుల మదిలో మధురమైన అనుభూతిని మిగుల్చుతాయి. ఇలాంటి చిత్రాలను ప్రేక్షకులు వదులుకుంటే అంతకంటే శిక్ష ఏముంటుందనే నా భావన.

బలం, బలహీనతలు

బలం, బలహీనతలు

ప్ల‌స్ పాయింట్స్ :

సంజ‌య్ లీలా భ‌న్సాలీ టేకింగ్‌
రణ్‌వీర్ సింగ్, దీపికా పదుకొన్, షాహీద్ కపూర్ నటన
కళా విభాగం పనితీరు, నిర్మాణ విలువ‌లు
సినిమాటోగ్రఫీ, మ్యూజిక్ (ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్)

మైన‌స్ పాయింట్స్ :
తొలిభాగం స్లో నెరేష‌న్‌లో సాగ‌డం
యుద్ధ సన్నివేశాలకు ప్రాధాన్యత లేకపోవడం

తెర వెనుక, తెర ముందు

తెర వెనుక, తెర ముందు

నటీనటులు: దీపికా ప‌దుకొనే, ర‌ణ‌వీర్ సింగ్‌, షాహిద్ క‌పూర్‌, అదితిరావు హైద‌రీ, రాజా మురాద్ త‌దిత‌రులు
సంగీతం: స‌ంజ‌య్ లీలా భ‌న్సాలీ, సుదీప్ బల్హారా (బ్యాక్ గ్రౌండ్)
సినిమాటోగ్రఫీ: సుదీప్ ఛ‌ట‌ర్జీ
ఎడిటింగ్: జయంత్ జాదర్, సంజయ్ లీలా భన్సాలీ, అకివ్ అలీ
నిర్మాతలు: సంజయ్ లీలా భన్సాలీ, అజిత్ అంధారే, సుధాంశ్ వత్స్
నిర్మాణ సంస్థ‌లు: భ‌న్సాలీ ప్రొడ‌క్ష‌న్స్‌, వ‌యాకామ్ 18 మోష‌న్ పిక్చ‌ర్స్‌
రిలీజ్ డేట్: జనవరి 25, 2018
నిడివి: 163 నిమిషాలు

English summary
Bhansali's Padmavat is based on the legend of Rani Padmavati, a legendary Rajput queen mentioned in the Awadhi-language poem Padmavat, written by Sufi poet Malik Muhammad Jayasi. Sanjay Leela Bhansali's latest offering may be titled Padmaavat but it's Ranveer Singh's show all the way. He plunges deep into the sea of evilness to bring the 'monster' to life for 'ek jung husn ke naam'. It may be a doomed love-story for him in the film but Ranveer, you are truly 'Sultan-E-Hind' when it comes to capturing our hearts with your bravura performance!
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu