twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బొమ్మ తేడా..... ఫ్యాన్స్‌కి తోడా! (‘పైసా వసూల్’ మూవీ రివ్యూ)

    పైసా వసూల్ మూవీ పెద్దగా ఆకట్టుకోలేదు. పూరి ఈ చిత్రాన్ని ఆశించిన స్థాయిలో తీయలేదు.

    By Bojja Kumar
    |

    Rating:
    2.5/5
    Star Cast: బాలకృష్ణ, శ్రీయా సరన్, కైరా దత్
    Director: పూరీ జగన్నాథ్

    Recommended Video

    "Paisa Vasool" Public Review

    కొన్ని రోజులుగా బాలయ్య ఫ్యాన్స్ అంతా 'పైసా వసూల్' ఎఫెక్టుతో 101 ఫీవర్లో కొట్టుమిట్టాడుతున్నారు. వాళ్ల ఫీవర్ తగ్గించేందుకే అన్నట్లు బాలయ్య తన తాజా సినిమాతో బాక్సాఫీసు బరిలో దూకాడు. నేను తేడా... దిమాక్ తోడా అంటూ దేడ్ దిమాక్ క్యారెక్టర్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

    ఈ మధ్య కాలంలో హీరోల అభిమానులకు ఫెయిల్యూర్ ట్రీట్మెంట్స్ చేస్తూ సక్సెస్ ట్రాక్ తప్పిన పూరి జగన్నాథ్ డైరెక్షన్ అయినప్పటికీ బాలయ్య సినిమా కాబట్టి సక్సెస్‌ఫుల్‌గా ట్రీట్మెంట్ చేస్తాడని అంతా నమ్మకం పెట్టుకున్నారు.

    మరి పూరి జగన్నాథ్ తన అనుభవాన్నంతా రంగరించి తయారు చేసిన 'పైసా వసూల్' మెడిసిన్ అభిమానుల ఫీవర్ తగ్గించిందా? లేక? తేడా కొట్టిందా? అనేది రివ్యూలో చూద్దాం.

    కథ ఏమిటంటే....

    కథ ఏమిటంటే....

    మాఫియా డాన్ బాబ్ మార్లీ(విక్రమ్ జీత్) ఆగడాలతో ఇండియా వణికిపోతూ ఉంటుంది. పోర్చుగల్‌లో ఉంటూ ఇండియాలో మాఫియా సామ్రాజ్యం నడిపిస్తున్న బాబ్ మార్లీకి ఓ సెంట్రల్ మినిస్టర్ సపోర్టు కూడా ఉంటుంది. బాబ్ మార్లీ ఆట కట్టించడం పోలీసుల వల్ల కాక పోవడంతో...... ఆ క్రిమినల్‌ను అంతం చేసేందుకు తీహార్ జైలు నుండి వచ్చిన తేడా సింగ్(బాలకృష్ణ)‌కు ఆ బాధ్యత అప్పగిస్తారు. అయితే తేడా సింగ్ వ్యవహారం తేడాగా ఉండటంతో నిఘా పెట్టిన పోలీసులు........ అతడు పోర్చుగల్ నుండి వచ్చిన బాల అని గుర్తిస్తారు. బాలకు, బాబ్ మార్లీకి సంబంధం ఏమిటి? తేడా సింగ్‌గా అతడు ఎందుకు నాటకం ఆడాల్సి వచ్చింది..... ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టు శ్రీయ, ముస్కాన్ సేథిలతో లింక్ ఏమిటి? అనేది తెరపై చూడాల్సిందే

    పెర్ఫార్మెన్స్

    పెర్ఫార్మెన్స్

    పెర్ఫార్మెన్స్ పరంగా చూస్తే.... ‘తేడా సింగ్' క్యారెక్టర్లో బాలయ్య అదరగొట్టాడు. తనదైన మార్కు డైలాగులు, యాక్షన్ సీన్లతో అలరించాడు. అయితే గత సినిమాలతో పోలిస్తే బాలయ్య వాయిస్‌లో బేస్ తగ్గిన తేడా కొట్టొచ్చినట్లు కనపడుతోంది. ఆయన గొంతులో ఏదో సమస్య ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టు పాత్రలో శ్రీయ ఓకే. ముస్కాన్ సేథి, కైరా దత్ గ్లామర్‌గా కనిపించారు. విలన్ బాబ్ మార్లీ పాత్రలో విక్రమ్ జీత్ బాలయ్యతో పోటీపడలేక పోయాడు. ఇంతకు మించి సినిమాలో చెప్పుకోదగ్గ పాత్రలేమీ లేవు.

    టెక్నికల్ అంశాల పరంగా...

    టెక్నికల్ అంశాల పరంగా...

    టెక్నికల్ అంశాల పరంగా చూస్తే ముఖేష్ జి సినిమాటోగ్రఫీ బావుంది. పోర్చుగల్ ఎపిసోడ్స్ బాగా షూట్ చేశాడు. అనూప్ రూబెన్స్ సాంగ్స్ ఓకే. బ్యాగ్రౌండ్ స్కోర్ ఫర్వాలేదు. బాలయ్య కోసం పూరి రాసిన పంచ్ డైలాగులు అభిమానులను అలరించాయి.

    కథే పెద్ద మైనస్

    కథే పెద్ద మైనస్

    ఈ సినిమాలో పెద్ద మైనస్ ఏదైనా ఉంది అంటే.... అది ఈ చిత్రానికి సంబంధించి కథ. పరమ రోటీన్ కథతో పూరి మరోసారి ప్రేక్షకులను బోర్ కొట్టించాడు. బాలయ్య ఇమేజ్‌కు ఫైట్లు, పాటలు, పంచ్ డైలాగులు జోడించి ప్రేక్షకులను ఎంటర్టెన్ చేయాలనే ఉద్దేశ్యమే తప్ప...... బలమైన కథతో బాలయ్య కెరీర్లో ఒక మైలురాయిలా నిలిచిపోయే సినిమా తీద్దామనే ఉద్దేశ్యం మాత్రం కనిపించలేదు.

    టేకింగ్ ఆకట్టుకోలేదు

    టేకింగ్ ఆకట్టుకోలేదు

    పూరి సినిమాల్లో కథలు ఇలానే ఉంటాయి అని లైట్ తీస్కున్నా....కనీసం టేకింగ్ అయినా బావుందా? అంటే అదీ లేదు. సినిమాలో చాలా సీన్లు కన్విన్సింగ్‌గా అనిపించవు. ఇప్పటి ట్రెండుకు తగిన విధంగా కనిపించాలని పోర్చుగల్ నేపథ్యాన్ని ఎంచుకున్నట్లు ఉందే తప్ప.... చాలా సీన్స్ టేకింగ్‌ ఇప్పటి ట్రెండుకు తగిన విధంగా లేదు.

    బాలయ్య స్ట్రెంత్ పూర్తిగా వాడుకోని పూరి

    బాలయ్య స్ట్రెంత్ పూర్తిగా వాడుకోని పూరి

    బాలయ్య స్ట్రెంత్‌ను పూర్తిగా వాడుకోవడంలో దర్శకుడు పూరి విఫలం అయ్యాడు. బాలయ్యతో చేయడం తొలిసారి కావడం వల్లో? ఏమో? తెలియదుకానీ.... పూరికి ఈ విషయంలో చాలా మంది అభిమానుల నుండి మైనస్ మార్కులే పడుతున్నాయి.

    సాంగ్స్

    సాంగ్స్

    సినిమా సంగతి పక్కన పడితే.... బాలయ్య, కైరాదత్, ముస్కాన్ సేథి, శ్రీయలతో చిత్రీకరించిన పాటలు అభిమానులను అలరించాయి. పైసా వసూల్, మామా ఏక్ పెగ్ లా పాటలు మాస్‌ను ఆకట్టుకునే విధంగా ఉంది. కన్ను కన్ను కలిసాయి సాంగ్ క్లాస్‌గా ఉంది.

    ఫ్యాన్స్‌ను టార్గెట్ చేసిన పూరి

    ఫ్యాన్స్‌ను టార్గెట్ చేసిన పూరి

    బాలయ్య అభిమానులను మెప్పించాలనే ఆరాటంలో పంచ్ డైలాగులపైనే ఎక్కువ ఫోకస్ పెట్టిన పూరి..... చాలా విషయాలను నిర్లక్ష్యం చేసినట్లు కనిపిస్తోంది. తేడా సింగ్ క్యారెక్టరైజేషన్ కూడా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేక పోయింది.

    దేశభక్తి  గురించి బాలయ్య డైలాగ్స్ అదుర్స్

    దేశభక్తి గురించి బాలయ్య డైలాగ్స్ అదుర్స్

    సినిమాలోని ఓ సన్నివేశంలో దేశ భక్తి గురించి బాలయ్య చెప్పిన డైలాగులు యువతలో ఉత్తేజం నింపేలా ఉన్నాయి. ఈ సీన్ వచ్చేప్పుడు థియేటర్లో ఫ్యాన్స్ విజిల్స్ తో మోతెక్కించారు.

    ప్లస్, మైనస్ పాయింట్స్

    ప్లస్, మైనస్ పాయింట్స్

    బాలయ్య పెర్ఫార్మెన్స్, సినిమాటోగ్రఫీ, మ్యూజిక్ సినిమాకు ప్లస్ పాయింట్లు. కథ, డైరెక్షన్, పూరి టేకింగ్ ఇలా మైనస్ పాయింట్లు చాలా ఉన్నాయి.

    జై బాలయ్య సాంగ్

    జై బాలయ్య సాంగ్

    బాలయ్య అభిమానుల కోసం ‘కోకా కోలా పెప్సీ.... బాలయ్య బాబు సెక్సీ..... జై బాలయ్య జైజై బాలయ్య' అంటూ సినిమా ఎడింగ్ టైటిల్స్ పడే సమయంలో ఓ పాట వేశారు. సినిమా పెద్దగా ఎక్కక పోయినా చివర్లో ఈ పాట మాత్రం అభిమానులకు బాగా ఎక్కేసింది.

    ఫైనల్ వర్డ్

    ఫైనల్ వర్డ్

    దర్శకుడు పూరీ జగన్నాథ్, బాలకృష్ణ కాంబినేషన్‌లో వచ్చిన క్రేజీ ప్రాజెక్ట్ పైసా వసూల్ చిత్రం కథ, కథనాలు ఆసక్తిగా లేకపోవడంతో ప్రేక్షకుల అంచనాలు చేరుకోలేకపోయింది. సినిమాలో ‘తేడా సింగ్' పాత్రను పెట్టిన పూరి సినిమాను కూడా కాస్త తేడాగానే తెరకెక్కించాడు. అయితే అభిమానులను అలరించే ఎలిమెంట్స్ తోడా తోడా ఉన్నాయి.

    English summary
    Paisa Vasool movie review and rating. The action comedy film produced by V. Anand Prasad under Bhavya Creations banner and directed by Puri Jagannadh. Starring Nandamuri Balakrishna, Shriya Saran in the lead roles and Vikramjeet Virk plays the key role. music composed by Anup Rubens. The film is scheduled to release on 1st September 2017.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X