For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఉప్పు తక్కువైన 'పప్పు' (రివ్యూ)

  By Srikanya
  |
  Pappu
  Rating
  -జోశ్యుల సూర్య ప్రకాష్
  సినిమా: పప్పు
  సంస్థ: ఆర్య ఎంటర్‌ టైన్ ‌మెంట్‌
  నటీనటులు: కృష్ణుడు, సుబ్బరాజు, దీపిక, జునైద్‌, సంగీత, ఉత్తేజ్‌, బెనర్జీ, శివారెడ్డి, మెల్కోటే తదితరులు.
  సంగీతం: ఫని కళ్యాణ్
  కెమెరా: కే.రాజేంద్ర
  ఎడిటింగ్: చంద్రశేఖర్
  నిర్మాతలు: ప్రవీణ్‌రెడ్డి నల్ల, నగేష్‌ యాద.
  కథ, స్కీన్ ప్లే, దర్శకత్వం: సపన్‌ పసుమర్తి
  విడుదల తేది: 25 జూన్, 2010

  అల్లరి నరేష్ డేట్స్ దొరకలేదా...అయితే కృష్ణుడుతో లాగిద్దాం...వినాయకుడు హిట్టయింది కదా...ఏం భయపడక్కర్లేదు అన్న మాటలు ఈ మధ్య కాలంలో చాలా చోట్ల వినిపిస్తున్నాయి.అయితే వినాయకుడు హిట్టవటానికి కృష్ణుడు ఎంత కారణమో..అంతకు చాలా రెట్లు ఆ సినిమా స్క్రిప్టు అనేది ఒప్పుకుతీరాల్సిన నిజం. అది మర్చిపోయి విజయాన్ని కృష్ణుడుకే అంటగట్టి తీస్తే విలేజ్ లో వినాయకుడు, పప్పు వస్తాయి. క్రేజ్ ని క్యాష్ చేసుకోవాలన్నా దానికి తగ్గ డిజైన్, రీజన్ ఉండితీరాల్సింది. ఇక ప్యూర్ లక్ అనే చిత్రం ఫ్రీమేక్ గా వచ్చిన ఈ పప్పు చిత్రానికి లక్ కనపడటం లేదు. ఏదో కామిడీ చిత్రం అన్నాం కదా అని కమిటయ్యాంకదా తప్పదు అన్నట్లు అక్కడక్కడా నవ్వించినా ఎక్కువ శాతం సహనాన్నే పరీక్షించింది. అలాగే సీన్లుకు తగ్గట్లే కృష్ణుడు కూడా సేమ్ ఎక్సప్రెషన్స్ రిపీట్ చేస్తూ న్యాయం చేసాడు.

  విపరీతమైన దురదృష్టంతో ఇబ్బంది పడుతున్న పప్పు (కృష్ణుడు)కి ఓ విచిత్రమైన ఆఫర్ వస్తుంది. తను ఇష్టపడే తన బాస్ (బెనర్జీ) కూతురు రాధా (దీపిక) కిడ్నాప్ కి గురికాగా ఆమెను వెతికే డిటెక్టివ్ రామ్‌ (సుబ్బరాజు)కి సహాయంగా వెళ్ళమని. పప్పుని డిటెక్టివ్ కి తోడుగా పంపటానికి కారణం అతను తెలివైనవాడని కాదు...ఆ కిడ్నాపైన అమ్మాయి శని ప్రభావంతో దురదృష్టంలో ఉందిని, ఆమెని వెతకాలంటే ఆమెకంటే దురదృష్టవంతుడైన వాడు అవసరం ఉందని ఆమె తండ్రికి తెలియటం. ఇంతకీ పప్పు ఆ డిటెక్టివ్ కు ఏ రకంగా ఆమెను పట్టుకోవటంలో సాయించేసాడు. ఆమెను ఎలా గెలుచుకున్నాడనేది మిగతా కథ.

  మొదటే చెప్పుకున్నట్లుగా ప్యూర్ లక్ (1991) అనే చిత్రం ఆధారంగా రూపొందించిన ఈ కథ ఇంటర్వెల్ దాకా అసలు మెయిన్ పాయింట్ లోకి రాదు. అప్పటివరకూ హీరోయిన్ ని కృష్ణుడు మూగగా ఆరాధించే సన్నివేశాలు, అతని ఒబిసిటీ మీద వేసే జోకులు వరసగా వస్తూంటాయి. దాంతో ఏదో చూసాం కానీ..ఏం చూసాం అంటే చెప్పలేము. ఇక సెకెండాఫ్ లో కథ ప్రారంభమవుతుంది. అయితే హీరోయిన్ ని వెతికే ప్రాసెస్ లో డిటెక్టివ్ కీ సుబ్బరాజుకీ, కృష్ణుడుకీ మధ్య రిలేషన్ మీద సీన్స్ ఉంటాయి గానీ, హీరోయిన్ తో ఉండవు. ఎందుకంటే ఒరిజనల్ లో అలానే ఉంది. ఏం చేస్తాం. దాంతో స్క్రీన్ ప్లేనే సమస్యగా మారి చిత్ర కథని దెబ్బ తీసింది.

  అదే ప్యూర్ లక్ కి వచ్చేసరికి ఓ పదినిముషాల్లోనే హీరోయిన్ కిడ్నాప్ జరిగి కథ ప్రారంభమవుతుంది. దాంతో బోర్ ఉండదు. అలాగే ఒరిజనల్ లో హీరోయిన్ కూడా పూర్తి దురదృష్టవంతురాలే.(తెలుగులో హీరోయిన్ కి దురదృష్టవంతురాలంటే బాగోదని ఫీలయ్యి ఆమెకు జాతకంలో శనిదోషం ఉందని పెట్టారు). అలాగే ప్యూర్ లక్ లో సైక్రాటిస్ట్ కిడ్నాప్ డ్రామాకి సలహా ఇస్తే..ఇక్కడ స్వామీజీని పెట్టారు(ఇదే ఇంప్రవైజేషన్). చివరలో కూడా ఆంజనేయ స్వామి శక్తులతో పప్పు...విలన్స్ ఎదుర్కొనే సీన్స్ కూడా మనవాళ్ళు తయారుచేసినవే.

  అలాగే ప్యూర్ లక్ లో హీరోయిన్ ను కిడ్నాప్ చేసిన వాళ్ళు మరసటి రోజు ఫోన్ చేయకపోతే ఆమె తండ్రి కంగారు పడి ఆమెను వెతకటానికి హీరోని పంపుతారు. ఇంతకీ ఎందుకు వాళ్ళు డబ్బు కోసం ఫోన్ చేయలేదు అంటే ఆమె దురదృష్టం వారినీ వెంటాడి వాళ్ళు నాశనమయిపోయారని తర్వాత తెలుస్తుంది. అటువంటి పంచ్ లు ఈ పప్పు లో మిస్సయ్యాయి. ఇక పాటలు ఓ రెండు బాగున్నాయి. డైరక్షన్ ఓ మాదిరిగా ఉంటుంది. డైలాగులు అక్కడక్కడా పేలబోయి తప్పించుకున్నాయి.కృష్ణుడు... వినాయకుడు రేంజిలో చేస్తానని మాటిచ్చాడేమో..అచ్చం అలాంటి ఎక్సప్రెషన్స్ ఇస్తూ నడిపేస్తూంటాడు. ఎడిటింగ్, కెమెరా రెండూ బాగానే ఉన్నాయి(అధ్బుతమని కాదు). హీరోయిన్ మాత్రం కొన్ని చోట్ల అస్సలు చూడబుద్ది కాదు(కృష్ణుడు కి ఆ మాత్రం చాలని పిక్సయ్యారేమో)

  ఏదైమైనా మరీ ఖాళీగా ఉన్నప్పుడు ఊళ్ళో చూడదగ్గ సినిమాలన్నీ చూసేసాం అనుకున్నప్పుడు ఓ లుక్కేయవచ్చు. అలాగే పిల్లలుకి పెద్ద టెడ్డీబేర్ లా ఉన్న కృష్ణుడు నచ్చే అవకాశం ఉంది కాబట్టి వారిని పంపవచ్చు. అసభ్యత, అశ్లీలత, హింస లేదుకాబట్టి ఫ్యామిలీలు వెళ్ళే సాహసం చేయవచ్చు. టోటల్ గా కొద్ది రోజులు ఆడవచ్చు.

   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X