twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'ప్రాణం' పోయింది..

    By Staff
    |

    Pranam
    -జలపతి గూడెల్లి
    చిత్రం: ప్రాణం
    నటీనటులు: నరేష్‌, సదా, సీత, బెనర్జీ, రాజన్‌ పి.దేవ్‌
    సంగీతం: కమలాకర్‌
    నిర్మాత: మాగంటి బాబు
    స్క్రీన్‌ ప్లే, దర్శకత్వం: మల్లి

    టేకింగ్‌ ఒక్కటే ఉంటి సరిపోతుంది. మిగతా ఏదీ అక్కర్లేదనుకొనే కొంతమంది దర్శకులు ఇటీవల ఎక్కువయ్యారు. ఈ చిత్రంతో పరిచయమైన మల్లి అనే దర్శకుడు సినిమాటోగ్రఫర్‌ భరణీధరన్‌, ఆర్ట్‌ డైరక్టర్‌ ప్రతిభలపైనే విపరీతంగా ఆధారపడి, లాజిక్‌ కు అందని, ప్రేక్షకులను ఏమాత్రం, ఏ చోట ఆకట్టుకొని సినిమా పిండి..పిండి..వండి..వండీ..ప్రేక్షకుల మీదికి వదిలాడు. సినిమాలో ఏ పాత్రకు లాజిక్‌ లేకుండా..సినిమా ఇక అయిపోతుందనుకునే సమయానికి..మళ్ళీ ..మళ్ళీ సాగదీసి..వదిలిన తర్వాత ప్రేక్షకుడి ప్రాణం విలవిలాలాడకుండా ఉంటుందా?

    'పూర్వజన్మ' కాన్సెప్ట్‌ తో గతంలోనూ తెలుగులో చిత్రాలు వచ్చాయి. ఈ చిత్రం కూడా అదే కాన్సప్ట్‌ తో తీశారు. కాకపోతే, గత జన్మ కాలం నాటి పరిస్థితులను ...సినిమాలో చూపిస్తే కొత్తగా ఉంటుందునుకొని దర్శకుడు...పల్లెటూరు అందాలు, గోదావరి బ్యాక్‌ డ్రాప్‌ లో ఊరి నాటకాలు, గుడిసెలు...నదిలోకి వెళ్ళి నీళ్ళు తెచ్చే హీరోయిన్‌..ఇలాంటి దృశ్యాలు చూపించాడు.

    కానీ, కథలో బలం లేనప్పుడు ఇవేవీ పనికిరావు. హీరో, హీరోయిన్‌ ముందే చనిపోయి...మళ్ళీ పుడుతారు. పోనీ, వీరిద్దరూ మళ్ళీ కలుసుకునే సందర్భమైనా బాగుందా అంటే అదీ లేదు. స్టూడెంట్‌ నెంబర్‌ వన్‌ చిత్రంలో ఉన్న ఓ పాపులర్‌ పాటను మార్చి చెపితే ఈ సినిమాకు చక్కగా సరిపోతుంది. అది: ఎక్కడో మొదలెట్టి..ఎక్కడో చంపేసి..ఇక్కడే ముగించాం సినిమామ్మ చివరి మలుపులో..

    ప్రథమార్థం బాగున్నా, సెకండాఫ్‌ భరించడం చాలా కష్టం. ముఖ్యంగా సెంటిమెంట్‌ సీన్లు దారుణంగా ఉన్నాయి. ఇక, హీరో నరేష్‌ గారి మీద కెమెరా ఉన్నంతకాలం మనం భయపడాల్సిందే. అతనివి అన్నీ ఒకేరకమైన ఎక్స్‌ ప్రెషన్స్‌. ఇప్పటివరకు చేసిన అన్ని చిత్రాల్లోనూ అదే మాట. అదే భావం. సదా ఆకట్టుకోలేకపోయింది. కేవలం భరణీధరణ్‌ చక్కటి ఫోటోగ్రఫీ (ముఖ్యంగా లైటింగ్‌ లో చూపిన ప్రతిభ ప్రశంసనీయం), ఆర్ట్‌ డైరక్టర్‌ శ్రమ, ప్రతిభనూ, సీత చక్కటి నటన (ముఖ్యంగా క్లైమాక్స్‌ లో) ..వంటి అంశాలే సినిమాలో మెచ్చుకోదగ్గ అంశాలు.

    సినిమాను చూడకపోవడం ఉత్తమం. నూతన సంగీత దర్శకుడు కమలాకర్‌ పాటలు బాగున్నా..ఒకే పాటను మార్చి..మార్చి నాలుగు సార్లు వేయడంతో ఆయన ప్రతిభ సినిమా మీద పుట్టిన విసుగులోనే కనబడకుండా పోతుంది.

    కథ కావాలనుకునవారికి క్లుప్తంగా: ఒకానొక కాలంలో..కాత్యాయిని (సదా), శివుడు (నరేష్‌) అనే వారు ప్రేమించుకుంటారు. కులసంకరం ఇష్టం లేని ఊరి పెద్దలు వీరికి ఉరిశిక్ష వేస్తారు. వీరి ఆత్మలు తిరిగి ప్రాణం పోసుకుంటాయి. అమెరికాలో పుట్టిన హీరో ఇండియాకు ఓ ఆల్బమ్‌ రూపొందించేందుకు వస్తాడు.

    మోడల్‌ గా సదా ఆల్బమ్‌ లో నటించేందుకు అంగీకరిస్తుంది. కానీ, వాళ్లన్నయ్య ఆమెకు ఇదే సమయంలో తనకు ఇష్టం లేని బావతో పెళ్ళికి బలవంతం చేస్తాడు. ఇంకేముంది..హీరో, హీరోయిన్లు ఇద్దరూ కలిసి పారిపోతారు..ఎవరికీ దొరకకుండా.(అంతకుముందు వారు ప్రేమించుకోరు, కానీ దర్శకుడు చెప్పాడు కాబట్టి..తిరిగి ఏ ఊళ్ళో అయితే చనిపోయారో..అదే ఊరికి చేరకుంటారు. క్లైమాక్స్‌ లో ఎలాగూ ఒకటవుతారు.)

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X