Don't Miss!
- News
UNION BUDGET 2023-2024: కేంద్ర బడ్జెట్ పై ఆంధ్రప్రదేశ్ గంపెడాశలు; ఈసారైనా కేంద్రం కరుణిస్తుందా?
- Sports
INDvsNZ : మూడో టీ20లో తాడో పేడో.. సిరీస్ డిసైడర్‌లో వాతావరణం ఎలా ఉండబోతోంది?
- Finance
PMCares: PMCares రాజ్యాంగబద్ధమా ? RTI కిందకు వస్తుందా ? విరాళాల సంగతేంటి..??
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
- Lifestyle
'ఆ' సమయంలో ఈ ప్రదేశాల్లో మీ భర్త & భార్యను టచ్ చేయండి...ఆ ఆనందం మరోస్థాయిలో ఉంటుంది!
- Technology
ఆపిల్ నుంచి ఫోల్డబుల్ ఐఫోన్ లాంచ్ వివరాలు! కొత్త ఫీచర్లు!
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్‌లోని ఈ సరస్సులు!
ప్రాణం ఖరీదు మూవీ రివ్యూ అండ్ రేటింగ్
Rating:2/5
ప్రాణం ఖరీదు అనే టైటిల్ వినగానే చిరంజీవి నటించిన మంచి చిత్రం గుర్తుకొస్తుంది. కెరీర్ ఆరంభంలో చిరంజీవికి మంచి సక్సెస్ ఇచ్చిన ఘనత ఆ సినిమాకు ఉంది. తాజాగా అదే టైటిల్‌తో ప్రశాంత్ అనే యువ హీరో తెలుగు చిత్రసీమకు పరిచయం అయ్యాడు. మెడికల్ మాఫియా కథా నేపథ్యంతో వచ్చిన ప్రాణం ఖరీదు చిత్రం ఎలాంటి సక్సెస్‌ను అందుకొన్నది. హీరో ప్రశాంత్‌కు ఎలాంటి విజయాన్ని అందించింది అనే విషయాన్ని తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే..

ప్రాణం ఖరీదు కథ, కీలక మలుపులు
రామ్ అనే యువకుడు ఓ క్యాబ్ డ్రైవర్. సంపన్నవర్గానికి చెందిన డాక్టర్‌ను, ఓ బ్రోకర్‌ను కిడ్నాప్ చేస్తాడు? ఈ క్రమంలో అధికార పార్టీ ఎమ్మెల్యేను, బ్రోకర్ భార్య హత్యకు గురవుతారు? ఈ నేపథ్యంలో పోలీస్ ఆఫీసర్ (తారకరత్న) రంగంలోకి దిగుతాడు. డాక్టర్‌ను, బ్రోకర్‌ను ఎందుకు కిడ్నాప్ చేశాడు? జరిగిన హత్యల వెనుక అసలు కారణం ఏమిటి? అనే ప్రశ్నలకు సమాధానమే ప్రాణం ఖరీదు.

హీరోగా ప్రశాంత్ పరిచయం
ఎన్నారై ప్రశాంత్ సినిమాపై అభిమానంతో హీరోగా మారాడు. తన మొదటి చిత్రానికే వైద్య రంగంలో జరుగుతున్న కుంభకోణాలు, మాఫియా కార్యక్రమాలను ఇతివృత్తంగా ఎన్నుకోవడం సినిమాపై ఆయనకు ఉన్న అభిరుచికి అద్దంపట్టింది. క్యాబ్ డ్రైవర్ పాత్రలో ఒదిగిపోయాడు. కొత్తవాడైనా కీలక సన్నివేశాల్లో భావోద్వేగమైన నటనను ప్రదర్శించాడు. మంచి కథ, పాత్ర లభిస్తే మరింత రాణించే అవకాశాలు చాలా ఉన్నాయి.

మిగితా రోల్స్‌లో
హీరోయిన్‌గా అవంతిక తన పాత్రకు న్యాయం చేసింది. హాస్పిటల్ సీన్‌లో తన నటనతో ఆకట్టుకొన్నది. పాత్ర పరిధి తక్కువగా ఉండటం, తన ఫెర్ఫార్మెన్స్‌ను బయట పెట్టుకోవడానికి స్కోప్ లేకపోవడం వల్ల ఆ పాత్ర ఎలివేట్ కాలేకపోయింది. చాలా రోజుల తర్వాత తారకరత్న మరోసారి తెరమీద మెరిసాడు. కథలో కీలకంగా ఉండే పాత్రలో కనిపించాడు. తన పాత్రకు పూర్తిగా న్యాయం చేశాడని చెప్పవచ్చు.

దర్శకత్వం ప్రతిభ
దర్శకుడు పీఎల్‌కే రెడ్డి ఎంచుకొన్న మెడికల్ మాఫియా పాయింట్ బాగుంది. కానీ ప్రభావవంతంగా చెప్పలేకపోవడం కొంత అసంతృప్తికి గురిచేస్తుంది. అవయవాల చౌర్యం ఎలా జరుగుతుందనే విషయాన్ని తెర మీద చక్కగా చూపించాడు. కథ, కథనాలపై సరైన కసరత్తు చేసి ఉంటే మరో మంచి సందేశాత్మక చిత్రంగా, ఆలోచింపజేసే చిత్రంగా ఈ సినిమా మారేదనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.

సాంకేతిక విభాగం పనితీరు
సినిమాటోగ్రఫి, పాటలు ఒకేలా ఉన్నాయి. కానీ రీరికార్డింగ్ కీలక సన్నివేశాలను బాగా ఎలివేట్ చేసింది. నిర్మాణ విలువలు ఫర్వాలేదనిపించే స్థాయిలో ఉన్నాయి. ఫ్యాష్ బ్యాక్ ఎపిసోడ్ సినిమాకు హైలెట్ అని చెప్పవచ్చు. సందేశాత్మక సినిమాలను, రివేంజ్ డ్రామా నేపథ్యం ఉన్న చిత్రాలను ఆదరించే వారికి ఈ సినిమా తప్పకుండా నచ్చుతుంది.

తెర ముందు, తెర వెనుక
నటీనటులు: నందమూరి తారకరత్న, ఒరాట ప్రశాంత్ , అవంతిక, షఫి, జెమినీ సురేష్, చిత్రం శ్రీను, ఫణి రాజమౌళి (జబర్దస్త్ ఫేమ్) సంజన తదితరులు
దర్శకత్వం: పీఎల్‌కే రెడ్డి
నిర్మాత: నల్లమోపు సుబ్బారెడ్డి
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
సినిమాటోగ్రాఫర్: ఎస్ మురళీ మోహన్ రెడ్డి
బ్యానర్: యన్. ఎస్ క్రియేషన్స్
రిలీజ్ డేట్: 2015-03-15