twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    దారీ తెన్నూ లేని 'ప్రస్దానం' (రివ్యూ)

    By Srikanya
    |
    Prasthanam
    Rating
    -జోశ్యుల సూర్య ప్రకాష్
    సినిమా: ప్రస్ధానం
    సంస్థ: వి.ఆర్‌.సి మీడియా అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌
    నటీనటులు: శర్వానంద్‌, రూబి పరిహార్‌, సందీప్‌ కిషన్‌, కిషోర్‌,
    జయప్రకాష్‌ రెడ్డి, జీవా, పవిత్రా లోకేష్‌, సురేఖావాణి తదితరులు.
    సంగీతం: మహేష్ సంకర్
    ఎడిటింగ్: ధర్మేంద్ర కాకరాల
    కెమెరా: శ్యామ్ దత్
    కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం: దేవా కట్టా
    నిర్మాత: రవి వల్లభనేని
    విడుదల తేది: 16/04/2010

    రాజా, పార్వతి మిల్టన్ ల వెన్నెల చిత్రంతో సినీ ప్రస్ధానం ప్రారంభించిన దర్శకుడు దేవకట్టా...మలి ప్రయత్నం ప్రస్ధానం నిరాశపరిచిందనే చెప్పాలి. పూర్తి రాజకీయ వాతావరణంలో ఓ ఫ్యామిలీ డ్రామాను పండించాలనే ఉద్దేశ్యంతో మలిచిన ఈ చిత్రంలో కథ ఓ పాత్ర పాయింట్ ఆఫ్ వ్యూలో కదలక, అన్ని పాత్రలవైపూ కదులుతూ ఎవర్ని ఫాలో కావాలో తెలియని స్ధితికి తెచ్చింది. దాంతో ప్రధాన పాత్ర(శర్వానంద్) ప్యాసివ్ గా మారిపోయింది. దానికి తోడు క్లైమాక్స్ దాకా ఎక్కడా హీరో కి ప్రధాన సమస్య ఇది తెలిసి యాక్టివ్ గా పార్టిసిపేషన్ తీసుకునే మూవ్ మెంట్ రాదు. దాంతో ఎంతో ఆశించి చేసిన డ్రామా మొత్తం డ్రామాలా మారి...ప్రేక్షకులకు సహన పరీక్షగా మారింది. దాంతో శర్వానంద్ బాగా చేసినా, దర్శకుడు టేకింగ్ బాగున్నా, మిగతా విభాగాలు కష్టపడ్డా బూడిదలో పోసిన పన్నీరులా మారిన ఫీలింగ్ వచ్చేసింది.

    ఇది ఓ ఇద్దరు సవతి అన్నదమ్ముల పోరాటం కథ. అలాగే ఓ సవతి తండ్రి కథ. మిత్ర (శర్వానంద్‌) చిన్నప్పుడే తండ్రి ని కోల్పోతాడు. ఆ సమయంలో తండ్రి అనుచరుడుగా ఉండే లోకనాథం నాయుడు (సాయికుమార్‌) అతని తల్లిని పెళ్ళాడి మిత్రాకు మారుటి తండ్రి అవుతాడు. అయితే అది మిత్ర అక్క (సురేఖా వాణి) కి సుతారామూ ఇష్టం ఉండదు. మరో ప్రక్క మిత్ర తల్లికి, మారుటి తండ్రికి పుట్టిన వాడు చిన్నా(సందీప్). కాలగమనంలో స్ధానిక ఎమ్మల్యే గా ఎదిగిన మారుటి తండ్రిని ఇష్టపడి అతని అడుగుజాడల్లో నడుస్తూ రాజకీయాలు,సెటిల్ మెంట్స్ చేసుకుంటూ గడపుతున్న మిత్రాని అతని సవితి తమ్ముడు చిన్నా ద్వేషంతో అడ్డుకుంటూంటాడు. అంతేగాక చిన్నా ఓ హత్య కేసులో ఇరుక్కుని బయిటకు రావటానికి తన తండ్రి రాజకీయ ప్రత్యర్ధులతో చేతులు కలుపుతాడు. అలాగే తన సొంత తండ్రి రాజకీయ వారసత్వం అప్పచెప్పలేదని, ప్రతీకారంగా తన అక్కని, బావని దారుణంగా చంపేస్తాడు. ఇవన్నీ చూస్తూ తట్టుకోలేక ఎదురుతిరిగిన మిత్రాకు ఓ దారుణమైన నిజం తెలుస్తుంది. ఆ నిజం ఏమిటి...అది తెలిసాక జరిగే పర్యవసానాలు ఏమిటీ అన్నది తెరపై చూడాల్సిందే.

    కధగా చెప్పటానికే చాలా కష్టం అనిపించే ఈ కథని తెరపై రెండున్నర గంటలు పైగా నేరేట్ చేయటానికి కూడా దర్శకుడు చాలా కష్టపడ్డాడని అర్ధమవుతూంటుంది. అందులోనూ కథ మొత్తం సాయికుమార్ చుట్టూ తిరిగుతూ మెయిన్ హీరో శర్వానంద్ కి పనిలేకుండా చేస్తుంది. అందులోనూ శర్వానంద్ పాత్ర మంచితనం, కుటుంబ సభ్యుల పట్ల ప్రేమ అనే ఎలిమెంట్స్ తో నిండిపోయి ఏ పాత్ర తప్పు చేసినా కూడా మహా అయితే ఓ వార్నింగ్ ఇచ్చేసి వదిలేసాలా మరిచారు. సాధారణంగా మన తెలుగు చిత్రాల్లో చెడు పెరిగిపోతున్నప్పుడు హీరో రైజ్ అయ్యి వారిని శిక్షించటం అనే కార్యక్రమం ఉంటూంటుంది. ఎంత రొటీన్, ఫార్మెట్ అనుకున్నా అదే నచ్చుతూంటుంది. అందులోనూ ఇంత పొలిటకల్ కథలోనూ ఎంతసేపూ హీరో తన సొంత ప్రస్ధానం చూసుకుంటాడే తప్ప ప్రజల పక్షాన పోరాడడు. ఇక వీటికి తోడు రొమాంటిక్ ధ్రెడ్ బాగా మిస్సయింది. మొన్న రానా లీడర్ లో ఏం జరిగిందో అలాగే హీరోయిన్ పాత్ర పాటలకే పరిమితం అయింది. కామిడీ (వెన్నెల మహేష్) కూడా కావాలని ట్రాక్ క్రింద పెట్టినట్లు ఉంటుంది కానీ ఎక్కడా కథలో కలవదు. అయితే జయప్రకాశరెడ్డి సీన్స్ మాత్రం బాగా నవ్వించాయి. కాంట్రాక్టర్ బస్విరెడ్డి గా జీవా బాగా చేసాడు. డైలాగులు చాలా చోట్ల బాగుంటే కొన్ని చోట్ల మరీ విచిత్రంగా ఉన్నాయి. దర్శకుడు ఏదో చెప్పాలనే తాపత్రయం మాత్రం ప్రతీసీన్ లోనూ కనపడుతూంటుంది...కానీ చిత్రంగా సీన్స్ అన్నీ కలిపితే ఆ ఇంటెన్షన్ మిస్సవుతూంటుంది. ఈ పొలిటికల్ ధ్రిల్లర్ లో ధ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కన్నా అనవసరమైన సన్నివేశాల కలపోత ఎక్కువైంది. కొంత ట్రిమ్ చేస్తే ఫలితం ఉంటుంది. అలాగే పాటలు ప్లేస్ మెంట్ కూడా అస్సలు బాగోలేదు. పాటలు కూడా అంత ఇంప్రెసెవ్ గా లేవు.

    ఏదైమైనా వెన్నెల తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకున్న ఈ చిత్రం దర్శకుడు దేవ కట్టాకు అంతలా కలిసి వచ్చేది కాదని ఖచ్చితంగా చెప్పవచ్చు. స్క్రిప్టు పై మరింత వర్క్ చేసి ఉంటే కథలో కన్ఫూజన్ తగ్గి ప్రధాన పాత్ర ఇంపార్టెన్స్ బయిటకు వచ్చి వర్కవుట్ అయ్యేది అనిపిస్తుంది. అలాగే సినిమా ప్రారంభంలో బ్లాక్ అండ్ వైట్ లో వచ్చిన ఎపిసోడ్స్ రేంజిలో చిత్రం మొత్తం ఎఫెక్టివ్ గా తీసి ఉంటే గ్యారెంటీగా ఓ ల్యాండ్ మార్క్ చిత్రంగా మిగిలేది. అప్పటికీ సాయికుమార్ డైలాగులకోసం, శర్వానంద్ నటనకోసం ఈ చిత్రం వైపు ఓ లుక్కేయవచ్చు. అయితే దర్శక, నిర్మాతలు కరుణించి కాస్త ట్రిమ్ చేస్తేనే సుమా.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X