For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ప్రయాణంలో పది'నస'లు (రివ్యూ)

  By Staff
  |

  Prayanam

  Prayanam

  -జోశ్యుల సూర్య ప్రకాష్
  నటీనటులు: మంచు మనోజ్ కుమార్, హారిక, బ్రహ్మానందం, జనార్ధన్ తదితరులు
  సంగీతం: మహేష్ శంకర్
  పాటలు: అనంత్ శ్రీరామ్
  కెమెరా: సర్వేష్ మురారి
  కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం:యేలేటి చంద్రశేఖర్
  నిర్మాత: యేలేటి సీత
  రిలీజ్ డేట్: 29 మే 2009

  అప్పుడే పరిచయమైన అమ్మాయిని పడేయటానికి రెండు గంటలు మాత్రమే టైమ్ ఉంది..అప్పుడేం చేయాలి...అనేది క్యూరియాసిటీ పాయింటే. అందులోనూ ఐతే, అనుకోకుండా ఒక రోజు వంటి విభిన్నమైన చిత్రాల దర్శకుడు యోలేటి చంద్రశేఖర్ తానే స్వయంగా నిర్మాతగా మారి రూపొందించిన చిత్రం ఇది. మరో ప్రక్క ఆయన రెగ్యులర్ ధ్రిల్లర్ కాకుండా సాప్ట్ రొమాంటిక్ కామిడీ చూపుతానంటూ ప్రొమోలు ఢిపెరెంట్ గా వేస్తున్నారు. దాంతో ఆయన అభిమానుల్లో మరింత ఎక్సపెక్టేషన్స్ పెరుగుతూ పోయాయి. అయితే సీన్ రివర్స్ లో ఉంది. యేలేటి ఏ మాత్ర కథ అనే పదార్ధం లేకుండా(అంటే కథనం ఉంది కదా అని నమ్మి ఉండవచ్చు)కేవలం సన్నివేశాలును నమ్మి తీసిన (చేసిన)ప్రయాణం గమ్యం చేరినట్లు అనిపించదు. ఆయన గత చిత్రాల్లో ఫెయిలయిన అంశాలు(కామిడీ, రొమాన్స్, లవ్ ఎలెమెంట్)నే పూర్తిగా నమ్మి తీయటం అవి ఈ సారి కూడా పండకపోవటం ఇబ్బందికరమే.

  విభిన్న ధ్రువాల్లా ఉండే ద్రువ (మనోజ్), హారిక(హారిక) మలేషియా ఎయిర్ పోర్ట్ లో తారసపడతారు. ద్రువ ఎప్పుడు లైఫ్ లో ఛాన్స్ లు తీసుకోవటానికి ఇష్టపడతే,హారిక పక్కా ప్లానింగ్ ప్రకారం వెళ్ళే ఆధునిక యువతి. ఉషారైన ధ్రువ్ (మనోజ్)సరదాగా సింగపూరు వెళ్ధామని మలేషియా ఎయిర్ పోర్ట్ లో వెయిట్ చేస్తూంటాడు. అలాగే హారిక(హారిక)తన ఎంగేజ్ మెంట్ కి ఇండియా వెళ్ళటానికి అక్కడికే వస్తుంది. వాతావరణం సమస్య వల్ల ఇద్దరు ప్లైట్ లు రెండు గంటలు లేటని తెలుస్తుంది. ఆ సమయాన్ని ఎలా గడపాలా అనుకుంటున్న సమయంలో ఇద్దరూ ఒకరికొకరు అనుకోనివిధంగా తారసపడతారు. పనిలో పనిగా లవ్ ఎట్ పస్ట్ సైట్ అనే సూత్రం తెలిసిన మన హీరో ఆమెతో ప్రేమలో పడతాడు. అక్కడ నుంచి రెండు గంటల్లో ఆమెను తన ప్రేమలో ఆమెను ఎట్లాపడేసాడనేది మిగతా కథ.

  సాధారణంగా రొమాంటిక్ కామిడీలు కలవటం, విడిపోవటం, పొందటం అనే మూడు మెయిన్ ప్లాట్ స్టెప్ లతో ముందుకెళ్తూంటాయి. ఈ విభజన మనకు శేఖర్ కమ్ముల ఆనంద్, గోదావరి చిత్రాలలో స్పష్టంగా కనపడుతుంది. అలాగే ఈ తరహా చిత్రాలలో ప్రారంభంలో హీరో, హోరోయిన్స్ పాత్రలు రెండూ వేర్వేరు చోట్ల ఎస్టాబ్లిష్ చేసి వాటిని ఒకచోటకు తెచ్చి(అది కొత్త బ్యాక్ గ్రౌండ్ తీసుకుంటూంటారు) అక్కడ వారిద్దరి మధ్యా లవ్ గేమ్ ఏర్పాటు చేస్తూంటారు. అయితే మొదటి నుంచీ విభిన్నంగా ప్రయత్నిస్తూ సక్సెస్ సాధిస్తున్న యేలేటి ఇక్కడా అదే పని చేయబోయారు. అందుకణుగుణంగానే హీరో, హీరోయిన్స్ గత జీవితాలను ఎస్టాభ్లిష్ చేయలేదు(మంచి ఎలిమెంటే..అనవసరమైనవి చెప్పటం అనవసరమే). దాంతో ప్రారంభం నుంచీ చిత్రం అంతా ఎయిర్ పోర్ట్ లోనే జరిగింది.

  ఇది నావెల్టీగా చెప్పుకోవటానికి బాగానే ఉన్నా విజువల్ గా అంతా ఒకే చోట జరగటం అందులో ఎక్కువ ఎమోషన్స్ లేకపోవటంతో బోర్ కొట్టటం జరిగింది. అలాగే ఎక్కడా ఊహించని మలుపులు అవీ లేకుండా నడుపుదామనే తాపత్రయంలో ప్లాట్ గా కథనం మారిపోయింది. దాంతో ఎంతసేపు జరిగినా సీన్స్ రిపీట్ అవుతున్న ఫీలింగ్ తప్ప మరొకటి కలగదు.కథ కదలిన ఫీలింగ్ కలగదు. హీరో సమస్య (ఆమె ప్రేమ పొందటం)పెరగదు. రెండు గంటల్లో సాధించటం అనే టైమ్ లాక్ తప్ప కాంఫ్లిక్ట్ ఎలిమెంట్ కనపడదు. అయితే ఆమెను ఇంప్రెస్ చేయటానికి హీరో చేసే చేస్టలు అక్కడక్కడా నవ్వు తెప్పిస్తాయి. అయితే అది కాస్సేపే..ఇంటికి మోసుకెళ్ళి నలుగురుకి చెప్పేంత నవ్వులు గానీ ప్రేమ పరిమళంగానీ కనపడపదు.మల్టీ లేయర్స్ లేకపోవటం, సింగిల్ లైన్ లో కథ చెప్పాలని ప్రయత్నించటం ఈ సినిమాకు మరో మైనస్.

  ఇక ఈ చిత్రంలో ప్లాస్ పాయింట్స్ లేవా అంటే ప్రారంభంలో టైటిల్స్,పాట యానిమేషన్, కార్టూన్స్ లో వేయటం బావుంది. అలాగే బ్రహ్మానందం పాత్ర పెద్దగా నవ్వించకపోయినా త్రూ అవుట్ ఉండటంతో కాస్త రిలీఫ్ అనిపించింది. అయితే క్లైమాక్స్ లో తప్ప ఆ పాత్ర కథలో కలవదు.అలాగే హీరో ప్రెండ్స్, హీరోయిన్ ప్రెండ్ పాత్రలు స్పష్టంగా మేనరిజమ్స్ సహా డిజైన్ చేయటం బావుంది. హీరోయిన్ స్నేహితురాలు పాత్రని జూడో అనిపించటం, ఆమెను చూడగానే హీరో ప్రెండ్ దడుసుకోవటం బాగున్నాయి. అలాగే సూపర్ మ్యాన్, బ్యాట్స్ మ్యాన్ ఉన్నట్లే టైగర్ మ్యాన్ ఉండడా అని బ్రహ్మానందం అమాయికంగా మలేషియా పోలీసులతో వాదించటం బావుంది.

  అంతేగాక హీరో ప్రెండ్ తెలుగు సినిమా కథ ఎలా ఉంటుందో వెటకారంగా ఉక్కు నరం అనే టైటిల్ తో చెప్పటం, అందులో బాంబు అనే పదం విని మలేషియా పోలీసులు ఎలర్ట్ అయ్యే ఎపిసోడ్ బాగా నవ్వించింది. ఇక యేలేటి స్వయంగా రాసుకున్న డైలాగులు పేలలేదు..గుర్తుంచుకునేవి లేవు. ఇక కెమెరా డిమాప్ట్ మెంట్ మాత్రం బాగా కష్టపడినట్లు తెలుస్తుంది.సింగిల్ లొకేషన్ ని అదీ కాస్ట్యూమ్స్ కూడా మారని హీరో,హీరోయిన్స్ ని కలర్ ఫుల్ గా చూపటంలో సఫలీకృతమయ్యింది. వెన్నెల ఫేమ్ మహేష్ శంకర్ అందించిన సంగీతం మైనస్ గా మారింది. ఇక దర్శకుడుగా యేలేటి ఎప్పటిలాగానే తన మార్కులు వేయించుకున్నా కథ, కథనాలే దెబ్బతీసాయని ప్రేక్షక స్పందన చెపుతోంది. మనోజ్ హ్యాండ్ సమ్ గానే కనపడ్డాడు. ఇక హీరోయిన్ కళ్ళతో చాలా చోట్ల ఎక్సెప్రెషన్స్ చూపించింది.హీరో ప్రెండ్ గా చేసిన కోత్త (జుట్టు) కుర్రాడు బావున్నాడు.

  ఏదైమైనా యేలేటి రొమాంటిక్ ప్రయాణం సవ్యంగా జరగలేదని స్పష్టమవుతుంది. ఆయన ఎప్పటిలాగే ధ్రిల్లర్ తీస్తేనే ఆయన అబిమానలు సంతృప్తి చెందుతారు..అలాగే ఆయనకు ఇబ్బంది ఉండదు. ఇక పెద్దగా ఎక్సెపెక్ట్ చేయకుండా ఈ చిత్రానికి వెళితేనే కొంతలో కొంత హ్యాపీగా బయిటపడే అవకాశం ఉంటుంది. మల్టీఫ్లెక్స్ ని టార్గెట్ చేసిన ఈ చిత్రం ఆ వర్గాన్నైనా అలరిస్తుందా అంటే సందేహమే..ఎందుకంటే మౌత్ టాక్ ఈ రోజుల్లో చాలా స్పీడుగా ముందుకెళ్తోంది.

   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X