For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ప్రేమ కథా చిత్రం 2 మూవీ రివ్యూ అండ్ రేటింగ్

  |

  Rating:
  1.5/5
  Star Cast: సుమంత్ అశ్విన్, నందితా శ్వేత, సిద్ధి ఇద్నానీ, విద్యుల్లేఖ రామన్, కృష్ణ తేజ
  Director: హరి కిషన్

  యువ హీరో హీరోయిన్లు సుధీర్ బాబు, నందిత జంటగా సప్తగిరి చెలరేగి హాస్యాన్ని పండించడంతో హారర్, కామెడీ చిత్రాలకు ప్రేమ కథా చిత్రమ్ ఓ ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. ఆ తర్వాత ఆ సినిమా ప్రభావంతో చాలా సినిమాలు తెలుగు తెరను తట్టినా ఆ రేంజ్ సక్సెస్‌ను, ఫీలింగ్‌ను అందించలేక చతికిలా పడ్డాయి. ఇలాంటి పరిస్థితుల్లో భారీ సక్సెస్ సాధించిన సినిమాకు సీక్వెల్‌గా ప్రేమ కథా చిత్రమ్ 2 ఏప్రిల్ 6న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సుమంత్ అశ్విన్, నందితా శ్వేత, సిద్ధి ఇద్నానీ ప్రధాన పాత్రలను పోషించారు. ఈ సినిమా ప్రేమ కథా చిత్రమ్ అందించిన అనుభూతిని ప్రేక్షకులకు పంచిందా అనే విషయాన్ని తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే.

  ప్రేమ కథా చిత్రం 2 స్టోరీ, ట్విస్టులు

  ప్రేమ కథా చిత్రం 2 స్టోరీ, ట్విస్టులు

  సుధీర్ (సుమంత్ అశ్విన్)‌, బిందు (సిద్ధి ఇద్నానీ) ఒకే కాలేజ్‌లో చదువుకునే విద్యార్థులు. సుధీర్‌తో బిందు ప్రేమలో పడి ప్రపోజ్ చేస్తుంది. దాంతో ఆమె బావిలో దూకి ఆత్మహత్య చేసుకొంటుంది. నందును సుధీర్ ప్రేమిస్తుంటాడు. వారిద్దరూ కలిసి ఓ ఫాంహౌస్‌లోకి వెళ్తారు. చిత్ర అనే ఆత్మ నందు దేహంలోకి ప్రవేశించి సుధీర్‌ను ఇబ్బంది పెడుతుంది? ఆ క్రమంలో సుధీర్, నందు ఒకర్నొకరు చంపుకునే పరిస్థితికి దారి తీస్తుంది. చిత్ర ఎందుకు ఆత్మగా మారింది? నందు, సుధీర్‌ను ఎందుకు ఇబ్బంది పెట్టింది? ఆత్మ ప్రతీకారం తీర్చుకునే క్రమంలో వారు ప్రాణాప్రాయ స్థితి నుంచి ఎలా భయటపడ్డారు. ఇంతకీ ఆత్మ శాంతించిందా? చివరకు ఏ రకంగా చిత్ర సంతృప్తి చెందింది అనే ప్రశ్నలకు సమాధానమే ప్రేమ కథా చిత్రం

  మూవీ ఎలా ఉందంటే

  మూవీ ఎలా ఉందంటే

  హారర్ కామెడీ చిత్రాలు నిర్మించాలనే కుతుహలం ఉంటే సరిపోదు. కథ, కథనాలపై భారీగా కసరత్తు చేయాల్సి ఉంటుంది. అలా చేయకపోతే ఏమిటనేది ప్రేమ కథా చిత్రం 2 అని చెప్పవచ్చు. ప్రేమ కథా చిత్రమ్ అనే టైటిల్ అంటనే ప్రేక్షకుల అంచనాలకు భారీగా ఉంటాయి. అలా థియేటర్‌కు వచ్చిన ప్రేక్షకులకు ప్రేమ కథా చిత్రమ్ పూర్తిగా నిరాశపరుస్తుంది. నాసిరకమైన కథ, కథనాలు, పేలవమైన పాత్రలు, రోతపుట్టించే నాటు కామెడీ ఇవన్నీ సినిమాకు ప్రతికూలంగా మారాయి.

  దర్శకుడి ప్రతిభ

  దర్శకుడి ప్రతిభ

  ప్రేమ కథా చిత్రమ్ సినిమా అసలు కథ చెప్పడానికి దర్శకుడు హరి కిషన్ చాలా సమయమే తీసుకొన్నాడు. కథలోకి వెళ్లడానికి వేసుకొన్న కామెడీ ట్రాక్‌ సరైన మార్గాన్ని చూపలేకపోయింది. కృష్ణ తేజు అనే కమెడియన్‌కు మంచి రోల్‌ను ఇచ్చారు కానీ.. హాస్య సన్నివేశాలను సరిగా డిజైన్ చేసుకోలేక పోవడం మిస్ ఫైర్ అయిందని చెప్పవచ్చు. రోత పుట్టించే హాస్యపు సన్నివేశాలతో హాస్యాన్ని అపహాస్యం చేశారని చెప్పవచ్చు. అనవసరమైన ట్విస్టులు లేకుండా నేరుగ కథను చెప్పి ఉంటే కొంతలో కొంత ప్లస్ అయి ఉండేదేమో అనిపిస్తుంది

  సుమంత్ అశ్విన్ నటన

  సుమంత్ అశ్విన్ నటన

  పరిశ్రమలో మంచి బ్యాక్ గ్రౌండ్ ఉన్నప్పటికీ, స్థిరపడటానికి సుమంత్ అశ్విన్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రేమ కథా చిత్రమ్ మంచి ఫలితాన్ని ఇస్తుందనే ఆశతో సినిమాపై హోప్స్ పెరిగి ఉంటాయి. తన పాత్ర పరిధి మేరకు, ఆ పాత్రలో ఒదిగి పోయేందుకు తన వంతు ప్రయత్నం చేశాడు. కథలో దమ్ము లేకపోవడంతో అంతకు మంచి ఏం చేయలేకపోయాడనే ఫీలింగ్ కలుగుతుంది.

  నందిత శ్వేత, సిద్దు ఇద్నానీ ఫెర్ఫార్మెన్స్

  నందిత శ్వేత, సిద్దు ఇద్నానీ ఫెర్ఫార్మెన్స్

  నందితా శ్వేతలో మంచి ఫెర్హార్మన్ ఉందనే విషయం ఆమె నటించిన గత చిత్రాలు చెప్పాయి. ఈ చిత్రంలో కూడా మంచి పాత్రే లభించింది. కథ, కథనాల్లో విషయం లేకపోవడం వల్ల ఆమె రోల్ సరిగా పండలేకపోయిందని చెప్పవచ్చు. కొన్ని కీలక సన్నివేశాల్లో నందిత శ్వేత ఆకట్టుకొన్నది. సిద్ధు ఇద్నానీ పాత్ర పరిస్థితి కూడా అంతే.

  కామెడీ ట్రాక్ ఎలా ఉందంటే

  కామెడీ ట్రాక్ ఎలా ఉందంటే

  కృష్ణ తేజ్, విద్యుల్లేఖ రామన్ జంట కామెడీ చాలా థర్డ్ క్లాస్. ఏ సందర్భంలోనూ వారి కామెడీ ఆకట్టుకోలేకపోయింది. కాకపోతే సన్నివేశాల్లో కొత్తదనం లేకపోయినా కృష్ణ తేజ, విద్యుల్లేఖకు రాసిని కామెడీ పంచులు అక్కడక్కడ బాగానే పేలాయి. ప్రభాస్ శ్రీను ఒకే ఒక సీన్‌లో కనిపించినా అంతగా మెప్పించలేకపోయాడని చెప్పవచ్చు.

  టెక్నికల్ అంశాలు

  టెక్నికల్ అంశాలు

  సాంకేతిక అంశాల్లో సినిమాకు హైలెట్ ఏదైనా ఉందంటే అది సీ రాంప్రసాద్ సినిమాటోగ్రఫి అని చెప్పవచ్చు. నైట్ ఎఫెక్ట్ సీన్లు బాగున్నాయి. స్క్రీన్‌ను కలర్‌ఫుల్‌గా మార్చి కొన్ని సీన్లకు బలాన్ని ఇచ్చారు. ఇక పాటలు అంతగా ఆకట్టుకోలేకపోయినా... అక్కడక్కడ రీరికార్డింగ్ బాగుందనే ఫీలింగ్‌ను జీవన్ బాబు కల్పించారు. సుదర్శన్ రెడ్డి రాజీ లేకుండా సినిమాను తెరకెక్కించారనే విషయం కనిపిస్తుంది. కాకపోతే కథ, కథనాలను సరిగా ఎంచుకోకపోవడం సినిమాకు ప్రతికూలంగా మారింది.

   ఫైనల్‌గా

  ఫైనల్‌గా

  నాసిరకమైన కథ, కథనాలతో భావోద్వేగాలు లేకుండా ప్రేమ కథా చిత్రం 2 హారర్ కామెడీగా రూపొందింది. పేలవమైన సన్నివేశాలు, అర్ధంపర్థం లేని ట్విస్టులు సినిమాకు ప్రతికూలంగా మారాయి. వెగటు కామెడీ నవ్వించడానికి బదులు ప్రేక్షకులను ఇబ్బందికి గురిచేస్తుంది. నాటు కామెడీ, హారర్ సినిమాలను ఇష్టపడే వారికి ఈ సినిమా నచ్చుతుంది.

  ప్లస్, మైనస్ పాయింట్స్

  ప్లస్, మైనస్ పాయింట్స్

  సినిమాటోగ్రఫి

  రీరికార్డింగ్

  ప్రొడక్షన్ వ్యాల్యూస్

  మైనస్ పాయింట్స్

  కథ, కథనాలు

  కామెడీ

   తెర ముందు, తెర వెనుక

  తెర ముందు, తెర వెనుక

  నటీనటులు: సుమంత్ అశ్విన్, నందితా శ్వేత, సిద్ధి ఇద్నానీ, విద్యుల్లేఖ రామన్, కృష్ణ తేజ, ప్రభాస్ శ్రీను తదితరులు

  దర్శకత్వం: హరి కిషన్

  నిర్మాత: సుదర్శన్ రెడ్డి

  కథ: చంద్రశేఖర్

  మ్యూజిక్: జీవన్ బాబు

  సినిమాటోగ్రఫి: సీ రాంప్రసాద్

  ఎడిటింగ్: ఎస్‌బీ ఉద్దవ్

  రిలీజ్: 2019-04-06

  English summary
  Prema Katha Chitra Telugu horror comedy film written and directed by Hari Kishan and produced by R. Sudarshan Reddy. The film stars Sumanth Ashwin[4] and Nandita Swetha in the lead roles. It is a sequel to the 2013 film Prema Katha Chitram directed by J Prabhakar Reddy and Maruthi Dasari. The movie is scheduled to be released on 6 April 2019. The Hindi dubbing rights for the film sold for 1.5 Crore
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X