twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వరుణ్ సందేష్ ‘ప్రియుడు’ రివ్యూ..

    By Bojja Kumar
    |

    తారాగణం: వరుణ్ సందేష్, ప్రీతికారావు, రణధీర్, స్వేతా బసు, వెన్నెల కిషోర్, అలీ, తాగుబోతు రమేష్, కోట, నాజర్, కాశీ విశ్వనాథ్, సురేఖ వాణి, శివనారాయణ తదితరులు...
    దర్శకత్వం: శ్రవణ్
    నిర్మాత: పి. ఉదయ్ కిరణ్
    సంగీతం: మోహన్
    విడుదల: డిసెంబర్ 3, 2011

    హ్యాపీడేస్, కొత్త బంగారు లోకం లాంటి హిట్ సినిమా తర్వాత పడుతూ లేస్తూ సాగుతున్న తన కెరియర్ ని గాడిలో పెట్టుకోవడానికి ప్రియుడుగా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు హీరో వరుణ్ సందేష్. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అమృతరావు చెల్లెలు ప్రీతికారావు వరుణ్ తో జతకట్టింది. మరి ఈ ప్రియుడు గోల ఏమిటో ఒకసారి వీక్షిద్దామా..

    కథలోకి వెళితే...
    కార్తీక్(వరుణ్ సందేష్) అందరితో ఫ్రెండ్లీగా ఉండే కుర్రాడు. స్నేహితుల కోసం ఏ పనైనా చేస్తాడు. కానీ ప్రేమ అంటే మాత్రం ఆమడ దూరం ఉంటాడు. ప్రేమ వల్ల ఇద్దరు వ్యక్తుల మధ్య మనస్ఫర్థలు వస్తాయని, వ్యక్తిగత స్వేచ్ఛ కోల్పోతాం, అనవసర టెన్షన్లు ఉంటాయనేది కార్తీక్ వాదన. అందుకే ప్రేమకు దూరంగా ఉంటూ ఉంటాడు. మరో వైపు మధులత(ప్రీతికారావు) అనే అమ్మాయి ఇందుకు పూర్తిగా విభిన్నం. మధులత అమ్మ నాన్నలది కూడా ప్రేమ వివాహమే కావడంతో ప్రేమించి పెళ్లి చేసుకుంటేనే జీవితం సంతోషంగా ఉంటుంది అని బలంగా నమ్ముతుంది. ఈ క్రమంలో మధులత కార్తీక్ ప్రేమలో పడుతుంది.

    కార్తీక్ ఫాదర్(కాశీ విశ్వనాథ్), మధులత ఫాదర్(నాజర్) ఒకప్పటి స్నేహితులు. మధులత తన ప్రేమ విషయాన్ని పేరెంట్స్ కి చెబుతుంది. వెంటే వారు వెళ్లి కార్తీక్ తల్లిదండ్రులతో మాట్లాడటంతో వారు కూడా ఓకే చెబుతారు. కార్తీక్ కు ఇష్టం ఉండదుకానీ కొన్ని పరిస్థితుల కారణంగా ఓకే చెబుతాడు. ఓలాగైనా ఆమెను వదిలించుకోవడానికి ప్లాన్ వేస్తాడు. ఈ క్రమంలో మధులతను చాలా కాలంగా ప్రేమిస్తున్న వరప్రసాద్(రణధీర్) కనిపిస్తాడు. వరప్రసాద్ కు ట్రైనింగ్ ఇచ్చి మధుతో అతని ప్రేమను సక్సెస్ అయ్యేందుకు ప్రయత్నిస్తాడు. మరి కార్తీక్ ప్రయత్నం సక్సెస్ అయిందా? కార్తీక్ ను ప్రేమించిన మధు పరిస్థితి ఏమిటి? అనేది తర్వాతి కథ.

    విశ్లేషణ...
    కథ కాస్త డిఫరెంట్ గా ఉన్నప్పటికీ దర్శకుడు సినిమాను పర్ ఫెక్టుగా ప్రజెంట్ చేయడంలో తడబడ్డాడు. స్రిప్టు వర్కు, స్ర్రీన్ ప్లే యావరేజ్ గా ఉంది. కేవలం కాలేజీ స్టూడెంట్స్, యూత్ ను దృష్టిలో పెట్టుకొనే ఈ సినిమా తీసినట్లు స్పష్టం అవుతోంది. ఫ్యామిలీ ఆడియన్స్ కు నచ్చే అంశాలు సినిమాలో పెద్దగా లేవనే చెప్పాలి. సినిమా బ్యాగ్రౌండ్ స్కోర్ బాగానే ఉన్నప్పటికీ పాటలు ఆకట్టుకునేలా లేవు. బోర్ కొట్టించే క్లయిమాక్స్ సినిమాకు మైనస్ పాయింట్.

    వరుణ్ సందేష్ ఎనర్జిటిక్ నటనతో ఆకట్టుకున్నాడు. హీరోయిన్ ప్రీతికారావు నటనలో ఫర్వాలేదనిపించినా అందం పరంగా ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయింది. రణధీర్ నటన డీసెంట్ గా ఉంది. శ్రేత బసు ఫర్వాలేదు. కోట నటనకు పేరు పెట్టలేం. తాగు బోతు రమేష్ నటన ఫన్నీగా ఉంది. నాజర్ నాచురల్ గా నటించాడు. అలి, వెన్నెల కిషోర్ మమ అనిపించారు. కాశీవిశ్వనాథ్ నటన స్టాండర్డ్ గా ఉంది. సురేఖ వాణి నీట్ గా నటించింది. ఇతర నటీనటులు వారి వారి పరిధిమేర రాణించారు.

    English summary
    The film has been made keeping the college and youth audience in mind but in this process, cinematic liberties and reasoning was left to the wind.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X