»   » ట్రైలర్ భళి...సినిమా బలి (‘కబాలి’ రివ్యూ)

ట్రైలర్ భళి...సినిమా బలి (‘కబాలి’ రివ్యూ)

Posted By:
Subscribe to Filmibeat Telugu
Rating:
2.5/5

---సూర్య ప్రకాష్ జోశ్యుల

ఒకే ఒక్క ట్రైలర్ తో ఊహించశక్యం కాని క్రేజ్ తెచ్చుకున్న ఏకైక సినిమా ఈ మధ్య కాలంలో ఇదే . అయితే ఆ క్రేజ్ మొత్తం ..సినిమా ఆ స్దాయిలో లేకపోవటంతో బెలూన్ పేలినట్లు పేలిపోయింది. రజనీ తన గత రెండు ప్లాఫ్ ల కన్నా ఇది బెటర్ గా అనుకోవటానికే పనికొచ్చింది. ఈ సినిమా డైరక్ట్ చేసిన రంజిత్ కన్నా...ట్రైలర్ కట్ చేసిన వారిదే గొప్పతనం అని చెప్పాలి. ఎందుకంటే ఇంతక్రౌడ్ ని ధియేటర్ వరకూ లాగేంత క్రేజ్ క్రియేట్ చేసాడు.


రజనీ తన దైన మ్యానరిజమ్స్ , స్టైల్స్ తో అలరించే ప్రయత్నం చేసినా దర్శకుడు కథ,కథనంతో ఆయనకు తోర్పడలేదు. ఫస్టాఫ్ బాగున్నా..సెకండాఫ్ అంత సీన్ లేదు అని తేలిపోయింది. క్లైమాక్స్ అయితే మరీ దారుణం అనే చెప్పాలి. స్లో నేరేషన్ , తెలుగు నేటివిటీ కొంచెం కూడా లేకపోవటం, రజనీ సినిమాల నుంచి ఆశించే కమర్షియల్ ఎలిమెంట్స్ లేకపోవటం సినిమాకు మైనస్ లు గా నిలిచాయి.


మలేషియాలోని ఓ మాజి మంచి డాన్ కబాలి (రజనీకాంత్) పాతిస సంవత్సరాల అనంతరం జైలు జీవితం అనుభవించి బయిటకు వస్తాడు. తన పాతిక సంవత్సరాల జీవితాన్ని, తన భార్యని, కుమార్తెని తనకు కాకుండా చేసిన మలేషియా టాప్ మాఫియా డాన్ టోని ( విన్స్ టన్ చావ్) పై పగ తీర్చుకోవాలనుకుంటాడు.


Also Read: టికెట్లు దొరకలేదు: రజనీకాంత్ అభిమాని ఆత్మహత్య? (వీడియో)


అయితే కబాలి ..జైలు నుంచి వచ్చాడని తెలుసుకున్న టోని సైతం దాడులు ప్రారంభిస్తాడు. అంతేకాకుండా కబాలిని చంపటానికి ఓ ఫ్రొఫిషనల్ కిల్లర్ యోగి (ధన్సిక)కు సుపారి ఇస్తాడు. అప్పుడు ఏం జరుగుతుంది. ఆ అమ్మాయి ..కబాలిని చంపగలిగిందా...కబాలి ...టోనిపై పగ తీర్చుకున్నాడా...అసలు కబాలి జైలుకు వెళ్లటానికి కారణం ఏమిటి, తన భార్య,కుమార్తెను కలుసుకున్నాడా వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.


ఇక స్క్రిప్టు విషయంలోనే దర్శకుడు దారి తప్పాడనిపిస్తుంది. రజనీకాంత్ ని ఓ హీరోలా చూడకుండా ఓ ఏజ్ అయిపోయిన ముసలి హీరోగా భావించి ఈ కథ చేసుకున్నట్లున్నాడు. మొదట పదినిముషాల్లో సినిమాల్లో రజనీ ఎంట్రీ, తన అనుచరులను కలవటం, తిరిగి పాత పగలు సెటిల్ చేసుకోవాలనుకోవటం వరకూ బాగానే నడిచింది. అయితే ఆ తర్వాత మెల్లిగా డ్రాప్ అవటం మొదలయ్యి.. ఇంటర్వెల్ కి ఓ ట్విస్ట్ తో ఊపు వచ్చింది.


Also Read: రజినికాంత్ గురించి ఆశ్చర్యకరమైన కొన్ని సంగతులు (ఫొటోలు)


సెకండాఫ్ కు లో అయితే ఇంకా దారణం.. కేవలం తన భార్యను ఎక్కడ ఉందా వెతకుతూ రజనీ వంటి స్టార్ కాలం గడుపుతూ కాలక్షేపం చేస్తూంటాడు. పోనీ ఆ ప్రహసనం పూర్తి అయిన తర్వాత అయినా రంగంలోకి దిగి విలన్స్ వెన్నులో వణుకు పుట్టిస్తాడు అనుకుంటే ఓ చిన్న క్లైమాక్స్ ఫైట్ తో ముగింపుకు వచ్చేస్తుంది. రజనీకాంత్ వంటి సూపర్ స్టార్... ప్యాసివ్ పాత్రలో ఏమి చెయ్యలేక,కేవలం 'మంచిది'అని డైలాగు చెప్తూ తిరుగుతూంటే ఏం చూడగలం, ఆయన కూడా ఎప్పుడూ తన భార్య, కూతురు వాళ్లే జీవితం అని కన్నీరు పెట్టుకుంటూంటే ఎలా భరించగలం.


స్లైడ్ షోలో మిగతా రివ్యూ


రజనీ సినిమా కాదు

రజనీ సినిమా కాదు

ఇది ఖచ్చితంగా రజనీ సినిమా అయితే మాత్రం కాదు. సినిమాలో ఆయన నుంచి సగటు ప్రేక్షకుడు ఆశించే ఎలిమెంట్స్ ఏమీ లేవు. దర్శకుడు కేవలం తను అనకుంటున్నట్లాగానే కాకుండా అభిమానులను కూడా దృష్టిలో పెట్టుకుని చేస్తే బాగుండేది.ట్రిమ్ చేసేయవచ్చు

ట్రిమ్ చేసేయవచ్చు


సెకండాఫ్ ప్రారంభం నుంచి దాదాపు 30 నిముషాలు పాటు...తన భార్యను వెతుక్కునే సీన్స్ తగ్గించేస్తే సినిమా సగం బోర్ తగ్గుతుంది.రగ్గడ్ నెస్

రగ్గడ్ నెస్


సినిమా హైలెట్స్ ఒకటి సినిమాటోగ్రఫి. సినిమాకు వరల్డ్ క్లాస్ లుక్ తీసుకువచ్చిందంటే అతిశయోక్తికాదు. మలేషియాలోని రగ్గెడ్ నెస్ ని పట్టుకుని ఓ కొత్త ఎట్మాస్మియర్ క్రియేట్ చేసాడు.కాపాడంది

కాపాడంది


సినిమాకు మరో ప్లస్ పాయింట్ ఏమీటి అంటే బ్యాక్ గ్రౌండ్ స్కోర్. సంతోష్ నారాయణ్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ..సినిమాని అంత బోర్ లోనూ కూర్చోబెట్టగలిగింది.వదిలేసాడు

వదిలేసాడు


రజనీ వంటి స్టార్ హీరో సినిమాల్లో రెగ్యులర్ గా చోటు చేసుకునే కమర్షియల్ ఎలిమెంట్స్ ని పూర్తిగా వదిలేసాడు దర్శకుడు. రొటీన్ అయిపోతాయి అనుకున్నా..వాటి ప్లేస్ లో కొత్తగా ఏదన్నా చేసి మాస్ ని అలరించాలి కదా..అదేమీ చెయ్యలేదు.వన్ పర్శంట్ కూడా లేదు

వన్ పర్శంట్ కూడా లేదు


సినిమాలో కామెడీకి కొంచెం కూడా స్దానం ఇవ్వలేదు. సీరియస్ గ్యాగస్టర్ ఫ్లిక్ లా సినిమాని తీర్చిదిద్దుదామనుకున్నాడు. కానీ రిలీఫ్ ఇవ్వాలి, మనం హాలీవుడ్ సినిమా కాదు చేస్తోంది రీజనల్ లాంగ్వేజెస్ లో కూడా ఆడాల్సిన సినిమా అని దర్శకుడుకి ఎందుకో ఆలచన రాలేదు.కరెక్టు ఛాయిస్ కాదు

కరెక్టు ఛాయిస్ కాదు


రజనీ భార్యగా రాధిక ఆప్టే, కుమార్తె గా ధన్సిక ఇద్దరూ బాగానే చేసారు కానీ ఎమోషనల్ సీన్స్ లో నిలబెట్టలేకపోయారు. ధన్సిక కాకుండా మరొకరు ఎవరినైనా తీసుకుంటే బెస్ట్ ఛాయిస్ అయ్యేదేమో అనిపిస్తుంది.అక్కడిదాకా మెచ్చుకోవచ్చు

అక్కడిదాకా మెచ్చుకోవచ్చు


రజనీవంటి సూపర్ స్టార్ సినిమాని కూడా రియలిస్టిక్ ఎప్రోచ్ తో తీయాలన్న దర్శకుడు రంజిత్ సాహసాన్ని మెచ్చుకోవచ్చు. అయితే అందుకోసం ఆయన స్క్రిప్టుపై మంరిత కసరత్తు చేసి ఉండాల్సింది.యాక్షన్ ఎపిసోడ్స్,విలన్స్

యాక్షన్ ఎపిసోడ్స్,విలన్స్


ఉన్నంతలో యాక్షన్ ఎపిసోడ్స్ మరీ విజిల్స్ వేయించేలా లేకపోయినా...రజనీ వయస్సు కు తగ్గట్లు జాగ్రత్తగా కొరియోగ్రఫి చేసారు. ఇక విలన్స్ చేసిన విన్స్ టన్ చావ్, కిషోర్ ..ఇద్దరూ కూడా బాగా చేసారు. కిషోర్ అయితే అదరకొట్టాడనే చెప్పాలిఇమేజ్ ని పట్టించుకోకపోవటం

ఇమేజ్ ని పట్టించుకోకపోవటం


రజనీ ఇమేజ్ ని దర్శకుడు వదిలేయటమే ఈ సినిమాకు పెద్ద మైనస్ అని చెప్పాలి. ఆ ఎలిమెంట్స్ పెట్టుకుని, ఇదే కథని మరింత ఆసక్తికరంగా తీసినా బాగుండేది.అదిరాయి

అదిరాయి


బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ...నిప్పురా, నెరుప్పురా అంటూ సాగటం, ఒక్కడే, ఒక్కడినే అనే రజనీ ఇంట్రడక్షన్ సాంగ్ కూడా స్క్రీన్ పై అదిరిపోయాయి.ఎవరెవరు

ఎవరెవరు


బ్యానర్ : షన్ముఖ పిక్చర్స్
నటీనటులు : రజనీకాంత్, రాధికా ఆఫ్టే, ధన్సిక, విన్స్ టన్ చావ్, తదితరులు
సినిమాటోగ్రఫీ : జి.మురళి
ఎడిటర్ : కె.ఎల్.ప్రవీణ్
సంగీతం : సంతోష్ నారాయణ్
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం : పా.రంజిత్
నిర్మాత : కలైపులి ఎస్.థాను
విడుదల తేదీ :22-07-2016
ఫైనల్ గా ... ట్రైలర్ చూసి ధ్రిల్లైపోయి ఈ సినిమాకు పరుగెత్తుకెళ్లితే దారుణంగా దెబ్బతింటారు. రజనీ ఎందుకు రెగ్యులర్ సినిమాలు చేస్తారు...ఆయన తన ఇమేజ్ వదిలి...రియలిస్టిక్ పిక్చర్స్ చేయరా అనేవారికి ..అలాంటి సినిమాలు చేస్తే ఇలా దారుణంగా ఉంటుంది.. అనే సమాధానం చెప్తుందీ చిత్రం.

English summary
Superstar Rajinikanth's much-awaited flick Kabali released today( July 22nd) in worldwide theatres. Touted to be a mass entertainer, Rajinikanth seen portraying the role of Malaysia don. Kabali is directed by Pa Ranjith and features Radhika Apte in the lead role while Taiwanese actor Winston Chao will be seen in a pivotal role.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu