For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ‘RED’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్

  |

  Rating:
  3.0/5
  Star Cast: రామ్ పోతినేని, మాళవికా శర్మ, అమృతా అయ్యర్, నివేతా పెతురాజ్
  Director: కిషోర్ తిరుమల

  ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని చాలా కాలం తరువాత రెడ్ అనే సినిమాతో డిఫరెంట్ గా ఆకట్టుకోవాలని ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. చివరగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో చేసిన ఇస్మార్ట్ శంకర్ సినిమా ఏ స్థాయిలో సక్సెస్ అయ్యిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇక ఈ సారి తమిళ్ మూవీ తడమ్ సినిమా రీమేక్ గా రూపొందిన రెడ్ సినిమాతో సక్సెస్ అందుకోవడానికి రెడీ అయ్యాడు. ఇక రామ్ ద్విపాత్రాభినయంతో చేసిన రెడ్ సినిమా నేడు(జనవరి 14) విడుదలైంది. ఇక సినిమా ఎంతవరకు ఆకట్టుకుందో రివ్యూలో చూద్దాం..

  రెడ్ చిత్రం ప్రీరిలీజ్ ఈవెంట్ ..రామ్ హంగామా చూడండి (ఫోటోలు)

  కథ..

  కథ..

  రామ్ ఈ సినిమాలో ఆదిత్య, సిద్ధార్థ్ అనే రెండు పాత్రల్లో నటించాడు. సిద్ధార్థ్ వృత్తిరీత్యా ఇంజనీర్ కాగా, ఆదిత్య ఒక కొన్ని నెగిటివ్ షేడ్స్ తో మోసాలు చేస్తుంటా జీవితాన్ని ఎంజాయ్ చేస్తుంటాడు. అయితే ఒకరోజు ఆకాష్ అనే యువకుడి హత్య వలన మొదట ఒక ఆధారం ద్వారా సిద్దార్థ్ ను అరెస్ట్ చేయడం జరుగుతుంది. అనంతరం ఆదిత్య కూడా ఇదే కేసులో చిక్కుకుంటాడు. ఇక అసలు హంతకుడు ఎవరనే పాయింట్ మీదే మిగతా కథ మొత్తం నడుస్తుంది.

  కథలో ట్విస్టులు..

  కథలో ట్విస్టులు..

  అసలు మొదట సిద్దార్థ్ ను పట్టుకున్న పోలీసులకు అనుకోకుండా కేసులో అదిత్యను ఎందుకు లాగాల్సి వస్తుంది. ఆకాష్‌ను ఎవరు చంపారు? అసలు సిద్దార్థ్, ఆదిత్య ఇద్దరు ఒకేలా ఎందుకు ఉంటారు? వాళ్ల ఫ్లాష్ బ్యాక్ ఏమిటి? పోలీసులకు దొరికిన ఆధారాలు ఏమిటి? అనే ఎన్నో ప్రశ్నలతో ట్విస్టులను క్రియేట్ చేస్తుంది ఈ కథ. ఈ సమాధానాలు తెలియాలి అంటే సినిమాను బిగ్ స్క్రీన్ పై చూడాల్సిందే.

  ఫస్టాఫ్ అనాలిసిస్..

  ఫస్టాఫ్ అనాలిసిస్..

  రామ్ మొదటిసారి ద్విపాత్రాభినయం చేయడం చాలా కొత్తగా ఉంది. వారి పాత్రలను పరిచాయడం కూడా బాగానే ఉంది. అయితే కొన్ని ఫస్టాఫ్ సీన్స్ చాలా నెమ్మదిగా కొనసాగడం బోర్ కొట్టించే అంశం. సినిమాలో సందేహాలు ఆకట్టుకునేలా దర్శకుడు నెమ్మదిగా వివరించే ప్రయత్నాలు బాగానే చేసినప్పటికీ సీన్స్ మేకింగ్ కొత్తగా ఏమి అనిపించదు. స్టార్టింగ్ లో సిద్దార్థ్ లవ్ సీన్స్ కంటే ఆ తరువాత ఆదిత్య ఇంట్రడక్షన్ సీన్స్ లవ్ సీన్స్ ఆకట్టుకునే విధంగా ఉంటాయి. అలా ఇంటర్వెల్‌లో అసలు కథను రివీల్ చేయడంతో ప్రథమార్థం ఎంతో థ్రిల్లింగ్‌గా ముగుస్తుంది.

  సెకండాఫ్ అనాలిసిస్..

  సెకండాఫ్ అనాలిసిస్..

  ఫస్ట్ హాఫ్ మొత్తం పాత్రలకు సంబంధించిన హావభావాలను పరిచయం చేసిన దర్శకుడు ఆ తరువాత ఒక మర్డర్ ట్విస్టుతో కథను మలుపు తిప్పే ప్రయత్నం బాగానే ఉంది. కానీ ఇన్వెస్టిగేషన్ మరీ అంత కొత్తగా ఏమి అనిపించదు. హీరోల ఫ్లాష్ బ్యాక్ సీన్స్ సెన్సిటివ్ గా ఉంటాయి. అందులో కూడా అన్ని సీన్స్ ఎట్రాక్ట్ చేసేలా ఏమి ఉండవు. కానీ రామ్ రెండు పాత్రల్లో నటించిన విధానం, మణిశర్మ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మేజర్ ప్లస్ పాయింట్స్. మొత్తంగా ఎమోషనల్, యాక్షన్ సీక్వెన్స్, క్లైమాక్స్ ట్విస్ట్‌లో సెకండాఫ్ ఈజీగా పాసైంది.

  నటీనటులు

  నటీనటులు

  రామ్ తన కెరీర్‌లో మొదటిసారిగా ద్విపాత్రాభినయం చేశాడు. రెండు పాత్రల్లోనూ స్పష్టమైన తేడాను, యాక్టింగ్‌లోనూ, లుక్స్‌లోనూ ఎంతో తేడా చూపించాడు. ఒకటి క్లాస్, మరోటి మాస్ పాత్రల్లో రామ్ ఇరగ్గొట్టేశాడు. అలా మొత్తానికి రామ్ తన పర్ఫామెన్స్‌తో మరోసారి ఆకట్టుకున్నాడు. ఇక రామ్ తరువాత ఈ సినిమాలోని కథానాయికలా గురించి చెప్పుకోవాలి. అందులోనూ ముఖ్యంగా నివేదా పేతురాజ్ గురించి చెప్పుకోవాలి. ఉన్నంతలో ఆమెకే ఎక్కువగా నటించే స్కోప్ దక్కింది. మాళవిక అందాలు, అమృతా అయ్యార్ స్క్రీన్ ప్రజెన్స్ అన్నీ ఆకట్టుకుంటాయి. మిగతా పాత్రల్లో అందరూ తమ పరిధి మేరకు నటించారు.

  దర్శకుడి ప్రతిభ..

  దర్శకుడి ప్రతిభ..

  రీమేక్ సినిమాను తెరకెక్కించడం దర్శకులక కత్తిమీద సాము వంటిది. ఎక్కువగా మార్పులు చేర్పులు చేసి చేతులు కాల్చుకోకూడదని కొందరు చూస్తుంటారు. ఇంకొందరు మాత్రం సోల్‌ను మాత్రమే తీసుకుని మొత్తంగా కథనాన్ని మార్చేసుకుంటారు. అయితే రీమేక్ సినిమాలు ప్రతీ సారి మ్యాజిక్ చేయవు. ఒక్కోసారి ప్రయత్నం సఫలమవుతుంది.. ఇంకోసారి విఫలమవుతుంది.

  కానీ RED విషయంలో కిషోర్ తిరుమల సాహసం ఏమీ చేయలేదనిపిస్తోంది. ఉన్నది ఉన్నట్టుగా తీసుకుని మన తెలుగు నేటివిటీకి తగ్గట్టు ఇంకొంత యాడ్ చేసినట్టుగానే అనిపిస్తుంది. అయితే తమిళ్‌లో అరుణ్ విజయ్‌కు ప్రత్యేకమైన ఇమేజ్ లేదు. కానీ ఇక్కడ రామ్.. ఇస్మార్ట్ హిట్‌తో మంచి జోరుమీదున్నాడు. అందుకే రామ్‌కు RED కొత్త అనుభవం. దానికి తగ్గట్టు దర్శకుడు చేసిన మార్పులు ప్రేక్షకులను మెప్పించేలానే ఉన్నాయి. మొత్తానికి రీమేక్ చేసినా కూడా రామ్ ఇమేజ్‌ను బ్యాలెన్స్ చేస్తూ తెరకెక్కించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడనే చెప్పవచ్చు.

  సాంకేతిక విభాగాల పనితీరు..

  సాంకేతిక విభాగాల పనితీరు..

  ఇక ఎప్పటిలానే మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ లో బెస్ట్ అనిపించుకున్నాడు. కథ ఇంట్రెస్టింగ్ గా కొనసాగే విధానంలో తన మ్యూజిక్ అనుభవాన్ని చూపించాడు. దర్శకుడు కూడా అదే స్థాయిలో థ్రిల్లింగ్ సీన్స్ ను ఊహించని విధంగా తెరకెక్కించి ఉంటే మరింత బావుండేది. సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ కూడా బాగానే ఉంది. ప్రతి ఫ్రేమ్ ను ఈ టెక్నీషియన్ డిఫరెంట్ గా చూపించే ప్రయత్నం చేశాడు. ఇక పీటర్ హెయిన్ ఫైట్స్ విషయంలో అంచనాలను అందుకోలేదు. పోలీస్ స్టేషన్ లో ఆదిత్య, సిద్దార్థ్ పాత్రల యాక్షన్ సీన్ హై వోల్టేజ్ తో మొదలైనప్పటి ఆ తరువాత ఫైట్ మాత్రం రొటీన్ గానే ఉంటుంది.

  ప్లస్ పాయింట్స్..

  ప్లస్ పాయింట్స్..

  రామ్

  సంగీతం, నేపథ్య సంగీతం

  కథలోని ట్విస్ట్‌లు

  మైనస్ పాయింట్స్

  నెమ్మదిగా సాగే కథనం

  ఫైనల్‌గా.

  ఫైనల్‌గా.

  చివరగా RED సినిమాతో రామ్ తన అభిమానులను ఆకట్టుకుంటాడు. మరోసారి రామ్ తన ఎనర్జీని చూపించాడు. అయితే సంక్రాంతి బరిలోకి దిగడం, ప్రస్తుతం ఉన్న పరిస్థితిని చూస్తే బాక్సాఫీస్ మీద ఏ మాత్రం ప్రభావం చేస్తుందో చూడాలి.

  నటీనటులు :

  నటీనటులు :

  రామ్ పోతినేని, మాళవికా శర్మ, అమృతా అయ్యర్, నివేతా పెతురాజ్ తదితరులు

  దర్శకత్వం : కిషోర్ తిరుమల

  నిర్మాత : స్రవంతి రవికిషోర్

  మ్యూజిక్ : మణిశర్మ

  సినిమాటోగ్రఫి : సమీర్ రెడ్డి

  ఎడిటింగ్ : జునైద్ సిద్దిఖీ

  రిలీజ్ డేట్ : 2021-01-14

  రేటింగ్ : 3

  English summary
  Energetic hero Ram Pothineni came forward to impress the audience differently with the movie Red after a long time. Needless to say, the level of success of Ismart Shankar, directed by Puri Jagannath, is huge. This time, he is ready to receive success with Red, a remake of the Tamil movie Tadam. The red movie starring Ram in a double role was released today (January 14). Let's see how impressive the movie is in the review ..
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X