For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  శవమ్ (రామ్ 'శివమ్‌' రివ్యూ)

  By Srikanya
  |

  Rating:
  1.5/5

  ఓ రోజు కూర బాగా కుదరింది కదా అని...దాన్నే దాచి, వాసన వచ్చినా రోజులు తరబడి తినాలంటే పరిస్ధితి ఎలా ఉంటుంది. రామ్ సినిమాలు పరిస్దితి కూడా అదే. ప్రతీ సారి తన సినిమాలను తనే రీమిక్స్ చేసుకుంటూ వస్తున్న హీరో తెలుగులో ఎవరూ అంటే కళ్లు మూసుకుని రామ్ అని చెప్పవచ్చు. తన హిట్ సినిమాల్లో వచ్చిన సీన్స్ లనే పేర్లు, లొకేషన్స్ , ఆర్టిస్టులను మార్చి అందిస్తూ కొత్తగా ఫీలవమంటూ థియోటర్లలో దిగుతున్నాడు. డైరక్టర్స్ మార్తున్నా స్కీమ్ మాత్రం మారటం లేదు.

  ఈ రొటీన్, రొట్టకొట్టుడు... ఓల్డ్ వైన్ ఇన్ న్యూ బాటిల్ స్క్రీమ్ ని ఈ సారి కూడా శివమ్ అని అందించబోయాడు. అయితే ఇప్పటికే ఎన్నో సార్లు ఇదే స్కీమ్ వేయటంతో ఆ స్క్రీమ్ కూడా జనాలకు బోరు కొట్టి బై కొట్టే స్ధితి వచ్చేసింది. పేరుకి కొత్త దర్శకుడే శ్రీనివాస రెడ్డి కాని అతని ఆలోచనలు అన్ని పాత వాసనలే. కష్టపడి...ఇంత రొటీన్,కంగాళి సినిమాని ఈ మధ్యకాలంలో చూడలేదనిపించేలా డిజైన్ చేయటంలో సక్సెస్ అయ్యాడు. అలాగే శుభం కార్డు బదులు కొత్తగా... దూలు తీరిపోతుంది అని వేసి అదే ప్రేక్షకుడుకి ఫైనల్ గా కలిగిన ఫీల్ ని అక్కడ ఊహించి మరీ చూపించాడు.

  ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

  'మనకు నచ్చిన అమ్మాయి దొరికేంత వరకూ వెయిట్ చెయ్యాలి, దొరికాక ఆ అమ్మాయి కోసం ఫైట్ చెయ్యాలి' అనే ఫిలాసపీతో బ్రతుకుతూ ప్రేమికులకు పెళ్లిళ్లు, సాయాలు, అందుకోసం రిస్క్ లు చేస్తూంటాడు శివమ్(రామ్). ఆ ప్రాసెస్ లో అతను ఇగో ఎక్కువ ఉన్న రౌడీ జడ్చర్ల బోజి రెడ్డి (వినయ్ కుమార్) అనే రౌడీని కెలుకుతాడు. మరో ప్రక్క అతను తను(రాశిఖన్నా) కనపడటంతో ఆమెతో ప్రేమలో పడి,వెంటబడతాడు. తను..కరెక్టు గా శివ కు ప్రేమ ని ఎక్సప్రెస్ చేసే సమయానికి అభి(అభిమన్యు సింగ్) అనే గూండా ఆమెను ఎత్తుకుపోతాడు. అభి కూడా ఆమెను ప్రేమిస్తాడు అందుకే కిడ్నాప్ చేసి ఎత్తుకుపోయాడన్నమాట. ఇప్పుడు శివ...తనను వెంబడిస్తున్న బోజి రెడ్డి మనుష్యుల నుంచి తప్పించుకుని అభి వద్ద నుంచి ఎలా తీసుకుతెచ్చుకున్నాడు. తన ప్రేమను ఎలా సాధించుకున్నాడు అనేది మిగతా కథ.

  కథకు ఏ లక్ష్యమూ లేదు..అలాగే ఆ కథలోని హీరోకు ఏ లక్ష్యమూ లేదు. దాంతో కథ ఎటునుంచి ఎటు వైపుకు వెళ్తోందో అర్దం కాని సిట్యువేషన్ ఏర్పడింది. ఫస్ట్ హాఫ్ ఓకే అనకుంటే సెకండాఫ్ మరీ ఘోరం అయ్యిపోయింది. ముఖ్యంగా విలన్స్ ని ప్రోపర్ గా ఏక్టివ్ గా ఉంచలేదు. దాంతో హీరోకు సరైన కాంప్లిక్ట్ లేకుండా పోయింది. దాంతో సీన్ బై సీన్ హీరో గారి ఘనతను చూపించే సీన్స్ రావటమే కాని పస లేకుండా పోయాయి. అలాగే కథలోనూ,కథనంలోనూ ఎక్కడా ట్విస్ట్ లు లేవు. సినిమా ప్రారంభమైన కాస్సేపటికే సినిమా ఎటు నుంచి ఎటు వెళ్తుందో ఎక్కడ ముగుస్తుందో అర్దమైంది.

  ఇక కామెడీ సీన్స్ పేలితే సినిమాకు మైలేజి అని దర్శకుడు బాగా నమ్మినట్లున్నాడు. జబర్దస్త్ టీమ్ ని తీసుకు వచ్చి కామెడీ చేయించే ప్రయత్నం చేసాడు. అయితే అవీ సత్పలితాన్ని ఇవ్వలేదు. కంటెంట్ లేని కామెడీ...టీవిలో వేసుకునే బిట్లుగా తప్ప ఎందుకు పనికిరాదనే విషయం మరో సారి ప్రూవ్ అయ్యింది.

  స్లైడ్ షోలో మిగతా రివ్యూ

  చేసిందేది

  చేసిందేది

  హీరో రామ్ ఎనర్జి లెవెల్స్ ఎప్పుడు బాగానే ఉంటాయి. దాని గురించి ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు.అయితే ఆ ఎనర్జీని లవర్స్ కు హెల్ప్ చేయటం, హీరోయిన్ కు బీట్ వెయ్యిటం, గూండాలతో గేమ్, బ్రహ్మానందంపై జోక్స్ కట్ చేయటం, ట్యాన్స్ కు డాన్స్ వీటికే అయితే కొత్తేముంది..బోర్ తప్ప

  స్క్రిన్ షో చేసినా

  స్క్రిన్ షో చేసినా

  ఈ సినిమాలో హీరోయిన్ రాశిఖన్నా స్క్రిన్ షో చేసినా నటన పెద్దగా చేయకపోవటం,చేసేటంత స్కోప్ లేకపోవటం జరిగింది.

  హైలెట్

  హైలెట్

  ఈ సినిమాలో డైరక్టర్ చూపిన హైలెట్ ఏదైనా ఉందీ అంటే జడ్చర్లలో చేసిన యాక్షన్ ఏపిసోడ్. అయితే ఆ క్రెడిట్ స్టంట్ మాస్టర్ కే చెందుతుంది.

  వామ్మో ఇంత టైమా

  వామ్మో ఇంత టైమా

  ఈ సినిమాకు రన్ టైమ్ బాగా ఎక్కువ. 2 గంటల 48 నిమిషాల సినిమాలో ఒక 20 నిమిషాలన్నా తగ్గిస్తే బాగుండేది.

  టెక్నికల్

  టెక్నికల్

  ఈ సినిమా టెక్నికల్ గా కెమెరా వర్క్ బాగుంది. అయితే రసూల్ ఎల్లూర్ స్టాడర్డ్ లో లేదు. ఎడిటింగ్ బాగా ట్రిమ్ చేయాల్సిన అవసరం గుర్తు చేస్తుంది.

  సంగీతం, డైలాగ్స్

  సంగీతం, డైలాగ్స్

  దేవిశ్రీప్రసాద్ సంగీతం ఎప్పటిలాగ జోష్ గా సాగలేదు. సోసో గా అనిపించింది. దర్శకుడు, మరో దర్శకుడు కిషోర్ తిరుమల రాసిన డైలాగ్స్ కొన్ని బాగానే పేలాయి

  తేలిపోయింది

  తేలిపోయింది

  ఈ సినిమాకు పెద్ద మైనస్ క్లైమాక్స్, ప్రీ క్లైమాక్స్, సినిమా అక్కడికి వచ్చేసరికి బాగా సిల్లీగా మారి తేలిపోయింది.

  ఎవరెవరు...

  ఎవరెవరు...

  బ్యానర్ శ్రీ స్రవంతి మూవీస్
  నటీనటులు:రామ్, రాశిఖన్నా, బ్రహ్మానందం, అభిమన్యు సింగ్‌, జయప్రకాష్‌రెడ్డి, పోసాని కృష్ణమురళి తదితరులు
  సంగీతం: దేవిశ్రీప్రసాద్‌ పోరాటాలు: పీటర్‌ హెయిన్స్‌,
  ఛాయాగ్రహణం: రసూల్‌ ఎల్లోర్‌
  కథ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం: శ్రీనివాస రెడ్డి
  సమర్పణ: కృష్ణచైతన్య
  నిర్మాత: 'స్రవంతి' రవికిశోర్
  విడుదల తేదీ:02, అక్టోబర్ 2015.

  ఫైనల్ గా...మీరు సినిమా గజనీ అయ్యి చూసిన సినిమాలు మర్చిపోగలిగితే ఈ సినిమా కొత్తగా అనిపించి కొంతలో కొంత ఎంజాయ్ చేయగలిగారు.లేకపోతే కష్టమే.

  English summary
  Ram`s `Shivam` released today with divide talk. Debutant Srinivas Reddy directed this flick and Ram’s uncle, ‘Sravanthi’ Ravi Kishore, produce the film under ‘Sravanthi Movies’ banner.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X