twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Ramarao on Duty Review మళ్లీ నిరాశపరిచిన రవితేజ్.. మాస్ ఎలిమెంట్స్ లేకుండానే డ్యూటీ!

    |

    Rating:
    2.0/5

    క్రాక్ హిట్టు.. ఖిలాడీ డిజాస్టర్ సినిమా తర్వాత రవితేజ నటించిన రామారావు ఆన్ డ్యూటీ మూవీ రావడంతో ప్రేక్షకులు, అభిమానుల్లో అంచనాలు భారీగా నెలకొన్నాయి. గత నెల రోజులుగా చేసిన సినిమా ప్రమోషన్స్ మరింత హైప్‌ను కలిగించాయి. సుధాకర్ చెరుకూరి, రవితేజ టీమ్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి శరత్ మండవ దర్శకత్వం వహించారు. ఈ సినిమా రవితేజకు ఎలాంటి ఫలితాన్ని ఇచ్చిందనే విషయాన్ని తెలుసుకోనేందుకు కథ, కథనాలు సమీక్షించుకోవాల్సిందే..

    రామారావు ఆన్ డ్యూటీ కథ

    రామారావు ఆన్ డ్యూటీ కథ

    అన్యాయాలను ఎదురిస్తూ నీతి, నిజాయితీతో విధులు నిర్వహించే రామారావు శ్రీకాకుళం జిల్లాలో (రవితేజ) డిప్యూటీ కలెక్టర్ (ఎంఆర్వో)గా పనిచేస్తుంటాడు. అయితే తన మాజీ ప్రేయసి మాలిని (రజీషా విజయన్)ను కలుసుకొన్న సమయంలో తన భర్త తప్పిపోయినట్టు తెలుసుకొంటాడు. అలా తప్పిపోయిన తన మాజీ ప్రేయసి భర్త గురించి ఆరా తీస్తున్న సమయంలో ఎర్రచందనం స్మగ్లింగ్‌కు సంబంధించిన వ్యవహారంలో 20కిపైగా మంది కనిపించకుండా పోయారనే విషయం రామారావుకు తెలుస్తుంది. ఆ క్రమంలో రామారావు ఎర్రచందనం స్మగ్లింగ్‌పై దృష్టిపెడుతాడు.

    ట్విస్టులు ఎలా ఉన్నాయంటే..

    ట్విస్టులు ఎలా ఉన్నాయంటే..

    ఎర్రచందనం స్మగ్లింగ్‌ వ్యవహారంలో హత్యలు ఎందుకు జరిగాయి? మిస్సింగ్ కేసుల వ్యవహారంలో రామారావు ఎలాంటి దర్యాప్తు చేపట్టారు? రామారావు ఇన్వెస్టిగేషన్‌లో భార్య నందిని (దివ్యాంశ కౌశిక్), తండ్రి (నాజర్), సోదరుడు (రాహుల్ రవీంద్రన్) పాత్రలు ఏమిటి? సీఐ జమ్మి మురళి (వేణు తొట్టెంపూడి) రామారావుకు సహకరించాడా? ఎస్పీ దేవానంద్ (సర్పెట్టా జాన్ విజయ్) ఎలాంటి ఎత్తులు పన్నాడు. తన దర్యాప్తులో ఎలాంటి సంచలన విషయాలు రామారావుకు ఎదురుపడ్డాయి అనే ప్రశ్నలకు సమాధానమే రామారావు ఆన్ డ్యూటీ సినిమా కథ.

    ఆరంభం ఆసక్తికరంగానే..

    ఆరంభం ఆసక్తికరంగానే..

    కూలీ (సమ్మెట గాంధీ)పై సినిమాను ఓపెన్ చేసి ఆసక్తికరమైన సన్నివేశం కారణంగా రామారావు ఆన్ డ్యూటీపై ఆసక్తి కలుగుతుంది. ఆ ఆ తర్వాత రైతుల ధర్నా ఎపిసోడ్ మరింత ఆసక్తికరంగా మారుతుంది. ఎప్పుడైతే మాలిని కలిసిన తర్వాత కథను ఎర్రచందనం బ్యాక్ డ్రాప్‌లోకి తీసుకెళ్లడంతో కథ, కథనాలు పేలవంగా మారాయనిపిస్తుంది. కథలో బలమైన సన్నివేశాలు లేకపోవడంతో పాటలు, ఫైట్స్‌ను పేర్చుకొంటూ తొలి భాగం మమా అనిపించారనిపిస్తుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ కూడా ఆసక్తికరంగా లేకపోవడంతో సెకండాఫ్‌ ఎలా ఉంటుందనే విషయం కూడా బోపడుతుంది.

    సెకండాఫ్‌ ఊహించని విధంగా

    సెకండాఫ్‌ ఊహించని విధంగా

    ఇక ఊహించనట్టే సెకండాఫ్ టేకాఫ్ కూడా సాదాసీగా సాగుతుంది. రవితేజ ఎనర్జీకి తగినట్టుగా సీఐ మురళీ క్యారెక్టర్ పేలవంగా ఉండటం, ఆ పాత్రకు సరిగా డబ్బింగ్ కుదరకపోవడంతో కథపై పట్టు బిగిసినట్టు కనిపించదు. అయితే హత్యల వెనుక ట్విస్టులను చివరి దాకా సాగదీయడంతో ఓ దశలో సహనానికి పరీక్ష పెట్టినట్టు ఉంటుంది. రామారావు డ్యూటీ ఎఫెక్టివ్‌గా లేకపోవడం వల్ల ఈ సినిమా అత్యంత సాదాసీదాగా ముగుస్తుంది.

    శరత్ మండవ డైరెక్షన్

    శరత్ మండవ డైరెక్షన్

    దర్శకుడు శరత్ మండవ రాసుకొన్న పాయింట్‌ ప్రాధాన్యం ఉన్నప్పటికీ.. ఆ పాయింట్ చుట్టు కథను, కథానాన్ని పాత్రల డిజైన్ సరిగా లేకపోవడం వల్ల టోటల్‌గా సబ్జెక్ట్‌ను సరిగా డీల్ చేయలేకపోయాడు. వేణు సొంత వాయిస్ కారణంగా ఆ పాత్ర ఎలివేట్ కాలేకపోయింది. స్క్రీన్ ప్లే‌తో సన్నివేశాలు చాలా పేలవంగా ఉన్నాయి. శరత్ మండవలో డైరెక్షన్‌లో పూర్తి తడబాటు కనిపించింది.

    రవితేజ, హీరోయిన్ల గురించి

    రవితేజ, హీరోయిన్ల గురించి

    రవితేజ విషయానికి వస్తే.. తన బాడీలాంగ్వేజ్, ఎనర్జీకి భిన్నంగా ఎంచుకొన్న కథ ఇది. మాస్ ఎలిమెంట్స్ లేకుండా చాలా నీరసమైన, తన యాటిట్యూడ్‌కు వ్యతిరేకంగా చేసిన ప్రయత్నం బెడిసి కొట్టిందనే చెప్పవచ్చు. మాస్ మహరాజా అంటే ప్రేక్షకుల్లో ఓ అంచనా ఉంటుంది. ప్రేక్షకుల అంచనాలకు తగినట్టుగా సినిమాను చేయడంలో రవితేజ ఘోరంగా విఫలమయ్యాడు. ఇక హీరోయిన్లు దివ్యాంశ, రజీషా విజయన్‌ పెర్ఫార్మెన్స్‌కు స్కోప్ లేని పాత్రల్లో కనిపించారు. గ్లామర్ పరంగా ఆకట్టుకొలేకపోయారు. సీసా పాటలో కాస్తో కూస్తో జైన్ ఆకట్టుకొనే ప్రయత్నం చేసింది. వేణు రోల్, జాన్ విజయ్ పాత్రలు పూర్తిగా నిరాశపరిచాయి.

    టెక్నికల్‌గా ఎలా ఉందంటే?

    టెక్నికల్‌గా ఎలా ఉందంటే?

    సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫి బాగుంది. శామ్ సీఎస్ రికార్డింగ్ బాగుండటం వల్ల అంతో ఇంతో సినిమాతో ప్రేక్షకుడు కనెక్ట్ కావడానికి ఛాన్స్ దొరికింది. శామ్ అందించిన పాటలు డిజాస్టర్. తెర మీదను, ఆడియోపరంగా ఆకట్టుకోలేకపోయాయి. కథ, కథనాలు, సన్నివేశాల్లో బలం లేకపోవడం వల్ల ప్రవీణ్ కేఎల్ కూడా ఏం చేయలేకపోయాడు. కాకపోతే శ్రీ లక్షమీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి అనుసరించిన నిర్మాణ విలువలు బాగున్నాయి. ఈ సినిమాకు రవితేజ కూడా కో ప్రొడ్యూసర్‌గా మారడం గమనించాల్సిన విషయం.

    బలం, బలహీనతలు

    బలం, బలహీనతలు

    పాజిటివ్ పాయింట్స్
    గొప్పగా చెప్పుకోవాల్సిన పాయింట్స్ ఏమీ లేవు

    మైనస్ పాయింట్స్
    కథ, కథనాలు
    పేలవమైన సన్నివేశాలు
    డైరెక్షన్
    పాటలు
    డైలాగ్స్, ఇంకా చాలా ఉన్నాయి

    RoD ఫైనల్‌గా ఎలా ఉందంటే?

    RoD ఫైనల్‌గా ఎలా ఉందంటే?

    ఎర్ర చందనం బ్యాక్ డ్రాప్‌గా వ్యక్తుల మిస్సింగ్ ఎలిమెంట్స్ నేపథ్యంతో తెరకెక్కిన చిత్రం రామారావు ఆన్ డ్యూటీ. రవితేజ క్రేజ్‌కు, ఫాలోయింగ్‌కు భిన్నంగా చేసిన చిత్రంగా కనిపిస్తుంది. అపరిపక్వతతో కూడిన కథ, కథనాలు, శరత్ మండవ దర్శకత్వ లోపాలు సినిమాకు మైనస్‌‌గా మారాయి. రవితేజ కెరీర్‌లో ఊహించని ఫలితం ఈ సినిమాకు ఎదురైన పరిస్థితి. ఈ సినిమాలో ఉపశమనం ఏమిటంటే.. నరేష్, పవిత్రా లోకేష్ ఒకే సీన్‌లో కన్పించినప్పుడల్లా కేకలు పెట్టడం థియేటర్లలో కొంత కామెడీగా అనిపిస్తుంది. ఏదైనా మ్యాజిక్ జరిగితే తప్ప.. బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ ఫలితాలు రాబట్టడానికి ఛాన్స్ ఉంది. కొద్ది రోజులు ఆగితే ఈ సినిమా పరిస్థితి ఏమిటో స్పష్టమవుతుంది. అయితే ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందనే సంకేతాలను వదలడంతో.. రెండో భాగమైనా సరిగా తీస్తారా అనే కామెంట్స్ థియేటర్లలో వినిపించాయి.

    నటీనటులు, సాంకేతిక నిపుణులు

    నటీనటులు, సాంకేతిక నిపుణులు


    నటీనటులు: రవితేజ, దివ్యాంశ కౌశిక్, రజీషా విజయన్, వేణు తొట్టెంపుడి, నాజర్, నరేష్, పవిత్రా లోకేష్, జాన్ విజయ్, తనికెళ్ల భరణి, రాహుల్ రామకృష్ణ తదితరులు
    రచన, దర్శకత్వం: శరత్ మండవ
    నిర్మాత: సుధాకర్ చెరుకూరి, రవితేజ టీమ్ వర్క్స్
    సినిమాటోగ్రఫి: సత్యన్ సూర్యన్
    మ్యూజిక్: శామ్ సీఎస్
    ఎడిటింగ్: ప్రవీణ్ కేఎల్
    రిలీజ్ డేట్: 2022-07-29

    English summary
    Ravi Teja's Ramarao on Duty hits the theatres on July 29th. Here is the exclusive review from Telugu filmibeat.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X