Don't Miss!
- News
Wife: కాన్ఫు కోసం వెళ్లిన మహిళ, 50 రోజుల బిడ్డను చంపేసి తల్లి ఆత్మహత్య, విలన్ ఎవరంటే !
- Sports
IND vs NZ: మైదానంలో దూసుకొచ్చిన పిల్లాడు.. సెక్యూరిటీని హెచ్చరించిన రోహిత్!
- Lifestyle
చలికాలంలో బరువు పెరగడానికి అసలు కారణం ఇదే... దీనికి దూరంగా ఉండాలి!
- Finance
Wipro Layoffs: ఫ్రెషర్ ఉద్యోగులకు షాక్ ఇచ్చిన విప్రో.. 452 మంది తొలగింపు..
- Automobiles
దేశీయ మార్కెట్లో రూ. 6 కోట్ల ఖరీదైన కారుని విడుదల చేసిన Bentley - వివరాలు
- Technology
Jio నుంచి రెండు కొత్త రీచార్జి ప్లాన్లు! ప్లాన్ల వివరాలు చూడండి!
- Travel
భాగ్యనగరంలో ప్రశాంతతకు చిరునామా.. మక్కా మసీదు!
Ranasthali review ఆకట్టుకొనే మర్డరీ మిస్టరీ.. ఆర్టిస్టుల పెర్ఫార్మెన్స్ ఎలా ఉందంటే?
నటీనటులు: ధర్మ, అమ్ము అభిరామి, చాందిని రావు, ప్రశాంత్, శివ జామి, అశోక్ సంగా, నాగేంద్ర , విజయ్ రాగం తదితరులు
నిర్మాత: అనుపమ సురెడ్డి
దర్శకత్వం: పరశురామ్ శ్రీనివాస్
ఫైట్స్: డ్రాగన్ ప్రకాశ్
సినిమాటోగ్రఫి: జాస్తి బాలాజీ
సంగీతం: కేశవ్ కిరణ్
సాహిత్యం: పరుశురాం శ్రీనివాస్
సమర్పణ: సురెడ్డి విష్ణు
బ్యానర్: ఏజే ప్రొడక్షన్
రిలీజ్ డేట్: 2022-11-26
చిన్నతనంలోనే తల్లిదండ్రులు కోల్పోయిన అమ్ములు (చాందినీ రావు)కు బావ బసవ (ధర్మ) కుటుంబంతోనే పెరుగుతుంది. బావ అంటే చెప్పలేనంత ఇష్టం ఉండటంతో బసవ తండ్రి (సమ్మెట గాంధీ) వాళ్లిద్దరికి వివాహం చేస్తాడు. కుటుంబం అప్పుల్లో కూరుకుపోవడంతో గ్రామ పెద్ద చక్రవర్తి (బెనర్జీ) వద్ద పనికి చేరుతాడు. అక్కడ పనిచేస్తున్న సమయంలోనే అనూహ్యంగా అమ్ములు, చక్రవర్తి దారుణంగా హత్యకు గురవుతారు.
తాను ప్రాణానికి ప్రాణంగా భావించిన అమ్ములును హత్యకు కారణం ఎవరు? అమ్మలు, తన యజమానిని ఎవరు చంపారు? తన భార్యను కోల్పోయిన బసవకు ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి? భార్య హత్యకు కారణమైన హంతకులపై బసవ ప్రతీకారం తీర్చుకొన్నాడా? ఇంతకు చక్రవర్తి ఎవరు? అమ్ములు, చక్రవర్తి హత్యకు ఎవరు కుట్రపన్నారు? అనే ప్రశ్నలకు సమాధానమే రణస్థలి చిత్ర కథ.

దర్శకుడు పరుశురామ్ శ్రీనివాస్ ఎంచుకొన్న స్టోరి పాయింట్, దానిని కథగా విస్తరించిన విధానం బాగుంది. మర్డర్ మిస్టరీ డ్రామాను ఆసక్తికరమైన కథనంతో నడపడంలోను, అలాగే కొత్త నటీనటులతో కథను ఆసక్తికరంగా తెరమీద చెప్పడంలోను సక్సెస్ అయ్యారని చెప్పవచ్చు. పరిమిత బడ్జెట్‌తో క్వాలిటీగా ప్రేక్షకులకు మంచి అనుభూతిని పంచే ప్రయత్నం చేశారు. అయితే ఈ సినిమా పేరున్న నటీనటులతో రూపొందించి ఉంటే.. ఇంకా మంచి చిత్రమయ్యేది.. రీచ్ ఎక్కువగా ఉండేదనిపిస్తుంది. ఫస్టాఫ్‌లో అక్కడక్కడ సాగదీసినట్టు అనిపిస్తుంది. దర్శకుడిగా కథను నడిపించే తీరులో కాస్త తడబాటు కనిపించినా.. కథనం, పాత్రలను బలంగా రాసుకోవడంతో ఆ లోపాలను అధిగమించాడని చెప్పవచ్చు.
ఇక నటీనటుల పనితీరు విషయానికి వస్తే.. బసవ పాత్రలో ధర్మ, అమ్ములు పాత్రలో చాందినీ రావు ఒదిగిపోయారు. కొత్తవారైనా మంచి ఫెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకొన్నారు. అమ్ము అభిరామి కీలక పాత్రలో ప్రేక్షకులను సర్‌ప్రైజ్ చేస్తుంది. ఇతర పాత్రల్లో బెనర్జీ, సమ్మెట గాంధీ, విలన్ పాత్రధారి శివ, ఇతర నటీనటులు తమ పాత్రల పరిధి మేరకు నటించారు.
అలాగే సాంకేతిక నిపుణుల విషయానికి వస్తే.. రస్టిక్ ఎన్విరాన్‌మెంట్‌తో సాగే కథలోని ఎమోషన్స్‌ను సినిమాటోగ్రాఫర్ జాస్తి బాలాజీ చక్క పట్టుకొని తెరమీద మంచి అవుట్‌పుట్ చూపించాడు. లైటింగ్‌తో పలు సన్నివేశాలను నేటివిటితో హైలెట్ చేశారు. మర్డర్ మిస్టరీకి కావాల్సిన మ్యూజిక్‌ను కేశవ్ కిరణ్ చక్కగా అందించారు. బీజీఎం ఈ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్. పరుశురాం శ్రీనివాస్ సాహిత్యం కథకు బలంగా మారింది. డ్రాగన్ ప్రకాశ్ ఫైట్స్ కంపోజిషన్ బాగున్నది.

రణస్థలి కథను ఎంచుకొని.. తెరకెక్కించిన ప్రయత్నాన్ని చూస్తే నిర్మాత అనుపమ సురెడ్డికి సినిమాపై ఉన్న అభిరుచి ఏమిటో తెలుస్తుంది. కొత్తవారి ప్రతిభను నమ్మి సినిమాను తెరకెక్కించాలంటే.. గట్స్ ఉండాల్సిందే. ఎక్కడ రాజీ లేకుండా సినిమాను రిచ్‌గా మలిచారని చెప్పవచ్చు. స్టార్ హీరోలతో సినిమా తీసి ఉంటే.. బెస్ట్ మూవీ అయి ఉండేది. యాక్షన్, మర్డర్ మిస్టరీ సినిమాలను ఆదరించే వారికి ఈ సినిమా నచ్చుతుంది. మాస్, కమర్షియల్, ఫ్యామిలీ ఎమోషన్స్‌తో సాగే ఈ సినిమా మంచి థియేట్రికల్ ఎక్స్‌పీరియెన్స్ అందిస్తుంది.