»   »  బాలీవుడ్ థమ్స్ ఆప్.. రంగూన్ సెలబ్రిటీ రివ్యూ

బాలీవుడ్ థమ్స్ ఆప్.. రంగూన్ సెలబ్రిటీ రివ్యూ

Posted By:
Subscribe to Filmibeat Telugu

రంగూన్ చిత్రం విడుదలకు ముందే ట్రైలర్లు, ప్రచార చిత్రాలు సోషల్ మీడియాలో హోరెత్తించాయి. యూట్యూబ్ ఆ చిత్రానికి సంబంధించిన పాటలు ప్రేక్షకులను గిలిగింతలు పెట్టాయి. కంగన, షాహీద్ కపూర్, సైఫ్ అలీఖాన్ మధ్య మోతాదు మించిన శృంగారం మీడియాలో చర్చనీయాంశమయ్యాయి. ఈ నేపథ్యంలో రంగూన్ చిత్రం ఈ నెల 24న విడుదలకు సిద్ధమైంది. విశాల్ భరద్వాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని బాలీవుడ్ ప్రముఖుల కోసం ప్రీమియర్ షో ఏర్పాటు చేశారు.

 బాలీవుడ్ ప్రముఖులు థమ్స్ అప్

బాలీవుడ్ ప్రముఖులు థమ్స్ అప్


ముంబైలో రంగూన్ చిత్రాన్ని బాలీవుడ్ సినీ ప్రముఖుల కోసం ప్రదర్శించారు. బ్రిటీష్ కాలం నాటి కథతో రూపొందించిన చిత్రాన్ని చూసిన బాలీవుడ్ ప్రముఖులు ముక్త కంఠంతో హర్షించారు. ఈ చిత్రంపై నటుగు రణదీప్ హుడా, దర్శకుడు ఆనంద్ ఎల్ రాయ్, రచయిత ప్రసూన్ జోషి తదితరులు అభిప్రాయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశారు.

 అద్భుతమైన అనుభూతి పొందడం ఖాయం

అద్భుతమైన అనుభూతి పొందడం ఖాయం


ఈ చిత్రాన్ని చూడటం ద్వారా సాహిత్య ప్రయాణం చేశాను. మీరు ఆ కాలానికి వెళ్లిన అనుభూతిని కలిగించడంలో దర్శకుడు సఫలమయ్యాడు. రంగూన్ చిత్రం హాలీవుడ్ సినిమా స్థాయిలో ఉంది అని నటుడు రణదీప్ హుడా ట్వీట్ చేశారు.

 దర్శకుడి తపన కనిపించింది

దర్శకుడి తపన కనిపించింది


ఈ చిత్రం గురించి చెప్పాలనుకుంటే తపన అనే ఒకే పదం ద్వారా చెప్పవచ్చు. ఈ చిత్రాన్ని తీర్చిదిద్దిన తీరులో ఓ తపన కనిపిస్తుంది. పాత్రల చిత్రీకరణలో దర్శకుడి తపన కనిపిస్తుంది. విశాల్ భరద్వాజ్ ముద్ర కనిపిస్తుంది అని దర్శకుడు ఆనంద్ ఎల్ రాయ్ ట్వీట్ చేశారు.

 జూలియాగా ఆకట్టుకొన్న కంగన..

జూలియాగా ఆకట్టుకొన్న కంగన..


జూలియా పాత్రలో కంగన ఆకట్టుకొన్నది. అద్భుతమైన నటుల్లో షాహీద్ కపూర్ ఒకరు. సైఫ్ సర్ ఈ చిత్రాన్ని చూసిన తర్వాత మీ ప్రేమలో పడకుండా ఎవరూ ఉండరు అని ఆనంద్ మరో ట్వీట్ చేశారు.

 కంగన రనౌత్ నటన మరోస్థాయికి

కంగన రనౌత్ నటన మరోస్థాయికి


కంగన రనౌత్ నటన, ప్రతిభ మరో స్థాయికి చేరుకొన్నది. షాహీద్ కపూర్ మరోసారి వెండితెరపై మెరిశాడు. సైఫ్ అలీఖాన్ నటన అమోఘం. విశాల్ భరద్వాజ్ పనితీరు అద్భుతం అని రచయిత ప్రసూన్ జోషి ట్వీట్‌లో పేర్కొన్నారు.

 సైఫ్‌పై కరీనా ప్రశంస వర్షం

సైఫ్‌పై కరీనా ప్రశంస వర్షం


రంగూన్ చిత్రాన్ని బాలీవుడ్ స్టార్ కరీనా కపూర్ ఇటీవల చూసింది. తన భర్త సైఫ్ అలీఖాన్ నటనపై ప్రశంసల వర్షం కురిపించింది. ఈ చిత్రం ఈ ఏడాదిలో ఉత్తమ చిత్రంగా ఎంపికవుతుందనే ఆశాభావాన్ని ఆమె వ్యక్తం చేసింది.

 సైఫ్ పునర్జన్మ.. విశాల్ మాస్టర్ పీస్

సైఫ్ పునర్జన్మ.. విశాల్ మాస్టర్ పీస్


సైఫ్ నటుడిగా పునర్జన్మను పొందాడని, ఈ చిత్రం విశాల్ భరద్వాజ్ కెరీర్‌లో మరో మాస్టర్ పీస్ అని పలువురు ట్వీట్ చేశారు.

English summary
This Vishal Bhardwaj's film starring Kangana Ranaut, Shahid Kapoor, Saif Ali Khan gets a thumbs up from Bollywood celebs such as Randeep Hooda, Kareena Kapoor and more.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu