twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రంగులరాట్నం సినిమా రివ్యూ: ఇదోరకం ప్రేమ కథ

    రంగులరాట్నం చిత్రంతో సంక్రాంతి బరిలోకి దూకాడు. ప్రేమకథా చిత్రంగా రూపొందిన ఈ చిత్రంతో రాజ్ తరుణ్ మళ్లీ సక్సెస్ అందుకొన్నాడా? ప్రేక్షకులను మెప్పించాడా అనే విషయాన్ని తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే.

    By Rajababu
    |

    Rating:
    2.0/5

    Recommended Video

    రంగులరాట్నం మూవీ రివ్యూ..!

    టాలీవుడ్‌లోని యువ హీరోల్లో ఎక్కువ సక్సెస్ రేట్ ఉన్న హీరో రాజ్ తరుణ్. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌లో ఉయ్యాల జంపాల చిత్రంతో హీరోగా మారిన రాజ్ తరుణ్ వరుస విజయాలను అందుకొన్నాడు. సినిమా చూపిస్త మావ, కుమార్ 21ఎఫ్, కిట్టు ఉన్నాడు జాగ్రత్త, అంధగాడు చిత్రాలు సక్సెస్ సాధించడంతో నిర్మాతలకు నమ్మకం ఉన్న హీరో‌గా రాజ్ తరుణ్ మారాడు. ఈ నేపథ్యంలో తాజాగా రంగులరాట్నం చిత్రంతో సంక్రాంతి బరిలోకి దూకాడు. ప్రేమకథా చిత్రంగా రూపొందిన ఈ చిత్రంతో రాజ్ తరుణ్ మళ్లీ సక్సెస్ అందుకొన్నాడా? ప్రేక్షకులను మెప్పించాడా అనే విషయాన్ని తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే.

    రంగులరాట్నం కథ

    రంగులరాట్నం కథ

    విష్ణు (రాజ్ తరుణ్) ఓ కంపెనీని స్వయంగా నడుపుతుంటాడు. ఆయనకు తల్లి (సితార), స్నేహితుడు (ప్రియదర్శి) తప్ప మరొక బంధువు అంటూ ఉండరు. విష్ణుకు త్వరగా పెళ్లి చేసి ఓ ఇంటివాడిని చేయాలని తల్లి ప్రయత్నిస్తుంటారు. కానీ ఈ మధ్యలో కీర్తి (చిత్ర శుక్లా) అనే అమ్మాయిని విష్ణు తొలి చూపులోనే ప్రేమలో పడుతాడు. ఆ తర్వాత అనుకోకుండా తల్లి కన్నుమూస్తుంది?

    క్లైమాక్స్ దారి ఇలా

    క్లైమాక్స్ దారి ఇలా

    తల్లి మరణంతో ఒంటరి వాడైన విష్ణు.. కీర్తి ప్రేమను, తోడును కోరుకొంటాడు. కానీ ప్రేమ, పెళ్లి మధ్య ఊగిసలాడే మనస్తత్వం ఉన్న కీర్తీ కొంత సమయాన్ని అడుగుతుంది? కీర్తి పెళ్లికి కొంత సమయాన్ని అడుగడానికి కారణం ఏమిటి? కీర్తి ప్రేమను గెలుచుకొన్నాడా? చివరికి ఏ విధంగా పెళ్లి చేసుకొన్నాడు అనే ప్రశ్నలకు సమాధానమే రంగుల రాట్నం కథ.

    ఫస్టాఫ్‌లో కథ

    ఫస్టాఫ్‌లో కథ

    రాజ్ తరుణ్, సితార మధ్య ప్రేమ ఆప్యాయతలను ఎస్టాబ్లిష్ చేయడమనే అంశంతో సినిమా మొదలవుతుంది. ఆ పాయింట్‌నే పట్టుకొని నిస్తేజంగా ఉండే సన్నివేశాలతో ఓ గంటపాటు సాగదీసింది దర్శకురాలు శ్రీరంజని. చివరకు చిత్రశుక్లాతో ప్రేమ ఎపిసోడ్స్‌ పట్టాలక్కించడానికి చాలానే సమయం తీసుకొన్నారు. చివరికి తొలి భాగంలోనైనా రొమాంటిక్ సన్నివేశాలను బలంగా రాసుకొన్నారా అంటే అదీ కనిపించదు. ఇంటర్వెల్ బ్యాంగ్ కోసం సితారను చంపేసి కథను కొంత క్లిష్టంగా మార్చింది.

    రెండోభాగంలో కథ

    రెండోభాగంలో కథ

    రెండో భాగంలో చిత్రశుక్లా అపరిపక్వత ఉండే క్యారెక్టర్‌తో మరింత సాగదీసింది. సినిమాలో ఎమోషన్స్, ఫీల్‌గుడ్ డైలాగ్స్, సన్నివేశాలు లేకుండా ఓ టెలివిజన్ సీరియల్ చూస్తున్నామా? అనే ఫీలింగ్‌ కలిగి విధంగా దర్శకురాలు ప్రేక్షకుడిని అసహనానికి గురిచేసే విధంగా క్లైమాక్స్ తీసుకెళ్లింది. క్లైమాక్స్ అనవసరపు హడావిడితో కంగారు పడి చివరకు ఓ మాత్రం బలంగా లేని సన్నివేశాలతో ముగింపు కార్డు ప్రేక్షకుడి ముఖాన పడేసింది.

    దర్శకురాలు ప్రతిభ

    దర్శకురాలు ప్రతిభ


    ఇప్పుడొస్తున్న ఫీల్‌గుడ్ ప్రేమకథా చిత్రాలతో పోల్చుకొంటే ఎలాంటి భావోద్వేగం లేని కథతో దర్శకురాలు శ్రీరంజని ఓ పెద్ద సాహసమే చేసింది అని చెప్పవచ్చు. రొటీన్ కథ, కథనాలు ప్రేక్షకుడి అభిరుచికి దూరంగా ఉన్నాయని చెప్పవచ్చు. తల్లి, కొడుకుల మధ్య ప్రేమ, ప్రియురాలితో ఓ లవర్‌తో పడే మానసిక సంఘర్షణ ఎక్కడా కనిపించదు. ఓవరాల్‌గా అన్నపూర్ణ బ్యానర్ నుంచి ఏ ప్రేక్షకుడు కూడా ఊహించిన కథను వండివార్చింది.

    రాజ్ తరుణ్ యాక్టింగ్

    రాజ్ తరుణ్ యాక్టింగ్


    యువ నటుల్లో రాజ్ తరుణ్ హిట్ల మీద హిట్లు కొడుతూ దూసుకెళ్తున్నాడు. వరుస విజయాలను సొంతం చేసుకొంటున్న రాజ్ తరుణ్ గతేడాది అంధగాడు చిత్రంతో మంచి విజయాన్ని అందుకొన్నాడు. ఈ సారి అన్నపూర్ణ బ్యానర్‌లో రంగుల రాట్నంతో వస్తున్నాడనగానే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెరిగాయి. మరీ సంక్రాంతి రేసులో దూకే సరికి మరింత ఆసక్తి పెరిగింది. కానీ రాజ్ తరుణ్ తన బాడీ లాంగ్వేజికి ఏ మాత్రం సరిపడని క్యారెక్టర్ కనిపించాడు. తన ప్రతిభతో ప్రేక్షకుడిని ఆకట్టుకోవడానికి అవకాశమే లభించలేదు. కీలకమైన కొన్ని సన్నివేశాలలో సెంటిమెంట్‌ను పండించాడు.

    చిత్ర శుక్లా యాక్టింగ్

    చిత్ర శుక్లా యాక్టింగ్

    కథా నాయికలు ఆటపాటలకు పరిమితమవుతున్నారనే సమయంలో రంగులరాట్నంలో చిత్రశుక్లాకు మంచి పాత్రే లభించింది. కానీ పాత్రలో ఇంటెన్సీ లేకపోవడంతో, బలమైన సన్నివేశాలు లేకపోవడం ఆ పాత్రలో ఎలివేట్ కాలేకపోయింది. దానికి తోడు ఆమె నటనపరంగా ఇంకా బాగా కృషి చేయాల్సిన అవసరం కనిపించింది. భావోద్వేగ సన్నివేశాలలో తడబడినట్టు కనిపించింది.

    తల్లిగా సితార

    తల్లిగా సితార

    రాజ్ తరుణ్‌కు తల్లిగా హీరోయిన్ సితార కనిపించింది. తన పాత్ర పరిధి మేరకు పర్వాలేదు అనిపించింది. కథ, కథనంలో విషయం లేకపోవడంతో ఆమె విభిన్నంగా నటించడానికి స్కోప్ లేకపోయింది. ఏదో ఆశించి వచ్చే ప్రేక్షకుడికి ఇది కొంత నిరాశే.

    రొటీన్ పాత్రలో ప్రియదర్శి

    రొటీన్ పాత్రలో ప్రియదర్శి

    ప్రియదర్శి మరోసారి రొటీన్ పాత్రకే పరిమితమయ్యాడు. జీవితం అంటే మద్యం సేవించడం తప్ప మరోకటి ఉండాదా అనే విధంగా ప్రియదర్శి పాత్రను మలచడం చాలా దారుణమనిపిస్తుంది. ప్రియదర్శి భావోద్వేగాలు పండించే సత్తా ఉన్న క్యారెక్టర్ ఆర్టిస్టు. ఆయన ప్రతిభను సరిగా ఉపయోగించుకోకపోవడం దర్శకురాలిగా శ్రీరంజనీ విఫలమైందనే చెప్పవచ్చు.

    సంగీతం అంతంతే

    సంగీతం అంతంతే

    రంగులరాట్నం చిత్రానికి శ్రీచరణ్ పాకాల సంగీతాన్ని సమకూర్చాడు. అయితే పాటలు తెరమీద గానీ, ఆడియో పరంగానీ ఆకట్టుకొనే విధంగా లేకపోవడం ప్రధాన లోపం. రీరికార్డింగ్ కూడా చాలా నాసిరకంగా ఉంది. పాటల ప్లేస్‌మెంట్ బాగాలేదు. పాటలు అసందర్భోచితంగా వస్తుంటాయి. వాటికవే పోతుంటాయి.

    మిగితా విభాగాల పనితీరు

    మిగితా విభాగాల పనితీరు

    మిగితా సాంకేతిక విభాగాల పనితీరు పరిశీలిస్తే కొంత కెమెరా వర్క్ బాగా ఉన్నదనిపిస్తుంది. ప్రేమకథను ఎలివేట్ చేసే సన్నివేశాల చిత్రీకరణ, మాటలు లేకపోవడం కొంత నిరాశపరిచే విషయం.

    ప్రొడక్షన్ వ్యాల్యూస్

    ప్రొడక్షన్ వ్యాల్యూస్

    ఎన్నో బ్లాక్‌బస్టర్ చిత్రాలను, ఫ్యామిలీ ఆడియెన్స్‌ను ఆకట్టుకొనే సినిమాలు ప్రఖ్యాత అన్నపూర్ణ బ్యానర్ నుంచి వచ్చాయి. కొన్ని చిత్రాలు చరిత్రలో నిలిచిపోయాయి. అంత పేరున్న నిర్మాణ సంస్థ నుంచి సినిమా వస్తుందంటే ప్రేక్షకులకు ఆసక్తి పెరుగుతుంది. కానీ రంగులరాట్నంలో మాత్రం అన్నపూర్ణ బ్యానర్ నిర్మాణ ప్రమాణాలు ఎక్కడా కనిపించలేదనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.

    ఫైనల్‌గా

    ఫైనల్‌గా

    టాలీవుడ్‌లో నాగార్జున అంటే మంచి అభిరుచి ఉన్న నటుడే కాదు.. నిర్మాత కూడా అనే పేరున్నది. ఆయన తీసిన సినిమాలు కూడా ఆ పేరును నిలబెట్టాయి. అలాంటి ఫిల్మ్ మేకర్ నుంచి వచ్చే రంగులరాట్నంలో రాజ్ తరుణ్ జతకట్టాడు. దాంతో ఫీల్‌గుడ్ ఫిల్మ్ వస్తుందనే భావన కలగడం సహజం. సంక్రాంతి సెలవుల్లో వచ్చిన ఈ చిత్రం మల్టిప్లెక్స్ ఆడియెన్స్‌తోపాటు బీ, సీ సెంటర్ల ఆడియెన్స్ ఆదరిస్తే మంచి సక్సెస్ లభించవచ్చు.

    బలం, బలహీనతలు

    బలం, బలహీనతలు

    ప్లస్ పాయింట్స్

    రాజ్ తరుణ్
    ప్రియదర్శి

    మైనస్ పాయింట్స్
    శ్రీరంజనీ డైరెక్షన్
    కథ, కథనం
    కామెడీ ట్రాక్
    సంగీతం, పాటలు

    తెర వెనుక, తెర ముందు

    తెర వెనుక, తెర ముందు

    నటీనటులు: రాజ్ తరుణ్, చిత్ర శుక్లా, సితార, ప్రియదర్శి తదితరులు
    కథ, దర్శకత్వం: శ్రీరంజని
    నిర్మాత: అక్కినేని నాగార్జున
    మ్యూజిక్: శ్రీచరణ్ పాకాల
    రిలీజ్ డేట్: జనవరి 14, 2018

    English summary
    Rangula Ratnam Movie starring Raj Tarun, Chitra Shukla. Written & Directed by Shreeranjani, Music Composed By Sricharan Pakala, Produced by Akkineni Nagarjuna under Annapurna Studios.This movie set to release on 14 January 2018. In this occassion Telugu Filmibeat brings exclusive review..
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X