twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రథం మూవీ రివ్యూ అండ్ రేటింగ్

    |

    Recommended Video

    Ratham Movie review రథం సినిమా రివ్యూ

    Rating:
    2.5/5

    కంటెంట్ బాగుంటే చిన్న చిత్రమా? భారీ బడ్జెట్ సినిమానా అనే తేడా లేకుండా ప్రేక్షకులు ఆదరిస్తారనే విషయాన్ని పెళ్లిచూపులు, అర్జున్ రెడ్డి, RX 100 చిత్రాలు నిరూపించాయి. ఇటీవల విభిన్నమైన కథతో వచ్చిన చిత్రాలు చిన్న నిర్మాతల ఆశలకు ఊపిరిపోసాయి. అలాంటి విభిన్నమైన కథతో వచ్చిన తాజా చిత్రం రథం. రాజా దారపునేని ఈ చిత్రాన్ని గీతానంద్, చాందినీ భగ్వనాని జంటగా చంద్రశేఖర్ కానూరి దర్శకత్వంలో రూపొందించారు. రిలీజ్‌కు ముందే ఈ సినిమా టీజర్లు, ట్రైలర్లు ప్రేక్షకులను ఆసక్తిని రేపాయి. విడుదల తర్వాత ఈ చిత్రం ఎలాంటి స్పందనను కూడగట్టుకుందో తెలుసుకోవాలంటే ఈ సినిమాను సమీక్షించాల్సిందే.

     రథం మూవీ కథ

    రథం మూవీ కథ

    కార్తీక్ (గీతానంద్) వ్యవసాయం చేస్తూ రైతులకు అండగా నిలిచే ఓ ఆధునిక భావాలు ఉన్న యువకుడు. అన్యాయాన్ని, అక్రమాలను సహించడు. వడ్డీ వ్యాపారంతో ఊరి ప్రజలను పీల్చుకుతినే కాల్‌మనీ కీచకులకు, దందాకు ఎదురొడ్డి నిలుస్తాడు. ఇలాంటి పరిస్థితుల నడుమ ఓ ఫ్యాక్షన్ నేత అబ్బులు కూతురు బుజ్జి (చాందినీ భగ్వనాని) అనే అమ్మాయి ప్రేమలో పడుతాడు. ఓ కేసులో చాలా ఏళ్లు జైలు జీవితాన్ని అనుభవించి రిలీజైన అబ్బులు తన కూతురు ప్రేమను అంగీకరించడు. చివరికి గీతానంద్ మంచి తనాన్ని చూసి ఒప్పుకొంటాడు. కానీ ఓ కారణంగా కార్తీక్‌కు ప్రేమను తిరస్కరించి బుజ్జి అతడికి దూరంగా వెళ్లిపోతుంది.

    రథం మూవీలో ట్విస్టులు

    రథం మూవీలో ట్విస్టులు

    ఆవేశపరుడైన కార్తీక్ రైతులకు ఎలాంటి మేలు చేశాడు? కాల్ మనీ కీచకుల భరతం ఎలా పట్టాడు? తన ప్రేమను కాపాడుకోవడానికి బుజ్జి తల్లిదండ్రులను ఎలా మెప్పించాడు. తల్లిదండ్రులు ఒప్పుకొన్నప్పటికీ కార్తీక్‌ను బుజ్జి ఎందుకు దూరం పెట్టింది? ప్రేయసి దూరమైన కార్తీక్ పరిస్థితి ఏమిటి అనే ప్రశ్నలకు సమాధానమే రథం సినిమా.

    ఫస్టాఫ్ అనాలిసిస్

    ఫస్టాఫ్ అనాలిసిస్

    ఆదర్శ రైతు కార్తీక్ పాయింట్ ఆఫ్‌ వ్యూలో రథం సినిమా ప్రారంభవుతుంది. కార్తీక్, బుజ్జి ప్రేమ కథతో ముందుకు సాగుతుంది. ఆ తర్వాత కాల్ మనీ ముఠా సాగించే దౌర్జన్యాలను కార్తీక్ ఎదుర్కోవడమనే అంశం కథలో కొత్తగా అనిపిస్తుంది. ఇంటర్వెల్ బ్యాంగ్‌కు ముందు వచ్చే ఎపిసోడ్ సినిమాకు హైలెట్‌గా నిలుస్తుంది. ఇంటర్వెల్‌కు ముందు వచ్చే యాక్షన్ సీన్లు రొటీన్‌కు భిన్నంగా ఉంటాయి.

    సెకండాఫ్ అనాలిసిస్

    సెకండాఫ్ అనాలిసిస్

    ఇక ఇంటర్వెల్ తర్వాత హీరోయిన్ బుజ్జి తండ్రి అబ్బులు జైలు నుంచి విడుదల కావడంతో సినిమా కొత్త మలుపు తిరుగుతుంది. కాల్‌మనీ నడిపే వ్యక్తిని చంపిన కార్తీక్‌పై ఆ కుటుంబం పగ పెంచుకోవడం ఓ వైపు, అబ్బులు జీవితం మరోవైపు సెంటిమెంట్‌ను పండిస్తూ రొటీన్‌గా సాగుతాయి. సెకండాఫ్‌లో రకరకాల అంశాలు రావడంతో కథావేగానికి కళ్లెం పడుతుంది. చివర్లలో కార్తీక్, బుజ్జి విడిపోవడం, ఆ తర్వాత వారు ఎలా కలిశారనే ఫీల్‌గుడ్ అంశంతో కథ ముగుస్తుంది.

    దర్శకుడు చంద్రశేఖర్ కానూరి ఎంచుకొన్న కథ బాగానే ఉన్నప్పటికీ, రకరకాల కోణాల్లో కథ నడిపించడం గజిబిజిగా మారింది. ప్రేమ కథకు, ఓ అంశాన్ని జోడించి సరైన పంథాలో నడిపించి ఉంటే ప్రేక్షకుడిని ఆకట్టుకొవడానికి అవకాశం లభించేది. కాల్ మనీ, అబ్బులు లైఫ్, వైజాగ్‌లో సహజీవనం లాంటి అంశాలు అసలు కథను ట్రాక్ తప్పించాయి. కానీ కొన్ని సన్నివేశాలను రాసుకొన్న విధానం, తెరకెక్కించిన తీరును అభినందించాల్సిందే.

     హీరో గీతానంద్ ప్రతిభ

    హీరో గీతానంద్ ప్రతిభ

    గీతానంద్ తన ప్రతిభకు, సామర్థ్యానికి మించిన పాత్రనే భుజాన వేసుకొన్నాడు. కాకపోతే ఓ మాస్, ఎస్టాబ్లిష్ అయిన హీరో చేయాల్సిన రోల్‌లో గీతానంద్ ఒదిగిపోయాడు. కొన్ని కీలక సన్నివేశాల్లో అతడి బాడీ లాంగ్వేజ్ సూట్ కాలేదు. తొలి చిత్రంలోనే చాలా వేరియేషన్స్ ఉన్న పాత్రకు తన వంతు న్యాయం చేశాడు. నటనపరంగా, లుక్ పరంగా ఇంకా మెరుగులు దిద్దుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

     హీరోయిన్‌గా చాందినీ

    హీరోయిన్‌గా చాందినీ

    బుజ్జి పాత్రలో చాందినీ గ్లామర్‌గా కనిపించింది. తండ్రి, ప్రియుడితో ఉండే భావోద్వేగమైన సన్నివేశాల్లో చాందిని మెప్పించింది. టిపికల్ హీరోయిన్‌‌కు కావాల్సిన బాడీ కంటే కాస్త ఎక్కువగా ముద్దుగా, బొద్దుగా కనిపించింది. నటన, బాడీ ఫిటినెస్ విషయంలో ఇంకా శ్రద్ధపెట్టాల్సిందే.

    సునీల్ సినిమాటోగ్రఫి

    సునీల్ సినిమాటోగ్రఫి

    రథం సినిమాలోని హైలెట్లలో సునీల్ అందించిన సినిమాటోగ్రఫి. ఇంటర్వెల్ ఎపిసోడ్, చివర్లో వైజాగ్ సీన్లు సునీల్ ప్రతిభకు అద్దం పట్టాయి. పాటల చిత్రీకరణ బాగుంది. ప్రతీ సీన్‌లో క్వాలిటీ కనిపించింది.

    మ్యూజిక్, ఎడిటింగ్ గురించి

    మ్యూజిక్, ఎడిటింగ్ గురించి

    ఇక సుకుమార్ అందించిన మ్యూజిక్ బాగుంది. పడి పో, ఎదో ఎదేదో అనే పాటలు చాలా బాగున్నాయి. ఆడియో పరంగా ఎంత ఆకట్టుకొన్నాయో, తెర మీద కూడా అంత అందంగా కనిపించాయి. ఇక బీ నాగేశ్వర్ రెడ్డి అందించిన ఎడిటింగ్ ఈ సినిమాకు మరో అసెట్. తొలిభాగంలో నాగేశ్వర్ రెడ్డి ఎడిటింగ్ చాలా షార్ప్‌గా క్రిస్పీగా ఉంది. సెకండాఫ్‌లో ఆయన కత్తెరకు మరింత పదును చూపించాల్సిన ఛాన్సు కూడా మిగిలే ఉన్నట్టు కనిపించింది.

    ప్రొడక్షన్ వాల్యూస్

    ప్రొడక్షన్ వాల్యూస్

    రాజ్ గురు బ్యానర్ పై నిర్మాత రాజా దారపునేని ఈ చిత్రాన్ని నిర్మించాడు. టెక్నికల్‌గా చాలా రిచ్‌గా ఈ సినిమాను తెరకెక్కిచే ప్రయత్నం కనిపించింది. కాకపోతే నటీనటుల ఎంపిక విషయం కొంత సినిమాకు ప్రతికూలంగా మారింది. కనీసం ప్రేక్షకుడికి తెలిసిన నటీనటులను ఎంపిక చేసి ఉంటే, ప్రేక్షకుడికి సినిమా మరింత చేరువయ్యేది. ఓవరాల్‌గా రాజ్‌గురు బ్యానర్ నిర్మాణ విలువలు బాగున్నాయి.

    బలం, బలహీనతలు

    బలం, బలహీనతలు

    కాల్ మనీ ఎపిసోడ్
    సినిమాటోగ్రఫి
    పాటలు, రీరికార్డింగ్
    గీతానంద్ యాక్టింగ్

    మైనస్ పాయింట్స్
    సెకండాఫ్
    స్లో నెరేషన్
    హీరోయిన్, మిగితా నటీనటులు

    నటీనటులు: గీతానంద్, చాందినీ భగ్వనాని తదితరులు

    నటీనటులు: గీతానంద్, చాందినీ భగ్వనాని తదితరులు

    డైరెక్టర్: చంద్రశేఖర్ కానూరి
    నిర్మాత: రాజా దారపునేని
    మ్యూజిక్ డైరెక్టర్: సుకుమార్ పమ్మి
    సినిమాటోగ్రాఫర్: సునీల్
    ఎడిటర్: బీ నాగేశ్వరరెడ్డి
    బ్యానర్:
    రిలీజ్ డేట్: 26-10-2018

    English summary
    Ratham Movie directed by Chandrashekar Kanuri, who also worked on its story, Dialogues and Screenplay. The producer of this grand movie is Raja Darapuneni and it is being produced on the banners of Rajguru Films. The music is by Sukumar T. This movie released on 26-10-2018. In this occassion, Telugu filmibeat brings exclusive review.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X