»   » 'వీర' బాదుడు (రవితేజ 'వీర' రివ్యూ)

'వీర' బాదుడు (రవితేజ 'వీర' రివ్యూ)

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts  -సూర్య ప్రకాష్ జోశ్యుల
  బ్యానర్: శాన్వి ప్రొడక్షన్స్
  తారాగణం: రవితేజ, కాజల్ అగర్వాల్, తాప్సీ, కిక్ శ్యామ్
  కూర్పు: మార్తాండ్ కె. వెంకటేష్
  సినిమాటోగ్రఫీ: చోటా కె నాయుడు
  సంగీతం: తమన్ ఎస్.
  కథ: పరుచూరి బ్రదర్స్
  మాటలు: అబ్బూరి రవి
  నిర్మాత: గణేష్ ఇందుకూరి
  దర్శకత్వం: రమేష్ వర్మ

  విలన్ ఓ ఫొటో పట్టుకుని రోడ్లు మీద తిరుగుతూ ఎవరినో సీరియస్ గా వెతుకుతూంటాడు.హీరో ఎక్కడనుంచోహఠాత్తుగా ఊడిపడి ఓ కుటుంబంలోకి చొరబడి ఆ ఇంట్లో అందరి ఆదరాభిమానాలు పొందేందుకు విపరీతంగా కృషి చేస్తూంటాడు.మరో ప్రక్క ప్రపంచంలో ప్రేమ తప్ప మరేమీ లేనట్లు హీరో వెనక పడుతూంటుంది హీరోయిన్.ఇంటర్వెల్ ముందు ఓ పెద్ద పోలీస్ ఆఫీసర్ హీరోని చూసి అయ్యగారు అన్న రేంజిలో నమస్కారం పెడతాడు.ఇవన్నీ చదువుతూంటే మీకు ఏమి గుర్తుకువస్తోంది. భాషా నుంచి నిన్న మొన్నటి సింహా దాకా ఎన్నో సినిమాలు గుర్తుకు రావటం లేదూ.రవితేజ వీర దీ సేమ్ టు షేమ్ అదే స్కీమ్ ని ఫాలో అయ్యింది.ఇన్నాళ్ళూ కామిడీ చేసి హ్యాపీగా మనల్ని నవ్వించేసిన రవితేజకు హఠాత్తుగా యాక్షన్ హీరో అనిపించుకోవాలనే బుద్ది పుట్టినట్లుంది.అయితే ఆ యాక్షన్ ని కొత్త పాయింట్ తో కొత్త సీన్స్ తో చేసి ఉంటే బావుండేది.కానీ ఫ్యాక్షన్ సినిమాల్లో హిట్టయిన ప్రతీ ఎపిసోడ్ ని సినిమాలో దించి హిట్టు కొట్టాలనే తాపత్రయంతో మళ్లీ మరో మూస పాత చిత్రం తయారు చేసి నమ్మి వెళ్ళిన ప్రేక్షకుడుని వీర బాదుడు బాదాడు.

  ఆపదలో ఉన్న ఏ.సి.పి శ్యామ్ (కిక్ శ్యామ్)ఇంటికి సెక్యూరిటీ ఆఫీసర్ గా దేవా(రవితేజ)వస్తాడు.వచ్చిందే తడువుగా ఆ ఇంట్లో ఉన్న వాళ్ళతో అనుబంధం పెనవేసుకోవటానికి విపరీతంగా ట్రై చేస్తూంటాడు.అయితే ఏ.సి.పి భార్య సత్య(శ్రీదేవి)మాత్రం దేవాని అనుమానంగా చూస్తూ అవమానం చేస్తూంటుంది.హీరో కాబట్టి తప్పదన్నట్లు అవన్నీ భరిస్తూ,మధ్య మధ్యలో ఆ కుటుంబాన్ని విలన్స్ నుంచి కాపాడేస్తూ,పవర్ ఫుల్ డైలాగులు చెప్తూ,హీరోయిన్ తో పాటలు పాడుతూ గడిపేస్తూంటాడు.ఇదిలా ఉంటే ప్రదీప్ రావత్ అనే విలన్ ఎసిపి భార్య ఫోటొ పట్టుకుని అందరినీ ఆమె గురించి అడుగుతూ సిటీలో తిరుగుతూంటాడు.ఈలోగా అనుకోని విధంగా ఎసిపి కీ తమ ఇంట్లో ఉన్నది దేవా కాదని వీర అనే చాలా గొప్ప వ్యక్తి అని రివిల్ అవుతుంది.ఇంతకీ వీరా ఎవరు...అస్సలు అతనకీ ఈ ఇంటికీ సంభందం ఏమిటి..ఏసిపీ భార్య అతన్ని ఎందుకు దూరం పెడుతోంది వంటి ప్రశ్నలకు జవాబులు తెలియాలంటే సినిమా సెకండాఫ్ లో వచ్చే ఫ్లాష్ బ్యాక్ చూడాల్సిందే.

  'భీష్మ" పేరుతో బాలయ్య కోసం సిద్దం చేసుకున్న కథ ఇది.అయితే ఈ ప్రాజెక్ట్‌ కార్యరూపం దాల్చలేదు.దాంతో అదే కథను స్వల్ప మార్పులుచేర్పులతో రవితేజతో చేసాను.'భీష్మ"టైటిల్‌ 'వీర"గా మార్చాను అని దర్శకుడు రమేష్ వర్మ ఈ చిత్రం గురించి చాలా ప్రాంక్ గా ఇంటర్వూలలో ఇచ్చాడు.అదే విషయం తెరపై స్ఫష్టంగా కనపడుతూంటుంది.బాలకృష్ణ కోసం తయారు చేసుకున్న సీన్స్,డైలాగులు,యాక్షన్ ఎపిసోడ్స్ రవితేజ చేస్తూంటే ఏదో ప్యారిడీ సినిమా చూస్తున్న ఫీలింగ్ వస్తుంది.అందులోనూ బాలకృష్ణ కెరీర్ లో సూపర్ హిట్టయిన సినిమాల్లోని బాగున్న సీన్స్ ను కలిపి మరీ తయారు చేయటంతో ఆ లోపం మరీ కనపడుతూంటుంది.ఇక ఫస్టాఫ్ ..హాలీవుడ్ చిత్రం మ్యాన్ అన్ ది ఫైర్ చిత్రం గుర్తుకు తెస్తూ సాగుతుంది.సెకెండాఫ్ ప్లాష్ బ్యాక్ గురించి తెలుసు సినిమా బ్యాక్ వెళ్ళితే చాలా రిఫెరెన్స్ లు దొరుకుతాయి.అలా కథ అతుకులు బొంతలా తయారైంది.

  ఇక స్క్రీన్ ప్లే విషయానికి వస్తే..ఫస్టాఫ్ కీ సెకండాఫ్ కీ ఎక్కడా కలసినట్లుగానీ ముడిపడినట్లు గానీ కనపడదు.రెండూ రెండు కథల్లాగా ఉంటాయి.ఫస్టాఫ్ మిస్సైనా సెకెండాఫ్ చూసినా పూర్తిగా ఏ సమస్యా లేకుండా అర్దమవటం దీని ప్రత్యేకత.అలాగే ఈ అవుట్ డేటెడ్ కథకి,కాలం చెల్లిన సిస్టర్ సెంటిమెంట్ ని జతేసారు..మధ్యమధ్యలో వచ్చే బ్రహ్మానందం,అలీ కామిడీలో మరీ ఛండాలంగా ఉన్నాయి.ఇక పాటలు ప్లేస్ మెంట్ కూడా సరిగ్గా లేదు.డ్రైవర్ రాముడు చిత్రంలో ని మామిళ్ళ తోట కాడ పాట రీమిక్స్ అస్సలు పేలలేదు.డైలాగులు విషయానికి వస్తే పరుచూరి బ్రదర్శ్ ఇక ఈ కాలాలనికి కష్టం అనిపిస్తుంది.కొద్దో గొప్పో బాగున్న వాటిలో ఛాయాగ్రహణం,తాప్సీ గ్లామర్,క్లైమాక్స్ ముందు వచ్చే వీర..వీర సాంగ్ బాగుంది. దర్శకుడుగా రమేష్ వర్మ ఏ విభాగంలోనూ తన ముద్రను చూపలేకపోయారు.రవితేజ వంటి ఎనర్డీ ఉన్న హీరోని పెట్టుకుని కూడా తెరపై నీరసంగా చూపెట్టాడు.నటుడుగా రవితేజ,కాజల్,తాప్సీలు గురించి ప్రత్యేకంగా చెప్పుకునేదేమీ లేదు.రవితేజ ఇలాంటి తనకు సంభంధంలేని ప్రయోగాలు చేయకుండా ఉంటేనే తన కెరీర్,చూసేవాళ్ళ ఆరోగ్యాలు క్షేమంగా ఉంటాయి.

  ఏదైమైనా రవితేజ చిత్రం..కాస్త నవ్వుకోవచ్చు అని పొరపాటున ధియోటర్ లోకి దూరితే దానికి తగ్గ ఫలితం అనుభవించాల్సి ఉంటుంది.ట్రేడ్ పరంగా అన్ని వర్గాలను టార్గెట్ చేసిన ఈ చిత్రం ఏ వర్గాన్ని కూడా స్పెసిఫిక్ గా చేరే వాతావరణం కనపడటం లేదు.దర్శకుడు రవి వర్మ ఈ సినిమా గురించి చెబుతూ..'వీర' సృజనాత్మక పరంగా చెప్పుకోవాల్సింది తక్కువైనా పూర్తి స్థాయి కమర్షియల్ ఫిల్మ్ అన్నారు. కానీ కమర్షియల్ సినిమాకు కూడా సృజనాత్మకత అనేది అత్యవసరం అని ఈ సినిమా నుంచైనా తెలుసుకుంటే బెస్టు.

  English summary
  Ravi Teja's ‘Veera’ released today(20th May). Kajal Agarwal and Tapsi Pannu are the leading ladies in the film.Touted to be a complete mass entertainer, Veera has directed by Ramesh Varma of Ride fame and produced it by Ganesh Indukuru on Sanvi Productions banner.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more