Don't Miss!
- News
viral video: కూతురి పుట్టినరోజున లక్ష పానీపూరీలు పంచిన తండ్రి.. గ్రేట్ మెసేజ్ ఇచ్చారుగా!!
- Technology
రూ.18 వేలలో, 108 మెగాపిక్సెల్ కెమెరా Smartphone.. లాంచ్ ఎప్పుడంటే!
- Sports
కౌంటీ క్రికెట్ ఆడనున్న సిరాజ్.. రెడ్ బాల్ క్రికెట్‌పై మియా భాయ్ స్పెషల్ ఫోకస్!
- Automobiles
కొత్తగా వచ్చిన 'ఓలా ఎస్1'కి, ఇప్పటికే అమ్ముడవుతున్న 'ఓలా ఎస్1 ప్రో'కి మధ్య తేడా ఏమిటి?
- Finance
ఆరు నెలల కనిష్ఠానికి క్రూడాయిల్ ధర: ఆ కంపెనీలకు మాత్రమే కేంద్రం ఊరట
- Lifestyle
Today Rasi Phalalu: ఈ రోజు ఈ రాశుల వారు అదనపు ఖర్చులు తగ్గించుకోండి..
- Travel
ఒకప్పటి రాజ నివాసాలు.. ఇప్పుడు విలాసవంతమైన విడిది కేంద్రాలు
Rechhipodham Brother review భావోద్వేగమైన కథ.. కానీ..!
నటీనటులు: అతుల్ కులకర్ణి, రవికిరణ్, దీపాలి శర్మ, భానుశ్రీ, శివాజీరాజా, పోసాని కృష్ణ మురళి, శశాంక్, భానుచందర్, ఇంద్రజ, బెనర్జీ, అజయ్‌గోష్, ప్రభాస్ శ్రీను, తాగుబోతు రమేష్ తదితరులు
బ్యానర్: ప్రచోదయ ఫిలిమ్స్
నిర్మాతలు: హనీష్ బాబు ఉయ్యూరు, వీవీ లక్ష్మీ
స్టోరీ, డైలాగ్స్, స్క్రీన్‌ప్లే, డైరెక్షన్: ఏకే జంపన్న
సంగీతం: సాయి కార్తీక్
లిరిక్స్: భాస్కరభట్ల, కాసర్ల శ్యామ్, పూర్ణచారి
సినిమాటోగ్రాఫర్: శ్యామ్ కే నాయుడు
ఎడిటర్: కార్తీక శ్రీనివాస్
ఫైట్స్: డ్రాగన్ ప్రకాష్
ఆర్ట్: మహేష్ శివన్
డాన్సు: భాను
పబ్లిసిటీ డిజైనర్: ధని ఏలే
రిలీజ్ డేట్: 2022-07-29
సైన్యంలో పనిచేస్తూ దేశం కోసం ప్రాణాలు త్యాగం చేసిన మిలిటరీ ఆఫీసర్ చంద్రమౌళి (భానుచందర్) కుమారుడు అభి (రవి కిరణ్). తండ్రి సైన్యంలో పనిచేస్తే.. అభి మాత్రం జర్నలిస్టు కావాలని చిన్నతనం నుంచే కలలు కంటాడు. అలా ప్రముఖ ఛానెల్‌లో జర్నలిస్టుగా చేరిన అభి తన కెమెరా ఉమెన్ (భానుశ్రీ)తో కలిసి నేషనల్ బాక్సింగ్ ఛాంపియన్ భరణి (అతుల్ కులకర్ణి)ని ఇంటర్వ్యూ చేసి పాపులర్ అవుతాడు. అభి ఉత్సాహాన్ని చూసిన టీవీ యాజమాన్యం పొలిటికల్ లీడర్ల ఇంటర్యూలు చేయాలని పురమాయిస్తారు. ఆ క్రమంలో మాజీ మంత్రి (అజయ్ ఘోష్) నకిలీ విత్తనాలతో రైతులను మోసగించే స్టోరిని అభి షూట్ చేస్తాడు.
మాజీ మంత్రి మోసాలను బహిర్గతం చేయాలనుకొన్న అభి ప్రయత్నం నెరవేరిందా? అభి టీవీ ఛానెల్‌లో ఉద్యోగం మానేసి యూట్యూబ్ ఛానెల్ ఎందుకు పెట్టుకొన్నాడు. తన సహచర జర్నలిస్టు మరణం వెనుక చీకటి కోణం ఏమిటి? మాజీ మంత్రి అవినీతి భాగోతాలు, జర్నలిస్టు మరణం వెనుక సూత్రధారి ఎవరు? అవినీతిని బయటపెట్టే క్రమంలో అభికి ఎదురైన సమస్యలు ఏమిటి అనే ప్రశ్నలకు సమాధానమే రెచ్చిపోదాం బ్రదర్ సినిమా కథ.

రెచ్చిపోదాం బ్రదర్ సినిమాతో తెలుగు సినిమా పరిశ్రమలోకి ప్రవేశించిన రవి కిరణ్ అనుభవం ఉన్న నటుడిగా తన ఫెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకొన్నాడు. జర్నలిస్టు అభిగా పాత్ర పరంగా యాటిట్యూడ్, హావభావాలను చక్కగా పలికించాడు. ఇక నేషనల్ బాక్సింగ్ ఛాంపియన్‌గా రెండు షేడ్స్ ఉన్న విభిన్నమైన పాత్ర భరణిగా అతుల్ కులకర్ణి మరోసారి విలక్షణమైన నటనను ప్రదర్శించాడు. రవికిరణ్ తల్లిదండ్రులుగా భానుచందర్, ఇంద్రజ తమ పాత్రల్లో ఒదిగిపోయారు. దీపాలీ శర్మ, పోసాని, అజయ్ ఘోష్, అప్పాజీ అంబరీష, ప్రభాస్ శ్రీను, తాగుబోతు రమేష్ తమ పాత్రల పరిధి మేరకు మెప్పించారు.
దర్శకుడు జంపన్న ఎంచుకొన్న పాయింట్ ఆసక్తికరంగా ఉంటుంది. కథా, కథనాలపై దర్శకుడు మరింత కసరత్తు పెట్టి ఉంటే.. మంచి సస్పెన్స్, థ్రిల్లర్ అయి ఉండేది. సెంటిమెంట్, యాక్షన్ అంశాలకు దర్శకుడు పెద్ద పీట వేశాడు. అక్కడక్కడా డైలాగ్స్ ఆకట్టుకొంటాయి. ఇక సాయి కార్తీక్ మ్యూజిక్ బాగుంది. యుద్ధం శరణం, తప్పదు ప్రళయం అనే పాట తెర మీదే కాదు.. ఆడియోపరంగా బాగుంది. శ్యామ్ కే నాయుడు సినిమాటోగ్రఫి, కార్తీక శ్రీనివాస్ ఎడిటింగ్, ఫైట్ మాస్టర్ డ్రాగన్ ప్రకాష్ ఫైట్స్ సినిమాకు ప్లస్ పాయింట్స్.
రెచ్చిపోదాం బ్రదర్ మూవీని ప్రచోదయ ఫిలిమ్స్ పతాకంపై నిర్మాతలు హనీష్ బాబు, వీవీ లక్ష్మీ ఉయ్యూరు నిర్మించారు. తొలిసారి నిర్మాణం చేపట్టిన వారి అభిరుచికి ఈ సినిమా సాక్ష్యంగా నిలిచింది. ప్రొడక్షన్ వ్యాల్యూస్, నటీనటుల ఎంపిక సినిమాపై నిర్మాతలు అంచనాలు పెంచారు. దేశభక్తి, అవినీతి, అక్రమాలను ఎదురించే కథా నేపథ్యంతో వచ్చే సినిమాలను ఆదరించే వారికి ఈ సినిమా నచ్చతుంది. అంచనాలు లేకుండా వెళితే మంచి అనుభూతిని మిగిల్చడానికి అవకాశం ఉంది.