twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Repeat movie OTT Review ఎంగేజింగ్‌గా కిడ్నాప్ డ్రామా.. నవీన్ చంద్ర ఫెర్ఫార్మెన్స్ ఎలా ఉందంటే?

    |

    నటీనటులు: నవీన్ చంద్ర, మధుబాల, అచ్యుత్ కుమార్, కాళి వెంకట్, మైమ్ గోపి, స్మృతి వెంకట్ తదితరులు
    రచన, దర్శకత్వం: అరవింద్ శ్రీనివాసన్
    నిర్మాత: విజయ్ పాండీ, పీజీ ముత్తయ్య
    సినిమాటోగ్రఫి: పీజీ ముత్తయ్య
    ఎడిటింగ్: అరుల్ సిద్దార్థ్
    మ్యూజిక్: జిబ్రాన్
    బ్యానర్: వైట్ కార్పెట్ ఫిల్స్మ్, పీజీ మీడియా వర్క్స్
    ఓటీటీ రిలీజ్: డిస్నీ+హాట్ స్టార్
    ఓటీటీ రిలీజ్ డేట్: 2022-12-01

    రచయిత సుబ్రమణ్యం (అచ్యుత్ కుమార్) తను రాసే క్రైమ్ స్టోరీల్లో సన్నివేశాలు, సంఘటనలు నిజ జీవితంలో కూడా జరుగుతుంటాయి. సుబ్రమణ్యం తన కథలో రాసినట్టే.. డిజీపీ ఆషా ప్రమోద్ (మధుబాల) కూతురు పూజ (స్మృతి వెంకట్) కిడ్నాప్ గురవుతుంది. ఈ కేసును దర్యాప్తు చేయడానికి విక్రమ్ కుమార్ అనే పోలీస్ అధికారి అండర్ కవర్ ఆపరేషన్ చేపడుతాడు.

    విక్రమ్ కుమార్ అండర్ కవర్ ఆపరేషన్‌లో ఎదురైన విషయాలు ఏమిటి? సుబ్రమణ్యం రాసే కథలు నిజమవడానికి వెనుక కారణం ఏమిటి? పూజా కిడ్నాప్ వెనుక ఎవరున్నారు? డీజీపీ ఆషా కూతురునే ఎందుకు కిడ్నాప్ చేశారు? సుబ్రమణ్యం కథలు రాయడం వెనుక ప్రేరణ ఏమిటి? చివరకు పూజా కిడ్నాప్ వ్యవహారాన్ని విక్రమ్ కుమార్ సక్సెస్‌ఫుల్‌గా చేధించారా? క్రైమ్ వెనుక అసలు దోషి ఎవరు? అనే ప్రశ్నలకు సమాధానే రిపీట్ సినిమా కథ.

    Repeat movie Review and Rating: Naveen Chandras Kidnap drama

    రిపీట్ సినిమా విషయానికి వస్తే.. రచయిత సుబ్రమణ్యం రాసే ప్రతీ చాప్టర్‌‌లోని సంఘటనలు నిజం కావడం అనే పాయింట్‌తో సినిమా ఆసక్తికరంగా మారుతుంది. పేపర్ మీద రచయిత ఏం రాస్తాడనే ఉత్సుకత ప్రేక్షకుల్లో కలిగించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడనే చెప్పవచ్చు. అయితే.. దర్శకుడు అరవింద్ కేవలం సింగిల్ పాయింట్‌పైనే కథను నడపడం, స్టోరీలో ట్విస్టులు, ఎమోషన్స్ లేకపోవడం వల్ల కాస్త సాగదీసినట్టు అనిపిస్తుంది. అయితే ప్రీ క్లైమాక్స్ నుంచి చివరి సన్నివేశం వరకు కథలో చోటుచేసుకొనే సంఘటనలు ఎంగేజింగ్‌గా ఉంటాయి. విక్రమ్ కుమార్ లైఫ్‌లో జరిగిన ఓ సంఘటన సినిమాను ఫీల్‌గుడ్‌గా మార్చే ప్రయత్నం చేస్తుంది.

    రిపీట్ సినిమాలో నటీనటుల పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే.. అండర్ కవర్ ఆఫీసర్‌గా నవీన్ చంద్ర ఆకట్టుకొన్నాడని చెప్పవచ్చు. రెండు రకాల వేరియేషన్స్ ఉన్న పాత్రలో ఆయన ఒదిగిపోయాడు. కొన్ని బలహీనంగా ఉండే సన్నివేశాలను నవీన్ చంద్ర తన ఫెర్ఫార్మెన్స్‌తో మంచి ఫీల్ కలిగించాడు. డీజీపీగా మధుబాల నటన, గ్లామర్ పరంగా ఆకట్టుకొన్నారు. రచయిత సుబ్రమణ్యం పాత్రలో అచ్యుత్ కుమార్ తనదైన నటనను ప్రదర్శించాడు. కంతారా సినిమాలో బలమైన పాత్రతో ఆకట్టుకొన్న అచ్యుత్ కుమార్ ఈ సినిమాలో డిఫరెంట్ రోల్‌తో మెప్పించే ప్రయత్నం చేశారు.

    Repeat movie Review and Rating: Naveen Chandras Kidnap drama

    ఇక సాంకేతిక వివరాల్లోకి వెళితే.. దర్శకుడు అరవింద్ ఎంచుకొన్న కథ బాగుంది. ఫస్టాఫ్‌లో కథను నడిపించిన తీరు కూడా ఫర్వలేదనిపిస్తుంది. సెకండాఫ్‌లో ఇంకాస్త పదును పెట్టి ఉంటే.. డెఫినెట్‌గా మంచి క్రైమ్ థ్రిల్లర్ అయ్యే అవకాశం ఉండేది. పీజీ ముత్తయ్య సినిమాటోగ్రఫి, అరుల్ సిద్దార్థ్ ఎడిటింగ్, జిబ్రాన్ మ్యూజిక్ బాగున్నాయి. ముఖ్యంగా జిబ్రాన్ అందించిన బీజీఎం సినిమా మూడ్‌ను క్రియేట్ చేసింది. విజయ్ పాండీ, పీజీ ముత్తయ్య పాటించిన నిర్మాణ విలువలు బాగున్నాయి. క్రైమ్, హారర్, థ్రిల్లర్ జోనర్లను ఇష్టపడే వారికి రిపీట్ సినిమా నచ్చుతుంది. డీస్నీ+హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతున్నది. మీకు తగినంత సమయం ఉంటే.. ఒకేసారి చూస్తే రిపీట్ సినిమా థ్రిల్లింగ్ అనుభూతిని కలిగిస్తుంది.

    English summary
    Tamil Movie Dejavu's Telugu remake Repeat movie hits the OTT on December 1st. This movie is streaming on Disney+Hotstar. Here is the Exclusive review by Telugu filmibeat.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X