»   » సమాంతర ప్రయాణం (కమలతో నా ప్రయాణం' రివ్యూ)

సమాంతర ప్రయాణం (కమలతో నా ప్రయాణం' రివ్యూ)

Posted By:
Subscribe to Filmibeat Telugu
Rating:
2.5/5
హైదరాబాద్: సమాంతర చిత్రాలకు తెలుగులో పెద్దగా గుర్తింపు లేదు. కానీ అప్పుడప్పుడూ ఒకటి ఆరా వస్తూ అవార్డులు గెలుస్తు...ఒక్కోసారి ప్రేక్షకుల మనస్సులను సైతం గెలుచుకుంటున్నాయి. గతంలో 1940 లో ఓ గ్రామం చిత్రం తీసి జాతీయ అవార్డ్ సాధించిన నరసింహ నంది మళ్లీ అలాంటి ప్రయోగమే చేసాడు. కమర్షియల్ సినిమా కోసం పాకులాడకుండా తను నమ్మిన బాటను వీడకుండా ఈ చిత్రాన్ని రూపొందించాడు. తిలక్ రచన ఊరి చివర ఇల్లు ప్రేరణతో రూపొందిన ఈ చిత్రం ఆర్దిక విజయం సంగతి ఎలా ఉన్నా హార్ధిక విజయం సాధిస్తుంది.

1950 నేపథ్యంలో జరిగే కథ ఇది. వేశ్య వృత్తిలో జీవించే కమల కధగా చిత్రం నడుస్తుంది. సత్యం(శివాజి) తన కుమార్తె కమల రాణికి కథ చెప్తూండగా సినిమా ప్రారంభమవుతుంది. అయోధ్యపురం శివార్లలలో ఉండే కమల(అర్చన) ఓ వేశ్య. తన స్నేహితుడు ఆనందరావుకి సహాయం చేయటానికి బర్మా నుంచి వచ్చిన సత్యం వాతావరణం అనుకూలంగా లేకపోవటంతో కమల ఇంట్లో ఓ రాత్రి గడపాల్సి వస్తుంది. ఆ రాత్రి వారి మధ్య ఓ అందమైన బంధం ఏర్పడుతుంది. దీంతో కమలను తనతోపాటు తీసుకుని బర్మాలో పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. వారిద్దరి కల నెరవేరిందా లేదా ఏం జరిగిందనేది తెలియాలంటే చిత్రం చూడాల్సిందే.

 Review: Kamalatho Naa Prayanam

ఒకప్పుడు కామెడీ హీరోగా వెలిగిన శివాజి వరస ఫ్లాపులతో మార్కెట్ కోల్పోయి ఫేడ్ అవుట్ అయిపోయాడు. అయితే అతనిలోని నటుడుని ఆవిష్కరిస్తూ ఈ చిత్రం దర్శకుడు రూపొందించారు. అర్చన సైతం బాగానే చేసింది. అయితే చిత్రం చాలా స్లోగా నడుస్తుంది. కానీ ఓ సమాంతర చిత్రం చూస్తున్నామని అనుకుంటే ఆ స్లో నేరేషన్ ఇబ్బంది పెట్టదు. మూడే పాత్రలతో చిత్రాన్ని రక్తి కట్టించటానికి దర్శకుడు చేసిన కృషి మనకు అడుగడుగున కనిపిస్తుంది. ఈ స్పీడు యుగంలో మనం మిస్ అవుతున్న విలువలు,భావోద్వేగాలు, అనుభూతులని కళ్లకు కట్టినట్లు చూపించాడు. సెకండాఫ్ మరీ అంత స్లోగా లేకుండా కాస్త స్పీడుగా ఉంటే బాగుండనిపిస్తుంది.

టెక్నికల్ గా చిత్రం ఛాయాగ్రాహకుడుకి మంచి మార్కులు పడతాయి. ఆ కాలాన్ని కళ్లముందు ఆవిష్కరించటంతో ఆర్ట్ డైరక్టర్ తో పోటి పడ్డాడు. అలాగే సంగీతం ఈ చిత్రానికి మైనస్ . పాటలు కథనానికి అడ్డుగానే కాక విసుగ్గా అనిపించాయి. డైలాగ్స్ కూడా ఆచితూచి నీట్ గా ప్రెజెంట్ చేసారు. ఎడిటర్ మరింత షార్ప్ గా కట్ చేసి సినిమాకు వేగం పెంచితే బాగుండేది. చిన్న కథని పెద్ద సినిమాగా తయారు చేయటంలో స్క్రీన్ ప్లే తోర్పడాలి. కానీ దర్శకుడు దానిని నెగ్లెట్ చేసారు. ఆయన చిత్రానికి పీరియడ్ లుక్ తేవటంలో పెట్టిన శ్రద్ద స్క్రిప్టు పై పెట్టినట్లు కనపడదు.

ఏదైమైనా ఈ చిత్రం పూర్తిగా ఆర్ట్ సినిమాలను ఆదరించే ఆడియన్స్ టార్గెట్ చేసింది...కాబట్టి ఎంటర్టైన్మెంట్,రెగ్యులర్ మసాలాలు ఆశించకుండా ఉంటే బాగుంటుంది. చిత్రం కమర్షియల్ గా విజయం సాధించకపోయినా అవార్డులు సాధించే అవకాసం ఉంది. ఫిల్మ్ ఫెస్టివల్స్ లోనూ చిత్రం మంచి పేరు తెచ్చుకుంటుంది.

సంస్ధ : లివిత యూనివర్శల్ ఫిలిమ్స్
నటీనటులు: శివాజీ, అర్చన, పావలా శ్యామల తదితరులు
పాటలు: వనమాలి,
సంగీతం: కిషన్ కవాడియా,
ఛాయాగ్రహణం: ఎస్.మురళీమోహనరెడ్డి,
ఎడిటింగ్: వి.నాగిరెడ్డి,
కళ; బాబ్జీ,
రచనా సహకారం; కె. ఎస్.వి.అనిల్‌కుమార్,
కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: నరసింహ నంది.
నిర్మాతలు: ఇసనాక సునీల్‌రెడ్డి, సిద్దార్థ్ బోగో
విడుదల తేదీ: 14 మార్చి 2014.

English summary
Kamala Tho Naa Prayanam is a good attempt in these days. Those who love realstic films, literature work films will definitly engage to its core.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu