»   » షౌట్ ఫర్ ఎగ్జిట్ (రేయ్ మూవీ రివ్యూ)

షౌట్ ఫర్ ఎగ్జిట్ (రేయ్ మూవీ రివ్యూ)

Posted By:
Subscribe to Filmibeat Telugu
Rating:
1.5/5
హైదరాబాద్: ఎన్నో కష్టాలను ఎదురీదిన ‘రేయ్' మూవీ సినిమా మొదలైన నాలుగేళ్ల తర్వాత ఈ రోజు థియేటర్లలోకి వచ్చింది. మెగాస్టార్ మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ హీరోగా వైవిఎస్ చౌదరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈచిత్రం ట్యాగ్ లైన్ షౌట్ ఫర్ సక్సెస్. కాని సినిమా చూసిన వారు మాత్రం షౌట్ ఫర్ ఎగ్పిట్ అంటున్నారు. మరి ప్రేక్షకుల నుండి అలాంటి స్పందన ఎందుకొస్తోంది? అనేది రివ్యూలో చూద్దాం...

కథ విషయానికొస్తే...
రెండు సార్లు అమెరికాలో బెస్ట్ అఫ్ వరల్డ్ టైటిల్ గెలుచుకున్న అమెరికన్ పాప్ సింగర్ జెన్న(శ్రద్ధ దాస్) మూడోసారి కూడా ఆ టైటిల్ గెలుచుకోవాలనకుంటుంది. ఇండియా నుంచి వచ్చిన సాండీ(ఫర్హద్ షానవాజ్) ఆమెకు గట్టి పోటీని ఇస్తాడు. దీంతో సాండీని అమెరికన్ డాన్ డాంగే(అర్పిత్ రాంఖా)తో చంపిస్తుంది. అన్నయ్య కోరికను నెరవేర్చి బెస్ట్ అఫ్ వరల్డ్ టైటిల్ గెలుచుకోవాలని అమెరికా సాండీ చెల్లెలు అమృత(సయామీ ఖేర్) వస్తుంది. ఈ క్రమంలో ఆమెకు రాక్(సాయిధరమ్ తేజ్) పరిచయం అవుతాడు. రాక్‌కు మ్యూజిక్ అన్నా..అమ్మాయిలన్నా చాలా పిచ్చి. ఈ క్రమంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. జెన్నను ఎదుర్కోవడానికి వీరిద్దరు ఏం చేసారు? బెస్టాఫ్ వరల్డ్ టైటిల్ గెలుచుకునేందుకు రాక్-అమృత ఏం చేసారు? అనేది తర్వాతి కథ.

Rey Movie Review

పెర్ఫార్మెన్స్ విషయానికొస్తే...
సాయి ధరమ్ తేజ్ కెరీర్లో నటన మొదలు పెట్టింది ఈ సినిమాతో. మెగా ఫ్యామిలీ నుండి వచ్చిన సాయి ధరమ్ తేజ్ డాన్సింగ్ స్కిల్స్, యాక్టింగ్ స్కిల్స్, ఫైటింగ్ లో అదరగొట్టాడు. మేనమామ పోలికలు మేనల్లుడికి వస్తాయి అంటారు. అలానే చిరులోని కొన్ని కొన్ని లక్షణాలు సాయి ధరమ్ తేజ్ లో కనిపిస్తాయి. తమ రక్తంలోనే ఆ టాలెంట్ ఉందని నిరూపించుకున్నాడు. హీరోయిన్ సయామీ ఖేర్ అందం పరంగా ఓకే కానీ....నటన పరంగా పెద్దగా ఆకట్టుకోలేక పోయింది. శ్రద్ధాదాస్ ఇటు పెర్ఫార్మెన్స్ పరంగా, అటు అందం పరంగా ఆకట్టుకుంది. తన గత సినిమాలతో పోలిస్తే ఆమె బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. సాయి ధరమ్ తేజ్, శ్రద్ధ దాస్ మధ్య వచ్చే చాలెంజింగ్ సీన్స్ బాగున్నాయి. అర్పిత్ రాంఖా, సీనియర్ నరేష్, హేమ, తనికెళ్ల భరణి, ఇతర నటీనటులు వారి వారి పాత్రల న్యాయం చేసారు.

టెక్నికల్ అంశాల విషయానికిస్తే... ఇందులో మనం ముఖ్యంగా చెప్పుకోదగిన విషయం గుణశేఖరన్ సినిమాటోగ్రపీ. దర్శకుడు ఎంచుకున్న కరేబియన్, అమెరికన్ బ్యాక్ డ్రాపును అతను తన కెమెరాతో తెరపై పర్ ఫెక్టుగా రిఫ్లక్ట్ అయ్యేలా చేసాడు. అతని సినిమాటోగ్రపీ సినిమాకు సరికొత్త ఫీల్ వచ్చేలా చేసింది. డాన్స్ మ్యూజిక్ ప్రధానంగా సాగే ఈ సినిమాలో డాన్సులు ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. యాక్షన్ ఎపిసోడ్స్ కూడా ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. చక్రి అందించిన సంగీతం ఫర్వాలేదు. శ్రీధర్ సీపాన రాసని డైలాగులు బావున్నాయి.

వాస్తవానికి పైన చెప్పిన అంశాలన్ని ఒక సినిమాకు పైపై మెరుగులు మాత్రమే. సినిమా ప్రేక్షకులకు కనెక్ట్ అయిందా? లేదా? అనేది కథ, కథనం, దర్శకుడి పని తీరుపైనే ఆధార పడి ఉంటుంది. కాన్సెప్టు కొత్తగానే ఉన్నా దాన్ని ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా చేయడంలో ఫెయిల్ అయ్యాడు. సినిమా లెంగ్త్ ఎక్కువగా ఉండటం కూడా మైనస్ అయింది.

ఓవరాల్‌గా చెప్పాలంటే.....రేయ్ సినిమా ఆశించిన స్థాయిలో లేదు. పవనిజం సాంగ్, గోలీమార్ సాంగ్ రీమిక్సు లాంటివి చేసి మసాలా జోడించినా సినీ ప్రియుల ఆకలి తీర్చడంలో సక్సెక్స్ కాలేక పోయారు.

English summary
After facing lot of hurdles for four long years, Sai Dharam Tej's supposed debut film, Rey has hit screens today. The title of the film, Rey has been tried to justify by its tagline, 'Shout Out For Success'. Well! let us quickly see if it has got the success it is longing for or not.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu