For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Rowdy Boys Review: దిల్ రాజు వారసుడు హిట్టు కొట్టాడా?

  |

  Rating:
  3.0/5

  నటీనటులు : ఆశిష్, అనుపమ పరమేశ్వరన్, కార్తీక్ రత్నం, కోమలి ప్రసాద్, విక్రమ్ సహిదేవ్, తేజ్ కూరపాటి, శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు.
  నిర్మాత : దిల్ రాజు- శిరీష్
  సంగీత దర్శకుడు :- దేవిశ్రీ ప్రసాద్
  దర్శకుడు :- శ్రీ హర్ష కొనుగంటి
  సినిమాటోగ్రఫీ: మదీ
  ఎడిటర్ : మధు

  తెలుగులో సక్సెస్ఫుల్ నిర్మాతగా పేరు తెచ్చుకున్న దిల్ రాజు ఫ్యామిలీ నుండి వచ్చిన ఆశిష్ రెడ్డి హీరోగా పరిచయం అవుతున్న చిత్రం రౌడీ బాయ్స్. సంక్రాంతి సందర్భంగా జనవరి 14 వ తేదీన ఈ సినిమా విడుదలైంది. తమ వారసుడు కావడంతో ఈ సినిమా మీద ముందు నుంచి దిల్రాజు బాగా ఫోకస్ పెట్టారు. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ప్రమోషనల్ యాక్టివిటీస్ తో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. దానికి తోడు ఎన్టీఆర్ రామ్ చరణ్ ప్రభాస్ లాంటి వాళ్లు సినిమా కోసం ప్రమోషన్ చేయడంతో సినిమా మీద జనాల్లో మంచి అభిప్రాయం ఏర్పడింది. మరి ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలో తెలుసుకుందాం.

  రౌడీ బాయ్స్ కథ ఏమిటంటే?

  రౌడీ బాయ్స్ కథ ఏమిటంటే?

  అక్షయ్( ఆశిష్) ఎలాంటి బాధ్యత లేకుండా అల్లరిగా తిరిగే కుర్రాడు. జీవితంలో ఏం చేయాలి అనే క్లారిటీ లేని అక్షయ్ ఇంజనీరింగ్ కాలేజీలో జాయిన్ అవుతాడు. మరోపక్క కావ్య(అనుపమా పరమేశ్వరన్) మెడికల్ స్టూడెంట్. బీటెక్ లో చేడానికి వెళ్తూ.. కావ్యను చూస్తాడు అక్షయ్.. తొలిచూపులోనే ప్రేమలో పడతాడు. అయితే అక్షయ్ జాయిన్ అయిన కాలేజీ విద్యార్థులకు కావ్య చదువుతున్న కాలేజీ విద్యార్థులకు అస్సలు పడదు. ఈ రెండు కాలేజీలో విద్యార్థుల మధ్యగ్యాంగ్ వార్స్ జరుగుతూనే ఉంటాయి. మరో వైపు కావ్యను అక్షయ్ తో పాటు.. తన క్లాస్ మెట్ విక్రమ్ (విక్రమ్ సహదేవ్)కూడా ప్రేమిస్తుంటాడు. అయితే ఈ ఇద్దరిలో కావ్య ప్రేమని ఎవరు పొందారు? ఈ ప్రేమను పొందే క్రమంలో ఎదురైన సవాళ్లు ఏమిటి? అనేదే అసలు సినిమా కథ.

  రౌడీ బాయ్స్ సినిమాలో ట్విస్ట్లు

  రౌడీ బాయ్స్ సినిమాలో ట్విస్ట్లు

  సినిమాలో కల మొదలైన కాసేపటికే కావ్య అక్షయ్ ప్రేమలో పడుతుంది. కానీ కావ్య ప్రేమ దక్కించుకోవడం కోసం విక్రమ్ ఏం చేశాడు? తనకు నచ్చిన అక్షయ్ ప్రేమను దక్కించుకోవడం కోసం కావ్య ఏం చేసింది? ఈ మధ్యలో కావ్య తండ్రి ఏం చేయాల్సి వచ్చింది? ప్రాణంగా ప్రేమించిన కావ్య ను అక్షయ ఎందుకు వదులుకోవాల్సి వచ్చింది? ఇందులో విక్రమ్ పాత్ర ఎంత? చివరికి కావ్య అక్షయ్ కలుస్తారా? లేక కావ్య విక్రమ్ కలుస్తారా? అనే ప్రశ్నలకు సమాధానమే ఈ సినిమా కథ.

  ఫస్టాఫ్ ఎలా ఉందంటే ?

  ఫస్టాఫ్ ఎలా ఉందంటే ?


  ఈ సినిమా మొదలైంది కాలేజీలో గొడవలతో. కానీ అసలు సినిమా కథ లోకి తీసుకు వెళ్ళే ముందు చాలా సేపు కాలేజ్ గొడవలు కాలేజీ నేపథ్యాన్ని చూపించడానికి దర్శకుడు ఆసక్తి చూపించాడు. ఈ కాలేజ్ గొడవలు చాలా సినిమాల్లో చూసినవే అనిపిస్తూ ఉంటాయి. కానీ తనదైన మార్కు వేసుకోవడానికి దర్శకుడు తీవ్ర ప్రయత్నం చేశాడు. నేటి యువతరం ఎలా ఉంది కాలేజీలకు వెళుతూ వాళ్ళు చేస్తున్న పనులు ఏమిటి వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంది అనేదాన్ని తెరమీద చూపించేందుకు ఆసక్తి చూపించాడు. అయితే అసలు విషయం లోకి తీసుకువెళ్లేందుకు చాలా ఆలస్యం చేశాడు దర్శకుడు.

  సెకండ్ హాఫ్ ఎలా ఉందంటే?

  సెకండ్ హాఫ్ ఎలా ఉందంటే?

  ఫస్ట్ హాఫ్ మొత్తం కాలేజీ గొడవలు చూపించిన దర్శకుడు సెకండ్ హాఫ్ మొత్తం లివ్ ఇన్ రిలేషన్ చూపించాడు. అసలు ఈ పాయింట్ ఉంటుందని ఎవరూ ఊహించలేదు ట్రైలర్ టీజర్ లో కూడా ఎక్కడ ఈ మేరకు హింట్ ఇవ్వకుండా జాగ్రత్త పడినట్లు కనిపిస్తోంది. మొత్తం మీద ఫస్ట్ హాఫ్ సాగతీత ధోరణితో సాగగా సెకండ్ హాఫ్ మాత్రం మొదలైన కాసేపటికే వేగం పుంజుకుంది. అక్షయ్ కావ్యా మధ్య ప్రేమ సన్నివేశాలు, విడిపోవాల్సిన సమయంలో వారి మధ్య విరహ సన్నివేశాలను తెరమీద దర్శకుడు అద్భుతంగా తెరకెక్కించారు. ముఖ్యంగా చివరిలో కావ్య అక్షయ్ విడిపోయే సమయంలో చోటు చేసుకున్న ట్విస్టులు ఎవరూ ఊహించని విధంగా కథ మీద ఆసక్తి కలిగించే విధంగా రూపొందించారు. పూర్తి స్థాయి యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా ప్రేక్షకుల అందరినీ అలరించింది.

  దర్శకుడి పనితీరు ఎలా ఉందంటే

  దర్శకుడి పనితీరు ఎలా ఉందంటే


  హుషారు లాంటి యూత్‌ఫుల్ సినిమా చేసిన శ్రీహర్షను నమ్మి తన తమ్ముడి కుమారుడిని లాంచ్ చేయడం అనే పెద్ద బాధ్యత ఉంచారు దిల్ రాజు. స్టార్ ప్రొడ్యూసర్ కొడుకుని లాంచ్ చేయడం అంటే ఆ ప్రెజర్ గట్టిగా ఉంటుంది కానీ దర్శకుడు కూడా ఎక్కడా తగ్గకుండా సరే డాన్స్, యాక్షన్, కామెడీ, హీరో, హీరోయిన్లు నటించడానికి స్కోప్ ఉన్న మంచి కథను ఎంచుకున్నాడు. అనుకున్న కథను కరెక్ట్ గా స్క్రీన్ మీద ప్రజెంట్ చేయడంలో కాస్త తడబడ్డాడు కానీ మొత్తంగా చూస్తే సంక్రాంతికి కచ్చితంగా ఒకసారి చూడదగ్గ సినిమా అని చెప్పాలి.

  హీరో హీరోయిన్ల పనితీరు విషయానికి వేస్తే

  హీరో హీరోయిన్ల పనితీరు విషయానికి వేస్తే

  హీరోగా ఆశిష్ రెడ్డి మొదటి ప్రయత్నం తోటి సక్సెస్ అయినట్టే అనాలి. ముందు నుంచి పెద్దగా అంచనాలు లేవు కానీ సినిమా చూసిన తర్వాత హీరో అవ్వాల్సిన క్వాలిటీస్ ఆశిష్ లో కనిపించాయి.. ఎక్కడ ఇది మొదటి సినిమా అనే అనుమానం కలగలేదు అంటే ఆశిష్ ఎంతలా కష్టపడ్డాడో అర్థం చేసుకోవచ్చు. ఎమోషనల్ సీన్స్ లో కొంచెం తడబడినా ఓవరాల్ గా కన్విన్సింగ్ గా నటించాడు అశీష్. కచ్చితంగా హీరో మెటీరియల్ అనిపించాడు. ఇక సినిమాలో ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన పేరు అనుపమ పరమేశ్వరన్. ఇప్పటిదాకా చాలా సినిమాల్లో అనుపమ పరమేశ్వరి హీరోయిన్ గా నటించింది కానీ ఒక రకంగా హీరో తో పాటు మిగతా సినిమా మొత్తాన్ని అనుపమ తన భుజాల మీద వేసుకొని నడిపించింది. ముందు నుంచి ట్రోల్ అయిన ముద్దు సీన్లు కూడా నటించాల్సిన మేరకే నటించింది. ఆమె నటనలో కాస్త పరిణితి కనిపించింది.

  మిగతా నటీనటుల పనితీరు విషయానికి వస్తే

  మిగతా నటీనటుల పనితీరు విషయానికి వస్తే

  కాలేజీ బ్యాక్ డ్రాప్ కథ కావడంతో ఇందులో చాలామంది నటీనటులు కనిపించారు. కానీ ముఖ్యంగా చెప్పుకోవాల్సిన పేర్లు కొన్ని ఉన్నాయి. తేజ్ కూరపాటి, లగడపాటి శ్రీధర్ కుమారుడు విక్రం సహదేవ్, కోమలి ప్రసాద్, కార్తీక్ రత్నం, శ్రీకాంత్ అయ్యంగార్, జయప్రకాష్ ఇలా కొంత మంది నటీనటులు తమ పాత్ర పరిధిమేర నటించి ఆకట్టుకున్నారు.

  టెక్నీషియన్స్ విషయానికి వస్తే

  టెక్నీషియన్స్ విషయానికి వస్తే

  ఈ సినిమా టెక్నీషియన్స్ విషయానికి వస్తే ముందుగా మాట్లాడు కోవాల్సింది దేవిశ్రీప్రసాద్ గురించి. దేవిశ్రీ మ్యూజిక్ చాలా బాగా అందించారు. అన్ని పాటలు కాకపోయినా కొన్ని పాటలు మాత్రం అద్భుతంగా కుదిరాయి. అంతేకాక ఆయన అందించిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంది. మదీ సినిమాటోగ్రఫి అద్భుతంగా ఉంది, కొన్ని ఏరియల్ షాట్స్ అద్భుతంగా కుదిరాయి. ఎడిటర్ మధు తన కత్తెరకు మరింత పని చెప్పి ఉంటే బాగుండేదేమో. ఇక నిర్మాణ విలువల విషయానికి వస్తే దిల్ రాజు ఖర్చుకు వెనకాడకుండా.. భారీగానే తమ వారసుడిని లాంచ్ చేశాడు. ఎక్కడా తగ్గలేదు.

  ఫైనల్ గా

  ఫైనల్ గా


  మొత్తంగా చూస్తే రౌడీ బాయ్స్ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. సినిమా చూసిన ప్రతి ఒక్కరు తమ తమ కాలేజీ రోజులను గుర్తు చేసుకోవడం ఖాయం. దిల్రాజు వారసుడికి అద్భుతమైన లాంచింగ్ సినిమా దొరికింది. యూత్ కి ఈ సినిమా బాగా కనెక్ట్ అవుతుంది. అలాగే సంక్రాంతి సీజన్లో ఇంటిల్లిపాదీ చూడదగ్గ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ ఈ సినిమా.

  English summary
  here is Rowdy Boys Review and rating in Telugu
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X