For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Sadak 2 మూవీ రివ్యూ అండ్ రేటింగ్

  |

  Rating:
  2.0/5

  దాదాపు రెండు దశాబ్దాల క్రితం బాలీవుడ్‌లో అద్బుతమైన విజయాన్ని అందుకొన్న చిత్రం సడక్. మహేష్ భట్ దర్శకత్వంలో యాక్షన్, ప్రేమ కథా చిత్రంగా వచ్చిన మూవీలో సంజయ్ దత్, పూజాభట్ ఫెర్ఫార్మెన్స్ హైలెట్‌గా నిలిచింది. ఇప్పటికీ ప్రేక్షకుల్లో కొత్త అనుభూతిని నింపిన ఈ మూవీకి సీక్వెల్‌గా సడక్ 2 ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సంజయ్ దత్‌తోపాటు అలియాభట్, ఆదిత్య రాయ్ కపూర్ ఈ చిత్రంలో నటించారు. జిషుసేన్ గుప్తా, గుల్షన్ గ్రోవర్, మకరంద్ దేశ్‌పాండే తదితరులు నటించారు. లాక్‌డౌన్ కారణంగా థియేటర్లు మూత పడిన నేపథ్యంలో సడక్ 2 చిత్రం డిస్నీ+హాట్ స్టార్ ఓటీటీ ద్వారా రిలీజైంది. సడక్ లాంటి గొప్ప అనుభూతిని ఈ సీక్వెల్ అందించిందా అనే విషయాన్ని తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే.

  సడక్ 2 కథ ఇలా..

  సడక్ 2 కథ ఇలా..

  భార్య పూజ (పూజా భట్) మరణంతో మానసిక వేదనకు గురైన రవి (సంజయ్ దత్) ఓ ట్యాక్సీ డ్రైవర్. తన భార్య లేని జీవితాన్ని ఊహించుకోలేని రవి తాను కూడా పూజ వద్దకు వెళ్లాలని సూసైడ్‌ ప్రయత్నాలు చేస్తుంటాడు. తన తల్లిని కోల్పోయిన బాధ‌లో ఆర్య దేశాయ్ (అలియా భట్) కైలాస పర్వతాన్ని దర్శించుకోవాలని ఇంటికి దూరంగా పారిపోతుంది. కైలాస శిఖరానికి వెళ్లే క్రమంలో ట్యాక్సీ డ్రైవర్ రవి, పూజాలు కలుసుకొంటారు. ఈ క్రమంలో ఆర్యను సొంత తల్లిదండ్రులు (జిషు సేన్ గుప్తా, ప్రియాంక బోస్) చంపాలని ప్రయత్నాలు చేస్తుంటారు. ఆర్యను చంపేందుకు ఆమె తల్లిదండ్రులకు దొంగ బాబా (మకరంద్ దేశ్‌పాండే) సహకారం అందిస్తుంటారు.

   సడక్ 2 చిత్రంలో ట్విస్టులు

  సడక్ 2 చిత్రంలో ట్విస్టులు

  కోట్లకు పడగలెత్తిన వ్యాపార కుటుంబానికి చెందిన ఆర్యను తల్లిదండ్రులే ఎందుకు చంపాలని ప్రయత్నిస్తుంటారు. ఆర్య ప్రాణాలకు ముప్పు ఉందని తెలిసిన రవి ఆమె ప్రాణాలకు అడ్డుగా నిలుస్తాడు. ఈ క్రమంలో సొంత ప్రియుడు విశాల్ (ఆదిత్య రాయ్ కపూర్) కూడా ఆ కుట్రలో భాగమవుతాడు. ఆర్యను చంపాలనే కుట్రను తెలుసుకొన్న రవి ఆమెను కాపాడేందుకు తన ప్రాణాలను అడ్డు వేస్తాడు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో తన ప్రియుడిని ఎలా మార్చింది? ఆర్య తన ప్రాణాలను ఎలా దక్కించుకొన్నది. ఏ విధంగా ఆర్యకు రక్షణగా నిలిచాడు. దొంగ బాబాల కుట్రలను ఇలా ఎదిరించాడు అనే ప్రశ్నలకు సమాధానమే సడక్ 2 చిత్రం.

  సడక్ 2 అనాలిసిస్

  సడక్ 2 అనాలిసిస్

  తన తల్లి మరణం తర్వాత వేదనకు గురైన ఆర్య దేశాయ్‌ని సొంత తండ్రి ఆమెను మానసిక రోగిగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తారు. తన సవతి తల్లి నుంచి ప్రాణాలకు ముప్పు ఉందని భావించిన ఆర్య ఇంటి నుంచి దూరంగా పారిపోతుంది. ఈ క్రమంలో రవి ట్యాక్సీ డ్రైవర్‌ను కలుస్తుంది. కైలాస పర్వతం చేరుకొనే ప్రయాణంలో జైలు నుంచి విడుదలైన ప్రియుడు విశాల్‌ జతకలుస్తాడు. ఇలా చిన్న చిన్న ట్విస్టులతో కథ నిదానంగా సాగుతుంది. ఇక ఆర్యను చంపాలనే ప్లాన్ వెనుక సొంత తండ్రి ఉన్నారనే విషయం తెలుసుకొన్న ఆర్యకు ఓ షాక్ తగులుతుంది. ఇలాంటి రొటీన్ సీన్లు, కథతో చిత్రం అత్యంత సాదాసీదాగా జరుగుతుంది. సడక్ లాంటి సీక్వెల్‌ను చూడాలని ఆశించిన ప్రేక్షకులకు సడక్ 2 నిరాశానే మిగులుస్తుంది.

  మహేష్ భట్ డైరెక్షన్ ఎలా ఉందంటే

  మహేష్ భట్ డైరెక్షన్ ఎలా ఉందంటే

  దాదాపు 20 ఏళ్ల గ్యాప్ తర్వాత సడక్‌కు స్వీక్వెల్ మహేష్ భట్ రూపొందించారనే విషయం ప్రేక్షకుల్లో అంచనాలు పెంచింది. అయితే కథ, కథనాలు ఏ మాత్రం ఆకట్టుకోలేని విధంగా లేకపోవడం సినిమాకు ప్రధాన లోపంగా మారింది. రెగ్యులర్ ఫార్మాట్‌తో కథను తెరపైన ఆవిష్కరించడం నిరాశకు గురిచేస్తుంది. సడక్ చిత్రాన్ని ఊహించుకొంటే ఈ చిత్రం ఎలాంటి అనుభూతిని పంచినట్టు అనిపించదు. సడక్‌ లాంటి ఫీల్ గుడ్ లవ్ స్టోరిని రూపొందించకలేకపోవడం దర్శకుడిగా మహేష్ భట్ విఫలమైనట్టే అని భావించవచ్చు.

  సంజయ్, అలియా, జిషు సేన్ గుప్తా యాక్టింగ్

  సంజయ్, అలియా, జిషు సేన్ గుప్తా యాక్టింగ్

  నటీనటుల విషయానికి వస్తే.. ట్యాక్సీ డ్రైవర్‌గా సంజయ్ దత్‌కు ఈ చిత్రంలో సాదాసీదా పాత్రనే దక్కింది. సంజయ్ దత్ తన పాత్ర పరిధి మేరకు పర్వాలేదనిపించాడు. ఇక కొన్ని సన్నివేశాల్లో మాత్రమే ఆలియాభట్ మెప్పించింది. చాలా కొన్ని సన్నివేశాల్లో ఆలియా భట్ భావోద్వేగం ఆకట్టుకొంటుంది. ఇక ఆదిత్య రాయ్ కపూర్ పాత్ర డమ్మీగానే కనిపిస్తుంది. ఈ సినిమాలో బాగా చెప్పుకోవాలంటే అలియా భట్ తండ్రిగా నటించిన జిషు సేన్ గుప్తా తన ఫెర్ఫార్మెన్స్ అదరగొట్టారు. జిషు సేన్ గుప్తాకు తోడుగా అలియా సవతి తల్లి పాత్రలో ప్రియాంక బోస్ ఆకట్టుకొన్నారు.

  సాంకేతిక విభాగాల పనితీరు

  సాంకేతిక విభాగాల పనితీరు

  సడక్ 2 చిత్రానికి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఫీల్‌గుడ్‌గా ఉంటుంది. షుక్రియా పాట హృదయానికి హత్తుకునేలా ఉంది. తుమ్ సే హీ, దిల్ కీ పురానీ సడక్ పాత్రలు బాగున్నాయి. ఈ సినిమా రోడ్ జర్నీ కావడంతో సినిమాటోగ్రఫి జేఐ పటేల్ తెరను అందంగా ముస్తాబు చేసింది. హిల్స్ స్టేషన్, ప్రకృతి అందాలు ఆహ్లాదంగా మార్చాయి. ఇతర సాంకేతిక విభాగాల పనితీరు ఫర్వాలేదనిపిస్తుంది.

  ఫైనల్‌గా

  ఫైనల్‌గా

  భగవంతుడి పేరుతో మూఢ నమ్మకాలను ప్రజల్లో నాటుతూ దొంగ బాబాలు చేసే కుతంత్రాలు అనే కథాంశంగా సడక్ 2 రూపొందింది. అయితే బలహీనమైన కథ, పేలవమైన కథనం సినిమాను గొప్ప ప్రేమకథగా మార్చలేకపోయింది. ఆస్తులు కోసం కుటుంబ కలహాలు, కుట్రల కథాంశం సినిమాను మరోస్థాయికి తీసుకెళ్లలేదనే చెప్పవచ్చు. దర్శకుడిగా మహేష్ భట్ పూర్తిగా విఫలమయ్యారనే చెప్పవచ్చు. ప్రేక్షకులను ఆకట్టుకోలేని ఓ సాదాసీదా చిత్రంగానే సడక్ 2 బాలీవుడ్‌లో మిగిలిపోయే అవకాశం ఉంది.

   బలం, బలహీనతలు

  బలం, బలహీనతలు

  పాజిటివ్ పాయింట్స్
  బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, పాటలు
  సినిమాటోగ్రఫి
  సంజయ్, అలియా, జిషుసేన్ గుప్తా ఫెర్ఫార్మెన్స్

  మైనస్ పాయింట్స్
  కథ, కథనాలు
  మహేష్ భట్ డైరెక్షన్

  Dil Bechara Review | Sushant Singh Rajput | Sanjana Sanghi | AR Rahman
   తెర ముందు, తెర వెనుక

  తెర ముందు, తెర వెనుక

  నటీనటులు: సంజయ్ దత్, పూజ్ భట్, అలియా భట్, ఆదిత్య రాయ్ కపూర్, జిషు సేన్‌గుప్తా, గుల్షన్ గ్రోవర్, మక్రంద్ దేశ్‌పాండే, ప్రియాంక బోస్, మోహన్ కపూర్, అక్షయ్ ఆనంద్ తదితరులు
  రచన, దర్శకత్వం: మహేష్ భట్
  నిర్మాత: ముఖేష్ భట్
  సినిమాటోగ్రఫి: జే ఐ పటేల్
  ఎడిటింగ్: సందీప్ కురుప్
  మ్యూజిక్: జీత్ గంగూలీ, అంకిత్ తివారీ, సందీద్ ముఖర్జీ, ఉర్వీ, సునీల్జీత్
  రిలీజ్ డేట్: 2020-08-28
  ఓటీటీ రిలీజ్: డిస్నీ+హాట్‌స్టార్

  English summary
  Sadak 2 is a hindi film directed by Mahesh Bhatt and produced by Mukesh Bhatt. The film is the sequel to the 1991 film Sadak. The sequel stars Sanjay Dutt, Pooja Bhatt, Alia Bhatt and Aditya Roy Kapur. It released on August 28th on Disney+ Hotstar.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X