twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సూపర్ డీలక్స్ మూవీ రివ్యూ అండ్ రేటింగ్

    |

    Rating:
    3.5/5
    Star Cast: విజయ్ సేతుపతి, ఫాహద్ ఫాజిల్, సమంత అక్కినేని, రమ్యకృష్ణ, మిస్కిన్
    Director: త్యాగరాజన్ కుమారరాజా

    విభిన్నమైన ఆలోచనలకు, కథాంశాలకు పెట్టిన పేరు తమిళ పరిశ్రమ అనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. అలాంటి ముద్ర వేసుకొన్న కోలీవుడ్‌ ప్రేక్షకులను కొత్త అనుభూతికి గురిచేసే చిత్రంగా సూపర్ డీలక్స్ చిత్రం మార్చి 29న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 2011లో అరణ్యకాండమ్ అనే చిత్రానికి దర్శకత్వం వహించిన త్యాగరాజన్ కుమారరాజా ఈ చిత్రానికి దర్శకుడు. విలక్షణ నటులు విజయ్ సేతుపతి, సమంత అక్కినేని, రమ్యకృష్ణ తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలో కనిపించారు. ఇలాంటి ప్రత్యేకతలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ తమిళ చిత్రం మంచి స్పందనను కూడగట్టుకోవడానికి కారణాలు ఏంటంటే..

    సూపర్ డీలక్స్ మూవీ స్టోరి

    సూపర్ డీలక్స్ మూవీ స్టోరి

    సమాజం అనే కిటికీలో నుంచి చూస్తే కనిపించే కొన్ని జీవితాల భావోద్వేగాలే సూపర్ డీలక్స్. మాణిక్యం అనే వ్యక్తి శిల్ప అనే ట్రాన్స్ జెండర్‌గా మారడం వల్ల కుటుంబంలో చోటుచేసుకొన్న భావోద్వేగాలు, అలాగే ట్రాన్స్ జెండర్‌గా సమాజంలో అనుభవించిన బాధలు ఈ చిత్రంలో ఓ కోణం. వెంబు (సమంత), మొగిలాన్ (ఫాహద్ ఫాజిల్) భార్యభర్తలు. ఓ ఎమోషనల్ సంఘటనతో తన మాజీ ప్రియుడితో సెక్స్‌లో పాల్గొంటుండగా అతను పక్కమీదే ప్రాణాలు వదలుతాడు. భార్య చేసిన నిర్వాకంతో కలత చెందిన భర్త మొగిల్ ఆ శవాన్ని పూడ్చిపెట్టడానికి తన అర్ధాంగితోనే ప్రయత్నాలు మొదలు పెట్టడం మరో కోణం.

     సూపర్ డీలక్స్ స్టోరిలో కోణాలు

    సూపర్ డీలక్స్ స్టోరిలో కోణాలు

    ఇక బ్లూఫిలిం చూడాలనే ఉబలాటంతో ఇంట్లో ఎవరు లేని సమయంలో నలుగురు యువకులు చేసిన ప్రయత్నం వల్ల టెలివిజన్ పగిలిపోతుంది. తల్లిదండ్రుల ఏమంటారో అనే భయంతో కొత్త టెలివిజన్ కోసం పిల్లలు ప్రయత్నించడం మరో యాంగిల్. ఏకంగా తాను చూసిన బ్లూఫిలింలో తన తల్లి (రమ్యకృష్ణ) కనిపించడంతో తట్టుకోలేక ఆమెపై కొడుకు హత్యాయత్నం చేయడానికి ప్రయత్నించడం మరో కోణం. స్త్రీలోలుడైన పోలీసు అధికారి బెర్లిన్ (భగవతి పెరుమాల్) తన కాంక్షను తీర్చుకోవడానికి వెంబు, శిల్పపై చేసిన ప్రయత్నం మరో అంశం. ఈ అంశాలన్నీ కలిసి సినిమాలో కథగా ప్రయాణం చేస్తుంటాయి.

    సూపర్ డీలక్స్‌లో మలుపులు

    సూపర్ డీలక్స్‌లో మలుపులు

    ట్రాన్స్ జెండర్‌గా శిల్ప అలియాస్ మాణిక్యం (విజయ్ సేతుపతి) ఎదుర్కొన్న సమస్యలేంటి? భర్త (ఫాహద్ ఫాజిల్) సహకారంతో ప్రియుడి మృతదేహాన్ని నాశనం చేసే క్రమంలో వెంబు (సమంత)కు ఎదురైన ఇబ్బందులేమిటి? భర్తకు వెంబుకు మధ్య జరిగిన మానసిక సంఘర్షణ ఏంటి? పోర్న్‌స్టార్ (రమ్యకృష్ణ)కు తన కుమారుడి వల్ల ఎదురైన ప్రశ్నలు ఏంటి? కుమారుడు చావు బతుకుల్లో ఉంటే తన భర్త మూఢ నమ్మకాల కారణంగా రమ్యకృష్ణ అనుభవించిన ఉద్విగ్న క్షణాలు, ఎస్సై బెర్లిన్ తన కామవాంఛలు తీర్చుకొనే క్రమంలో ఎలాంటి ఎదురుదెబ్బ తగిలింది. తన తండ్రి ఓ ట్రాన్స్ జెండర్ అని తెలుసుకొన్న కుమారుడు రాస్ కుట్టి (అశ్వనాథ్ అశ్వకుమార్) పరిస్థితి ఏంటి అనే ప్రశ్నలకు సమాధానమే సూపర్ డీలక్స్ సినిమా.

     సూపర్ డీలక్స్‌ అనాలిసిస్

    సూపర్ డీలక్స్‌ అనాలిసిస్

    సినిమా తొలి సన్నివేశం నుంచి నాలుగైదు జీవితాల్లోని ఓ కోణంతో కథ ప్రయాణిస్తుంటుంది. సమంత, ఫాహద్ దంపతుల మధ్య ఎమోషన్స్, విజయ్ సేతుపతి ట్రాన్స్ జెండర్‌గా మారడంతో భార్యలో కనిపించే భావోద్వేగాలు, తల్లి పోర్న్‌స్టార్ అని తెలిసిన తర్వాత రగిలిపోయిన కొడుకు ఇలా రకరకాల మానసిక సంఘర్షణలో తొలిభాగం సాగుతుంది. నటుడిగా మారాలనే ఫాహద్ పాత్ర ద్వారా తమిళనాడులో ఉండే సినీ నటులపై విమర్శనాస్త్రాలు ఆకట్టుకొనేలా ఉంటాయి. కులాలు, మతాలతో ఆడుకొనే ప్రభుత్వాల తీరును ఎండగట్టే ప్రయత్నం కనిపిస్తుంది. అలాగే బ్యాంకు ఏటీఎంలో డబ్బులు లేకపోవడంపై తీవ్రమైన విమర్శలు ప్రేక్షకులను ఆలోచింపజేస్తాయి. చెక్ బౌన్స్ అయితే 250 రూపాయలు వసూలు చేసే బ్యాంకులు.. ఏటీఎంలో డబ్బుల నింపకపోతే ఖాతాదారులకు 250 రూపాయలు ఎందుకు చెల్లించరు అనే పాయింట్ ఆలోచింపజేస్తాయి. ఇలాంటి సామాజిక అంశాలను పలు జీవితాల కోణంలో చెప్పించిన ప్రయత్నం గుండెను పిండేస్తుంది.

     దర్శకుడు త్యాగరాజన్ పనితీరు

    దర్శకుడు త్యాగరాజన్ పనితీరు

    సూపర్ డీలక్స్‌ గురించి చెప్పుకోవాల్సి వస్తే ముందుగా దర్శకుడు త్యాగరాజన్ కుమారరాజా విజన్‌ను, పాత్రలను మలిచిన తీరును అభినందించాల్సిందే. ప్రతీ పాత్రను సామాజిక, ఆర్థిక, రాజకీయ కోణంలో చెప్పిన తీరు ప్రశంసనీయం. దర్శకుడు మిస్కిన్, నలన్ కుమారస్వామి, నీలన్ కే శేఖర్‌తో కలిసి త్యాగరాజ కుమారరాజా రచించిన కథనం సినిమాకు ప్రత్యేక ఆకర్షణ అని చెప్పవచ్చు. పలు రకాల యాంగిల్స్‌లో కథ, కథనాలపై ఆసక్తి తగ్గకుండా వినోదం, భావోద్వేగాలు కలిపి చూపించిన విధానం హ్యాట్పాఫ్. కాకపోతే నిడివిని కాస్త తగ్గిస్తే ప్రేక్షకుడికి సినిమా మరింత చేరువయ్యే అవకాశం ఉండేది.

     సమంత అక్కినేని పెర్ఫార్మెన్స్

    సమంత అక్కినేని పెర్ఫార్మెన్స్

    సూపర్ డీలక్స్ చిత్రానికి వెన్నుముక సమంత అక్కినేని (వెంబు) నటన. భర్త లేని సమయంలో పడక గదిలో ప్రియుడు చనిపోతే పడే ఆందోళన, ఆదుర్తా, తదితర ఫీలింగ్స్‌ను సమంత చూపించిన విధానం అద్భుతమని చెప్పవచ్చు. పడక సుఖం అందిస్తే కేసు నుంచి విడిపిస్తానని పోలీస్ అధికారి చెప్పినప్పుడు.. అందుకు నిరాకరించడం.. ఆ సమయంలో చూపించిన ఎమోషన్స్ సమంతను మరో మహానటిని ఆవిష్కరించాయి. సమంతకు సంబంధించి ఇలాంటి సన్నివేశాలు ఈ సినిమాలో కేవలం శాంపిల్ మాత్రమే. అత్యంత భావోద్వేగమైన, భారమైన పాత్రలో సమంత అవలీలగా ఒదిగిపొయింని చెప్పవచ్చు.

     పోర్న్‌స్టార్‌గా రమ్యకృష్ణ

    పోర్న్‌స్టార్‌గా రమ్యకృష్ణ

    ఇక ఈ చిత్రంలో పోర్న్‌స్టార్‌గా రమ్యకృష్ణ తన కొడుకు కోసం పడే బాధను తెరపైన రక్తికట్టించింది. ఓ వైపు ప్రాణాప్రాయ స్థితిలో కొడుకు.. మరో పక్క మూఢ నమ్మకంతో భర్త (మిస్కిన్).. ఇంకో వైపు డబ్బులు పిండే వైద్యులు.. ఇలా రకరకాల మానసిక క్షోభను అనుభవించే గృహిణి పాత్రలో రమ్యకృష్ణ మరోసారి అమోఘమైన ప్రతిభను చాటారు.

    విజయ్ సేతుపతి నటనా విశ్వరూపం

    విజయ్ సేతుపతి నటనా విశ్వరూపం

    ఇటీవల కాలంలో విలక్షణమైన నటనతో దక్షిణాది ప్రేక్షకులను అలరిస్తున్న విజయ్ సేతుపతి ఓ ప్రయోగాత్మకమైన పాత్రలో అద్భుతంగా నటించాడు. మరోసారి నటనకు నిలువుటద్దంలా కనిపించాడు. ప్రతికూల సమయాల్లో ఓ స్త్రీ అనుభవించే బాధను విజయ్ సేతుపతి చూపించిన విధానాన్ని ఎవరూ కూడా ప్రశంసించకుండా ఉండలేరు. ట్రాన్స్‌జెండర్ పాత్రలో ప్రదర్శించిన హావభావాలు, ఒదిగిన తీరు నటుడిగా మరోస్థాయిని చేరుకొన్నాడని చెప్పవచ్చు.

    మానసిక సంఘర్షణకు లోనయ్యే పాత్రలో ఫాహద్

    మానసిక సంఘర్షణకు లోనయ్యే పాత్రలో ఫాహద్

    తన భార్య మరో పురుషుడితో పక్కను పంచుకొనే విషయంతో ఏ భర్తయినా మానసికంగా చితికిపోవాల్సిందే. అలాంటి సమయంలో ఓ భర్తగా, కష్టాల్లో పడిన భార్యను ఆదుకొనే వ్యక్తిగా మలయాళ నటుడు ఫాహద్ ఫాజిల్ నటన సూపర్బ్. మానసికంగా ఎన్నో విభేదాలు ఉన్నప్పటికీ.. గుండెను మనో నిబ్బరంగా చేసుకొనే వ్యక్తిగా అద్బుతంగా తెరపైన రాణించాడు. హీరోను అవుతా.. ఆ తర్వాత డబ్బు సంపాదిస్తా.. అనంతరం రాజకీయాల్లోకి వస్తా అనే డైలాగ్స్‌ చెప్పిన తీరు ప్రస్తుత పరిస్థితులకు అద్దంపట్టాయి.

     మిగితా పాత్రల్లో

    మిగితా పాత్రల్లో

    ఇంకా రమ్యకృష్ణ భర్తగా అర్బుతమ్‌గా దర్శకుడు మిస్కిన్ పాత్రలో లీనమయ్యాడు. మూఢ నమ్మకాల్లో మునిగిపోయిన భక్తుడిగా జీవించాడు. ఇక విజయ్ సేతుపతి కొడుకుగా నటించిన అశోక్ కుమార్ చివర్లో కంటతడి పెట్టించేంతగా నటించాడు. ఇక క్రూరమైన పోలీస్ ఆఫీసర్‌గా భగవతి పెరుమాల్ తనకు తానే సాటి అనిపించుకొన్నాడు. ఇలా చాలా రకాల బలమైన పాత్రలు తెర మీద కనిపిస్తాయి.

     యువన్ శంకర్ రాజా మ్యూజిక్

    యువన్ శంకర్ రాజా మ్యూజిక్

    ఎన్నో భావోద్వేగ పాత్రల మధ్య సాగే సినిమాకు యువన్ శంకర్ రాజ్ సంగీతం ప్రాణంగా నిలిచింది. పాటలు మచ్చుకైనా కనిపించవు. కానీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో యువన్ అదరగొట్టాడని చెప్పవచ్చు. 80వ దశంలో డిస్కో డ్యాన్సర్ సినిమా పాట ఐయామ్ ఏ డిస్కో డ్యాన్సర్ పాటను బ్యాక్ డ్రాప్‌గా వినిపించి ఓ ఫీల్‌గుడ్ ఫ్యాక్టర్‌ను పెంచాడు.

     ప్రొడక్షన్ వ్యాల్యూస్

    ప్రొడక్షన్ వ్యాల్యూస్

    సోషల్ రెస్పాన్సిబిలిటీ, పాలిటిక్స్‌పై విమర్శనాస్త్రాలు, ఎమోషనల్‌గా ఉండే పాత్రలను కలబోసి రూపొందిన సూపర్ డీలక్స్ సినిమాను కినో ఫిస్ట్, ఈస్ట్ వెస్ట్ డ్రీమ్ వర్క్స్ ఎంటర్‌టైన్‌మెంట్, అల్కెమీ విజన్ వర్క్స్ సంస్థలు సంయుక్తంగా రూపొందించాయి. కథ, కథనాల డిమాండ్ మేరకు ఎక్కడ రాజీ పడినట్టు కనిపించదు. కథ, కథనాలే కాకుండా సినిమాను అత్యంత బలమైన సాంకేతిక విలువలతో రూపొందించడం ఈ సినిమాకు పాజిటివ్‌గా మారింది.

    ఫైనల్‌గా

    ఫైనల్‌గా

    పలు రకాల భావోద్వేగాల సంగమం సూపర్ డీలక్స్. నాలుగు రకాల జీవితాల్లో చోటుచేసుకొన్న సంఘటనలు అత్యంత ఆసక్తికరంగా హృదయానికి హత్తకునేలా తెరకెక్కించడంలో దర్శకుడు త్యాగరాజన్ కుమారరాజా అద్భుతమైన ప్రతిభను చూపించాడు. మధ్య తరగతి జీవితాలు ప్రతిబించే నేపథ్యంగా రాజకీయ, సామాజిక కట్టుబాట్లపై అవసరమైన చోట్ల విమర్శనాస్త్రాలను సంధించాడు. ప్రభుత్వాల పనితీరును తన పాత్రల ద్వారా ఎండగట్టే ప్రయత్నం చేయడం ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణ అని చెప్పవచ్చు. అన్నివర్గాల ప్రేక్షకులను మెప్పించకపోయినా మెజార్టీ సినీ ప్రేమికులు ఈ సినిమాను భుజానికెత్తుకోవడం ఖాయం. ఇప్పటికే భారీ కలెక్షన్లతో ముందుకెళ్తున్న ఈ చిత్రం విజయం గురించి మాట్లాడుకోనవసరం లేదనుకొంటాను.

    బలం, బలహీనతలు

    బలం, బలహీనతలు

    పాజిటివ్ పాయింట్స్
    విజయ్ సేతుపతి, సమంత, రమ్యకృష్ణ యాక్టింగ్
    కథ, కథనాలు
    సినిమాటోగ్రఫి
    మ్యూజిక్

    మైనస్ పాయింట్స్
    సినిమా నిడివి
    మోతాదు మించిన అసభ్య డైలాగ్స్

    తెర ముందు, తెర వెనుక

    తెర ముందు, తెర వెనుక

    నటీనటులు: విజయ్ సేతుపతి, ఫాహద్ ఫాజిల్, సమంత అక్కినేని, రమ్యకృష్ణ, మిస్కిన్ తదితరులు
    కథ, దర్శకత్వం: త్యాగరాజన్ కుమారరాజా
    స్క్రీన్ ప్లే: మిస్కిన్, నలన్ కుమారస్వామి, నీలన్ కే శేఖర్, త్యాగరాజ కుమారరాజా
    సంగీతం: యువన్ శంకర్ రాజా
    సినిమాటోగ్రఫి: పీఎస్ వినోద్, నీరవ్ షా
    ఎడిటింగ్: సత్యరాజ్ నటరాజన్
    బ్యానర్: కినో ఫిస్ట్, ఈస్ట్ వెస్ట్ డ్రీమ్ వర్క్స్ ఎంటర్‌టైన్‌మెంట్, అల్కెమీ విజన్ వర్క్స్

    English summary
    Super Deluxe Tamil dark comedy-thriller film co-written and directed by Thiagarajan Kumararaja. It features Vijay Sethupathi, Fahadh Faasil, Samantha Akkineni, and Ramya Krishnan in leading roles in separate segments while Mysskin, Gayathrie, Naveen, Vijay Ram, Abdul Jabbar, and Bagavathi Perumal plays supporting roles. P. S. Vinod and Nirav Shah handled the cinematography, while Yuvan Shankar Raja was the music director. Directors Nalan Kumarasamy, Neelan K. Sekar and Mysskin are reportedly co-writers.The film had its theatrical release on 29 March 2019 and received critical acclaim from critics
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X