For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సంజు మూవీ రివ్యూ: మైండ్ బ్లోయింగ్.. మాస్టర్ పీస్!

By Rajababu
|

Rating:
4.0/5
Star Cast: రణ్‌బీర్ కపూర్, పరేష్ రావెల్, మనీషా కోయిరాలా, దియా మిర్జా
Director: రాజ్ కుమార్ హిరానీ

బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ జీవితం చూస్తే ఎన్నో ఆటుపోట్లు, ఎదురు దెబ్బలు కనిపిస్తాయి. అలాంటి జీవితాన్ని ఆధారంగా చేసుకొని సంజు బయోపిక్‌ను బాలీవుడ్ దర్శక, నిర్మాతలు విధు వినోద్ చోప్రా, రాజ్ కుమార్ హిరాణి ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించారు. సంజయ్ దత్ పాత్రలకి రణ్‌బీర్ ప్రవేశం చేశాడు. దియా మిర్జా, పరేష్ రావెల్, మనీషా కోయిరాల, వికీ కౌశల్ లాంటి నటులు కీలక పాత్రల్లో కనిపించారు. రిలీజ్‌కు ముందే ఎంతో భారీ అంచనాలను పెంచుకొన్న సంజు చిత్రం జూన్ 29న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సంజూ చిత్రానికి ఎలాంటి స్పందనను కలిగించిందో తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే.

Sanju First Review ‘సంజు’ మూవీ ఫస్ట్ రివ్యూ
సంజు కథ

సంజు కథ

బాలీవుడ్ దిగ్గజం, ఎంపీ సునీల్ దత్ కుమారుడైనప్పటికీ సంజయ్ దత్ జీవితం ఓ పడిలేచే కెరటం లాంటింది. పడిపోయిన ప్రతీసారి నిలిచి గెలిచాడు. ఓటమికి కుంగిపోలేదు. కష్టాలను, బాధలను ధీటుగా ఎదుర్కొన్న లైఫ్ అతడిది. జీవితంలో డ్రగ్స్ వాడటం దగ్గర నుంచి టాడా కేసులో జైలుశిక్ష అనుభవించడం, తల్లి నర్గీస్ కోల్పోవడం, కష్టాల్లో ఉన్న సమయంలోనే తండ్రి శాశ్వతంగా దూరం కావడం లాంటి ఎన్నో కోణాలు కనిపిస్తాయి. అయితే సంజయ్ ఓ టెర్రరిస్టు అని, మాఫియాతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని ఎన్నో ఆరోపణలు వచ్చాయి. వాటికి కచ్చితమైన సమాధానం మాత్రం ఎక్కడ కనిపించదు.

సంజయ్ జీవితంలోని అనేక కోణాలు

సంజయ్ జీవితంలోని అనేక కోణాలు

బాలీవుడ్‌లో ప్రవేశించిన తొలినాళ్లలో సంజయ్ దత్ డ్రగ్స్‌కు ఎందుకు బానిస అయ్యాడు? సంజయ్ డ్రగ్స్ వ్యసనం నుంచి ఎలా బయటపడ్డాడు. డ్రగ్స్ వాడకం నుంచి బయటపడటానికి ఎలాంటి కష్టాలను అనుభవించాడు? ముంబై బాంబు పేలుళ్లలో సంజయ్ దత్ పాత్ర ఏమిటి? ఏకే56 రైఫిల్‌ను ఎందుకు తన వద్ద ఉంచుకొన్నాడు? మాఫియాతో ఎందుకు సంబంధాలు పెట్టుకొన్నాడు? అనేవి చాలా మందికి అంతుపట్టని ప్రశ్నలు. ఈ ప్రశ్నలకు తెర మీద చెప్పిన సమాధానాలే సంజు బయోపిక్.

ఫస్టాఫ్ అనాలిసిస్

ఫస్టాఫ్ అనాలిసిస్

సంజయ్ దత్ టెర్రరిస్టు కాదు. మీడియా కథనాలకు అతడి జీవితం ఎలా బలైంది అనే విషయాన్ని చెప్పే ప్రయత్నంలో భాగంగా సంజును తెరకెక్కించినట్టు స్పష్టంగా అర్థమవుతుంది. ఓ జర్నలిస్టుతో జీవిత కథను రాయించడం అనే పాయింట్‌తో సంజు కథ మొదలవుతుంది. ఈ చిత్ర తొలిభాగంలో సంజయ్ దత్ బాలీవుడ్ ఎంట్రీ, డ్రగ్స్ ఎలా బానిస అయ్యాడు.. దానిని నుంచి ఎలా బయటపడ్డాడు. తన ప్రాణ మిత్రుడు ఎందుకు దూరమయ్యాడు అనే నాలుగు ప్రధాన అంశాలుగా సినిమా సాగుతుంది. ఈ చిత్రంలో రణ్‌బీర్ కపూర్ ఎక్కడా కనిపించడు.. తెర మీద సంజయ్ దత్ పాత్ర మాత్రమే కనిపించేంతగా సినిమాను తెరకెక్కించడం ఇందులో గొప్పదనం.

సెకండాఫ్ అనాలిసిస్

సెకండాఫ్ అనాలిసిస్

రెండో భాగంలో సంజయ్ దత్‌ జీవితంలోని ప్రధానమైన ఘట్టాన్ని అద్భుతమైన భావోద్వేగాలను మేలవించి ప్రేక్షకుడికి అందించే ప్రయత్నం జరిగింది. బాబ్రీ మసీదు కూలగొట్టడం, ఆ తర్వాత ముంబై నగరంపై మెమెన్ రచించిన బాంబు దాడులతో కథ సీరియస్ నోట్‌లోకి వెళ్తుంది. ఏకే56 రైఫిల్ దాచుకోవడం నేరంగా పరిగణించి టాడా కేసు మోపడం, ఆ తర్వాత టెర్రరిస్టుగా ముద్రవేసి జైలుకు పంపడం, జైలులో సంజయ్ దత్ పడిన కష్టాలను కళ్లకు కట్టినట్టు చూపించడం విధు వినోద్ చోప్రా, రాజ్ కుమార్ హిరాణి గొప్ప విజన్‌కు సాక్ష్యంగా నిలిచాయి.

దర్శకుడిగా రాజ్‌కుమార్ హిరాణి

దర్శకుడిగా రాజ్‌కుమార్ హిరాణి

సంజయ్ దత్ జీవితం వివాదాల పుట్ట. అలాంటి జీవితంలో ప్రధాన అంశాలను చాలా జాగ్రత్తగా దర్శకుడిగా రాజ్ కుమార్ హిరాణి టచ్ చేసిన తీరు శభాష్ అనే రేంజ్‌లో ఉంటాయి. సంజయ్ జీవితంలో డ్రగ్స్, సెక్స్, ఫ్రెండ్ షిప్ లాంటి కోణాలను కమర్షియల్‌ ఎలిమెంట్‌గా మలుచుకొన్నాడు. ఒక సునీల్ దత్ పాత్రలోని బాధ్యతాయుతమైన తండ్రి పాత్రను చిత్రీకరించిన తీరు అమోఘం ఉంటుంది. సంజయ్ దత్ ఓ సినీ నటుడు కాకుండా సామాన్య వ్యక్తి పడే సంఘర్షణను అద్భుతంగా తెరకెక్కించాడు హిరాణి.

సంజయ్ పాత్రలోకి రణ్‌బీర్ కపూర్

సంజయ్ పాత్రలోకి రణ్‌బీర్ కపూర్

సంజయ్ దత్ పాత్రలో రణ్‌బీర్ ఒదిగిపోయాడు. పాత్రపరంగా సంజయ్ దత్ నుంచి వీడదీయలేనంతగా రణ్‌బీర్ తన పాత్రను మహోద్బుతంగా పండించాడు. డ్రగ్స్ ఎపిసోడ్స్‌లోనూ, జైలు జీవితంలో కొన్ని సన్నివేశాల్లో రణ్‌బీర్ చూపించిన పరిణతికి ఎవరైనా ఫ్లాట్ కావాల్సిందే. రణ్‌బీర్ హావభావాలు, జైలులో రేడియో జాకీగా ఉద్వేగానికి లోనయ్యే సీన్లు ప్రేక్షకుడికి కొత్త అనుభూతిని పంచుతాయి.

పరేష్ రావెల్ సూపర్బ్

పరేష్ రావెల్ సూపర్బ్

సంజు చిత్రంలో గొప్పగా చెప్పుకొనే మరో పాత్ర పరేష్ రావెల్‌ది. అచ్చు సునీల్ దత్ మాదిరిగానే కనిపించాడనే కంటే ఆ పాత్రలో జీవించాడని చెప్పవచ్చు. డ్రగ్స్ వ్యసనం నుంచి బయటపడిన తర్వాత వచ్చే సీన్‌లోనూ, టేప్ రికార్డర్‌లో భార్య మాట్లాడిన మాటలు వినిపించే సన్నివేశం, ఇక ప్రివ్యూ థియేటర్‌లో బాంబు పేలుళ్లకు సంబంధం ఉంది అని సంజయ్‌ను ఒప్పించే క్రమంలో పరేష్ రావెల్ నటనకు దాసోహం కావాల్సిందే.

కమ్లీగా మెప్పించిన వికీ కౌశల్

కమ్లీగా మెప్పించిన వికీ కౌశల్

ఇక ఈ చిత్రంలో సంజయ్ దత్ స్నేహితుడు కమ్లేష్ కన్హాయిలాల్ కపాసి పాత్రలో వికీ కౌశల్ నటించాడు. వికీ నటన ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ. భావోద్వేగంతో కూడిన పాత్రను అద్భుతంగా పోషించి మెప్పించాడు. ఇక అతిథి పాత్రల్లో కనిపించిన మనీషా కోయిరాలా (నర్గీస్‌గా), దియా మిర్జా (మాన్యతగా), అనుష్క శర్మ (విన్నిగా) తమ పాత్రల పరిధి మేరకు సూపర్ అనిపించారు. డ్రగ్స్ వ్యాపారి పాత్రలో జిమ్ సర్బ్ ఆకట్టుకొన్నాడు.

ఇతర పాత్రల్లో

ఇతర పాత్రల్లో

ఇంకా ఈ చిత్రంలో సోనమ్ కపూర్, టుబు, బోమన్ ఇరాని, షియాజి షిండే, మహేష్ మంజ్రేకర్, అర్షద్ వార్సీ, సంజయ్ దత్ తదితరులు సందర్భోచితంగా కనిపించి అలరించారు.

ఏఆర్ రెహ్మన్ సంగీతం

ఏఆర్ రెహ్మన్ సంగీతం

సంజు చిత్రానికి ఏఆర్ రెహ్మన్, రోహన్ రోహన్, విక్రమ్ మాంత్రోసె పాటలను అందించారు. కర్ హర్ మైదాన్ ఫతే, రూబీ రూబీ, మై బదియా తు బీ బదియా అనే పాటలు ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలిగిస్తాయి. సంజయ్ వాంద్రేకర్, అతుల్ రనింగ రీరికార్డింగ్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచాయి.

టెక్నికల్ టీమ్

టెక్నికల్ టీమ్

సంజు చిత్రానికి రాజ్ కుమార్ హిరాణి స్వయంగా ఎడిటర్ బాధ్యతలను నిర్వర్తించారు. సినిమాలో ఓ సీన్ కూడా అనవసరం అనిపించకుండా హిరాణి జాగ్రత్తలు తీసుకొన్నాడు. రవి వర్మన్ సినిమాటోగ్రఫి ఓ విజ్‌వల్ ట్రీట్‌గా ఉంటుంది.

ప్రొడక్షన్ వ్యాల్యూస్

ప్రొడక్షన్ వ్యాల్యూస్

రాజ్‌కుమార్ హిరాణి ఫిల్మ్స్, విధు వినోద్ చోప్రా ఫిల్మ్స్ బ్యానర్‌పై హిరాణి, వినోద్ చోప్రాలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. వీరిద్దరు రూపొందించిన చిత్రాల్లో అత్యున్నతమైన సాంకేతిక విలువలు, ప్రతిభావంతులైన నటులకు కొదువ ఉండదు. సంజు చిత్రం అందుకు మినహాయింపు కాదు అని చెప్పవచ్చు. సంజు చిత్రంలో రిచ్ ప్రొడక్షన్ వ్యాల్యూస్ కనిపిస్తాయి.

ఫైనల్‌గా

ఫైనల్‌గా

బాలీవుడ్‌లో వచ్చిన బయోపిక్స్‌లో సంజు ఓ నోబెల్, భారతరత్న, ఫాల్కే అని చెప్పవచ్చు. సంజు చిత్రం చూసిన తర్వాత సంజయ్ దత్ వ్యక్తిగత జీవితంపై ఎవరికైనా ఎలాంటి అనుమానాలు ఉంటే అవన్నీ పటాపంచలైపోతాయి. కొన్ని కుట్రలకు బలైన సంజయ్ దత్‌పై అమాంతం సానుభూతి కంటే గౌరవం పెరుగుతుంది. గత చిత్రాల్లో మెడికల్, ఎడ్యుకేషన్, మతం లాంటి అంశాల్లోని లోపాలను ఎత్తిచూపిన హిరాణి.. ఈ సారి సెన్సేషనల్ జర్నలిజంపై విమర్శనాస్త్రాన్ని ఎక్కుపెట్టడం గమనార్హం.

బలం, బలహీనతలు

బలం, బలహీనతలు

రణ్‌బీర్ కపూర్, పరేష్ రావెల్ నటన

హిరాణి, వినోద్ చోప్రా విజన్

మాటలు, స్క్రీన్ ప్లే

సినిమాటోగ్రఫి, ఎడిటింగ్

మ్యూజిక్.. ఇంకా చాలా

మైనస్ పాయింట్స్

చెప్పుకోవడానికి ఏమీ లేవు

తెర ముందు, తెర వెనుక

తెర ముందు, తెర వెనుక

నటీనటులు: రణ్‌బీర్ కపూర్, సంజయ్ దత్, మనీషా కోయిరాలా, పరేష్ రావెల్, దియా మిర్జా, సోనమ్ కపూర్, వికీ కౌశల్, జిమ్ సర్బ్, అనుష్క శర్మ, రాజ్ కుమార్ హిరాని, విదూ వినోద్ చోప్రా తదితరులు

దర్శకత్వం: రాజ్ కుమార్ హిరాణి

నిర్మాత: విధు వినోద్ చోప్రా, రాజ్ కుమార్ హిరాణి

రచన: రాజ్ కుమార్ హిరాణి, అభిజిత్ జోషి

సంగీతం: ఏఆర్ రెహ్మన్, రోహన్, విక్రమ్

సినిమాటోగ్రఫి: రవి వర్మన్

రిలీజ్ డేట్: జూన్ 29, 2018

English summary
Sanju is a 2018 Indian biographical film directed by Rajkumar Hirani and written by Hirani and Abhijat Joshi. It was jointly produced by Hirani and Vidhu Vinod Chopra under the banners Rajkumar Hirani Films and Vinod Chopra Films respectively. The film stars Ranbir Kapoor as Indian actor Sanjay Dutt, and the story follows through various stages of Dutt's life. The film features an ensemble cast with Manisha Koirala, Paresh Rawal, Dia Mirza, Sonam Kapoor, Vicky Kaushal, Jim Sarbh and Anushka Sharma playing pivotal roles. This movie hits theatres on June 29th.
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more