twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Sardar Movie Review ఫెర్ఫార్మెన్స్‌తో ఇరగదీసిన కార్తీ.. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌ హైలెట్‌గా!

    |

    Rating:
    3.0/5
    Star Cast: Karthi, Raashi Khanna, Laila
    Director: PS Mitran

    నటీనటులు: కార్తీ, రాశీఖన్నా, విజేష విజయన్, లైలా, చంకీ పాండే తదితరులు
    దర్శకత్వం: పీఎస్ మిత్రన్
    నిర్మాత: లక్ష్మణ్ కుమార్
    సినిమాటోగ్రఫి: జార్జ్ సీ విలియమ్స్
    ఎడిటర్: రూబెన్
    మ్యూజిక్: జీవి ప్రకాశ్ కుమార్
    బ్యానర్: ప్రిన్స్ పిక్చర్స్
    రిలీజ్: 2022-10-21

    సర్దార్ కథ ఏమిటంటే?

    సర్దార్ కథ ఏమిటంటే?


    విజయ్ ప్రకాశ్ (కార్తీ) నిజాయితీ కలిగిన పోలీస్ ఆఫీసర్. సోషల్ మీడియాలో మంచి పాపులారిటీ సంపాదించుకొన్న బాధ్యతయుతమైన పోలీస్ ఆఫీసర్‌గా పేరు ఉంది. జీవితంలో ఏదో సాధించాలనే బలమైన లక్ష్యం ఉన్న లాయర్ షాలిని (రాశీఖన్నా)తో ప్రేమలో పడుతాడు. ఇదిలా ఉంటే.. వన్ లైన్ వన్ ప్రాజెక్ట్ అనే భారీ ప్రాజెక్ట్‌ను దేశవ్యాప్తంగా చేపట్టాలని ప్లాన్ చేస్తే.. రీసర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ (రా) అడ్డుకొనేందుకు ప్రయత్నిస్తుంటుంది. ఇక కథ ఇలా సాగుతుంటే.. దేశద్రోహం కేసులో ఇరుక్కుపోయిన సామాజిక కార్యకర్త సమీరా (సీనియర్ హీరోయిన్ లైలా) అనూహ్య పరిస్థితుల్లో మరణిస్తుంది. అయితే సమీరా మరణంపై విజయ్‌కి అనేక అనుమానాలు రేకెత్తుతాయి. ఇలాంటి పరిస్థితుల్లో సర్దార్ (కార్తీ)ని రంగంలోకి దించుతారు.

    సర్దార్ మూవీలో ట్విస్టులు

    సర్దార్ మూవీలో ట్విస్టులు


    వన్ లైన్ వన్ ప్రాజెక్ట్ వెనుక అసలు కుట్ర ఏమిటి? ఈ ప్రాజెక్టును షాలిని ఎందుకు అడ్డుకోవాలని చూసింది? షాలిని మరణం వెనుక వాస్తవం ఏమిటి? షాలిని దర్యాప్తులో విజయ్‌కు తెలిసిన విషయాలు ఏమిటి? ఇంతకు సర్దార్ ఎవరు? వన్ లైన్ వన్ ప్రాజెక్ట్ వెనుక అసలు కుట్ర ఏమిటి? దేశవ్యాప్తంగా వాటర్ లింకింగ్ ప్రాజెక్టును ఎందుకు అడ్డుకొవాలని చూశారనే ప్రశ్నలకు సమాధానమే సర్దార్ సినిమా కథ.

    సర్దార్ మూవీ ఫస్టాఫ్

    సర్దార్ మూవీ ఫస్టాఫ్


    సర్దార్ సినిమా తొలి భాగం ఎలాంటి హైప్స్ లేకుండా నార్మల్‌గా నడస్తుంటుంది. ఎప్పుడైతే షాలిని మరణిస్తుంందో కథలో ఊహించిన చలనం కనిపిస్తుంది. షాలిని మరణం చుట్టూ కథ సాగుతూ అనేక మలుపులు తిరుగుతుంది. ఇక దర్యాప్తు సంస్థ రా, రహస్యంగా పనిచేసే దర్యాప్తు సంస్థలు, చంకీ పాండే వ్యూహాలు ఆసక్తికరంగా సాగుతాయి. రాశీఖన్నా, కార్తీ మధ్య సన్నివేశాలు ఫీల్‌గుడ్‌గా రొమాంటిక్ యూత్‌కు గిలిగింతలు పెడుతాయి.

    సర్దార్ పాత్ర ఎంట్రీ తర్వాత

    సర్దార్ పాత్ర ఎంట్రీ తర్వాత


    సర్దార్ పాత్ర ఎంట్రీ ఇచ్చే వరకు సినిమా సాదాసీదాగానే సాగుతుంది. దేశంలోనే రహస్య గూఢచారిగా పనిచేసే సర్దార్, నిజాయితీ పోలీస్ ఆఫీసర్ మధ్య విజయ్ ప్రకాశ్ మధ్య రిలేషన్ లాంటి అంశాలు సినిమా కథను ఎమోషనల్‌గా మార్చేస్తాయి. జైలులో ఫైట్‌ను తెర మీద అద్బుతంగా చిత్రీకరించారు. సర్దార్‌కు సంబంధించిన వివిధ రకాల గెటప్స్ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలుస్తాయి. ప్రేక్షకులకు కొత్త రకమైన అనుభూతిని కలుగజేస్తాయి.

    కార్తీ పవర్‌ఫుల్ పాత్రలో

    కార్తీ పవర్‌ఫుల్ పాత్రలో


    కార్తీ ఫెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే.. పొన్నియన్ సెల్వన్ సినిమా తర్వాత తన సత్తాను నిరూపించుకొనే పాత్రలో కనిపించాడు. సినిమా భారాన్నంతా తానే మోశాడని చెప్పవచ్చు. పలు రకాల వేరియేషన్స్ ఉన్న పాత్రను సునాయసంగా పోషించాడా అనేంతగా నటించాడు. రాశీఖన్నా తన పాత్రలో ఒదిగిపోయారు. మరోసారి లాయర్ పాత్రలో ఆకట్టుకొన్నారు. ఇక చాలా రోజుల తర్వాత రీ ఎంట్రీ ఇచ్చిన సీనియర్ హీరోయిన్ లైలా ఈ సినిమాకు వెన్నముకగా మారిన పాత్రలో నటించారు. చంకీపాండే ఫర్వాలేదనిపిస్తాడు.

    సాంకేతిక విభాగాల పనితీరు..

    సాంకేతిక విభాగాల పనితీరు..


    సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. దర్శకుడు పీఎస్ మిత్రన్ రాసుకొన్న పాయింట్ అద్బుతంగా ఉంటుంది. నీటి కుంభకోణానికి సంబంధించిన కథ ప్రేక్షకుడిని ఆలోచింపజేస్తుంది. సామాజిక సమస్య ఆధరాంగా తొలిభాగంపై కొంత కసరత్తు చేసి ఉంటే... డిఫెనెట్ దక్షిణాదిలో మరో అద్బుతమైన చిత్రంగా మారి ఉండేదనిపిస్తుంది. సినిమాటోగ్రఫి, ఎడిటింగ్ విభాగాల పనితీరు బాగుంది. నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి.

    బలం, బలహీనతలు

    బలం, బలహీనతలు


    పాజిటివ్ పాయింట్స్
    కార్తీ ఫెర్ఫార్మెన్స్
    మ్యూజిక్
    సినిమాటోగ్రఫి
    డైరెక్షన్

    మైనస్ పాయింట్స్
    స్లో నరేషన్
    నిడివి

    ఫైనల్‌గా ఎలా ఉందంటే?

    ఫైనల్‌గా ఎలా ఉందంటే?


    సామాజిక అంశం, దేశభక్తి, లవ్, ఎమోషనల్, థ్రిల్లింగ్ అంశాలతో రూపొందిన చిత్రం సర్దార్. దేశం కోసం ప్రాణాలు పణంగా పెట్టే ఓ కరుడు గట్టిన రహస్య గుఢాచారి కథగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఫస్టాప్ సో..సోగా ఉన్నప్పటికీ. సెకండాఫ్ ఓ రేంజ్‌లో స్క్రీన్ ప్లేతో ఆటాడుకొన్నారు. కార్తీ నటన, లైలా ఫెర్ఫార్మెన్స్, రాశీఖన్నా గ్లామర్ ఈ సినిమా ప్రత్యేక ఆకర్షణ. సామాజిక సమస్యల ఇతివృత్తంతో వచ్చే సినిమాలను ఆదరించే వారికి, నిజాయితీ, నిస్వార్ధం పనిచేసే పోలీసులు కథను ప్రేమించే వారికి ఈ సినిమా నచ్చేస్తుంది. అయితే స్లో నేరేషన్, సినిమా నిడివి కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. ఈ సినిమా నిడివి 15 నిమిషాలు తగ్గిస్తే సినిమా రేంజ్ మారిపోతుంది. థియేట్రికల్ ఎక్స్‌పీరియెన్స్ ఉన్న చిత్రం సర్దార్. డోంట్ మిస్..

    English summary
    Karthi's latest movie Sardar has released on October 21st, 2022. Raashi Khanna, Laila are lead roles. Here is the Telugu filmibeat Exclusive review.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X