twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సెంటిమెంట్ ఫుల్ (‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' రివ్యూ)

    By Srikanya
    |

    Rating:
    2.0/5
    మధ్య తరగతి మనుష్యుల మనోభావాలు, వారి ఆంకాక్షలు, ఆలోచనలు, ఆనందాలు చుట్టూ కథలు రాసుకునే శేఖర్ కమ్ముల సినిమాలపై ప్రేక్షక లోకంలో మంచి ఎక్సపెక్టేషన్సే ఉన్నాయి. ముఖ్యంగా యూత్ ని టార్గెట్ చేసే లవ్,ఫీ ల్ గుడ్ సీన్స్ తో ఆయన విజయం సాధిస్తూ వస్తున్నారు. అయితే ఈ సారి ఆ అంచనాలుకు భిన్నంగా తన దైన శైలిని వదిలి... సెంటిమెంట్ బాట పట్టారు. మాతృదేవోభవ తరహా పాయింటుకు హ్యాపీడేస్ లాంటి ట్రీట్ మెంట్ ఇచ్చే ప్రయత్నం చేసారు. దాంతో అటు యూత్ కి, ఇటు కుటుంబానికి చెందకుండా నిరుత్సాహపరిచింది.

    సంస్థ: అమిగోస్‌ క్రియేషన్స్‌
    నటీనటులు: అభిజిత్‌, సుధాకర్‌, కౌశిక్‌, షగుణ్‌, జారా, రష్మి, కావ్య, నవీన్‌, విజయ్‌, సంజీవ్‌, శ్రీరామ్‌, అమల, శ్రియ, అంజలా జవేరి తదితరులు
    సంగీతం: మిక్కీ జె.మేయర్
    కళా దర్శకత్వం: తోట తరణి విజయ్
    ఛాయాగ్రహణం: సి.కుమార్
    ఎడిటింగ్: మార్తాండ్ కె.వెంకటేష్
    నిర్మాతలు: చంద్రశేఖర్‌ కమ్ముల, శేఖర్‌ కమ్ముల
    కథ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం: శేఖర్‌ కమ్ముల
    విడుదల: 14-09-2012

    అమల తన కొడుకు శ్రీను (అభిజీత్) ని,మిగతా ఇద్దరు పిల్లలని ఓ సంవత్సరం పాటు తనకు దూరంగా వాళ్ల మామయ్య గారి ఊరైన హైదరాబాద్ పంపుతుంది. కొత్తగా వారు చేరిన సన్‌షైన్‌ వ్యాలీ ప్రాతంలో నాగరాజ్‌ (సుధాకర్‌), అభి (కౌశిక్‌), సత్య (రష్మి), లక్ష్మి (జారా) వంటి రకరకాల పాత్రలు పరిచయమవుతాయి. ముఖ్యంగా తమ మామయ్య ఉండే మధ్య తరగతి కాలనీకు, ప్రక్కనే ఉండే డబ్బున్న వాళ్ళ కాలనీకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుందని తెలుసుకుంటారు. దానికితోడు తమ మామ కూతురు పద్దు (షగుణ్‌)తో శ్రీను ప్రేమలో పడతాడు. ఆ తర్వాత ఆ కాలనీలో మరిన్ని లవ్ స్టోరీలు ఉన్నాయని తెలుస్తుంది. ఆ ప్రేమ కథలు ఓ కొలిక్కి వచ్చాయా...కాలనీల మధ్య తగువులు ఏమిటి.... అలాగే అమల అసలు ఎందుకు తమ పిల్లలను వదిలి ఉండమని పంపింది...కథలో పారు (శ్రియ) పాత్ర ఏమిటి అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

    శేఖర్‌కమ్ముల స్వీయ దర్శకత్వంలో ఈ చిత్రం మాతృదేవోభవ చిత్రాన్ని బాగా ప్రేరణ పొందినట్లు అనిపిస్తుంది. ముఖ్యంగా అమల పాత్ర.. అప్పటి మాధవి పాత్రను గుర్తు చేస్తుంది. అలాగే రెండు కాలనీల మధ్య గొడవలు చూస్తుంటే రవిబాబు..అమ్మాయిలు..అబ్బాయిలు చిత్రం గుర్తుకు వస్తుంది. చదువు, లక్ష్యం, ప్రేమ, ఆకర్షణ... అనే పాయింట్స్ చుట్టూనే సాగినా ప్రధాన పాత్ర ని బేస్ చేసుకుని కథ సాగదు. దాంతో కథ కి ఓ లక్ష్యం అనేది ఉండకుండా సాగుంతుంది అనే ఫీలింగ్ వస్తుంది. అయితే రిచ్ కాలనీవారు పూర్తిగా మధ్య తరగతి కాలనీ వాళ్లను కుక్కల్లా చూడటం వంటి సీన్స్ మింగుడు పడవు. వాళ్లు రెగ్యులర్ సినిమాల్లో విలన్స్ లా బిహేవ్ చేయటం ఆశ్చర్యమనిపిస్తుంది.

    అలాగే హీరో, హీరోయన్స్ మధ్యన లవ్ ఎపిసోడ్స్ పండి ఉంటే హ్యాపీడేస్ తరహాలో యూత్ కి నచ్చేది. పోనీ సెంటిమెంట్ పండాలి అని.. మాతృదేవోభవ తరహాలో సాగినా...వేరే రకంగా ఉండేది. అటూ ఇటూ కాకుండా కిచిడీ కావటంతో వచ్చిన ఇబ్బంది ఇది. దానికి తోడు ఆంటీస్ ఆర్ బ్యూటీఫుల్ అన్నట్లు... శ్రియ, అంజలా జవేరి వెనక కాలనీ కుర్రాళ్లు పడటం బాగా హైలెట్ చేసారు. ఆ సీన్స్ కొంత తగ్గించి ఉంటే బాగుండేది. సీన్స్ లో కాలనీ వాళ్లు క్రికెట్ ఆడటంతో హీరోని అక్కడకి తీసుకురావటం బాగుంది. అలాగే తెలంగాణా కుర్రాడు నాగరాజు,ఆంద్రా అమ్మాయి మధ్య వచ్చే లవ్ సీన్స్ లో డైలాగ్స్ బాగున్నాయి. ఇక శ్రియ వెనక పడే కుర్రాడు కూడా చాలా బాగా చేసాడు. అయితే శ్రీయ ..ఈ ఏజ్ లో...అందాల పోటీ మిస్ ఇండియాకు ట్రై చేయటం విచిత్రం అనిపిస్తుంది.

    నటీనటుల్లో హీరోయిన్ గా చేసిన అమ్మాయి బాగా చేసింది... అలాగే నాగరాజు గా తెలంగాణా స్లాంగ్ లో మాట్లాడుతూ చేసిన కుర్రాడు కూడా బాగా చేసాడు. ఇక హ్యాపీడేస్ కి సంగీతం ప్లస్ అయితే ఈ సినిమాకు అదే మైనస్ అయ్యింది. పాటల్లో టైటిల్ సాంగ్ తప్ప ఏమీ పెద్దగా బాగోలేదు. పాటల విజువలైజేషన్ లో కూడా శేఖర్ మార్కు మిస్సైంది. సీనియర్స్ శ్రియ,అంజలా జవేరి పాత్రలుకు తగినట్లు ఆంటీలులాగానే ఉన్నారు. ఎంతగానే హైప్ చేసిన అమల పాత్ర మాత్రం బాగా నిరాశపరుస్తుంది. కెమెరా కొన్ని సీన్స్ లో హైలెట్ గా ఉంది. ఎడిటింగ్ మరింత షార్పుగా ఉండే బాగుండేది. చాలా సీన్స్ ట్రిమ్ చేయాల్సి ఉంది. ముఖ్యంగా లెంగ్త్ తగ్గించాలి.

    ఏదైమైనా శేఖర్ కమ్ముల గత చిత్రాలను దృష్టిలో పెట్టుకుని ఈ సినిమాకు వెళితే పూర్తిగా నిరాశపరుస్తుంది. ఎవరో కొత్త డైరక్టర్, కొత్త వారితో చేసారు అని చూస్తే ఓకే అనిపిస్తుంది. సెంటమెంట్ చిత్రాలు నచ్చేవారికి మాత్రం ఈ సినిమా బ్యూటిఫుల్ అనిపిస్తుంది.

    (గమనిక: వినోదం, అసభ్యం లేకపోవటం, సాంకేతిక విలువలు, కథన నైపుణ్యం తదితర అంశాల ఆధారంగా మా రేటింగ్ ఉంటుంది)

    -సూర్య ప్రకాష్ జోశ్యుల

    English summary
    Sekhar Kammula's Life is Beautiful (LIB) released today with divide talk. Life Is Beautiful is set in a colony. It is the coming-of-age story of six youngsters set in the beautiful world of a working class neighborhood. It traces the journey of the youngsters through different seasons, festivals, romances, street cricket, colony fights and family gatherings. With adulthood and its responsibilities looming, their dreams and aspirations bring them together.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X