twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Jersey First Review: అదరకొట్టిన షాహిద్ కపూర్.. ఈ మూవీకి క్రిటిక్ ఇచ్చిన సూపర్ రేటింగ్ ఎంతంటే?

    |

    నాని హీరోగా గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్లో తెరకెక్కిన జెర్సీ సుమారు మూడేళ్ల క్రితం తెలుగులో విడుదలై అంచనాలకు మించి విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో నాని నటనకు కూడా తెలుగు ప్రేక్షకుల నుంచి ప్రశంసలు వచ్చాయి. నాని కెరీర్ లోని స్పెషల్ సినిమాలలో ఒకటిగా నిలిచినా జెర్సీ సినిమా హిందీలో అదే టైటిల్ తో షాహిద్ కపూర్ హీరోగా తెరకెక్కింది. ఈ నెల 22వ తేదీన రిలీజవడానికి సిద్దంగా ఉంది. ఈ క్రమంలో ఈ సినిమా ఫస్ట్ రివ్యూ బయటకు వచ్చింది. ఆ వివరాలు

    గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం

    గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం


    'కబీర్ సింగ్'తో బ్లాక్ బస్టర్ అందుకున్న షాహిద్ కపూర్ తెలుగు సినిమాల మీద మనసు పారేసుకున్న సంగతి తెలిసిందే. 'అర్జున్ రెడ్డి రీమేక్'గా హిందీలో వచ్చిన 'కబీర్ సింగ్' తో బాలీవుడ్ బాక్సాఫీస్ ను షేక్ చేసిన ఈ హీరో ఇప్పుడు తెలుగులో నాని నటించిన 'జెర్సీ' సినిమాను బాలీవుడ్ లో అదే పేరుతో రీమేక్ చేశారు. తెలుగులో గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ సినిమా హిందీ రీమేక్ కూడా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తుండటం విశేషం.

    క్రికెటర్ కొడుకు కోసం

    క్రికెటర్ కొడుకు కోసం


    ఈ సినిమాలో నాని క్రికెటర్ గా కనిపించడానికి చాలా కష్టపడ్డారని చెప్పాలి. అదే విధంగా షాహిద్ కపూర్ కూడా క్రికెటర్ గా కనపడటానికి నిపుణుల వద్ద శిక్షణ తీసుకున్నాడు. క్రికెట్ నుంచి తప్పుకున్న ఒక క్రికెటర్ కొడుకు కోసం మళ్లీ టీమిండియాకు సెలెక్ట్ అవ్వటంలో అతను ఎదుర్కొన్న సవాళ్లు అనే కధాంశంతో ఈ సినిమాను తెరకెక్కించారు.

     జెర్సీ రిలీజ్ డేట్ మారి

    జెర్సీ రిలీజ్ డేట్ మారి


    హిందీ జెర్సీలో 'మృణాలిని ఠాకూర్' షాహిద్ కపూర్ కి జంటగా నటిస్తుంది. శరద్ కేల్కర్.. పంకజ్ కపూర్, శిశిర్ శర్మఇతర ముఖ్య పాత్రల్లో నటించగా కరోనా కారణంగా షూటింగ్ వాయిదా పడుతూ వచ్చింది. అయితే ఈ నెల 14వ తేదీనే జెర్సీ రిలీజ్ కావాల్సి ఉన్నా వేర్వేరు కారణాల వల్ల, కేజీఎఫ్2 సినిమా రిలీజ్ వల్ల జెర్సీ రిలీజ్ డేట్ మారింది.

     మొదటి రివ్యూ

    మొదటి రివ్యూ


    తాజాగా ఈ సినిమా మీద కాపీ మరక కూడా పడింది. ది వాల్ పేరుతో ఈ కథను 2007 సంవత్సరంలో ఫిల్మ్ రైటర్ అసోసియేషన్ లో రిజిస్టర్ చేసుకున్నానని రూపేశ్ జైస్వాల్ ఆరోపణలు చేశారు. ఆ సంగతి పక్కన పెడితే ఇప్పుడు ఈ సినిమా ఫస్ట్ రివ్యూ బయటకు వచ్చింది. క్రిటిక్, దుబాయ్ సెన్సార్ బోర్డు సభ్యుడిగా చెలామణీ అవుతున్న ఉమైర్ సంధూ ఈ సినిమా గురించి మొదటి రివ్యూ ఇచ్చారు.

     5కి 3.5 రేటింగ్

    5కి 3.5 రేటింగ్


    మీరు క్రికెట్‌కు విపరీతమైన అభిమాని అయితే ఈ సినిమాకు ఖచ్చితంగా వెళ్లండి, ఎందుకంటే మీరు క్రీడా సన్నివేశాల సమయంలో మీ సీటు అంచున కూర్చుంటారు. షాహిద్ కపూర్, మిగిలిన నటీనటుల కోసం ఈ సినిమా చూడాలి. చివరికి పేర్లు పడే సమయానికి వారి పాత్రలతో మిమ్మల్ని ప్రేమలో పడేలా చేస్తారని ఆయన చెప్పుకొచ్చాడు. ఇక ఈ సినిమాకు 5 కి 3.5 రేటింగ్ ఇచ్చాడు ఉమైర్.

    English summary
    Shahid kapoor's Jersey First Review is out. critic umair sandhu gave review and rating of the movie.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X