For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  She Hulk Web Series Review: మనుషులు పడే కష్టాలు లేడి సూపర్ హీరో పడితే.. షి-హల్క్ వెబ్ సిరీస్ రివ్యూ

  |

  రేటింగ్: 2.25/5

  టైటిల్: షి-హల్క్: అటార్నీ ఎట్ లా (వెబ్ సిరీస్)
  నటీనటులు: టాటియానా మాస్లానీ, మార్క్ రుఫలో, జింజర్ గోంజాగా, చార్లీ కాక్స్, టిమ్ రాత్, బెనడిక్ట్ వాంగ్ తదితరులు
  రచయిత: జెస్సికా గౌ, జాక్ కిర్బీ, మార్వెల్ కామిక్స్
  దర్శకత్వం కేట్ కొయిరో, అను వాలియా
  సంగీతం: అమీ డోహెర్టీ
  ప్రొడక్షన్ హౌజ్: మార్వెల్ స్టూడియోస్
  విడుదల తేది: ఆగస్టు 18-అక్టోబర్ 13 (ఎపిసోడ్స్ 9)
  ఓటీటీ: డిస్నీ ప్లస్ హాట్ స్టార్

  మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్

  మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్

  హాలీవుడ్ లో ఎమ్ సీయూ (మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్) చిత్రాలకు, వెబ్ సిరీస్ లకు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఎందుకంటే ఈ సంస్థ నుంచి వచ్చే సినిమాలన్ని సూపర్ హీరోస్ ఫిలీంస్ కాబట్టి. ఈ సినిమాటిక్ యూనివర్స్ నుంచి ఇప్పటివరకు 29 సినిమాలు, 16 వెబ్ సిరీస్ లు వచ్చాయి. అయితే ఇంతకుముందు మార్వెల్ సినిమాల్లో హైలెట్ అయిన క్యారెక్టర్లను వెబ్ సిరీస్ ల ద్వారా తీసుకొచ్చేవారు. కానీ ఈ ఏడాది నుంచి మాత్రం సూపర్ హీరోలను వెబ్ సిరీస్ ల ద్వారా డైరెక్ట్ గా పరిచయం చేస్తున్నారు. ఇటీవల మూన్ నైట్ వంటి క్యారెక్టర్ ను ఇంట్రడ్యూస్ చేసిన మార్వెల్ తాజాగా 'షి-హల్క్' ను వెబ్ సిరీస్ ద్వారా పరిచయం చేసింది. మరి ఈ మార్వెల్ 'షి-హల్క్' ఎలా ఉందో రివ్యూలో చూద్దామా!

   కథ

  కథ


  జెన్నిఫర్ వాల్టర్స్ (టాటియానా మాస్లానీ) కు సూపర్ హీరోలు అంటే అస్సలు నచ్చదు. తను తన జీవితాన్ని అమెరికాలో న్యాయవాదిగా సర్వీస్ చేస్తూ జీవించాలనుకుంటుంది. కానీ జెన్నిఫర్ కజిన్ బ్రూస్ బానర్ అలియాస్ హల్క్ (మార్క్ రుఫలో) కలిసి కారులో ప్రయాణిస్తుంటారు. అప్పుడు జరిగిన ఒక ప్రమాదం వల్ల అనుకోకుండా బ్రూస్ లోని శరీరానికి తగినట్లు మార్చుకునే గామా కిరణాలు జెన్నిఫర్ వాల్టర్స్ లోకి ప్రవేశిస్తాయి. దీంతో ఆమె ఒక్కసారిగా షి-హల్క్ గా మారిపోతుంది. కానీ అలా బతకడం అస్సలు నచ్చదు. అందుకే బ్రూస్ బానర్ నుంచి వెళ్లిపోయి లాయర్ గా పనిచేస్తుంది. అప్పుడు కోర్టులో జెన్నిఫర్ వాదిస్తుండంగా తలెత్తిన ప్రమాదంతో షి-హల్క్ గా మారి అందరిని కాపాడుతుంది. దీంతో లాయర్ జెన్నిఫర్ ఒక షి-హల్క్ అని తెలుస్తుంది. అప్పటి నుంచి జెన్నిఫర్ కు ఎదురైన సవాళ్లు ఏంటి? షి-హల్క్ అనే ట్యాగ్ ను తను ఉంచుకోవాలనుకుందా? ఆమెను నాశనం చేద్దామని ఎవరనుకున్నారు? లాయర్ గా ఆమె టేకప్ చేసిన కేసులేంటి? అనే తదితర విషయాలు తెలియాలంటే ఈ 'షి హల్క్: అటార్నీ ఎట్ లా' కచ్చితంగా చూడాల్సిందే.

  విశ్లేషణ

  విశ్లేషణ


  మార్వెల్ సిరీస్ నుంచి ఒక సూపర్ హీరో సినిమా వస్తుందంటే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉంటాయి. అందులోను హల్క్ చిత్రాలకు ఎంతమంది అభిమానులు ఉన్నారో ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. హల్క్ అనే సూపర్ హీరో చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్లకు ఎంతో ఫేవరెట్. అలాంటిది హల్క్ గా ఒక అమ్మాయి పాత్రను తీసుకొస్తున్నారని తెలియగానే ఆ సిరీస్ పై ఎన్నో అంచనాలు ఏర్పడ్డాయి. అయితే మార్వెల్ మాత్రం ఇంతకుముందులా బ్యాడ్ విలన్స్ ను చితకొట్టి ప్రజలందరిలో సూపర్ హీరో అయ్యేటువంటి నేరేషన్ తో సినిమాలు, వెబ్ సిరీస్ లను తీసుకురావట్లేదనే చెప్పవచ్చు. ఇటీవల వచ్చిన మూన్ నైట్ వెబ్ సిరీస్ లో కూడా విలన్స్ కు బ్యాడ్ బాయ్ లా కాకుండా తనలోని త్రీ డిఫరెంట్ షేడ్స్ ఏంటీ వాటిని ఎలా అధిగమించాడో వంటి అంశాలపైనే ఎక్కువ ఫోకస్ పెట్టి తెరకెక్కించారు.

  సూపర్ హీరోలా

  సూపర్ హీరోలా


  ఇప్పుడు షి హల్క్ లో కూడా తను ఒక్కసారిగా సూపర్ హీరోలా మారాక ఆ పవర్ ను ఎలా అధిగమించింది.. అటు లాయర్ గా ఇటు భారీ కాయం ఉన్న, అందరికన్న విభిన్నంగా ఉండే అమ్మాయిగా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసింది వంటి విషయాలపైనే సిరీస్ మొత్తం సాగింది. అటు లాయర్ గా ఇటు సగటు అమ్మాయి ఉండే కోరికలు (బాయ్ ఫ్రెండ్, డేటింగ్) వంటి వాటిని కామెడీ తరహాలో చూపించారు. జెన్నిఫర్.. హల్క్ లా మారాక తన కజిన్ బ్రూస్ బానర్ వద్ద తీసుకునే శిక్షణ కామెడీగా, వాళ్లిద్దరి మధ్య వచ్చే ఫైటింగ్ ఆకట్టుకుంది. తర్వాత జెన్నిఫర్ వాల్టర్ గా, షి-హల్క్ గా రకరకాల అబ్బాయిలతో చేసే డేటింగ్ ఫన్నీగా ఉంటుంది. షి హల్క్ కు కూడా ఎవరు భయపడకుండా ఉండటం, ఆమె సైతం ఒక మనిషిగా ఒక అమ్మాయిగా ప్రజలందరూ చూస్తారు అన్నట్లుగా చూపించారు. కోపం వచ్చి హల్క్ గా మారనంతవరకు ఆమెను ఒక సగటు మనిషిగానే ట్రీట్ చేస్తారు.

  సాహోసోపేత సన్నివేశాలే

  సాహోసోపేత సన్నివేశాలే

  అంటే ఇంతకుముందు సూపర్ హీరోస్ మూవీస్ లలో వారికి సంబంధించిన గ్రూప్ తో మాత్రమే ఎక్కువ ఉన్నట్లు మాత్రమే చూపించారు. అవేంజర్స్ అందరూ గ్రూప్ గా ఫామ్ అయి విలన్స్ ని మట్టుబెడతారు. లేదా వారి వారి ఇండివిడ్యువల్ స్టోరీస్ లలో ఎక్కువగా సాహోసోపేత సన్నివేశాలే ఉండేవి. కానీ షి హల్క్ లో మాత్రం ఒక సగటు మనిషి ఎలా జీవిస్తుందో చూపించారు. తన పేరు చెడగొట్టే విరోధులు, తనకు ఆ పవర్స్ రావడంతో ఓర్వలేని వాళ్లు, ఆమెపై కూడా కేసులు వేయడం, నోటీసులు వంటివి చేయడం, వాటికోసం ఆమె పోరాడటం వంటివే కనిపించాయి. ఇక మధ్యలో షో ఎలా రన్ అవుతుంది, గెస్ట్ క్యారెక్టర్స్ గురించి వంటి రియాలిటీకి సంబంధించిన విషయాలు (మార్వెల్ సినిమాలపై ఆడియెన్స్ కున్న అభిప్రాయాలు) హీరోయిన్ తో చెప్పించడం వంటివి సగటు ప్రేక్షకుడి ఆలోచనను ప్రతిబింబిస్తాయి.

  ఎవరెలా చేశారంటే

  ఎవరెలా చేశారంటే


  ప్రధాన పాత్రలో షి హల్క్ గా టాటియానా మాస్లానీ ఆకట్టుకుంది. సగటు అమ్మాయిగా, లాయర్ గా, షి హల్క్ గా చక్కగా చేసిందనే చెప్పవచ్చు. ఇక అతిథి పాత్రల్లో మెరిసిన డేర్ డెవిల్ (చార్లీ కాక్స్), వాంగ్ (బెనెడిక్ట్ వాంగ్) గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎప్పటిలానే అదరగొట్టారు. నటీనటుల నటన బాగుంది. మ్యూజిక్ కూడా పర్వాలేదనిపించింది. 8వ ఎపిసోడ్ చివరిలో వచ్చే ట్విస్ట్ కొద్దిగా బాగుంటుంది. అదే చివరి ఎపిసోడ్ లా ఉంటుంది. కానీ లాస్ట్ ఎపిసోడ్ అంతగా ఆకట్టుకోదు. క్లైమాక్స్ కొత్తగా ట్రై చేసినట్లు అనిపించింది. బాగుంది అనడం కన్నా కొత్తగా ఉంది అని మాత్రమే చెప్పవచ్చు. ఇక ఎపిసోడ్ చివరగా బ్రూస్ బానర్ ఒక వ్యక్తితో తిరిగిరావడం ట్విస్ట్ అనే చెప్పవచ్చు. ఆ ట్విస్ట్ కు సంబంధించిన సిరీస్ లేక సినిమాలు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఫైనల్ గా చెప్పాలంటే.. అసలే లేని యాక్షన్ ఎపిసోడ్ లతో అంతగా ఆకట్టుకోని కామెడీతో ఈ షి-హల్క్ పర్వాలేదనిపిస్తుంది.

  English summary
  Tatiana Maslany Mark Ruffalo Starrer She Hulk Attorney At Law Web Series Review And Rating In Telugu.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X