twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    '180' కాదు 108 (సిద్దార్ధ కొత్త చిత్రం రివ్యూ)

    By Srikanya
    |


    నటీనటులు: సిద్దార్థ‌, నిత్యమీనన్‌, ప్రియా ఆనంద్‌, మౌళి, తనికెళ్ళ భరణి, గీత, లక్ష్మీ, రామకృష్ణన్‌, జానకి నటేష్‌ తదితరులు.
    కెమెరా: బాలసుబ్రహ్మణ్యమ్‌
    సంగీతం: శరత్‌
    ఎడిటింగ్‌: కిషోర్‌
    ఆర్ట్‌: సెల్వమణి, విజువల్‌: రమేష్‌
    మాటలు: కుమరన్‌
    నిర్మాతలు: కిరణ్‌రెడ్డి,స్వరూప్‌రెడ్డి. సి.శ్రీకాంత్‌,
    దర్శకత్వం: జయేంద్ర

    సిద్దార్ద సుడి బాగుండినట్లు లేదు. ఏదో చేద్దామనుకూంటేంటే అదేదో అవుతున్న బాపతులా అతని సినిమాలన్నీ వరసగా బోల్తా పడుతున్నాయి. ఎంతో క్లాస్ గా, ఓ దృశ్య కావ్యంలా మలుద్దామనుకున్న అతని తాజా చిత్రం 180 కూడా ఎమోషన్స్ లేని అందమైన పెయింటింగ్ లా మిగిలిపోయింది. విజువల్ ట్రీట్ గా కనిపించే ఈ చిత్రం కథా,కథన పరంగా మైనస్ గా మారి సగటు ప్రేక్షకుడుకి మహా నసగా విసిగించింది. ఫస్టాఫ్ బాగానే ఉన్నా సెకెండాఫ్ సినిమాను సర్వనాశనం చేసేసింది.

    అమెరికా నుంచి ఇండియాకు వచ్చిన అజయ్‌ (సిద్దార్థ్‌) ఓ ఆరు నెలలు(180 రోజులు) ఇక్కడే ఉండాలని నిర్ణయించుకుంటాడు. 'నిన్నటి గురించి ఆలోచన లేదు. రేపటి గురించి భయం లేదు. ఈ రోజే నాకు ముఖ్యం' అన్న కాన్సెప్ట్ తో ఆనందంగా ప్రతీ క్షణాన్ని అనుభవిస్తూ బ్రతుకుతూంటాడు. అతని లైఫ్ స్టైయిల్ ని చూసి ముచ్చటపడిన ఫోటో జర్నలిస్ట్ విద్య(నిత్యా మీనన్) అతనితో ప్రేమలో పడిపోతుంది.అయితే ఆమె ప్రేమను అజయ్ ఏక్సెప్ట్ చేయడు. అంత చక్కని అమ్మాయి ప్రేమని ఒప్పుకోకపోవటానికి కారణం ఏమిటి..అతని గతం ఏమిటి..అసలు ఈ ఆరు నెలల స్కీమ్ ఏమిటీ..ప్రియా ఆనంద్ కి కథలో పాత్ర ఏమిటి అన్న విషయాలు తెలియాలంటే..సినిమా చూడాల్సిందే.

    సిద్దార్ధ గతంలో ఎంతో ఇష్టపడి చేసిన 'ఓయ్‌'ని గుర్తు చేస్తూ సాగే ఈ చిత్రం ఎండ్ సస్పెన్స్ ను మెయింటైనా చేస్తూ కథనం నడిపారు. హీరోకి కాన్సర్ అందుకే ఇండియాకు వచ్చాడనే సంగతి మార్నింగ్ షో నుంచి బయిటకు వచ్చాక అందరికీ తెలిసిపోతుంది.అందులో అంత సాగితీసి ముడివిప్పే అంత సస్పెన్స్ లేదని కధా రచయిత కూడా అయిన దర్శకుడు గమనించలేకపోయాడు. దానికి తోడు కామిడీలోనూ,సెంటిమెంట్ లోనూ సస్పెన్స్ ఉండకూడదనే మినిమం బేసిక్ ను కూడా ఈ సినిమా పాటించలేకపోవటం కూడా స్క్ర్రీన్ ప్లే పరంగా ఇబ్బంది పరిచే అంశం.

    నటుడుగా సిద్దార్ధ,నిత్యామీనన్, ప్రియా ఆనంద్ ముగ్గురూ మంచి మార్కులే వేయించుకున్నారు. అలాగే నూతన దర్శకుడు జయేంద్ర కూడా సినిమాను తన గతానుభవం(యాడ్ ఫిల్మ్ డైరక్టర్)తో మంచి యాడ్ లాగ తీర్చిదిద్దాడు. అయితే సినిమాకు కెమెరాపనితనం తప్ప కధా పరంగా ఉండే ఎమోషన్స్ కు చోటు లేకుండా చేయటంతో చూసే ప్రేక్షకుడుకి సినిమా దగ్గర కాలేకపోయింది. అందులోనూ చక్రం సినిమాను గుర్తు చేసే కాన్సర్ కథనం ప్రేక్షకుడుని బాగా చిరాకు పరిచే అంశం. దాంతో అంత విజువల్ ట్రీట్ బూడిదలో పోసిన పన్నీరుగా మిగిలింది.పాటల్లో ''ఊలలూఊహే.. అలుపికలేదు. వయసిక రాదు..' అనే పాట బాగుంది. డైలాగుల్లో ఏదో పంచ్ మిస్సైనట్లు అనిపిస్తుంది.

    ఇక ఇప్పటికే సిద్దార్ద సినిమాలు మల్టిప్లెక్స్ అనే ముద్రను వేసాయి.దాన్ని ఈ చిత్రం మరింత ముందుకు తీసుకు వెళ్ళుతుంది. అయితే సిద్దార్ధలోనూ, దర్శకుడులోనూ ఏదో కొత్తగా చేయాలనే తపన ముచ్చటపడేటట్లు చేస్తుంది. విజువల్స్ కొత్తగా ఉన్నాయి కదా అని ఫిక్స్ అయితే ఓ సారి చూడొచ్చు...కథే కావాలనుకుంటే మాత్రం అటు వైపు వెళ్ళటం అనవసరం.

    English summary
    Siddharth has seen a series of duds in Telugu and right now he is pinning all his hopes on his latest flick 180. The film is directed by famous by ad filmmaker Jayendra.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X