twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Sindhooram movie review ఆలోచింపజేసే నక్సల్స్, పోలీస్ డ్రామా.. నటీనటుల ఫెర్ఫార్మెన్స్ బలంగా!

    |

    నటీనటులు: శివ బాలాజీ, ధర్మ, బ్రిడిగా సాగా, రవి వర్మ, ఆనంద చక్రపాణి, మీర్, నాగ మహేష్, దయానంద రెడ్డి తదితరులు
    దర్శకత్వం: శ్యామ్ తుమ్మలపల్లి
    రచన: కిషోర్ శ్రీ కృష్ణ
    నిర్మాత: ప్రవీణ్ రెడ్డి
    మ్యూజిక్: గౌవ్రా హరి
    సినిమాటోగ్రఫి: కేశవ్
    ఎడిటింగ్: జస్విన్ ప్రభు
    బ్యానర్: శ్రీ లక్ష్మీ నర్సింహా మూవీ మేకర్స్
    రిలీజ్ డేట్: 2023-01-26

    ఖమ్మం జిల్లా పినపాక‌కు చెందిన రవి (ధర్మ), శిరీష (బ్రిడిగా సాగా) కాలేజీలో ఫ్రెండ్స్. ధర్మ బాడ్మింటన్‌లో జాతీయ స్థాయిలో ఆడాలని కలలు కంటాడు. శిరీష ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించి తన సొంత ఊరుకు ఎంఆర్‌వోగా వస్తుంది. రవి, శిరీషకు ఒకరంటే మరొకరికి చెప్పలేనంత ప్రేమ ఉంటుంది. అయితే ఓ కారణంగా బాడ్మింటన్ ఆటకు దూరమై ధర్మ నక్సల్స్ సానుభూతిపరుడిగా మారుతాడు. ఉద్యోగాన్ని వదిలేసి శిరీష రాజకీయాల్లోకి వస్తుంది. అయితే శిరీషను అదే ప్రాంతంలోని సింగన్న (శివబాలాజీ) దళం టార్గెట్ చేస్తుంది.

    Sindhooram movie review and rating: Bigg Boss Telugu Winner Siva Balajis emotional drama

    ధర్మ బాడ్మింటన్ ఆటకు దూరమై నక్సల్స్‌తో ఎందుకు చేతులు కలిపాడు? శిరీష ఎంఆర్వో ఉద్యోగాన్ని వదిలి రాజకీయాల్లోకి చేరింది? నక్సల్స్‌ను, ధర్మను మార్చేందుకు శిరీష ఎందుకు ప్రయత్నించింది? నక్సల్స్‌తో చేతులు కలిపిన తర్వాత ధర్మ ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడు? కథలో రైతుకూలి సంఘం నాయకుడు నరసింహం‌ను, రాజకీయ నేత ఈశ్వర్ రెడ్డి (రవివర్మ)ను ఎవరు హత్య చేశారు. పోలీసులకు, నక్సల్స్ మధ్య పోరాటం వల్ల గ్రామస్థులు ఎలా నలిగిపోయారు? చివరకు ధర్మ, శిరీష ఒక్కటయ్యారా? నక్సల్స్, పోలీసుల పోరాటానికి ఎవరెవరు బలయ్యారు? అనే ప్రశ్నలకు సమాధానమే సిందూరం సినిమా కథ.

    80 నుంచి 90 దశకంలో తెలంగాణ ప్రాంతంలో జరిగిన పలు సంఘటనలు, వాస్తవ సంఘటనల ఆధారంగా సిందూరం సినిమాను శ్యామ్ తుమ్మలపల్లి తెరకెక్కించారు. ఇప్పటికే ఇలాంటి సంఘటనలు, పోరాట సన్నివేశాలు చాలా సినిమాలో వచ్చాయి. కానీ ఈ చిత్రంలో ఓ కొత్త పాయింట్‌తో ప్రేక్షకులను ఆలోచించేలా దర్శకుడు ప్రయత్నించడం ఈ సినిమాకు ప్లస్ పాయింట్ అని చెప్పవచ్చు. నక్సల్స్, పోలీసుల మధ్య నలిగిపోయిన ప్రజల జీవితాలు, గ్రామ రాజకీయాల కారణంగా రైతులు వ్యధలను తెరపైన చెప్పేందుకు దర్శకుడు ప్రయత్నించిన తీరును అభినందించాల్సిందే. దర్శకుడు శ్యామ్ ఎంచుకొన్న పాయింట్.. కథగా, సన్నివేశాలుగా విస్తరించిన తీరు బాగుంది. కానీ ఇంకా ఏదో ఎమోషనల్ టచ్ మిస్ అయిందనే ఫీలింగ్ కలుగుతుంది.

    Sindhooram movie review and rating: Bigg Boss Telugu Winner Siva Balajis emotional drama

    సిందూరం సినిమాను నటనకు కొత్తవాళ్లైనా తమిళనటి, మాస్టర్‌లో నటించిన బ్రిడిగా సాగా, ధర్మ సినిమా భారాన్ని ఇద్దరే తమ భుజాల మీద మోశారు. బ్రిడిగా సాగా శిరీషగా అద్బుతమైన ఫెర్ఫార్మెన్స్‌ ప్రదర్శించి ఆకట్టుకొన్నారు. విద్యార్థిగా, ప్రభుత్వ ఉద్యోగిగా, రాజకీయ నేతగా, సమాజాన్ని ఉద్దరించాలనే తపన ఉన్న యువతిగా చాలా వేరియేషన్స్ ఉన్న పాత్రను సమర్ధవంతంగా పోషించింది. ధర్మకు తొలి చిత్రమైన భారమైన పాత్రను సక్సెస్‌ఫుల్‌గా పోషించడమే కాకుండా ప్రేక్షకులపై ఇంపాక్ట్ కూడా తెచ్చేలా నటించారు. సరైన కథలు ఎంచుకొంటే మంచి ఆర్టిస్టులుగా పేరు తెచ్చుకొనే అవకాశం ఉంది.

    మిగితా పాత్రల విషయానికి వస్తే.. దళనాయకుడు సింగన్నగా శివ బాలాజీ ఒక విభిన్నమైన పాత్రతో ప్రేక్షకులకు సర్‌ప్రైజ్ ఎలిమెంట్‌గా మారుతాడు. ఆయన హావభావాలు, కీలక సన్నివేశాల్లో యాటిట్యూడ్ కొత్తగా ప్రజెంట్ చేశారు. ఈశ్వర్ రెడ్డిగా రవి వర్మ మరోసారి మంచి పాత్రలో ఒదిగిపోయారు. ఇటీవల కాలంలో బలమైన పాత్రలతో మెప్పిస్తున్న రవివర్మ మరోసారి మంచి పాత్రతో ఆకట్టుకొన్నారు. నరసింహులుగా ఆనంద చక్రపాణి కథను మలుపు తిప్పే భావోద్వేగమైన పాత్రలో నటించారు. రెబెల్ పాత్రలో ఆనంద చక్రపాణి ఒదిగిపోయారు. ఇప్పటి వరకు పెద్ద చిత్రాల్లో చిన్న చిన్న పాత్రలతో ఆకట్టుకొనే నాగ మహేష్, దయానందరెడ్డి ఈ చిత్రంలో ప్రభావవంతమైన పాత్రలో మెప్పించారు. ఈ చిత్రంలో నటించిన ప్రతీ ఒక్కరు తమ పాత్రలకు న్యాయం చేశారనే చెప్పాలి.

    Sindhooram movie review and rating: Bigg Boss Telugu Winner Siva Balajis emotional drama

    సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. కేశవ్ అందించిన సినిమాటోగ్రఫి చాలా బాగుంది. ప్రతీ సీన్ చూస్తే.. పచ్చని అడవి తల్లి ఒడిలో సేద తీరినట్టు అనిపిస్తుంది. వాగులు, వంకలు, అడవి ప్రాంతాన్ని బాగా క్యాప్చర్ చేశారు. గౌవ్రా హరి బీజీఎం, పాటలు బాగున్నాయి. ఎడిటింగ్ విషయానికి వస్తే.. 10 నిమిషాలు లెంగ్త్ ట్రిమ్ చేయాల్సి ఉందనిపిస్తుంది. ఎడిటర్‌గా జస్విన్ ప్రభు తన విధిని సక్రమంగా నిర్వర్తించారు. శ్రీ లక్ష్మీ నర్సింహా మూవీ మేకర్స్, నిర్మాత ప్రవీణ్ రెడ్డి అనుసరించిన నిర్మాణ విలువలు బేషుగ్గా ఉన్నాయి.

    దారి తప్పిన నక్సల్స్ ఉద్యమాలు, గ్రామీణ రాజకీయాల్లో ఉండే కుళ్లు, కుతంత్రాలపై ఎక్కుపెట్టిన విమర్శనాస్త్రం సిందూరం. కంటెంట్, కాన్సెప్ట్ బలంగా ఉన్న చిత్రమని చెప్పవచ్చు. నటీనటుల పెర్ఫార్మెన్స్, సాంకేతిక విలువలు పుష్కలంగా ఉన్నాయి. సామాజిక సందేశంతో వచ్చిన ఓ మంచి ఫీల్ గుడ్ సినిమా. అయితే ఈ తరహా జోనర్‌కు టార్గెట్ ఆడియెన్స్ కరువయ్యారు. బీ, సీ సెంటర్ల ప్రేక్షకులను ఈ సినిమా ఆకట్టుకొంటే మంచి విజయమే దక్కే అవకాశం ఉంది. ఈ సినిమా థియేట్రికల్‌గా ఎలా చేస్తుంది. సామాజిక వర్గాలు ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.

    English summary
    Tamil Actress Bridiga Saga, debutant Dharma's Sindhooram hits the Theatres on January 26th. Here is the Filmibeats exclusive review.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X