twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Prince movie Review: శివకార్తికేయన్ కామెడీ కేక.. కానీ క్యాష్ అనుదీప్ షాక్ ఇచ్చాడుగా!

    |

    Rating: 2.75/5

    డాన్, డాక్టర్ సినిమాలతో తెలుగు వారికి కూడా కొంత దగ్గరైన శివకార్తికేయన్ ఈసారి టాలీవుడ్ డైరెక్టర్ అనుదీప్ తో చేసిన ప్రిన్స్ సినిమా తెలుగు తమిళంలో ఒకేసారి విడుదలయ్యింది. సినిమాలో సత్యరాజ్ హీరో తండ్రి పాత్రలో నటించగా ఉక్రెయిన్ కు చెందిన నటి మరియా ర్యాబోషప్కా హీరోయిన్ పాత్రలో నటించింది. ఇక జాతిరత్నాలు ఫేమ్ అనుదీప్ డైరెక్ట్ చేసిన సినిమా కావడంతో ఈ సినిమా కోసం ఓ వర్గం ఆడియెన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూశారు. ఫైనల్ గా అక్టోబర్ 21న వచ్చిన ఈ సినిమా ఎలా ఉంది అనేది పూర్తి రివ్యూలో తెలుసుకుందాం పదండి..

    కథ

    కథ

    విశ్వనాథం (సత్యరాజ్) కుల మతాలు తేడా చూపకుండా అందరూ కలిసి మెలిసి ఉండాలి అనుకునే వ్యక్తి. ఇక స్కూల్ టీచర్ గా వర్క్ చేసే ఆయన కుమారుడు ఆనంద్ (శివకార్తికేయన్) తన స్కూల్ లోనే టీచర్ గా ఉన్న జెస్సిక (మరియా ర్యాబోషప్కా) అనే అమ్మాయిని లవ్ చేస్తాడు. అయితే ఇంగ్లండ్ కు చెందిన జెస్సిక తండ్రి మాత్రం ఇండియన్స్ ని ఏ మాత్రం ఇష్టపడడు. ఆయన మరోవైపు సత్యరాజ్ గ్రామానికి చెందిన వ్యక్తితో ఒక విషయంలో గోడవపడుతూ ఇండియన్స్ పై మరింత ద్వేషాన్ని పెంచుకుంటాడు. జెస్సిక కూడా ఆనంద్ ను లవ్ చేయడంతో ఆమె తండ్రి ఏ మాత్రం ఒప్పుకొడు.

    సినిమాలో ట్విస్టులు

    సినిమాలో ట్విస్టులు

    ఆనంద్ తో జెస్సిక ఎందుకు ప్రేమలో పడుతుంది? అలాగే జెస్సిక తండ్రి కూడా అసలు ఇండియన్స్ అంటేనే ఎందుకు ఇష్టపడడు?. జెస్సిక ఆనంద్ ప్రేమను మొదట ఒప్పుకున్న విశ్వనాథం (సత్యరాజ్) ఒక విషయం తెలుసుకున్న తరువాత మాత్రం ఒప్పుకొడు. ఒకవైపు జెస్సిక తండ్రి మరోవైపు ఆనంద్ తండ్రి ఇద్దరు కూడా వారి ప్రేమ విషయాన్ని అంగీకరీంచారు. అసలు రెండు వర్గాలకు ఉన్న ప్రాబ్లం ఏమిటి? ఇక శివకార్తికేయన్ ను వారి గ్రామం నుంచి వెలివేయడానికి కారణం ఏమిటి? అనేది ఈ సినిమాలోని అసలైన ట్విస్టులు.

    ప్రిన్స్ ఫస్టాఫ్‌లో

    ప్రిన్స్ ఫస్టాఫ్‌లో

    హీరో ఆనంద్ ను వారి గ్రామం నుంచి వెలివేయడం నుంచి ఒక ఫ్లాష్ బ్యాక్ తో ప్రిన్స్ కథ స్టార్ట్ అవుతుంది. స్కూల్ టీచర్ గా అల్లరిగా తిరుగుతూ ఉండే ఆనంద్ తన స్టూడెంట్స్ తో కూడా సరదాగా ఉంటాడు. కొన్ని కామెడీ సన్నివేశాలు హైలెట్ అయ్యాయి. ఇక అదే స్కూల్ లో టీచర్ గా ఉన్న జెస్సికతో ఆనంద్ ప్రేమలోకి దించాలని ఎన్నో అల్లరి ప్రయత్నాలు చేస్తాడు. వారి మధ్య లవ్ సీన్స్ కూడా కొన్ని ఎమోషనల్ గా కనెక్ట్ అవుతాయి. అతని అమాయకత్వం చూసి జెస్సిక ప్రేమలో పడుతుంది. ఫ్యామిలీతో ఇంగ్లండ్ కు తిరిగి వెళ్లిపోవాలి అనుకున్న జెస్సిక తండ్రికి భూపతి (ప్రేమ్ కుమార్ గంగై అమరెన్) నుంచి ఒక ఇబ్బంది ఎదురవుతుంది. ఇక ఆ సమస్య జెస్సిక, ఆనంద్ ల ప్రేమ పై ప్రభావం చూపిస్తుంది.

    సెకండాఫ్ హైలెట్స్

    సెకండాఫ్ హైలెట్స్

    లవ్ విషయంలో మొదట హెల్ప్ చేసిన ఆనంద్ తండ్రి విశ్వనాథం (సత్యరాజ్) జెస్సిక బ్యాక్ గ్రౌండ్ తెలుసుకున్న తరువాత మొదట ఒప్పుకోడు. కానీ ఆ తరువాత జెస్సిక మంచితనం గురించి తెలుసుకొని ఒప్పుకుంటాడు. ఫాదర్, సన్ మధ్యలో వచ్చే కామెడీ సీన్స్ హైలెట్ అయ్యాయి. కానీ భూపతి ప్లాన్ వలన విశ్వనాథం అలాగే ఊరి వాళ్ళు అందరూ కూడా విరోధులుగా మారతారు. జెస్సిక ప్రేమ వలన అప్పుడు ఊరి వాళ్ళందరూ కూడా ఆనంద్ ను ఊళ్ళో నుంచి పంపించేసే సీన్స్ కూడా మంచి ఫన్ క్రియేట్ చేశాయి. ఆ తరువాత జెస్సిక కూడా దేశం నుంచి వెళ్లిపోవడానికి రెడీ అవుతుంది.

    శివకార్తికేయన్ నటన

    శివకార్తికేయన్ నటన

    శివకార్తికేయన్ ప్రిన్స్ సినిమాలో తన అద్భుతమైన కామెడీ టైమింగ్ తో మెప్పించాడు. ముఖ్యంగా స్కూల్ టీచర్ గా అతను చిన్న పిల్లల క్లాస్ లలో చూపించిన హావభావాలు నవ్విస్తాయి. అలాగే లవ్ సీన్స్ లో డ్యాన్స్ లో కూడా ఈ హీరో తన టాలెంట్ చూపించాడు. సత్యరాజ్ తో కూడా కొడుకుగా శివకార్తికేయన్ కామెడీ టైమింగ్ బాగా సెట్ అయ్యింది. ఇక క్లైమాక్స్ లో కూడా శివకార్తికేయన్ డైలాగ్స్ తో ఒకవైపు ఆలోచింపజేస్తూనే మరోవైపు నవ్విస్తాయి. సత్యరాజ్ నటన కూడా సినిమాలో హైలెట్ గా నిలిచింది.

    దర్శకుడు అనుదీప్ టేకింగ్

    దర్శకుడు అనుదీప్ టేకింగ్

    జాతిరత్నాలు సినిమాతో కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ అంధించిన దర్శకుడు అనుదీప్ ఈసారి ప్రిన్స్ కథను మూడు విభిన్న కోణాల్లో టచ్ చేశాడు. ఒకవైపు కామెడీ మరోవైపు లవ్ స్టొరీ.. అలాగే హ్యూమనీటి అనే అంశాన్ని హైలెట్ చేసే ప్రయత్నం చేశాడు. ఇక ఈ కోణాల్లో ఎక్కువగా కామెడీనే నమ్ముకొని వెళ్ళాడు. లవ్ సీన్స్ కూడా క్యూట్ గా అమాయకత్వం ఫీల్ వచ్చేలా ప్రజెంట్ చేశాడు. అనుదీప్ టేకింగ్ కు తగ్గట్టుగానే శివకార్తికేయన్ నటన కూడా ఈజీగా కనెక్ట్ అయ్యింది. కానీ మిగతా కొన్ని డ్రామా సీన్స్ లో మాత్రం అతను రొటీన్ ఫార్మాట్ లోనే వెళ్లినట్లు అనిపిస్తుంది.

    థమన్ మ్యూజిక్

    థమన్ మ్యూజిక్

    సినిమాలో కమర్షియల్ ఫార్మాట్ లోనే పాటలు ఉన్నాయి. ఇక అందులో జెస్సికా అనే సాంగ్ విజువల్ గా బావుంది. ముఖ్యంగా శివకార్తికేయన్ డ్యాన్స్ స్టెప్పులు కూడా మ్యూజిక్ లో హైలెట్ అయ్యాయి. థమన్ కంపోజ్ చేసిన సాంగ్స్ సినిమాకు తగ్గట్టుగా సెట్టయ్యాయి. ఇక బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా లవ్ సీన్స్ ను హైలెట్ చేశాయి.

    ఫైనల్ గా ప్రిన్స్ ఎలా ఉందంటే..

    ఫైనల్ గా ప్రిన్స్ ఎలా ఉందంటే..

    జాతిరత్నాలు ఫేమ్ అనుదీప్, తమిళ్ టాలెంటెడ్ హీరో శివకార్తికేయన్ కాంబినేషన్ వరకు సినిమాలో చాలా వరకు కామెడీ సీన్స్ ఆడియెన్స్ కు కనెక్ట్ అవుతాయి. కానీ విలేజ్ బ్యాక్ డ్రాప్ కామేడి సీన్స్ అంత కొత్తగా ఏమి లేవు. కథకు సంబంధం లేని సన్నివేశాలు డైలాగ్స్ కొంత బోరింగ్ అనిపించవచ్చు. ఇక సినిమా పై పెద్దగా అంచనాలు లేకుండా వెళితే కొన్ని కామెడీ ఎపిసోడ్స్ కోసం చూడవచ్చు. కానీ జాతిరత్నాలు అనుదీప్ రేంజ్ కు తగ్గట్టుగా ఉంటుందని థియేటర్స్ కు వెళితే మాత్రం అంచనాలను అందుకోకపోవచ్చు.

    English summary
    Sivakarthikeyan Prince telugu movie review and rating..
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X