»   » మంచి ఫ్యామిలీ ఎంటర్టెనర్... (సోగ్గాడే చిన్ని నాయనా రివ్యూ)

మంచి ఫ్యామిలీ ఎంటర్టెనర్... (సోగ్గాడే చిన్ని నాయనా రివ్యూ)

Posted By:
Subscribe to Filmibeat Telugu
Rating:
2.5/5
హైదరాబాద్: అక్కినేని నాగార్జున, రమ్యకృష్ణ, లావణ్య త్రిపాఠిలు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'సోగ్గాడే చిన్నినాయన'. కల్యాణ్‌ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి అనూప్‌ రూబెన్స్‌ సంగీతం అందించారు. అన్నపూర్ణ స్టూడియోస్‌ బ్యానర్‌పై అక్కినేని నాగార్జున నిర్మించిన ఈ చిత్రం సంక్రాంతి రోజు విడుదలైంది.

Soggade Chinni Nayana

పల్లెటూరి వాతావరణం, ఫ్యామిలీ అనుబంధాలు, సరదాలు, సరసాలు ఇలా అన్ని కలగలిపిన అచ్చమైన తెలుగు సినిమాగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సినిమా విశేషాలే ఏమిటో రివ్యూలో చూద్దాం...


కథ విషయానికొస్తే...గోదావరి జిల్లాల్లో శివపురంకు చెందిన బంగార్రాజు(నాగార్జున) గురించి తెలియని వారుండరు. అమ్మాయిలు ఆయనంటే పడి చస్తాడు. సోగ్గాడిగా పేరు తెచ్చుకుంటాడు. ఓ యాక్సిడెంటులో బంగార్రాజు చనిపోతాడు. ఆయన కొడుకు డా. రామ్ (నాగార్జున) అమెరికాలో కార్డియాలజిస్టుగా పని చేస్తుంటాడు. కుటుంబం కంటే పనినే ఎక్కువ ప్రేమిస్తాడు. దీంతో అతని భార్య సీత (లావణ్య త్రిపాఠి) భర్త తీరుపై అసంతృప్తిగా ఉంటుంది. ఓ రోజు ఇద్దరూ ఉన్నట్టుండి సొంతూరు శివపురంకు వస్తారు. వచ్చిన తర్వాత విషయాన్ని రామ్ తల్లి, తన అత్తగారైన సత్యభామ (రమ్యకృష్ణ) చెబుతుంది. అతనితో తాను కాపురం చేయలేనని, విడాకులు కావాలని అంటుంది. కోడలు చెప్పిన మాటవిని షాకవుతుంది సత్యభామ. కొడుకు తన భర్త బంగార్రాజు(నాగార్జున)లా కాకూడదని పద్దతిగా పెంచితే చివరకి ఇలా అయిందే అని భాధ పడుతుంటే ఉన్నట్టుండి బంగార్రాజు ఆత్మ ప్రత్యక్షమవుతుంది. వీరిద్దరూ కలిసి తమ కొడుకు కాపురాన్ని ఎలా సరిద్దారు? బంగార్రాజు చావుకు కారణమేంటి? అనేది తర్వాతి కథ.


Soggade Chinni Nayana

నటీనటుల పెర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే...తండ్రీకొడుకులు బంగార్రాజు, డా. రాముగా నాగార్జున వైవిధ్యమైన నటనతో అదరగొట్టాడు. బంగార్రాజు పాత్రలో మరోసారి మన్మధుడిగా తనకున్న పేరు నిలబెట్టుకున్నారు. బంగార్రాజు పాత్రలో కోనసీమ యాసలో డైలాగ్స్ అదరగొట్టేసాడు. రెండు పాత్రల్లో ఆయన లుక్ పరంగా, పెర్ఫార్మెన్స్ పరంగా పర్ ఫెక్ట్ అనిపించుకున్నారు. బంగార్రాజు భార్యగా, రాము తల్లిగా రమ్యకృష్ణ తన పాత్రకు పూర్తి న్యాయం చేసింది. లావణ్య త్రిపాఠి అందంగా కనిపించడంతో పాటు అభినయం పరంగా ఆక్టుకుంది. ఆత్మానందం పాత్రలో బ్రహ్మానందం, సప్తగిరి, వెన్నెల కిషోర్, పోసాని కృష్ణ మురళి బావుంది. సంపత్ రాజ్ నెగటివ్ పాత్రలో ఆకట్టుకున్నాడు. నాజర్, చలపతిరావు, ఎల్.బి. శ్రీరామ్ తదితరులు తమ తమ పాత్రల్లో ఒదిగి పోయారు.


టెక్నికల్ అంశాల పరంగా చూస్తే.... ఈ సినిమాలో బాగా హైలెట్ అయిన అంశాల్లో సినిమాటోగ్రఫీ ఒకటి. పిఎస్ వినోద్, సిద్ధార్థ్ సంయుక్తంగా ఈ బాధ్యతలు చేపట్టారు. సినిమా మొత్తాన్ని తమ కెమెరాతో అందంగా చూపెట్టారు. అనూప్ రూబెన్స్ అందించిన సంగీతం సినిమా కథకు చక్కగా సూటయింది. నేపథ్యసంగీతం కూడా బావుంది. ప్రవీన్ పూడి ఎడిటింగ్ ఇంకాస్త షార్ప్ గా ఉండాల్సింది. విలేజ్ వాతావరణం, యమలోకం సెట్స్ బాగా డిజైన్ చేసాడు ఆర్ట్ డైరెక్టర్ రవీందర్.


Soggade Chinni Nayana

దర్శకుడి పనితీరు గురించి మాట్లాడుకుంటే... రామ్ మోహన్ అందించిన కథ మామూలుగానే ఉన్నా దాన్ని ప్రేక్షకుల ముందు వినోదాత్మకంగా, ఫీల్ గుడ్ ఎంటర్టెనర్ గా ప్రజెంట్ చేయడంలో దర్శకుడు కళ్యాణ్ కృష్ణ సక్సెస్ అయ్యాడు. సినిమా ఎక్కడా బోర్ కొట్టకుండా పర్ ఫెక్ట్ స్క్రీన్ ప్లేతో నడిపించాడు. ఓ చక్కని ఫ్యామిలీ డ్రామాను, ముఖ్యంగా పక్కా పల్లెటూరి సినిమాను చూసిన అనుభూతిని ప్రేక్షకులకు కలిగిస్తుంది. కళ్యాణ్ కృష్ణ రాసుకున్న డైలాగ్స్ చాలా బాగున్నాయి. ముఖ్యంగా బంగార్రాజు పాత్రకి రాసిన కోనసీమ డైలాగ్స్ బాగా ఫేమస్ అవుతాయి. హంసానందిని, యాంకర్ అనసూయ, దీక్షాపంత్‌పై ఓ హుషారైనా పాటను పెట్టడం ఓ హైలెట్ అయితే, అందులో కృష్ణకుమారిగా అనుష్క కనిపించడం ఆకట్టుకుంది. అయితే రోటీన్ స్టోరీ లైన్, మాస్ ఎలిమెంట్స్ లేక పోవడం, సెకండాఫ్ కాస్త సాగదీసినట్లు ఉండటం.... క్లైమాక్స్ ఏమంత గొప్పగా లేక పోవడంలాంటి మైనస్ పాయింట్లు కూడా ఉన్నాయి.


ఓవరాల్ గా చెప్పాలంటే ‘సోగ్గాడే చిన్ని నాయనా' ఈ సంక్రాంతికి కుటుంబ సమేతంగా చూడదగ్గ ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్టెనర్.

English summary
Soggade Chinni Nayana is a feel good family entertainer with good comedy elements.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu