twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Stand Up Rahul Movie Review - రాజ్ తరుణ్ ఇంతకీ లేచి నిలబడ్డాడా?

    |

    Rating:
    1.5/5

    టైటిల్: 'స్టాండప్ రాహుల్'
    నటీనటులు: రాజ్ తరుణ్, వర్ష బొల్లమ్మ, 'వెన్నెల' కిషోర్, ఇంద్రజ, మురళీ శర్మ, దేవీ ప్రసాద్ తదితరులు
    సినిమాటోగ్రఫీ: శ్రీ‌రాజ్ ర‌వీంద్ర‌న్
    సంగీతం: స్వీకర్ అగస్తి
    నిర్మాతలు: నంద కుమార్ అబ్బినేని, భరత్ మాగులూరి
    దర్శకత్వం: శాంటో మోహన్ వీరంకి

    ఒక‌ప్పుడు వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి అందరినీ అలరించిన రాజ్ తరుణ్‌కి ఇప్పుడు స‌క్సెస్ అనేది చాలా అవసరం. ఒకరకంగా రాజ్ తరుణ్ క్లీన్ హిట్ కొట్టి చాలా రోజులు గడిచి పోతుంది. ఇప్పటిదాకా ఎన్ని సినిమాలు చేసినా ఆయనకు సరైన హిట్ పడ లేదు. ఇక తాజాగా రాజ్ తరుణ్ కొత్త దర్శకుడితో 'స్టాండప్ రాహుల్' మూవీ చేశారు. వర్ష బొల్లమ్మ హీరోయిన్ గా నటించిన ఈ మూవీ ఎట్టకేలకు శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మ‌రి సినిమా ఎలా ఉంది? ఈ సినిమాతో అయినా రాజ్ తరుణ్ హిట్ అందుకున్నాడా? అనేది తెలియాలంటే, రివ్యూ లోకి వెళ్లాల్సిందే

    'స్టాండప్ రాహుల్' కథేంటంటే…

    'స్టాండప్ రాహుల్' కథేంటంటే…


    రాహుల్ (రాజ్ తరుణ్) గాలికి తిరిగే నేటి మధ్య తరగతి కుర్రాడు. స్టాండప్ కమెడియన్ కావాలనేది రాహుల్ కల. అయితే చిన్ననాడే తల్లిదండ్రులు విడిపోవడం, ఉద్యోగం చేయమని తల్లి బలవంతం చేయడంతో ఒక వీఆర్ (వర్చువల్ రియాలిటీ) కంపెనీలో చేరతాడు. అయితే తండ్రి మాత్రం నచ్చింది చేయమని చెప్తూ ఉంటారు. ఈ క్రమంలో స్టాండప్ కామెడీ అతనికి ఒక బూస్ట్ లా పని చేస్తూ ఉంటుంది. అక్కడ స్కూల్ మేట్ శ్రేయ రావు (వర్ష బొల్లమ్మ) తిరిగి పరిచయం అవుతుంది. ఇద్దరు ప్రేమలో పడ్డా రాహుల్ కి పెళ్లి మీద నమ్మకం లేకపోవడంతో లివిన్(సహ జీవనం)లో ఉండడం మొదలు పెడతారు. ఆ తర్వాత ఏమైంది? రాహుల్ స్టాండప్ కమెడియన్ అయ్యాడా? లేదా? తల్లికి ఇష్టం లేని స్టాండప్ కామెడీ అతడు వదిలేశాడా? లేక ప్యాషన్ ను నమ్మి ముందుకు వెళ్లాడా? రాహుల్ శ్రేయ లివ్ - ఇన్ రిలేషన్షిప్ గురించి ఇద్దరి ఇళ్ళల్లో తెలిసిందా? లేదా? శ్రేయ రావు పెళ్లి చేసుకుందామని అడిగితే రాహుల్ ఎందుకు నో చెప్పాడు? చివరికి, వారిద్దరూ పెళ్లి చేసుకున్నారా? లేదా ఏమైంది? అనేది మిగతా కథ.

    ఫస్ట్ హాఫ్ :

    ఫస్ట్ హాఫ్ :

    స్టాండప్ కామెడీ అనగానే మన తెలుగువాళ్ళకు వెంటనే గుర్తొచ్చేది మొన్నామధ్య వచ్చిన 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్'. ఆ సినిమాలో హీరోయిన్ పూజా హెగ్డే కూడా ఒక స్టాండప్ కమెడియన్ పాత్ర చేసింది. అలాగే ఈ సినిమాలో రాహుల్ కూడా ఒక స్టాండప్ కమెడియన్ అవ్వాలని అనుకుంటూ ఉంటారు. మొదటి భాగం అంతా రాహుల్ ఎవరు? అతని జీవిత ఆశయం ఏంటి? అతను లైఫ్ లో ఎలాంటి కన్ఫ్యూజన్ మధ్య బతుకుతున్నాడు అనే విషయాన్ని కన్విన్సింగ్ గా చెప్పే ప్రయత్నం చేశాడు దర్శకుడు. ఒకరకంగా సినిమాను పెద్దగా నాన్చకుండా వీలైనంత వరకు పాయింట్ టు పాయింట్ అల్లుకుంటూ తీసుకు వెళ్ళాడు. పెళ్లి మీద నమ్మకం లేని రాహుల్ ను శ్రియ ప్రేమించడం, అతనినే పెళ్లి చేసుకోవాలనుకోవడం అతని కోసం లివిన్ లో కూడా ఉండడానికి ఒప్పుకోవడం మొత్తాన్ని మొదటి భాగంలో చూపారు.

    సెకండ్ హాఫ్ :

    సెకండ్ హాఫ్ :

    సెకండ్ హాఫ్ మొదలైనప్పటి నుంచి లివిన్ లో ఉన్న రాహుల్, శ్రియ ఒకరికొకరు అలవాటు పడిపోయి చాలా హ్యాపీగా ఉన్నట్టు చూపించడంలో సక్సెస్ అయ్యాడు దర్శకుడు. అయితే రాహుల్ కన్ఫ్యూజన్ మాత్రం అలానే కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఎప్పటిలానే ప్రేమ ఎక్కువైపోతుందని భయమేసి హీరోయిన్ నుంచి హీరో దూరంగా వెళ్లిపోవడం, ఆ తర్వాత ఆమెకు పెళ్లి జరుగుతున్న సమయంలో వెళ్లి సినిమాటిక్ డైలాగులు కొట్టి పెళ్లి ఆపి తాను చేసుకోవడం. అలా సెకండ్ హాఫ్ మొత్తం ఇది ఇంతకు ముందు ఎక్కడో చూశామే అనే విధంగా సాగింది సినిమా.

    దర్శకుడి టేకింగ్ విషయానికి వస్తే:

    దర్శకుడి టేకింగ్ విషయానికి వస్తే:

    స్టాండప్ రాహుల్... స్టాండప్ కామెడీ గురించి తీసిన సినిమా అని ప్రమోట్ చేస్తూ వచ్చారు కానీ ఒక మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేశాడు దర్శకుడు. స్టాండప్ కామెడీ సినిమా మొత్తం ఉంటుందని భావించే వారికి నిరాశే. శాంటో ఎంపిక చేసుకున్న కథా నేపథ్యం బాగుంది కానీ దాన్ని తెరమీదకు ఎక్కించే ప్రయత్నం బెడిసికొట్టింది. కామెడీ కోసం వెళ్లిన వారికి పెద్దగా అది దొరకదు కానీ సినిమాలో ఎమోషన్ ఉంది. సినిమాలో స్టాండప్ కామెడీ సీన్స్ మెప్పించలేకపోయాయి. స్టాండప్ కామెడీ తెలుగులో కొత్త అయినా ఈ కథ కొత్తది కాదు, చూసినంత సేపు ఎక్కడో చూశామే అన్నట్టు ఉంటుంది. కొత్త దర్శకుడి కొత్తదనం తెరమీద కనిపించలేదు.

    నటీనటుల విషయానికి వస్తే...

    నటీనటుల విషయానికి వస్తే...


    రాజ్ తరుణ్ ఎప్పటిలానే చాలా ఈజ్ తో నటిస్తాడని అనిపించినా కొన్ని సీన్స్ లో తేలిపోయాడు. మరికొన్ని సీన్స్ లో బాగానే నటించారు. అయితే లుక్ పరంగా కొత్తగా కనిపించాడు. వర్ష బొల్లమ్మ సహజ నటన కనబరిచింది. ఇక ఇంద్రజ ఎప్పటిలానే తనదైన శైలిలో నటించి మెప్పించింది. అయితే మురళీశర్మ లాంటి నటుడి ప్రాధాన్యతకు తగిన పాత్ర కాదేమో అనిపిస్తుంది. 'వెన్నెల' కిశోర్ తన కామెడీతో కాస్త నవ్వించే ప్రయత్నం చేశాడు కానీ అది వర్కౌట్ కాలేదు.రాజ్ కుమార్ కాశిరెడ్డి ట్రాక్ తో కాస్త నవ్వించాలని అనుకుంటే అది ఎబ్బెట్టుగా మారింది. రాజ్ తరుణ్, వర్ష మధ్య లవ్ లో ఎమోషన్ మిస్ అయ్యింది. . స్టాండప్ కమెడియన్స్ క్లబ్ నిర్వాహకుడిగా 'కేరాఫ్ కంచరపాలెం' డైరెక్టర్ వెంకటేష్ మహా నటించి నటనతోనూ మెప్పించగలనని నిరూపించాడు. ఇతర పాత్రల్లో మధురిమ, దేవి ప్రసాద్, అనీశా అల్లారెడ్డి తదితరులు తమ పరిధి మేర నటించారు.

    టెక్నికల్ టీమ్ విషయానికి వస్తే

    టెక్నికల్ టీమ్ విషయానికి వస్తే

    దర్శకుడి టేకింగ్ గురించి ముందే మాట్లాడుకున్నాం కాబట్టి డైలాగ్స్ విషయానికి వస్తే నందకుమార్ రాసిన మాటలు అక్కడక్కడ ఆకట్టుకున్నాయి. కానీ శ్రీరాజ్ రవీంద్రన్ సినిమాటోగ్రఫీ బాగుంది. ముఖ్యంగా అరుణాచల్ అంటూ చూపబడిన ప్రాంతాలను చాలా అందంగా చూపించారు. ఇక స్వీకర్ అగస్తి పాటలు ఎక్కలేదు కానీ నేపథ్య సంగీతం చక్కగా ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ మాత్రం సినిమాకు తగిన విధంగా ఉన్నాయి. . కామెడీ సీన్స్ వర్కవుట్ అయ్యి ఉంటే సినిమా మరోలా ఉండేదనడంలో ఎలాంటి సందేహం లేదు.

    ఫైనల్ గా:

    ఫైనల్ గా:


    స్టాండప్ రాహుల్ -కూర్చుంది చాలు - అనే సినిమాతో రాజ్ తరుణ్ లేచి నిలబడేట్టు ఏమీ కనిపించలేదు. రాజ్ తరుణ్ సక్సెస్ కోసం మరింత కాలం వేచి చూడాల్సిందే.- వన్ టైం వాచబుల్ రొటీన్ మూవీ..

    English summary
    Stand Up Rahul stars Raj Tarun and Varsha Bollamma. Movie released on March 18th, here is the review.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X