twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    State Of Siege: Temple Attack Review..అదరగొట్టిన అక్షయ్ ఖన్నా.. NSG కమాండోగా పాక్‌పై ప్రతీకారం

    |

    Rating:
    3.0/5
    Star Cast: అక్షయ్ ఖన్నా, మంజరి ఫడ్నీస్, అభిమన్యు సింగ్, అక్షయ్ డియోల్, సమీర్ సోని
    Director: కెన్ ఘోష్

    పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాదులు భారత్‌లోకి చొరబడి విధ్వంసం సృష్టించిన సందర్భాలను కథాంశంగా తీసుకొని ఎన్నో సినిమాలు వచ్చాయి. గతంలో అక్షర్‌ధామ్ ఆలయంపై 2002లో జరిగిన పాక్ ముష్కరుల దాడిని కథాంశంగా తీసుకొని స్టేట్ ఆఫ్ సీజ్: టెంపుల్ ఎటాక్ అనే చిత్రాన్ని రూపొందించారు. థియేటర్లు మూతపడిన నేపథ్యంలో జీ5 ఓటీటీలో ఈ చిత్రాన్ని ఓటీటీ రిలీజ్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ చిత్రంలో అక్షయ్ కుమార్, అభిమన్యు సింగ్ నటన, సినిమా కథ, కథనాలు ఎలా ఉన్నాయో ఓసారి పరిశీలిద్దాం..

    స్టేట్ ఆఫ్ సీజ్: టెంపుల్ ఎటాక్ కథ

    స్టేట్ ఆఫ్ సీజ్: టెంపుల్ ఎటాక్ కథ

    పాకిస్థాన్‌కు చెందిన టెర్రరిస్టులు నలుగురు భారత్‌లోకి ప్రవేశించి గుజరాత్‌లోని కృష్ణధామ్ మందిరంపై విచ్చలవిడిగా కాల్పులు చేస్తూ భక్తులను దారుణంగా చంపివేస్తుంటారు. మందిరంలోని భక్తులను బందీలుగా పట్టుకొంటారు. భారత్ జైల్లో ఉన్న బిలాల్ నైకూ (మీర్ సర్వర్)‌ను విడిపించాలని పాక్‌లోని ఉగ్రవాద సంస్థ చీఫ్ అబూ హంజా (అభిమన్యు సింగ్) డిమాండ్ పెడుతారు. ఈ క్రమంలో బిలాల్‌ను విడుదల చేసి పాక్‌ సరిహద్దులో విడిపించేందుకు ప్రయత్నం చేస్తారు. ఆ క్రమంలో మేజర్ హనుత్ సింగ్ (అక్షయ్ ఖన్నా, కెప్టెన్ బిబేక్ (అక్షయ్ ఒబెరాయ్) రంగ ప్రవేశం చేస్తారు.

    కథలో మలుపులు ఇలా

    కథలో మలుపులు ఇలా

    కృష్ణధామ్ మందిరంలో చొరబడిన పాక్ ఉగ్రవాదులు ఎలాంటి దుశ్చర్యకు పాల్పడ్డారు? బందీలుగా పట్టుకొన్న భక్తులను ఉగ్రవాదులు ఏం చేశారు? బిలాల్ నైకూను విడుదల చేయించేందుకు అబు హంజా ఎలాంటి పథకం వేశారు? మందిరంలో ఉన్న ఉగ్రవాదులు ఎన్‌సీజీ కమెండోలపై ఎలా దాడి చేశారు? ఆలయంలో ఉన్న ఉగ్రవాదుల దాడులను మేజర్ హనుత్ సింగ్ ఎలా అడ్డుకొన్నారు? అనే ప్రశ్నలకు సమాధానమే స్టేట్ ఆఫ్ సీజ్: టెంపుల్ ఎటాక్ కథ.

    ఫస్టాఫ్ అనాలిసిస్

    ఫస్టాఫ్ అనాలిసిస్

    పాక్ సరిహద్దుల్లో బందీగా పట్టుకొన్న భారతీయ మహిళను విడిపించే సాహసానికి పూనుకొన్న మేజర్ హనుత్ సింగ్ ఎపిసోడ్‌తో సినిమా ఆసక్తికరంగా ప్రారంభమవుతుంది. ఆ తర్వాత ఆ ఆపరేషన్‌లో స్నేహితుడిని కోల్పోవడం, హనుత్ గాయపడటం లాంటి అంశాలు చాలా ఎమోషనల్‌గా సాగుతాయి. కాకపోతే ఆపరేషన్‌లో ఉండాల్సిన ఇంటెన్సిటీ పెద్దగా ప్రభావం చూపలేకపోయిందని చెప్పవచ్చు. భారత్‌లోకి చొరబడిన పాక్ అగంతకులు ఆలయంలోకి ప్రవేశించి భక్తులపై కాల్పులు జరిపే ఎపిసోడ్ హృదయం ముక్కలయ్యేలా చిత్రీకరించారు. పలు సన్నివేశాల్లో సెంటిమెంట్ ప్రేక్షకుడిని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది.

    సెకండాఫ్ అనాలిసిస్

    సెకండాఫ్ అనాలిసిస్

    ఇక స్టేట్ ఆఫ్ సీజ్: టెంపుల్ ఎటాక్ సెకండాఫ్‌లో హనుత్ సింగ్ టీమ్ రంగంలోకి ఆపరేషన్ చేపట్టడం, కెప్టెన్ బిబేక్ భార్య ప్రసవించే సమయంలో ఆయన ఆపరేషన్‌లో ఉండే సీన్లు ప్రేక్షకుడిని భావోద్వేగానికి గురిచేస్తాయి. పాక్ ముష్కరుల దాడిలో హనుత్ సింగ్ గాయపడినా.. ప్రాణాలకు తెగించి బందీలను విముక్తి చేయడం లాంటి అంశాలు ఆసక్తికరంగా, ఎమోషనల్‌గా సాగుతాయి. కథ, కథనాలను చాలా గ్రిప్పింగ్‌గా చెప్పడంలో దర్శకుడు కెన్ ఘోష్ తన ప్రతిభను చాటుకొన్నారు. సన్నివేశాలను దర్శకుడు రాసుకొన్న తీరు ఈ సినిమాకు మరింత బలాన్ని ఇచ్చిందని చెప్పవచ్చు.

    అక్షయ్ ఖన్నా నటనా ప్రతిభ

    అక్షయ్ ఖన్నా నటనా ప్రతిభ

    మేజర్ హనుత్ సింగ్‌గా అక్షయ్ ఖన్నా పాత్ర కథను మరో రేంజ్‌కు చేర్చిందని చెప్పవచ్చు. పలు సన్నివేశాల్లో అక్షయ్ ఖన్నా అద్బుతంగా ఉంది. తనదైన శైలిలో పాత్రలో పరకాయ ప్రవేశం చేసి హావభావాలు పండించడంలో ఆకట్టుకొన్నాడు. కెప్టెన్ బిబేక్‌గా అక్షయ్ ఒబెరాయ్, ఇతర పాత్రల్లో మంజు ఫడ్నీస్ తమ పాత్రలకు న్యాయం చేశారు. అభిమన్యు సింగ్ పాత్ర బలమైనదే కానీ.. ఫెర్ఫార్మెన్స్ స్కోప్ లేని పాత్రగా మిగిలిపోయింది. అంతా ఫోన్ సంభాషణ ఆధారంగా పాత్రను డిజైన్ చేయడంతో అభిమన్యు పూర్తిస్థాయిలో విజృంభించలేకపోయారు. మిగితా పాత్రధారులు తమ పాత్రలకు పరిధి మేరకు ఓకే అనిపించారు.

    టెక్నికల్ డిపార్ట్‌మెంట్ పనితీరు

    టెక్నికల్ డిపార్ట్‌మెంట్ పనితీరు

    సాంకేతిక విభాగాల పనితీరును పరిశీలిస్తే.. స్టేట్ ఆఫ్ సీజ్: టెంపుల్ ఎటాక్ మూవీకి సినిమాటోగ్రఫి అదనపు ఆకర్షణ. భారత్, పాక్ సరిహద్దులో మిలిటరీ ఆపరేషన్స్, అలాగే ఆలయంలో ఉగ్రవాదుల దాడి అంశాలను సినిమాటోగ్రాఫర్ తేజల్ షెట్యే చక్కగా కెమెరాలో బంధించారు. అలాగే ముఖేష్ ఠాకూర్ ఎడిటింగ్ కూడా బాగుంది. సన్నివేశాలను మరింత హైలెట్ చేయడంలో మ్యూజిక్ కీలక పాత్రను పోషంచింది.

    ప్రోడక్షన్ వ్యాల్యూస్

    ప్రోడక్షన్ వ్యాల్యూస్

    స్టేట్ ఆఫ్ సీజ్: టెంపుల్ ఎటాక్ మూవీని నటుడు అభిమన్యు సింగ్, రూపాలి సింగ్ నిర్మించారు. దేశభక్తి ప్రధానమైన కథను ఎంచుకోవడమే కాకుండా దానిని తెరకెక్కించిన తీరు విషయంలో అభిమన్యు సక్సెస్ అయ్యారు. ప్రతీ సన్నివేశాన్ని ఎమోషనల్‌గా, ఆసక్తిగా ఉండేలా స్క్రిప్టును రాసుకోవడమే ఈ సినిమాకు తొలి విజయంగా మారింది. ఈ సినిమా నిర్మాణ విలువులు హై రేంజ్‌లో ఉన్నాయని చెప్పవచ్చు.

    ఓవరాల్‌గా సినిమా ఎలా ఉందంటే...

    ఓవరాల్‌గా సినిమా ఎలా ఉందంటే...

    దేశ సరిహద్దు ప్రాంతంలో సైనికుల త్యాగాలకు, కష్టాలకు ప్రతీరూపంగా నిలిచే చిత్రం స్టేట్ ఆఫ్ సీజ్: టెంపుల్ ఎటాక్. కథ, కథనాలు, బలమైన సన్నివేశాలు ఈ సినిమాకు ప్రాణంగా మారాయి. ఇక నటీనటులు ప్రతిభ సినిమాను ప్రేక్షకులను మెప్పించేలా చేస్తాయి. దేశభక్తి, సైన్యానికి సంబంధించిన భావోద్వేగాలను ప్రేమించే ప్రతీ ఒక్కరికి ఈ సినిమా నచ్చుతుంది. ఈ వారాంతంలో చక్కటి సినిమా చూశామనే ఫీలింగ్ కలుగుతుంది.

    తెర వెనుక, తెర ముందు

    తెర వెనుక, తెర ముందు

    నటీనటులు: అక్షయ్ ఖన్నా, మంజరి ఫడ్నీస్, అభిమన్యు సింగ్, అక్షయ్ డియోల్, సమీర్ సోని
    దర్శకుడు: కెన్ ఘోష్
    రచన: విలియమ్ బోర్త్‌విక్, సైమాన్ ఫాంటాజు
    నిర్మాత: అభిమన్యు సింగ్, రూపాలీ సింగ్
    సినిమాటోగ్రఫి: తేజల్ షిట్యే
    ఎడిటర్: ముఖేష్ ఠాకూర్
    ఆర్ట్: సప్నా శ్రీవాస్తవ్
    ఓటీటీ రిలీజ్: జీ5
    నిడివి: 112 నిమిషాలు
    ఓటీటీ రిలీజ్ డేట్: 2021-09-07

    English summary
    State Of Siege: Temple Attack Review: Akshaye Khanna's latest web movie released on Disney+Hot star on July 9th. This movie produced by actor Abhimanyu Singh and Rupali Singh and directedby Ken Ghosh. In this occassion, Telugu filmibeat brings exclusive review.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X