For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Gaalodu Review:డ్యాన్స్, ఫైట్స్ తో అదరగొట్టిన సుడిగాలి సుధీర్.. 'గాలోడు' హిట్ కొట్టాడా అంటే?

  |

  రేటింగ్: 2.25 /5

  టైటిల్: గాలోడు
  నటీనటులు: సుడిగాలి సుధీర్, గెహనా సిప్పీ, సప్తగిరి, షకలక శంకర్, పృథ్వీరాజ్ తదితరులు
  ప్రొడక్షన్ బ్యానర్: సంస్కృతి ఫిల్మ్స్
  నిర్మాత: పి. రాజశేఖర్ రెడ్డి
  కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: పి. రాజశేఖర్ రెడ్డి
  సంగీతం: భీమ్స్ సిసిరోలియో
  సినిమాటోగ్రఫీ: రామ్ ప్రసాద్
  విడుదల తేది: నవంబర్ 18, 2022

  సుడిగాలి సుధీర్ గురించి పెద్దగా అవసరం లేదు. బుల్లితెరపై విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న అతికొద్దిమందిలో సుధీర్ ఒకరు. యాంకర్ గా, కమెడియన్ గా రాణిస్తూనే హీరోగా తానేంటో నిరూపించుకునేందుకు తెగ కష్టపడుతున్నాడు. సాఫ్ట్ వేర్ సుధీర్, త్రీ మంకీస్, వాంటెడ్ పండుగాడ్ సినిమాలతో వెండితెరపై కనిపించిన సుడిగాలి సుధీర్ తాజాగా గాలోడుగా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇంతకుముందు సినిమా నుంచి విడుదల చేసిన టీజర్, ట్రైలర్స్ మాస్ ప్రేక్షకులను అలరించేలా ఆకట్టుకున్నాయి. దీంతో ఈ సినిమాపై కొద్దిమేర అంచనాలు పెరిగాయనే చెప్పవచ్చు. లవ్ అండ్ మాస్ ఎంటర్టైనర్ గా వచ్చిన సుడిగాలి సుధీర్ గాలోడు మూవీ ఇవాళ అంటే నవంబర్ 18న థియేటర్లలో విడుదలైంది. మరి ఈ సినిమాతో సుధీర్ హిట్ కొట్టాడా అనేది రివ్యూలో చూద్దాం.

  కథ:

  కథ:

  రాజ్/రజనీకాంత్ (సుడిగాలి సుధీర్) ఊర్లో ఏ లక్ష్యం లేకుండా అల్లరి చిల్లరగా గాలోడిలా తిరుగుతుంటాడు. పేకాట ఆడే సమయంలో ఆ గ్రామ సర్పంచ్ కొడుకుతో గొడవ పడతాడు రజనీకాంత్. ఈ గొడవలో సర్పంచ్ కొడుకు చనిపోతాడు. దీంతో ఊరి నుంచి పారిపోయి హైదరాబాద్ కు వస్తాడు. సిటీకి వచ్చిన రజనీకాంత్ బిచ్చగాళ్ల వద్ద డబ్బు కొట్టేస్తూ, గుళ్లో ప్రసాదం తినుకుంటూ గడుపుతుంటాడు. ఈ క్రమంలోనే రజనీకాంత్ కు శుక్ల (గెహనా సిప్పీ) పరిచయం అవుతుంది. రజనీకాంత్ పరిస్థితి చూసిన శుక్ల తన ఇంట్లోనే డ్రైవర్ గా ఉద్యోగం ఇస్తుంది. తర్వాత రజనీకాంత్ కు లవ్ చేస్తుంది. ప్రపోజ్ చేస్తే రజనీకాంత్ ఒప్పుకోడు. ఇంతలోనే రజనీకాంత్ ను పోలీసులు వచ్చి అరెస్ట్ చేసి తీసుకెళ్తారు. రజనీకాంత్ కు యావజ్జీవ కారాగార శిక్ష పడుతుంది. మరి రజనీకాంత్.. శుక్ల ప్రేమను ఒప్పుకున్నాడా? వారిద్దరి ప్రేమ గెలిచిందా? పెళ్లి చేసుకున్నారా? అనే తదితర విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

  విశ్లేషణ

  విశ్లేషణ

  జబర్దస్త్ కమెడియన్ గా సూపర్ పాపులర్ అయిన సుడిగాలి సుధీర్ బుల్లితెరపై ఆద్యంతం ఎంటర్టైన్ చేస్తాడు. కానీ వెండితెర విషయానికొస్తే అలా ఉండదు. స్మాల్ స్క్రీన్ పై సుధీర్ తనదైన యాక్టింగ్, కామెడీ టైమింగ్ తోపాటు అప్పుడప్పుడు డ్యాన్స్ లతో సూపర్బ్ గా ఎంటర్టైన్ చేశాడు. కానీ రెండు గంటల సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకోవడం పెద్ద సవాలే. అయితే గాలోడు సినిమాను ప్రారంభంలో ఆసక్తిగా స్టార్ట్ చేశారు. జైళ్లో సుధీర్ చూపించి మంచి ఎలివేషన్ ఇచ్చారు. కానీ అసలు స్టోరీలోకి, ప్లాష్ బ్యాక్ లోకి వెళ్లేసరికి రొటీన్ స్టోరీగా గాడి తప్పింది. రెగ్యులర్ సీన్లతో అంతగా ఆకట్టుకోదు.

  పెద్దింటి అమ్మాయితో

  పెద్దింటి అమ్మాయితో

  పెద్దింటి అమ్మాయితో మధ్య తరగతి యువకుడి లవ్ ట్రాక్ వంటి సీన్లతో రొటీన్ ఫార్ములగా సాగుతోంది. సప్తగిరి కనిపించిన సన్నివేశాలు కొంతవరకు నవ్వు తెప్పిస్తాయి. హీరోను హీరోయిన్ ప్రేమించడానికి చూపించే సన్నివేశాలు మరి పాతచింతపచ్చడిలా ఉంటాయి. హీరోయిన్ వెంటపడటం, హీరో తను ఉన్న పరిస్థితికి బ్యాడ్ హ్యాబిట్స్ చెప్పడం, వాటిని హీరోయిన్ అలవాటు చేసుకోవడం అంతా సాదాసీదాగా సాగుతుంది. హీరోయిన్ తల్లిదండ్రుల పాత్రలు పేలవంగా ఉంటాయి. ఇక చెప్పుకోవాల్సింది ఏమైనా ఉందంటే.. అవి హీరోహీరోయిన్ల మధ్య సాగే పాటలు, డ్యాన్స్ లు మాత్రమే. సినిమాలో సాంగ్స్ చాలావరకు ఊరటనిస్తాయి.

  ఎవరెలా చేశారంటే

  ఎవరెలా చేశారంటే

  సుడిగాలి సుధీర్ నిజానికి మంచి టాలెంట్ ఉన్న నటుడే. కానీ ఆయనకు తగిన సినిమా పడట్లేదనే చెప్పవచ్చు. సుధీర్ ఎంచుకునే కథలు విభిన్నంగా ఉంటే కచ్చితంగా వెండితెరపై కూడా క్లిక్ అవ్వగలడు. గాలోడులో యాక్షన్ సీన్స్, డ్యాన్స్ లు అదరగొట్టాడు. గ్లామర్ గా హ్యాండ్సమ్ లుక్స్ తో ఆకట్టుకున్నాడు. హీరోయిన్ గా నటించిన గెహనా సిప్పీ చోర్ బజార్ తర్వాత యాక్ట్ చేసిన మూవీ ఇది. హీరోయిన్ గా గెహనా సిప్పీ ఆకట్టుకుంది. తన పరిధిమేర నటిస్తూ గ్లామర్ తో అట్రాక్ట్ చేసింది. సప్తగిరి పాత్ర బాగుండటంతోపాటు ఆయన నటన కొంతవరకు నవ్విస్తుంది. మిగతా పాత్రలు తమ పరిధిమేర నటించారు.

  నిర్మాణ విలువలు

  నిర్మాణ విలువలు


  సంగీతం పర్వాలేదనిపించింది. సినిమాటోగ్రఫీ, నిర్మాణ విలువలు బాగున్నాయి. అయితే అనవసరమైన చోట్లు సీజీ వాడారని స్పష్టంగా తెలిసిపోతుంది. అలా వాడకుండా సహజంగా చూపిస్తే బాగుండేది. సంభాషణలు అంతగా ఆకట్టుకోవు. కొన్నిసార్లు సిల్లీగా అనిపిస్తాయి. క్లైమాక్స్ సన్నివేశంలో కోర్టులో హీరో నిజాయితీని నిరూపించుకోమనడం, తర్వాత వాళ్ల పెళ్లిని ప్రభుత్వ ఖర్చులతో చేయాలని పోలీసులను జడ్జ్ ఆదేశించడం ఏ సినిమాలో చూడలేం.

  ఫైనల్ గా చెప్పాలంటే..

  ఫైనల్ గా చెప్పాలంటే..

  బుల్లితెరపై తన మార్క్ చాటుకున్న సుడిగాలి సుధీర్ వెండితెరపై కూడా తానెంటో నిరూపించుకోవాలనుకుంటున్న ప్రయత్నంలో తెరెకెక్కిన మూవీ గాలోడు. టైటిల్ తగినట్లుగా సినిమా ఉంటుంది. కేవలం సుధీర్ ఫ్యాన్స్ కు మాత్రం నచ్చుతుంది. అలాగే సినిమాలోని సాంగ్స్, సుధీర్ డ్యాన్స్ అండ్ యాక్షన్ సీన్స్ కోసం మాత్రం చూడొచ్చు.

  English summary
  Sudigali Sudheer Gehna Sippy Starrer Love And Action Entertainer Gaalodu Movie Review And Rating In Telugu
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X