»   » సూయి ధాగ హిందీ మూవీ రివ్యూ

సూయి ధాగ హిందీ మూవీ రివ్యూ

Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  Rating:
  3.0/5
  Star Cast: అనుష్క శర్మ, వరుణ్ ధావన్, రఘువీర్ యాదవ్
  Director: శరత్ కటారియా

  సీక్రెట్ సూపర్ స్టార్, ప్యాడ్ మ్యాన్, టాయిలెట్ ఏక్ ప్రేమ కథ లాంటి మేకిన్ ఇండియా సినిమాలు బాలీవుడ్‌ ప్రేక్షకులు హృదయాలను తట్టిలేపాయి. కమర్షియల్ వ్యాల్యూ ఉన్న సూపర్‌స్టార్లు స్థానిక ముద్ర కనిపించే చిత్రాల్లో నటించడమే కాకుండా ప్రేక్షకులను మెప్పించారు. ఇలాంటి పరిస్థితుల్లో బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించే ఇద్దరు స్టార్ హీరో, హీరోయిన్లు అనుష్క శర్మ, వరుణ్ ధావన్ సూయి ధాగ - మేడ్ ఇన్ ఇండియా (సూది దారం) అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. రొటీన్‌కు భిన్నంగా వారిద్దరూ తమ ఇమేజ్‌ను పక్కన పెట్టి నటించిన ఎలాంటి ఫీలింగ్‌ను కల్పించిందో తెలుసుకోవాలంటే సినిమా కథ, కథనాలను చర్చించాల్సిందే.

  అనుష్క శర్మని ఎలా పడితే అలా.. కనికరం లేకుండా.. ఇదేమి ట్రోలింగ్ బాబోయ్!

  సూయి ధాగ స్టోరి

  మౌజి (వరుణ్ ధావన్) కుట్టు మిషన్ల అమ్మే షాపులో పనిచేస్తుంటాడు. యజమాని, అతడి కొడుకు అవమానాలను భరిస్తూ వారి వద్ద పనిచేస్తుంటాడు. మౌజీ బాధను అర్థం చేసుకొన్న అతడి భార్య మమత (అనుష్క శర్మ) స్వంతంగా ఏదో చేయమని ప్రోత్సాహిస్తుంటుంది. కానీ యజమాని ఆగడాలు అతి కావడంతో మౌజీ ఉద్యోగాన్ని వదులుకొంటాడు. అదే సమయంలో తల్లి తీవ్ర అనారోగ్యానికి గురి అవుతుంది. చికిత్స పొందుతుండగా తల్లి కోసం ఓ గౌన్ (నైట్ గౌన్) కుట్టి ఇస్తాడు. హాస్పిటల్‌లో అది చూసిన ఇతర రోగుల కుటుంబ సభ్యులు భారీగా ఆర్డర్లు ఇస్తారు. కానీ పరిస్థితులు అతడికి ప్రతికూలంగా మారుతాయి.

  సూయి ధాగ‌లో ట్విస్టులు

  కుటుంబ ఆర్థిక సమస్యలు తీవ్రం కావడంతో ఓ వస్త్ర తయారీ సంస్థలో వారిద్దరూ పనికి కుదురుతారు. కానీ అక్కడ జరుగుతున్న అన్యాయాన్ని ఎదురించడంతో మళ్లీ రోడ్డున పడుతారు. మళ్లీ సొంతంగా ఏదైనా చేయాలని ఆలోచించే సమయంలో వారికి ఫ్యాషన్ దుస్తుల పోటీలో పాల్గొనే అవకాశం లభిస్తుంది. కుట్టు మిషన్ల షాపు యజమాని పెట్టి బాధలేంటి? ఏ పరిస్థితుల్లో.. ఎందుకు ఉద్యోగాలు వదిలేశాడు? దేశవ్యాప్తంగా జరిగిన ఫ్యాషన్ దుస్తుల పోటీలో ఎందుకు పాల్గొనాల్సి వచ్చింది. అందులో పాల్గొనేందుకు ఎలాంటి అడ్డంకులు ఎదుర్కొన్నారు. చివరకు వారిని అదృష్టాన్ని వరించిందా అనే ప్రశ్నలకు తెర మీద సమాధానమే సూయి ధాగా సినిమా కథ.

  ఫస్టాఫ్ అనాలిసిస్

  సమకాలీన భారతంలో చేతి వృత్తుల వారు అనుభవించే కష్టాలను ప్రతిబింబించే, ఆవిష్కరించే సినిమా సూయి ధాగా చిత్రం. దళారులు, మధ్య వర్తుల చేతిలో దిగువస్థాయి వృత్తికారులు ఏవిధంగా దగా పడుతున్నారనే కోణంలో ఈ సినిమా ప్రారంభమవుతుంది. హాస్పిటల్స్ మోసాలు, సమాజంలో పేద ప్రజల కష్టాలను ప్రతిబింబిస్తూ ముందుకు వెళ్తుంది. ఓ కుట్టు మిషన్ సాధించడానికి భార్య భర్తలిద్దరూ ఎలాంటి కష్టాలు పడ్డారనే చక్కటి భావోద్వేగమైన ఎపిసోడ్‌తో తొలిభాగం ముగుస్తుంది.

  సెకండాఫ్ అనాలిసిస్

  ఇక సెకండాఫ్‌లో కార్పొరేట్ సంస్థల మోసాలు, అన్యాయానికి మధ్య నలుగుతున్న దిగువ, మధ్య తరగతి జీవితాలను ఆవిష్కరించే సన్నివేశాలతో కథ సాగుతుంది. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే వారికి కూడా బడా కార్పోరేట్ సంస్థలను ఎదురించే సత్తా ఉందని చెప్పే విధంగా స్ఫూర్తిని రగిలిస్తూ ఉత్తేజ కరంగా సినిమా సాగుతుంది. చివర్లో మేడ్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ విజయవంత కావడమనే ఉద్వేగభరితమైన ముగింపుతో సూయి ధాగాకు తెరపడుతుంది.

  దర్శకుడి ప్రతిభ

  మేకిన్ ఇండియా కాన్సెప్ట్‌తో గ్రామీణ ప్రజలకు స్ఫూర్తిని రగిలించే కథాంశంతో శరత్ కటారియా సూయి ధాగా చిత్రాన్ని తెరకెక్కించే క్రమంలో అనుష్క శర్మ, వరుణ్ ధావన్‌ను ఒప్పించడమే సక్సెస్ అయ్యాడనిపిస్తుంది. మధ్య తరగతి కుటుంబాల ఉండే సమస్యలను చక్కగా తెరకెక్కించారు. దర్శకుడిగా ప్రతీ సన్నివేశంలోనూ ఎమోషనల్ అంశాలను చూపించడంలో ప్రతిభను చాటుకొన్నాడు. కానీ స్క్రిప్టు పరంగా కొన్ని చోట్ల చాలా సన్నివేశాలు వీక్‌గా అనిపిస్తాయి. ఓవరాల్‌గా సూయి ధాగ ద్వారా సగటు ప్రేక్షకుల గుండెను పిండేలా చేయడంలో సఫలయ్యాడని చెప్పవచ్చు.

  వరుణ్ ధావన్ ఫెర్ఫార్మెన్స్

  కమర్షియల్ హీరోగా వరుణ్ ధావన్‌కు ఓ ప్రత్యేకమైన ఇమేజ్ ఉంది. అర్బన్ లుక్ ఉండే వరుణ్.. సాధారణ గ్రామీణస్థాయి యువకుడిగా మౌజీ పాత్రలో ఒదిగిపోయాడు. తెర మీద మౌజీ తప్ప వరుణ్ ఎక్కడ కనిపించడు. యాజమాని కుక్కలా బిహేవ్ చేయమనే సన్నివేశంలో ప్రేక్షకులను భావోద్వేగానికి గురిచేస్తాడు. కాలికి గాయమైనా భార్యను ఎక్కించుకొని సైకిల్ తొక్కుతూ చేసిన సీన్‌లో పరిపూర్ణమైన నటుడు కనిపిస్తాడు. ఇక సొంత ఇంటిలోనే ప్రతికూలతను ఎదురిచే క్షణంలో పరిణితి చెందిన యువకుడిలా మారుతాడు.

  అనుష్క శర్మ నటన

  ఇప్పటి వరకు అనుష్క శర్మ చేసిన సినిమాలు ఒక ఎత్తు. సూయి ధాగాలో మమతగా అనుష్క మరో ఎత్తు. ఎప్పుడూ అందాలు ఆరబోసే గ్లామర్‌గానే అనుష్క గుర్తుంటుంది. కానీ ఈ చిత్రంలో అతి సామాన్యురాలైన గృహిణిగా అనుష్క చూపించిన నటన ఆమెను మరో మెట్టు ఎక్కించింది. భర్తను ప్రోత్సహించే భార్యగా, ఇంటిలో సమస్యలను సానుకూలంగా ఆలోచించే మహిళగా.. ప్రతికూల పరిస్థితుల్లో అందరికి మనోధైర్యాన్ని నింపే యువతిగా పలు కోణాలో అద్బుతంగా కనిపిస్తుంది. ఇమేజ్‌ను పక్కన పెట్టి ఇలాంటి సినిమాను ఒప్పుకోవడమనే విషయంలో ఆమెకు సలాం కొట్టొచ్చు.

  అనూ మాలిక్ మ్యూజిక్

  సూయి ధాగాకు మ్యూజిక్ ప్రత్యేక ఆకర్షణ. అనూమాలిక్ స్వరపరిచిన చావ్ లగా, ఖటర్ పటర్, సూయి ధాగ పాటలు ఆకట్టుకొనేలా ఉంటాయి. అండ్రియా అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కీలక సన్నివేశాలకు ప్రాణం పోసింది. ముఖ్యంగా హాస్పిటల్ ఎపిసోడ్, కుట్టు మిషన్ తెచ్చుకొనే సీన్‌‌లో బీజీయం వైబ్రేషన్స్ క్రియేట్ చేస్తాయి.

  సినిమాటోగ్రఫి గురించి

  సూయి ధాగాకు సినిమాటోగ్రఫీ వెన్నుముకగా నిలిచింది. మధ్యప్రదేశ్‌లోని ఛండేరికి సిల్క్ వస్త్రాలకు ప్రసిద్ధి. అలాంటి గ్రామంలోని వాతావారణాన్ని అనిల్ మెహతా చక్కగా ఒడిసిపట్టుకొన్నాడు. భోపాల్, ఢిల్లీ నగరాల్లోని మధ్య తరగతి ఇళ్ల వాతావరణం చక్కగా తెరకెక్కించారు. కీలక సన్నివేశాల్లో నటీనటులు హావభావాలను చక్కగా తెరకెక్కించారు.

  నిర్మాణ విలువలు

  కథపరంగా, సాంకేతిక విలువల పరంగా ఉత్తమ నాణ్యతతో కూడిన నిర్మించడంలో యష్ రాజ్ ఫిలింస్ గొప్ప పేరుంది. సూయి ధాగలో కూడా అవే ప్రమాణాలు కనిపిస్తాయి. నటీ, నటులు, సాంకేతిక నిపుణల ఎంపిక వారి అనుభవానికి గీటురాళ్లుగా కనిపిస్తాయి.

  ఫైనల్‌గా

  వినోదం, భావోద్వేగం కలిపిన చక్కటి ఉద్వేగభరిత చిత్రం సూయి ధాగ. కొన్ని సన్నివేశాలు గుండెను తట్టుతాయి. ప్రేక్షకులను ఎమోషనల్‌గా మారుస్తాయి. నటీ నటుల ప్రతిభ కొన్నిసార్లు నవ్విస్తాయి.. కంటతడి పెట్టిస్తాయి. వాస్తవిక పరిస్థితులతో రూపొందే చిత్రాలను ఆదరించే వారికి సూయి దాగ సినిమా చక్కటి అనుభూతిని కలిగిస్తుంది.

  బలం, బలహీనతలు

  ప్లస్ పాయింట్స్

  • అనుష్క శర్మ, వరుణ్ ధావన్ యాక్టింగ్
  • కథ, కథనం
  • సినిమాటోగ్రఫి
  • మ్యూజిక్

  మైనస్ పాయింట్స్

  • స్లో నేరేషన్

  తెర ముందు, తెర వెనుక

  అనుష్క శర్మ, వరుణ్ ధావన్
  దర్శకత్వం: శరత్ కటారియా
  నిర్మాతలు: మనీష్ శర్మ, ఆదిత్య చోప్రా
  మ్యూజిక్: అను మాలిక్, ఆండ్రియా గ్యురా (బ్యాక్ గ్రౌండ్ స్కోర్)
  సినిమాటోగ్రఫి: అనిల్ మెహతా
  ఎడిటింగ్: చారుశ్రీ రాయ్
  బ్యానర్: యష్ రాజ్ ఫిలింస్
  రిలీజ్: 2018-09-28
  నిడివి: 122 నిమిషాలు

  English summary
  Sui Dhaaga comedy-drama film directed by Sharat Katariya and produced by Maneesh Sharma under the banner of Yash Raj Films. It stars Varun Dhawan and Anushka Sharma in lead roles. Principal photography began in the town of Chanderi, Madhya Pradesh in February 2018 and the film is released on 28 September 2018. In this occassion, Telugu Filmibeat brings Exclusive review.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more