»   » పో(రా)రా కృష్ణయ్య' (రివ్యూ)

పో(రా)రా కృష్ణయ్య' (రివ్యూ)

Posted By:
Subscribe to Filmibeat Telugu
Rating:
1.0/5
---సూర్య ప్రకాష్ జోశ్యుల

కొత్త దర్శకులుగా పరిచయమయ్యేవారు సాధారణంగా తాము నమ్మిన కథ మీద ఎక్కువ కసరత్తు చేసి,హిట్ కొట్టే ప్రయత్నం చేస్తూంటారు. అంతేగానీ కథ,కథనంలనుని నిర్లక్ష్యం చేసి, నాలుగైదు హిందీ సినిమాలు కలిపి వండేసి జనాల మీదకు విసిరెయ్యాలనుకోరు. సందీప్ కిషన్... 'వెంకటాద్రి ఎక్సప్రెస్' తో కమర్షియల్ హీరోగా ప్రూవ్ అయ్యి...భాక్సాఫీస్ వద్ద మినిమం గ్యారెటీ హీరో అనిపించుకుని కొద్ది రోజులు కూడా కాలేదు. అప్పుడే ఈ సినిమా ఆ ఇమేజ్ ని డామేజి చేయటానికి వచ్చేసింది. అర్దం పర్ధం లేని కథా,కథనంలతో పూర్తిగా విసిగించింది. సందీప్ కిషన్ కి, జగపతి బాబుకి కూడా చేయటానికి ఏమీ లేదు. ముఖ్యంగా హీరో పాత్రే పూర్తి కన్ఫూజన్ తో రాసుకోవటం, అతనికి సమస్య కానీ, లక్ష్యం కానీ లేకపోవటం సినిమాని కంగాళి చేసేసింది. ఉన్నంతలో హీరోయిన్ ఫెరఫార్మెన్స్ మాత్రమే కాస్త కలిసొచ్చే అంశం.

కృష్ణయ్య ఉరఫ్ కిట్టు (సందీప్‌ కిషన్‌) చెన్నైలో మాణిక్యం మొదలియార్(తనికెళ్ళ భరణి) క్యాబ్ కంపెనీలో డ్రైవర్ గా చేస్తూ ఉంటాడు. అతను కష్టపడి సంపాదించిన మొత్తాన్ని తన యజమాని మాణిక్యం దగ్గర దాచుకుంటాడు(బ్యాంకులు గట్రా లేవా అని అడొగద్దు). పాత సినిమాల్లో విలన్ లాగ ..మాణిక్యం మోసం చేస్తాడు. దాంతో రగిలిపోయిన కిట్టు...యజమని కూతురైన నందీశ్వరి ఉరఫ్ నందు (రెజీనా)ని కిడ్నాప్ చేస్తాడు. అయితే నందుకి ఇంట్లో ఇష్టం లేని పెళ్లి చేస్తూంటారు. దాంతో కిడ్నాప్ కి భాధ పడాల్సిన నందు... ఆనందంతో కిట్టు వెనకాల వెళ్ళిపోతుంది. అంతేగాక ఈ కాలం రొటీన్ సినిమాల స్క్రీన్ ప్లే ని ఫాలో అవుతూ...ప్రేమగా పడిపోతుంది. అయితే ఈలోగా అనుకోని విధంగా ఆమె జగ్గుభాయ్(జగపతిబాబు) చేత కిడ్నాప్ గురి అవుతుంది. ఇంతకీ జగ్గుభాయ్ ఎవరు...హీరోయిన్ ని ఎందుకు కిడ్నాప్ చేసారు అనే విషయాలు తెలుసుకోవాలంటే 'పస్ గయా ఒబామా' సినిమా చూడని వారు తప్పని సరిగా చూడాలి.

నో కాంఫ్లిక్ట్...నో డ్రామా..నో డ్రామా..నో సినిమా అనే బేసిక్ స్క్రీన్ ప్లే రూల్ ని మర్చిపోయి ఈ దర్శక,రచయిత ఈ స్క్రిప్టుని డిజైన్ చేసారు. దాంతో రొమాంటిక్ కామెడీగా మొదలైన ఈ చిత్రం జెనర్ మార్చుకుని ఎటో ఎటో వెళ్ళిపోయింది. నవ్విద్దామనుకున్న సీన్స్ అన్నీ నవ్వులు పాలయ్యాయి. తెరపై సెంటిమెంట్ సీన్ పండుతూంటే జనం నవ్వుతున్నారంటేనే పరిస్ధితి అర్దం చేసుకోవచ్చు.

ముఖ్యంగా కథలో హీరో సందీప్ కిషన్ అనే విషయం దర్శకుడు మర్చిపోయినట్లున్నారు. అతనికో లక్ష్యం లేదా సమస్య పెట్టకుండా గాలికి వదిలేసాడు. దాంతో కథ దాని ఇష్టం వచ్చినట్లు ప్రయాణించటం మొదలైంది. హీరో బ్యాంకింగ్ రంగం ఇంతలా డవలప్ అయిన ఈ రోజుల్లో...తాను సంపాదించిన డబ్బుని తన యజమాని వద్ద దాచుకోవటం ఏమిటో అర్దం కావటం కాదు. పోనీ లాజిక్ లు వదిలేసి...చూస్తే...దాన్ని వసూలు చేసుకోవటానికి ఆయన కూతురుని కిడ్నాప్ చేస్తే...కిడ్నాప్ అయిన కూతురుని రక్షించుకోవాలనే ఆలోచన ఆ తండ్రికి రాదు. ఇలా నెగిటివ్ ఫోర్స్ ఫస్టాఫ్ లో లేకపోవటం తో చాలా నీరసంగా సాగింది. సర్లే సెకండాఫ్ అయినా అద్బుతంగా ఉందా అంటే ఫస్టాఫ్ కి పోటీ పడింది. సెకండాఫ్ లో కామెడీ పేరుతో జగపతిబాబు పాత్ర పరిధిని, పవర్ ని తగ్గించేయటంతో అక్కడా కాంఫ్లిట్ రాకుండా పోయింది. సంఘర్షణ లేని స్క్రిప్టు సహన పరీక్షలా మారింది.

స్లైడ్ షోలో మిగతా రివ్యూ....

సందీప్ కిషన్

సందీప్ కిషన్

వైవిధ్యమైన కథలు ఒప్పుకుంటూ ముందుకు వెళ్తున్న సందీప్ కిషన్...ఈ సబ్జెక్ట్ ఒప్పుకునే ముందు ఏ అంశాలు పరిగణనలోకి తీసుకున్నారో తెలియదు. కేవలం దీనికి మూలమైన హిందీ చిత్రం రితీష్ దేశ్ ముఖ్, జెనీలియా కాంబినేషన్ లో వచ్చిన Tere Naal Love Ho Gaya ని చూసి అయితే ఎలా దీన్ని తెలుగైజ్ చేసారో అన్న విషయమైనా స్పష్టంగా స్క్రిప్టుని చూసుకున్నాకే రంగంలోకి దిగాల్సింది

రెజీనా

రెజీనా

ఈ సినిమా లో ఏకైక హైలెట్ రెజీనా అనే చెప్పవచ్చు. ఆమె తన హావ భావాలతో చాలా సీన్స్ లో విషయం లేకపోయినా ముందుకు లాక్కెళ్లింది. ఆ మాత్రమైనా సినిమా చివరి వరకూ భరించగలిగామంటే ఆమె ప్రతిభే కారణం.

దర్శకుడు

దర్శకుడు

కొత్త దర్శకుడు మహేష్ కి...ఇంటర్వెల్ ఎక్కడ వేయాలో కూడా తెలియనంత కన్ఫూజూన్ లో స్క్రిప్టు తయారు చేసుకున్నట్లు అనిపిస్తుంది. రిఫెరెన్స్ ఒక చిత్రమే పెట్టుకుని ఉంటే ఇంత కంగాళి చిత్రం అయ్యిండేది కాదేమో. అలాగే మేకింగ్ కూడా నేటి యువ దర్శకుల తరహాలో లేదు. టైటిల్ కి తగ్గట్లు ఓల్డ్ నేరేషన్ తో నడిచింది.

డైలాగులు

డైలాగులు

సీన్స్ సరిగ్గా లేకపోతే డైలాగులు కూడా పెద్ద గొప్పగా ఆశించలేం. అదే ఈ సినిమాకు చూస్తున్నప్పుడు కూడా అనిపిస్తుంది. ఎక్కడా పెద్దగా పేలవు. కావాలని కొన్ని డైలాగులు ముందు అనుకుని ఇరికించినట్లున్నాయి.

హైలెట్స్

హైలెట్స్

సినిమా సాంకేతికంగా అంటే ముఖ్యంగా కెమెరా వర్క్ బాగుంది. సీన్స్ లో ఆ మాత్రం అయినా డెప్త్ వచ్చింది అంటే అది కెమెరా మెన్ గొప్పతనమే. కొన్ని షాట్స్ చాలా బాగా డిజైన్ చేసి తీసారు. అయితే అవి సినిమాకు పెద్ద గా ఉపయోగపడలేదు అనేది వేరే విషయం. అలాగే ఆర్ట్ డిపార్టమెంట్ సైతం చాలా బాగా వర్క్ చేసింది. అది స్పష్టంగా కొన్ని సీన్స్ల్ లో కొట్టొచ్చినట్లు కనపడింది.

ఇంటర్వెల్,క్లైమాక్స్

ఇంటర్వెల్,క్లైమాక్స్

తెలుగు సినిమాకు ముఖ్యంగా ఇంటర్వెల్,క్లైమాక్స్ బాగా ఉండేటట్లు ప్లాన్ చేసుకుంటారు. అయితే ఇంటర్వెల్ వద్ద సినిమా ప్రారంభమవుతూంటుంది. అక్కడ నుంచి సెకండాఫ్ కి లీడ్ ఇస్తూంటారు. ఈ సినిమాలో ఇంటర్వెల్ దగ్గర జగపతిబాబుని రివిల్ చేస్తారనుకుంటే అదీ చెయ్యలేక సెకండాఫ్ కి దాచారు. ఇంతలా దాచి ఏం సాధించారా దర్శక,రచయితకే తెలియాలి. అలాగే క్లైమాక్స్ సైతం చాలా చాలా పేలవంగా సాగింది.

జగపతిబాబు

జగపతిబాబు

లెజండ్ తర్వాత జగపతిబాబు చేస్తున్న అద్బుతమైన చిత్రం అంటూ ఈ చిత్రం దర్శక,నిర్మాతలు బాగా ప్రచారం చేసారు. అయితే అందులో వన్ పర్శంట్ కూడా నిజం లేదు అనిపిస్తుంది. ఎక్కడా జగపతిబాబు పాత్ర లేవదు. పేలదు. దానికి తోడు కళ్యాణి సైతం...జగపతికి జోడిగా నీతులు చెప్పటానికే పరిమితమైంది.

సంగీతం

సంగీతం

అచ్చు అందించిన పాటలు, రీరికార్డింగ్ సినిమాకు ప్లస్ కాలేదు. అలాగని మైనస్ కాలేదు. సోసోగా సినిమాకు తగ్గట్లే సాగాయి. దర్శకుడు టేస్ట్ కి తగినట్లే పాత బాణీలను గుర్తు చేసాయి.

నిర్మాణ విలువలు

నిర్మాణ విలువలు

సినిమాకు నిర్మాత ఎక్కడా రాజీ పడకుండా బాగానే ఖర్చు పెట్టారనిపిస్తుంది. అయితే చాలా చోట్ల ఆ ఖర్చుకు సరైన ప్రాధాన్యత కనపడదు.

 పో(రా)రా కృష్ణయ్య' (రివ్యూ)

పో(రా)రా కృష్ణయ్య' (రివ్యూ)

చిత్రం: రా రా కృష్ణయ్య,
సంస్థ: ఎస్‌.వి.కె. సినిమా
నటీనటులు: సందీప్‌కిషన్‌, జగపతిబాబు, రెజీనా, కల్యాణి, తనికెళ్ల భరణి, రవిబాబు, బ్రహ్మాజీ, కాశీ విశ్వనాథ్, చలపతిరావు, తాగుబోతు రమేష్, సత్యం రాజేష్, దువ్వాసి మోహన్, వాసు

తదితరులు.
కెమెరా: శ్రీరామ్,
ఎడిటర్: మార్తాండ్.కె.వెంకటేష్,
ఆర్ట్: రామాంజనేయులు,
సంగీతం: అచ్చు,
నిర్మాత: వంశీకృష్ణ శ్రీనివాస్‌. సిహెచ్‌
రచన, దర్శకత్వం: మహేష్‌బాబు పి.
విడుదల తేదీ: 04,జూలై 2014.

ఫైనల్ గా చిత్రం టీవిలో ముక్కలు ముక్కలు గా ఏ సీన్ కు ఆ సీన్ గా చూడటానికి మాత్రమే పనికివచ్చేటట్లు కనపడుతోంది. ఎందుకంటే దర్శకుడు ఏ సీన్ కా సీన్

పండించాలనుకున్నాడు కానీ టోటల్ గా కథని,కథనంను ఓ పద్దతిలో డిజైన్ చేయలేకపోయాడు. అయితే ఈ చిత్రానికి ఓ పర్పస్ ఉందనిపిస్తుంది. కొత్త దర్శకులు తీసుకువాల్సిన

జాగ్రత్తలుకు ఓ లెస్సన్ గా బాగా పనికివస్తుంది.


(గమనిక: వినోదం, అసభ్యం లేకపోవటం, సాంకేతిక విలువలు, కథన నైపుణ్యం తదితర అంశాల ఆధారంగా మా రేటింగ్ ఉంటుంది)

English summary
Sundeep Kishan's romantic entertainer Ra Ra Krishnayya relesed today with divide talk. Sundeep Kishan and Regina are pairing up for the second time after a decent hit Routine Love Story while Ra Ra Krishnayya also casts Jagapathi Babu in a prominent role. P. Mahesh Babu is the director of the film and Krishna Srinivas is the producer. Achu composed the music.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu