For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  కామెడీ ఎంటర్టెనర్... ( ‘ఈడు గోల్డ్ ఎహె’ రివ్యూ)

  By Bojja Kumar
  |

  Rating:
  2.5/5

  హైదరాబాద్: కమెడియన్ నుండి హీరోగా మారాక సునీల్.... కథానాయకుడిగా తనను తాను నిరూపించుకోవడానికి చాలా కష్టపడుతున్నాడు. యాక్టింగ్ పరంగా, బాడీ పరంగా(సిక్స్ ప్యాక్), డాన్సుల పరంగా ఇలా అన్నింటిలోనూ బెస్ట్ అనిపించుకోవాలని తహతహలాడుతున్నాడు. అయితే హీరోగా సక్సెస్ అవ్వాలన్నా.... హిట్టు కొట్టాలలన్నా కేవలం తమలో టాలెంటు, తమన ఉంటే సరిపోదు... సరైన కథ, ఆ కథను ప్రేక్షకులకు ఎక్కేలా సినిమాను తెరకెక్కించే దర్శకుడు కావాలి.

  ఇప్పటి వరకు సునీల్ హీరోగా చాలా సినిమాలు చేసినా... అందులో ఫెయిల్యూర్సే ఎక్కువగా ఉన్నాయి. చిరవకు పరిస్థితి ఎక్కడికి వరకు వెళ్లిందంటే సునీల్ ను హీరోగా చూడలేక పోతున్నాం, అతడు కమెడియన్ గానే ఉంటే బావుంటుంది అని ప్రేక్షకలు విసుక్కునే వరకు.

  ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో సునీల్ తాజాగా సినిమా 'ఈడు గోల్డ్ ఎహె' సినిమా రిలీజైంది. మరి ఈ సినిమా అయినా సునీల్ మీద ప్రేక్షకుల్లో నెలకొన్న నెగెటివ్ అభిప్రాయాలను తుడిచేలా ఉందా? లేదా? అనేది రివ్యూలో చూద్దాం..

  కథ విషయానికొస్తే...

  కథ విషయానికొస్తే...

  బంగార్రాజు (సునీల్) ఓ అనాథ. చాలా అమాయకుడు. అతడు ఎక్కడ పనిచేస్తే అక్కడ యజమానికి కష్టాలు. దీంతో అతన్ని పనిలో పెట్టుకోవడానికి ఎవరూ ఇష్టపడరు. ఉద్యోగం కోసం హైదరాబాద్ వచ్చిన బంగార్రాజును జయసుధ కుటుంబంతో మంచి అనుబంధం ఏర్పడుతుంది. బంగార్రాజును ఆమె తన పెద్ద కొడుకుగా చేరదీస్తుంది. ఆ కుటుంబంతోనే ఉంటూ వారి వ్యాపారం చూసుకుంటుంటాడు. ఇదిలా సాగుతుండగా తనతో పరిచయం లేని కొందరు వ్యక్తులు తనను సునీల్ వర్మగా అంటూ పలుకరించడం బంగార్రాజును ఆశ్చర్యపరుస్తుంది.

  ఎవరీ సునీల్ వర్మ?

  ఎవరీ సునీల్ వర్మ?

  మరో వైపు బంగారు విగ్ర‌హాల అక్ర‌మ వ్యాపారం చేసే మ‌హ‌దేవ ఇంట్లో దొంగ‌త‌నం జరుగుతుంది. అది సునీల్ వ‌ర్మ పనే అని తెలుసుకున్న మ‌హ‌దేవ అచ్చు అత‌నిలా ఉండే బంగార్రాజుపై ప‌గ పెంచుకుంటాడు. బంగార్రాజును సునీల్ వర్మలా భావిస్తూ అందరూ వెంటపడుతుంటారు. అతడు దొరక్క పోవడంతో బంగార్రాజు తమ్ముడిని కిడ్నాప్ చేస్తాడు. మహదేవ్ వద్దకు వెళ్లి తాను సునీల్ వర్మను కాదని, బంగార్రాజును అని తన తమ్ముడిని వదిలెయ్యమని కోరుతాడు. సునీల్ వర్మ వస్తేనే తమ్ముడిని వదిలేస్తానని, లేకుంటే చంపేస్తానని చెప్పడంతో....సునీల్ వర్మను వెతుక్కుంటూ బంగార్రాజు ప్రయాణం మొదలవుతుంది. మరి సునీల్ వర్మ ఎవరు? బంగార్రాజుకు అతడికి సంబంధం ఏమిటి? చివరకు కథ ఎలా ముగిసింది అనేది తెరపై చూడాల్సిందే.

  పెర్ఫార్మెన్స్

  పెర్ఫార్మెన్స్

  సునీల్ ఎప్పటిలాగే తనదైన పెర్ఫార్మెన్స్ తో అదరగొట్టాడు. అమాయక పాత్రలో తనదైన మార్కు చూపించాడు. అదే సమయంలో పగతీర్చుకునే సన్నివేశాల్లో ఆవేశంగా నటించి తన ప్రాతకు తగిన న్యాయం చేసాడు. హీరోయిన్లు సుష్మారాజ్, రీచా పనయ్ గ్లామర్ పరంగా ఓకే. కనిపించే కొన్ని సీన్లలో బాగా చేసారు. ష‌క‌ల‌క శంక‌ర‌, న‌రేష్‌, వెన్నెల కిషోర్ నవ్వించారు. జయసుధ తనదైన నటనతో ఆకట్టుకున్నారు. విలన్ పాత్రలో సునీల్ ఇస్సార్, పోసాని, ప్రభాస్ శీను ఇతర నటీనటులు వారి వారి పాత్రలకు తగిన విధంగా రాణించారు.

  టెక్నికల్ అంశాలు

  టెక్నికల్ అంశాలు

  దేవరాజ్‌ సినిమాటోగ్రఫీ బాగుంది. సాగర్ మహతి మ్యూజిక్ బిలో యావరేజ్. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఓకే. మార్తాండ్‌ కె.వెంకటేష్‌ ఎడిటింగ్ ఇంకా షార్ప్ గా చేస్తే బావుండు అనిపిస్తుంది. సినిమాలో అనవసర సీన్లు ఉన్నాడు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రొడక్షన్ వ్యాల్యూస్ ఓకే...ఇతర టెక్నికల్ విభాగాలు పనితీరు ఓకే.

  దర్శకుడి పనితీరు

  దర్శకుడి పనితీరు

  దర్శకుడిగా వీరు పోట్ల అనుభవం సినిమాను మంచి ఎంటర్టెనర్ గా తెరకెక్కించడంలో దోహదపడింది. ట్విస్ట్ లను బేస్ చేసుకుని కథను తయారు చేసుకున్నాడు. బలమైన కథలేనప్పుడు ప్రేక్షకులను కట్టిపడేసే విధంగా ఉండాలతి. ఆ విషయంలో దర్శకుడు పూర్తి స్థాయిలో న్యాయం చేయలేక పోయాడు.

  కామెడీ..

  కామెడీ..

  హీరో సునీల్ సినిమాలన్నా... వీరు పోట్ల సినిమాలన్నా ప్రేక్షకలు కామెడీ ఆశిస్తారు. ఈ సినిమాలో అది బాగానే వర్కౌట్ అయింది. ట్విస్టులు, సస్పెన్స్ కు కామెడీ జోడవ్వడం ప్రాస‌ల‌తో పేల్చే డైలాగులు ప్రేక్షకులను న‌వ్విస్తాయి.

  ఫస్టాఫ్, సెకండాఫ్

  ఫస్టాఫ్, సెకండాఫ్

  సినిమా ఫస్టాఫ్ అంతా కామెడీతో సరదాగా సాగిపోతుంది. సెకండాఫ్ కూడా అదే కంటిన్యూ చేసే ప్రయత్నం చేసాడు కానీ పూర్తి స్థాయిలో వర్కౌట్ అయినట్లు అనిపించదు. క్లైమాక్స్ రోటీన్ గా ఉంది.

  ప్లస్, మైనస్

  ప్లస్, మైనస్

  సినిమాకు ప్రధాన ప్లస్ పాయింట్ సునీల్. సినిమాలో కామెడీ ట్రాక్ బాగా వర్కౌట్ అయింది. అయితే కథలో కొత్తదనం లేక పోవడం, క్లైమాక్స్ గొప్పగా ఏమీ లేక పోవడం మైనస్.

  ఫైనల్‌గా

  ఫైనల్‌గా

  ఓవరాల్ గా....ఈ మధ్య కాలంలో వచ్చిన సునీల్ సినిమాలతో పోలిస్తే ‘ఈడు గోల్డ్ ఎహె' ఫర్వాలేదు. సరదాగా నవ్వుకోవచ్చు.

  English summary
  Comedian turned Actor Sunil latest romantic-drama “Eedu Gold Ehe” is released today. The movie written and directed by Veeru Potla The film is produced by Rama Brahmam Sunkara under the banner of AK Entertainment and ATV presenting the movie. Check out Movie Review Rating.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X