Sunny Sanskari Ki Tulsi Kumari First Review: సన్నీ సంస్కారీ కి తులసీ కుమారి ఫస్ట్ రివ్యూ
బాలీవుడ్‌లో ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ ధర్మ ప్రొడక్షన్స్, మెంటర్ డిసిపుల్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై హిరూ యష్ జోహర్, కరణ్ జోహర్, అపూర్వ మెహతా, అదర్ పూర్ణావాలా, శశాంక్ ఖైతాన్ నిర్మించిన చిత్రం సన్నీ సంస్కారీ కి తులసీ కుమారి. బాలీవుడ్ యంగ్ హీరో, హీరోయిన్లు జాన్వీ కపూర్, వరుణ్ ధావన్ జంటగా నటించిన ఈ చిత్రానికి శశాంక్ ఖైతాన్ దర్శకత్వం వహించారు.
ఈ చిత్రంలో సాన్య మల్హోత్రా, రోహిత్ సరాఫ్, మనీష్ పాల్, అక్షయ్ ఒబెరాయ్, రియా విజ్ తదితరులు నటించారు. దసరా కానుకగా ఈ చిత్రం అక్టోబర్ 2వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్నది. ఈ సినిమాకు విశేషాలు, ఇతర సంబంధించిన సెన్సార్ రివ్యూ వివరాల్లోకి వెళితే..

ప్రేమ కథా, యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్, ఫన్, కామెడీ అంశాలను జోడించి రూపొందించినట్టుగా చెబుతున్న ఈ సినిమాకు మనుష్ నందన్ సినిమాటోగ్రఫి, మనన్ సాగర్, చారుశ్రీ రాయ్ ఎడిటింగ్, జాన్ స్టివార్డ్ ఎడ్యూరి బ్యాక్ గ్రౌండ్ స్కోర్, తనిష్క్ బాగ్చీ, ఏపీఎస్, సచెత్ పరంపర, గురు రాంధ్వా తదితరులు పాటలు అందించారు. రొమాంటిక్ కామెడీగా రూపొందిన ఈ మూవీని ఇటీవల సెన్సార్ బోర్డు ఆఫ్ ఫిలిం సర్టిఫికెట్ (CBFC) అధికారులు, ప్రతినిధులు వీక్షించి తమ అభిప్రాయాలు వెల్లడించారు.
అయితే ఈ సినిమాలోని సన్నివేశాలపై సెన్సార్ సభ్యులు తీవ్రంగా అభ్యంతరాలు వ్యక్తం చేశారు. దాంతో రెండుసార్లు ఈ సినిమాను పున:సమీక్షించారు. ఆ తర్వాత సెన్సార్ చెప్పిన అభ్యంతరాలను తొలగించడానికి చిత్ర యూనిట్ సభ్యులు అంగీకరించారు. అయితే ముఖ్యంగా కొన్ని లిప్‌లాక్ సీన్లను తొలగించాలని సూచించారు. అలాగే గార్డ్ అనే పదాన్ని మ్యూట్ చేయాలని అభ్యంతరం పెట్టారు అనే విషయాన్ని బాలీవుడ్ మీడియా వెల్లడించింది. అయితే జాన్వీ కపూర్, వరుణ్ ధావన్ మధ్య ఉండే లిప్ లాక్ నిడివిని దాదాపు 60 శాతం తగ్గించారు అని బాలీవుడ్ హంగామా తన కథనంలో పేర్కొన్నది.
ఇక ఈ సినిమాలోని రొమాంటిక్, కామెడీ అంశాలు, ఫ్యామిలీ ఎలిమెంట్స్‌పై సంతృప్తిని వ్యక్తం చేశారు. చివరకు అభ్యంతరాలు తొలగించి, కొన్ని డైలాగ్స్‌ను మ్యూట్ చేసిన తర్వాత ఈ సినిమాకు యూఏ (U/A) 13+ సర్టిఫికెట్‌ను అధికారులు జారీ చేశారు. దాంతో ఈ సినిమాను వీక్షించేందుకు తల్లిదండ్రుల సంరక్షణలో 13 ఏళ్లు దాటిన యువతీ, యువకులు చూడటానికి అనుమతి ఇచ్చారు.
అయితే ఈ సినిమా కథను సాగదీయకుండా.. పెద్దగా నిడివిని పెంచకుండా చిత్ర యూనిట్ జాగ్రత్తలు తీసుకొన్నది. ఈ సినిమాను సుమారుగా 135.45 నిమిషాల నిడివి అంటే.. ెండు గంటల 15 నిమిషాల, 45 సెకన్ల రన్‌టైమ్‌ను ఫిక్స్ చేశారు. ఈ విషయాన్ని అధికారికంగా విడుదల చేసిన సెన్సార్ సర్టిఫికెట్‌లో పొందుపరిచారు. ఇప్పటికే ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్, ట్రైలర్లు మూవీని క్రేజీగా మలిచాయి.


Click it and Unblock the Notifications











