»   » ప్రాంతీయ సిని పరిమళం ('పిట్టగోడ' రివ్యూ)

ప్రాంతీయ సిని పరిమళం ('పిట్టగోడ' రివ్యూ)

Posted By:
Subscribe to Filmibeat Telugu
Rating:
2.5/5

'పెళ్లి చూపులు' హిట్ అవటంతో కంటెంట్ బాగుంటే లో బడ్జెట్ సినిమాలు కూడా చూడబుల్ గా ఉంటాయని జనాలకి నమ్మకం కలిగింది. అలాగే విషయం ఉన్న చిన్న బడ్జెట్ చిత్రాలకు కూడా సరిగ్గా ప్రమోట్ చేస్తే డబ్బులు బాగానే రాలుతాయనే నమ్మకం నిర్మాతలకు,డిస్ట్రిబ్యూటర్స్ కు కలిగింది. జనాలు ఇలా నమ్మకాలను ప్రోది చేసుకుంటున్న సమయంలోనే సురేష్ బాబు..పిట్టగోడ అనే లో బడ్జెట్ సినిమాని మన ముందుకు దింపారు.

Photos: Punarnavi Bhupalam


మొదట వదిలిన టీజర్ తోనే అందరి దృష్టినీ తన వైపుకున్న ఈ చిత్రం, ప్రముఖ నిర్మాత డి. సురేష్ బాబు సమర్పణతో క్రేజ్ రెట్టింపై అంచనాలు పెంచేసింది. చిన్న చిన్న టౌన్ లలో ఉండే నేటి యువత ఆలోచనలు, ఆనందాలు, అవకాశాలు బేస్ చేసుకుని రూపొందిన ఈ చిత్రం హ్యాపీడేస్ లా సంచలనం సృష్టిస్తుందో, పెళ్లి చూపులు లాగ ల్యాండ్ మార్క్ ఫిల్మ్ అవుతుందో లేక ఎవరికీ పట్టని చిన్న సినిమాలా అలా వచ్చి ఇలా వెళ్లిపోయే సినిమా అవుతుందో రివ్యూలో చూద్దాం.


పిట్టగోడే ప్రపంచం

పిట్టగోడే ప్రపంచం

గోదావరి ఖనిలో పనీ పాటా లేకుండా తిరిగే ..టిప్పు, బిల్డప్‌ వేణు, జ్ఞానేశ్వర్‌, నాగరాజు చుట్టూ ఈ కథ తిరిగుతుంది. బేవార్స్ గా తిరిగే ఈ బ్యాచ్ అంటే అక్కడ ఎవరికీ గౌరవం ఉండదు. వాళ్ల వాళ్ల ఇళ్లల్లోనూ విలువ ఉండదు. వీళ్లు ఎప్పుడూ దగ్గర్లోని ఓ ‘పిట్టగోడ' ఎక్కి కబుర్లు చెప్పుకొంటుంటారు. వీళ్లకు ఆ గోడే ప్రపంచం. తమలోకంలో తాము బతుకుతుంటారు.


ఓ రోజు వాళ్ల జీవితంలో

ఓ రోజు వాళ్ల జీవితంలో

ఎప్పుడూ అందరితోటీ తిట్లు తినే ఈ పిట్టగోడ బ్యాచ్ కు టిప్పు (విశ్వదేవ్) లీడర్ గా ఉంటాడు. ఓ రోజు వాళ్లలోనూ మార్పు వస్తుంది. తమని తాము నిరూపించుకోవాలనీ, వూళ్లొ అందరి ముందూ కాలరెత్తుకొని తిరగాలనీ అనుకొంటారు. పేపర్లో పేరు, ఫొటో చూసుకోడం కోసం ఏమైనా చేయాలి అని నిర్ణయంచుకుంటారు.


మండల స్దాయిలో ..

మండల స్దాయిలో ..

ఎలాగైనా అందరిలోనూ గుర్తింపు తెచ్చుకోవాలనే ఆలోచనతో ఈ పిట్టగోడ బ్యాచ్ తమ ఆధ్వర్యంలో మండల స్థాయి క్రికెట్ టోర్నమెంటును కండక్ట్ చేయాలనుకుని పెద్ద మొత్తంలో ఎంట్రీ ఫీజులు వసూలు చేసి అన్ని ఏర్పాట్లను చేసుకుంటారు.


ఎవరూ ఊహించని నిర్ణయం

ఎవరూ ఊహించని నిర్ణయం

టిప్పు... దివ్య (పునర్నవి) అనే అమ్మాయి ప్రేమలో పడతాడు. ఆ ప్రేమ కథే... అందరి జీవితాల్నీ ఓ కొత్త దారిలోకి మళ్లిస్తుంది. టోర్నమెంట్ కు ముందు రోజు రాత్రి టిప్పు ఎవరూ ఊహించని నిర్ణయం తీసుకుంటాడు. దాంతో టిప్పు, అతని ముగ్గురు స్నేహితులు తీవ్ర ఇబ్బందుల్లో పడతారు. అసలు టిప్పు తీసుకున్న ఆ డెశిషన్ ఏమిటి ? ఎందుకు తీసుకున్నాడు ? అనేదే ఈ సినిమా కథ..


అభినందనలు

అభినందనలు

ముందుకు యూత్ ని టార్గెట్ చేసుకునే సినిమాల్లో సిగరెట్లు, మద్యం, డబుల్ మీనింగ్ డైలాగులు అన్న యాంగిల్ లో కథలు సాగుతాయి. అయితే లక్కీగా ‘పిట్టగోడ' దానికి చాలా దూరంలో ఉంటుంది. అటువంటి సీన్స్ ఈ సినిమాలో లేకుండా చేసినందుకు డైరక్టర్ ని ముందుగా అభినందించాలి.


ఆసక్తికరంగా

ఆసక్తికరంగా

ఈ సినిమాలో ఫస్ట్ మెచ్చుకోవాల్సిన హైలెట్ ఏమిటీ అంటే కథను వాస్తవానికి చాలా దగ్గరగా ఉండేలా డిజైన్ చేసుకోవటం. అలాగని వాస్తవంగా చెప్పమన్నారు కదా అని ఓ ఆర్ట్ సినిమాలా కాకుండా...ఆసక్తికరంగా సినిమాటెక్ గా నడపటం. అలాగే ఇంటర్వెల్ బ్యాంగ్ బాగుంది.


పేపర్లో ఫొటో చూసుకోవాలి

పేపర్లో ఫొటో చూసుకోవాలి

సినిమా ప్రారంభమై కధలోకి వెళ్లిపోయి.. నలుగురు కుర్రాళ్ల పరిచయం.. వాళ్ల ఇంట్లో జరిగే వ్యవహారాలు, స్నేహం... ఇవన్నీ మేళవించిన తొలి సీన్స్ అన్ని చకచకా సాగిపోతాయి. పేపర్లో పేరు, ఫొటో చూసుకోడం కోసం ఏమైనా చేయాలి? అనే పాయింట్‌ దగ్గర.. ఈ సినిమా కొత్త దారిలో వెళుతుందన్న ఫీలింగ్‌ కలుగుతుంది. కానీ అక్కడి నుంచే... కథ పక్కదారి పడుతుంది.


సెకండాఫ్ లో విలన్

సెకండాఫ్ లో విలన్

క్రికెట్‌ టోర్నమెంట్‌ నిర్వహించాలనుకోవడం, దాని కోసం పొలిటీషన్స్ ని కలవడం.. ఇవన్నీ చూస్తుంటే కథ ఎక్కడికి పోతుందో అనిపిస్తుంది . అలాగే సెకండాఫ్ లో ఓ విలన్‌ని తీసుకువచ్చి, పాత్రల మధ్య కాంప్లిక్ట్ పండించాలని చూశారు. హీరోయిన్ దివ్యకేదో ఫ్లాష్‌ బ్యాక్‌ ఉందన్నట్లు బిల్డప్ ఇచ్చి.. దాన్ని కూడా తేల్చేశారు. క్లైమాక్స్ సీన్స్ మరింత మెరుగ్గా తీస్తే బాగుండేది.


ఫ్రెష్ నెస్ అంతగా లేదు

ఫ్రెష్ నెస్ అంతగా లేదు

నటీనటులు విషయానికి వస్తే కొత్త వాళ్లైనా పిట్టగోడ బ్యాచ్ గా నలుగురూ నాచురల్ గా నటించారు. ‘ఉయ్యాల జంపాల'లో కనిపించిన పునర్నవి ఈ సినిమాలో కీలక పాత్ర పోషించింది. ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలు ఫ్రెష్‌గా అనిపించినా... చాలావరకు పాత సినిమాల్ని గుర్తుకు తేవటమే మైనస్. ‘ప్రాణం' కమలాకర్‌ అందించిన ట్యూన్లు హాయిగా ఉన్నాయి. నిర్మాణ విలువలు ఫరవాలేదు.


క్లైమాక్స్ మినహాయిస్తే..

క్లైమాక్స్ మినహాయిస్తే..

టెక్నికల్ గా చెప్పాలంటే.. చిన్న స్టోరీ లైన్ ని, రియలిస్టిక్ గా రాసుకుని,మన కళ్లదెరుగుగా జరుగుతున్నట్లు చూడటంలో దర్శక,రచయిత అనుదీప్ చాలా వరకూ సక్సెస్ అయ్యారు. అలాగే క్లైమాక్స్ ను మినహాయిస్తే రామ్మోహన్. పి రాసిన ఫస్టాఫ్, సెకండాఫ్ స్క్రీన్ ప్లే బాగానే బాగుంది. ఎడిటింగ్ బాగుంది. కెమెరా వర్క్ కూడా సినిమాకి మంచి లుక్ తెచ్చి పెట్టింది.


రైటర్ కమ్ డైరక్టర్ గా..

రైటర్ కమ్ డైరక్టర్ గా..

ఈ సినిమాతో దర్శకుడుగా పరిచయమైన అనుదీప్..తనదైన శైలిలో చక్కటి ప్రాంతీయ సినిమాని అందించే ప్రయత్నం చేసాడు. తను చూసిన పాత్రలతో, తన ఎరుగున్న ప్రాంతాలలోని అందాలను మిగతా ప్రపంచానికి పరిచయం చేస్తూ ఆకట్టుకున్నాడు. దర్శకుడుగానే కాకుండా కరీనంగర్ యాసలో రాసిన సూటి మాటలతో..సరదా వన్ లైనర్స్ తో .. డైలాగు రైటర్ గానూ అనుదీప్ సక్సెస్ అయ్యాడనే చెప్పాలి.


వీళ్లంతా కలిసే

వీళ్లంతా కలిసే

నటీనటులు: విశ్వదేవ్‌ రాచకొండ, పునర్నవి భూపాలం, ఉయ్యాల జంపాల రాజు, జబర్దస్త్‌ రాజు, శివ, ఆర్‌.ఎస్‌, శ్రీకాంత్‌ తదితరులు
సంగీతం: ‘ప్రాణం' కమలాకర్‌
ఛాయాగ్రహణం: దినేష్‌ కుమార్‌
నిర్మాతలు: దినేష్‌ కుమార్‌, రామ్మోహన్‌ పి.
సమర్పణ: డి. సురేష్‌ బాబు
దర్శకత్వం: అనుదీప్‌ కె.వి
విడుదల తేదీ: 24-12-2016ఫైనల్ గా తీసిపాడేయదగ్గ సినిమా కాదు. యూత్ కు పడితే మంచి స్దాయికి వెళ్తుంది. ఆహ్లాదంగా సాగే ఈ చిత్రం ఫ్యామిలీస్ కు మంచి వీకెండ్ కాలక్షేపమే.

English summary
Suresh Babu's Pittagoda Review
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu