»   » బోర్ ‘బ్రదర్స్’ (రివ్యూ)

బోర్ ‘బ్రదర్స్’ (రివ్యూ)

Posted By:
Subscribe to Filmibeat Telugu
Rating:
1.5/5
విభిన్నమైన కథలు, పాత్రలు ఎంపిక చేసుకుంటూ తెలుగులో సైతం తనకంటూ స్టైయిట్ హీరోలతో సమానంగా మార్కెట్ క్రియేట్ చేసుకోగలిగిన హీరో సూర్య. ఆయన తాజా చిత్రాలపై తెలుగులో కూడా మంచి ఎక్సపెక్టేషన్స్ ఉంటున్నాయి. అందులోనూ 'రంగం' వంటి తమిళ డబ్బింగ్ చిత్రంతో తెలుగువారి ఆదరణ చూరగొన్న కె.వి ఆనంద్ దర్శకత్వంలో చిత్రం అనగానే మరింత ఆసక్తి రేగింది. అందుకు తగినట్లే ఓ రేంజి ఓపినింగ్స్ తో ధియోటర్స్ హౌస్ ఫుల్స్ తో 'బ్రదర్స్' చిత్రం దిగింది. అయితే తీసుకున్న పాయింట్ లో ఉన్న ఉత్సకతని స్క్రిప్టులో ప్రతిఫలింపచేయటంలో దర్శకుడు విఫలమయ్యాడనిపిస్తోంది. ఫస్టాఫ్ ఎంటర్టైనింగ్ గా సాగినా సెకండాఫ్ ఇన్విస్టిగేషన్ డ్రామాతో ప్రేక్షకులుకు బోర్ ఫీలింగ్ కలగచేసింది.

నటీనటులు: సూర్య, కాజల్, వివేక్, సచిన్ కేడెకర్, తార, రవిప్రకాష్, శంకర్ కృష్ణమూర్తి తదితరులు
సంగీతం: హారిస్ జైరాజ్,
మాటలు: శశాంక్ వెన్నెలకంటి,
కెమెరా: ఎస్.సౌందర్యరాజన్,
ఎడిటింగ్: ఆంథోని,
పాటలు: చంద్రబోస్, వనమాలి,
నిర్మాతలు: బెల్లంకొండ సురేష్, బెల్లంకొండ గణేష్‌బాబు,
సమర్పణ: కె.ఇ.జ్ఞాన్‌వేల్ రాజా,
స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కె.వి.ఆనంద్

మార్కెట్లో నెంబర్ వన్ ఎనర్జీ డ్రింక్ ఓనర్, జెనిటిక్ సైంటిస్ట్(సచిన్ కేడెకర్)కి అవిభక్త కవలలైన విమల్& అఖిల్ (సూర్య)జన్మిస్తారు. కవలలులో ఒకరు కమ్యూనిస్టు భావాలు కలవాడయితే, మరొకరు పూర్తి జాలీ టైప్. కంపెనీ ఎదుగుతూంటే ఎంతో మంది శత్రువులు తయారవుతూంటారు. ఓ రైవల్ కంపెనీ రష్యన్ స్పై ని పంపి ఆ డ్రింక్ ఫార్ములా లేపాయాలనుకుంటారు. మరో ప్రక్క విమల్ కు తమ తండ్రి కంపెనీలో ఏదో మోసం జరుగుతున్నట్లు డౌట్ వస్తుంది. అందుకు ప్రతిఫలం మరణం రూపంలో అనుభవిస్తాడు. దాంతో ఒంటిరిగా మిగిలిన అఖిల్ తన సోదరుడు గుండెని తనలో ట్రాన్స్ ప్లెంట్ చేసుకుని అతని మరణానికి ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకుంటాడు. అందుకోసం తన గర్లప్రెండ్ అంజలి(కాజల్)తో కలిసి యుక్రెయన్ వెళ్లి ఇన్విస్టిగేషన్ మొదలెడతాడు. ఆ క్రమంలో ఏం జరగింది. పగ తీర్చుకున్నాడా... అసలు విలన్స్ ఎవరు అనేది మిగతా కథ.

ఈ సినిమా చూస్తుంటే సూర్య తన సూపర్ హిట్ గజనీ లోంచి బయిటకి రాలేదా అనిపిస్తుంది. కొద్దిగా వెరీటీ, పూర్తిగా రెగ్యులర్ అనే స్కీమ్ లో వెళితే చాలు హిట్ కొట్టవచ్చు అని నమ్మిచేసిన సినిమాలా అనిపిస్తుంది. నిజానికి అవిభక్త కవలలుగా సూర్య తనదైన శైలిలో చెలరేగిపోయాడనే చెప్పాలి. అయితే కథ అతనికి సహకరించలేదు. సెవెంత్ సెన్స్ మాదిరిగానే ఈ సినిమా కూడా స్క్రీన్ టైమ్ మారేకొలదీ ధ్రిల్లర్ గా మారుతూ, ప్రేక్షకులను నిద్రలోకి జార్చే ప్రయత్నం చేసింది. ఇంటర్వెల్ దగ్గరకి వచ్చేసరికి.. అప్పటివరకూ బాగుందనుకుంటూ వచ్చిన కథ, కథనం ఒక్కసారిగా రెగ్యులర్ రొటీన్ పగ, ప్రతీకారం మార్కు గా మారిపోవటం ప్రేక్షకుడుని నిరాశపరుస్తుంది. అందులోనూ ఇన్వెస్టిగేషన్ డ్రామాల్లో హీరో చేసేదేమీ ఉండదు. సూర్య వంటి హీరో ఏదో చేస్తాడు అని ఊహించుకుని వచ్చినవారిని ఇబ్బందిపెడుతుంది. అందుకే ఫస్టాఫ్ బాగుందనిపించినా, సెంకండాఫ్ డ్రాబాక్ గా మారింది.

టెక్నికల్ గా దర్శకుడు గతంలో ఛాయాగ్రాహకుడు కూడా కావటంతో మంచి విజువల్స్ సినిమా చాలాచోట్ల కనువిందు చేస్తుంది. వివేక్, సచిన్ కేదార్కర్, కాజల్ కూడా తమ పాత్రలకు న్యాయం చేసారు. కాజల్ చాలా అందంగా కనిపిస్తుంది. హ్యారీస్ జైరాజ్ సంగీతం సినిమాను మంచి మూడ్ లోకి తీసుకు వెళ్తుంది. పీటర్ హెయిన్ యాక్షన్ సన్నివేశాలు, రాజీవన్ ఆర్ట్ డైరక్షన్ కూడా మెచ్చుకోదగిన స్దాయిలో ఉన్నాయి. అయితే సినిమాకు ప్రాణమైన స్క్రిప్టు లోపంలో ఇవన్నీ కనపడకుండా పోయాయి. అయిుతే తన డబ్బింగ్ తాను చెప్పుకున్న సూర్య పట్టుదలకు మాత్రం అతన్ని అబినందించకుండా ఉండలేము.

ఏదైమైనా సూర్య అభిమానులకు సైతం సహన పరీక్ష పెట్టే సెకండాఫ్ తో వచ్చిన ఈ చిత్రం మరో సెవెంత్ సెన్స్ అని చెప్పాలి. స్టోరీ సెన్స్ లేని టెక్నికల్ వ్యాల్యూస్ ఏ విధంగానూ నిలబెట్టవని మరోసారి నిరూపించిన ఈ చిత్రం ప్రతీ డబ్బింగ్ చిత్రమూ గొప్పదికాదనే విషయం మరోసారి స్పష్టంగా తెలియచేస్తుంది.

(గమనిక: వినోదం, అసభ్యం లేకపోవటం, సాంకేతిక విలువలు, కథన నైపుణ్యం తదితర అంశాల ఆధారంగా మా రేటింగ్ ఉంటుంది)

English summary
Surya and director K V Anand's Brothers is released today with flop talk. Surya played the role of Siamese twin is the major attraction. The film comes with twists, mystery and unpredictable turns. For the first time in his career Surya has dubbed his voice in Telugu.
Please Wait while comments are loading...