twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Dil Bechara Review and Rating: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ చివరి చిత్రం ఎలా ఉందంటే..

    |

    Rating: This review is a tribute to Sushant Singh Rajput. We are not giving a rating for Dil Bechara.

    Recommended Video

    Dil Bechara Review | Sushant Singh Rajput | Sanjana Sanghi | AR Rahman

    బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ నటించిన చివరి చిత్రం దిల్ బేచారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎన్నో భావోద్వేగాల మధ్య మళ్లీ ప్రేక్షకులను తన నటనతో మెప్పించేందుకు సుశాంత్ సిద్ధమయ్యారు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ జూన్ 14వ తేదీన ఆత్మాహత్య చేసుకొని అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించడం ఎంతో మంది అభిమానులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఇలాంటి ఎమోషనల్ పరిస్థితుల్లో దిల్ బేచారా డిస్నీ+హాట్ స్టార్‌ ఓటీటీ యాప్‌లో రాత్ి 7.30 గంటలకు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. సుశాంత్ సింగ్ నివాళిని అర్పించేందుకు ఈ సినిమాను ఉచితంగా ప్రదర్శిస్తుండటం గమనార్హం. ఈ సినిమా‌కు సంబంధించిన లేటేస్ట్ అప్‌డేట్స్ మీకోసం..

    దిల్ బేచారా కథేంటంటే

    దిల్ బేచారా కథేంటంటే

    జంషెడ్‌పూర్‌కు చెందిన కిజూ బసు (సంజనా సంఘీ) క్యాన్సర్‌ వ్యాధితో బాధపడుతుంటుంది. ఆమెకు తోడుగా ఉండే స్నేహితుడు ఎవరంటే ఆక్సిజన్ సిలెండర్. ఆమె కలల్లో కేవలం ఆక్సిజన్ సిలెండర్ మాత్రమే ఊహించుకొంటుంది. అలాంటి జీవన్మరణ సమస్యల్లో ఉన్న కిజూకి రజనీకాంత్‌కు వీరాభిమాని, అదే క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న ఇమ్మాన్యుయేల్ రాజ్‌కుమార్ జూనియర్ పరిచయం అవుతాడు. తనకు యాక్టింగ్ అంటే ఇష్టమని, హీరోగా నటించేందుకు ప్రయత్నిస్తున్నానని తెలుపుతాడు. అలాగే కంటి క్యాన్సర్‌తో బాధపడుతుండే రాజ్ కుమార్ స్నేహితుడి జగదీష్ పాండే దర్శకుడిగా మారాలని ప్రయత్నిస్తుంటాడు.

    దిల్ బేచారాలో ట్విస్టులు

    దిల్ బేచారాలో ట్విస్టులు

    జీవితం నిస్సారంగా సాగుతున్న కిజు బసు లైఫ్‌లోకి ప్రవేశించిన రాజ్‌కుమార్ జూనియర్ ఆమెకు ఎలాంటి అనుభూతిని పంచాడు? తన జీవితంలో చివరి క్షణాలను అనుభవిస్తున్న ఇమ్మాన్యుయేల్ రాజ్‌కుమార్ జూనియర్ తన ప్రేయసి నుంచి ఎలాంటి ప్రేమను పొందాడు? రాజ్‌కుమార్ స్నేహితుడు జగదీష్ పాండే సినిమాను పూర్తి చేశాడా? చివరికి కిజూ, రాజ్‌కుమార్ జీవితాలకు ఎలాంటి ముగింపు లభించింది అనే ప్రశ్నలకు సమాధానం దిల్ బేచారా సినిమా కథ.

    దిల్ బేచారా ఫస్టాఫ్ అనాలిసిస్

    దిల్ బేచారా ఫస్టాఫ్ అనాలిసిస్

    దిల్ బేచారా సినిమా కథ కిజూ తన జీవిత కథను చెప్పడం ద్వారా మొదలువతుుంది. తన జీవితంలో భుజానికి ఆక్సిజన్ సిలెండర్‌ తగిలించుకొని శ్వాస పీల్చుకోవడం, ఆ తర్వాత మందులు వేసుకోవడంతోనే సరిపోతుంది అని చెబుతుంది. అలాంటి లైఫ్‌లోకి రాజ్‌కుమార్ ప్రవేశించడంతో ఆమె జీవితం ఒక్కసారిగా కలర్‌ఫుల్‌గా మారుతుంది. ఎప్పుడూ బాధలో ఉండే కిజు పెదాలపై చిరునవ్వు పూయిస్తాడు రాజ్‌కుమార్. అలా వారి జీవితం ముందుకు సాగుతుండగా.. జగదీస్ పాండే తన చిరకాల స్వప్నం సినిమా తీయాలనే తీరడానికి రంగం సిద్ధమవుతుంది. ఆ చిత్రంలో హీరోయిన్‌గా కిజూ ఒప్పుకొంటుంది.

    దిల్ బేచారా సెకండాఫ్ ఎనాలిసిస్

    దిల్ బేచారా సెకండాఫ్ ఎనాలిసిస్

    అయితే తనకు ఇష్టమైన గాయకుడు అభిమన్యు వీర్ (సైఫ్‌ ఖాన్) రాసిన పాట అసంపూర్తిగా ఉండటానికి కారణమేమిటనే విషయం ఆమెను బలంగా వెంటాడుతుంటుంది. ఆ కారణం ఏమిటో తెలుసుకోవడానికి కిజూ, రాజ్‌కుమార్ ప్యారిస్ వెళ్తారు. అక్కడ గాయకుడు అభిమన్యు వీర్ వ్యవహరించిన తీరు వారిని బాధిస్తుంది. దాంతో కిజూ మరింత నిరాశ చెందుతుంది. అయితే తాను ఆ పాటను పూర్తి చేస్తానని చెప్పి ఆమెను ఓదారుస్తారు. అలాంటి సమయంలో వారిద్దరి జీవితాల్లో విషాదం నెలకొనడమనే అంశంతో సినిమా ముగుస్తుంది.

    దర్శకుడు ముఖేష్ చాబ్రా

    దర్శకుడు ముఖేష్ చాబ్రా

    దర్శకుడు ముఖేష్ చాబ్రా దిల్ బేచారా సినిమాను ది ఫాల్ట్ ఇన్ అవర్ స్టార్స్ అనే హాలీవుడ్ సినిమాను రీమేక్‌గా మలిచాడు. అయితే కిజూ, రాజ్‌కుమార్ పాత్రలను భావోద్వేగంగా మార్చడంలో తన ప్రతిభను చాటుకొన్నారు. క్యాన్సర్ కారణంగా జగదీష్‌ పాండే గుడ్డిగా మారడం మరింత ఎమోషనల్‌గా మారుస్తుంది. రజనీకాంత్ థీమ్‌ను కమర్షియల్ అంశానికి వాడుకొన్నప్పటికీ.. ఇంకా మరింత ఆకట్టుకొనే విధంగా చేయవచ్చనే ఫీలింగ్ కలుగుతుంది. అలాగే ముద్దు, రొమాన్స్, కిస్, వర్జినిటీ అనే అంశాలు కొంత పరిణతితో కూడిన కంటెంట్‌గా స్ఫూర్తిస్తుంది. ఓవరాల్‌గా సినిమాను సుశాంత్ అభిమానులను మెప్పించే విధంగా రూపొందించారు. సినిమా నిడివి తక్కువగా ఉండటం కొంత నిరాశగానే అనిపిస్తుంది.

    సుశాంత్ యాక్టింగ్ గురించి

    సుశాంత్ యాక్టింగ్ గురించి

    సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ టాలెంట్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇమ్యాన్యుయేల్ రాజ్‌కుమార్ జూనియర్ పాత్రలో పరకాయ ప్రవేశం చేశారు. క్యాన్సర్‌తో బాధపడుతూ మరో క్యాన్సర్ పేషెంట్ కోసం ప్రేమను పంచే పాత్రలో ఒదిగిపోయారు. సినిమా థియేటర్‌ సీన్, మరికొన్ని సీన్లలో సుశాంత్ యాక్టింగ్ గుండెను కరిగిస్తుంది. డ్యాన్సులు బాగా చేశారు. పాత్ర పరిధి మేరకు అందరికీ సంతృప్తిని మిగిల్చి ఈ లోకాన్ని వెళ్లాడనే ఫీలింగ్ కలుగుతంది.

    సంజనా సంఘీ యాక్టింగ్

    సంజనా సంఘీ యాక్టింగ్

    ఇక కిజూ బసు పాత్రలో సంజన సంఘీ జీవించింది. నటనపరంగా మంచి మెచ్యురిటీని ప్రదర్శించింది. రొమాంటిక్ సీన్లలోను, ఎమోషనల్ సీన్లలో మెప్పించింది. ప్యారిస్ సన్నివేశాలు సినిమాను మరింత ఎమోషనల్‌గా మార్చాయి. సంజనా సంఘీ తర్వాత ప్రేక్షకులను ఆకట్టుకొన్నది జేపీగా నటించిన సాహిల్ వేద్ నటన బాగుంది. చర్చిలో ఓ సీన్‌లో కంటతడి పెట్టించేలా పెర్ఫార్మ్ చేశారు. ఇక రెండు మూడు సీన్లలో నటించిన సైఫ్ ఆలీఖాన్ కూడా గుర్తుండిపోతారు.

     ఏఆర్ రెహ్మాన్ మ్యూజిక్

    ఏఆర్ రెహ్మాన్ మ్యూజిక్

    దిల్ బేచారా సినిమాకు ఏఆర్ రెహ్మాన్ మ్యూజిక్ హైలెట్. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సన్నివేశాలను మరింత ఎమోషనల్‌గా మార్చింది. దిల్ బేచారా టైటిల్ సాంగ్, థిమ్ మ్యూజిక్ సినిమా ముగిసిన తర్వాత కూడా మనల్ని వెంటాతుంటుంది. తొమ్మిది పాటలు ఉన్నాయని చెప్పినప్పటికీ సినిమాలో అన్నీ కనిపించవు. మిగితా సాంకేతిక నిపుణులు సినిమాటోగ్రఫి, ఎడిటింగ్ శాఖల పనితీరు బాగున్నాయి.

    జీవితం అర్ధాంతరంగా ముగుస్తుందని

    జీవితం అర్ధాంతరంగా ముగుస్తుందని

    క్యాన్సర్ మహమ్మారి కారణంగా జీవితం అర్ధాంతరంగా ముగుస్తుందని తెలిసిన ఇద్దరు యువతీ, యువకులు ప్రేమలో పడటమనే కథాంశంగా ఈ సినిమా తెరకెక్కింది. జీవితపు చివరి దశలో వారికి ఉన్న కోరికలను పూర్తి చేసుకొనే క్రమంలో ఒకరికొకరు ఎలాంటి ప్రేమను పంచుకొన్నారు. వారి మధ్య బలమైన ప్రేమ ఎలా చిగురించిందనే హృదయానికి హత్తుకునేలా చూపించారు. అందమైన ప్రేమకథా చిత్రంగా మలిచేందుకు ఫాక్స్ స్టార్ చేసిన ప్రయత్నం బాగుంది. నిర్మాణ విలువలు హై స్టాండర్డ్‌లో ఉన్నాయి. పాత్రలకు సరిపోయేలా నటీనటులను ఎంపిక చేసిన విధానం మెప్పిస్తుంది. కథ, కథనాల పరంగా ఇంకా కొన్ని జాగ్రత్తలు తీసుకొని ఉంటే గొప్ప సినిమాగా దిల్ బేచారా మారి ఉండేదేమో.

    బలం, బలహీనతలు

    బలం, బలహీనతలు


    ప్లస్ పాయింట్స్
    సుశాంత్, సంజనా ఫెర్ఫార్మెన్స్
    ఏఆర్ రెహ్మాన్ మ్యూజిక్

    మైనస్ పాయింట్
    కథ, కథనాలు

    తెర వెనుక, తెర ముందు

    తెర వెనుక, తెర ముందు

    నటీనటులు: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్, సంజనా సంఘీ, సైఫ్ ఆలీఖాన్, సాహిల్ వేద్, సస్వతా ఛటర్జీ, స్వస్తికా ముఖర్జీ తదితరులు
    దర్శకత్వం: ముఖేష్ చాబ్రా
    స్క్రిన్ ప్లే: శంశాక్ ఖైతాన్, సుప్రోతిమ్ సేన్ గుప్తా
    సంగీతం: ఏఆర్ రెహ్మాన్
    ఓటీటీ రిలీజ్: డిస్నీ+హాట్‌స్టార్
    నిర్మాత: ఫాక్స్ స్టార్ స్టూడియో
    రిలీజ్ డేట్: 2020-09-24

    English summary
    Dil Bechara movie review and Rating: Sushant Singh Rajput's Last movie Dil Bechara releasing on Disney+ Hotsar app. After Sushant Singh Rajput sudden demise, Fans over all over movie world went into shock. In this emotional situation, Sushant Singh Rajput's coming before the audience.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X